సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు( ఫిబ్రవరి 26, గురువారం) నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు వైఎస్సార్ కడప పులివెందుల భాకరాపురం నివాసం నుంచి బయలుదేరి 8.50 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
9 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. 10.10 గంటలకు రోడ్డు మార్గంలో గొలగమూడి రోడ్డులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు 10.20 గంటలకు చేరుకుంటారు. స్కిల్ డెవలప్‌మెంట్ మాజీ ఛైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరుగు పయనమవుతారు.


