‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్దాలు’ | Ysrcp Mla Tatiparthi Chandra Sekhar Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్దాలు’

Feb 25 2026 3:45 PM | Updated on Feb 25 2026 6:03 PM

Ysrcp Mla Tatiparthi Chandra Sekhar Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ని చూసి ఊసరవెళ్లి కూడా ఉరేసుకుంటుందన్నారు. ఇక లోకేష్ పులకేసిని తలపించారని.. ఈ ముగ్గురు సొంత డబ్బా కొట్టుకోవటానికే అసెంబ్లీని వేదికగా చేసుకున్నారంటూ చంద్రశేఖర్‌ దుయ్యబట్టారు.

‘‘కల్తీ కారణంతో వెనక్కు పంపిన నాలుగు ట్యాంకర్లను తిరిగి ఎందుకు తీసుకున్నారు?. వైష్ణవి డెయిరీ సంగం డెయిరీ లోగోతో మజ్జిగ అమ్ముతున్నారు. వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి?. ఈ రాష్ట్రంలో పాలు, నీళ్లు అన్నీ కల్తీనే. పాలల్లో ఏం కలిసిందో ఎల్లో మీడియా ముందుగానే ఎలా రాస్తుంది?. లడ్డూ ఇష్యూలో కూడా ఇదే విధంగా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసింది. సీబిఐ రిపోర్టును కూడా తప్పుదారి పట్టించిన ఘనత చంద్రబాబు, ఎల్లో మీడియాది’’ అంటూ చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘హెరిటేజ్ డెయిరీ ఎప్పుడూ ఆలయాలకు నెయ్యి సరఫరా చేయలేదని టీటీడీ నేతలు పచ్చి అబద్దాలు చెప్పారు. 2002లో రూ.117లకు టిన్‌ల ద్వారా హెరిటేజ్ నెయ్యి సరఫరా చేసింది.. కానీ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడారు. బోలేబాబాతో సహా అందరు బాబాలకు చంద్రబాబే పెద్ద దిక్కు. ఇందాపూర్ డెయిరీని మ్యానుఫ్యాక్చరింగ్‌ నుండి కో-మ్యానిఫాక్చరింగ్ యూనిట్‌గా ఎలా మార్చారు?. వైష్ణవి డెయిరీ గేట్లకు రంగు మార్చితే మీ బాగోతాలన్నీ కనుమరుగు అవుతాయా?

..హెరిటేజ్ భాగోతం బయట పడగానే నేషనల్ సేల్స్ మేనేజర్‌ని మార్చేశారు. తిరుమల కొండ మీద ఎలాంటి ఎన్నికలు జరగకూడదని వైఎస్సార్ హయాంలో జీవో తెచ్చారు.. కానీ దాన్ని కూడా రెండు కొండలకే వెంకటేశ్వర స్వామిని పరిమితం చేశారంటూ చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేశారు. తిరుమలకు ఏడు కొండలు కాదు రెండు కొండలేనంటూ జీవో ఉంటే అది చంద్రబాబు బయట పెట్టాలి. తిరుమలలో అన్యమత ప్రచారం చేసుకోవటానికి అనుమతి ఇస్తానని బైబిల్ మిషన్ సభలో చంద్రబాబు మాట్లాడారు. తిరుమల వెళ్లే బస్ టిక్కెట్ల మీద కూడా అన్యమత ప్రచారం చేయటానికి చంద్రబాబే జీవో ఇచ్చారు.

అందరి బాబాల వెనుక ఉన్న ఏకైక బాబా మన చంద్ర "బాబా"

నెల్లూరు జోన్‌లో ముద్రించిన టిక్కెట్ రోల్స్‌ని తిరుమలకు కూడా పంపారు. వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిన ఘనుడు చంద్రబాబు. నీచమైన రాజకీయాలు చేయటం చంద్రబాబుకే చెల్లు. చంద్రబాబు జీవితంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించ లేదు. అలాంటి వ్యక్తి వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్టు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు’’ అంటూ చంద్రశేఖర్‌ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement