సాక్షి, సిద్దిపేట: మేడారం మహా జాతర నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టి మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు అందించారు. అనంతరం, కేసీఆర్ దంపతులు కూడా మంత్రులను సన్మానించారు.
ఆహ్వానం సందర్భంగా దాదాపు 20 నిమిషాలపాటు వారు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మేడారంలో జాతర సందర్బంగా చేస్తున్న ఏర్పాట్లను కేసీఆర్‌కు వివరించినట్టుగా తెలిసింది. అనంతరం, మేడారం జాతరకు ఏదోఒక రోజు తాము హాజరు అవుతామని కేసీఆర్ చెప్పారని మంత్రులువెల్లడించారు. కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లిపోయారు.
బాగున్నరా.. అమ్మ !
కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు
ఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం
గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క
మరికొద్ది… pic.twitter.com/8NPsnWB5jX— Telugu Scribe (@TeluguScribe) January 8, 2026
అంతకుముందు మంత్రులిద్దరూ మాట్లాడుతూ..‘మాజీ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. హెలికాప్టర్‌లో సతీసమేతంగా జాతరకు కేసీఆర్ వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాము. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. మేడారం జాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందరిని మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం’ అని అన్నారు.



