పాతబస్తీలో షియాల భారీ నిరసన | Muslims Protest In Old City Hyderabad against US and Israel Attacks On Iran | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో షియాల భారీ నిరసన

Mar 2 2026 4:35 AM | Updated on Mar 2 2026 4:35 AM

Muslims Protest In Old City Hyderabad against US and Israel Attacks On Iran

పురానీ హవేలీ వద్ద నిరసన తెలియజేస్తున్న షియా ముస్లింలు

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను వ్యతిరేకిస్తూ....   

చార్మీనార్‌/డబీర్‌ పురా: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు, ఖమేనీ హత్యను నిరసిస్తూ ఆదివారం పాతబస్తీ పురానీ హవేలీ చౌరస్తా వద్ద షియా ముస్లింలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖమేనీ చిత్రపటాన్ని చేతుల్లో పట్టుకొని నివాళులర్పించారు. పురానీ హవేలీ చౌరస్తా నుంచి దారుషిఫా వరకు నిరసన ర్యాలీ సాగింది. స్త్రీ, పురుషులు, పిల్లలు, పెద్దలు సహా భారీఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. దారి పొడవునా డెత్‌ టు అమెరికా.. డెత్‌ టు ఇజ్రాయెల్‌ అంటూ నినాదాలు చేస్తూ ఆదివారం రాత్రి ఆయా దేశాల జెండాలను రోడ్డుపై వేసి తొక్కుతూ నిరసన తెలిపారు.

పవిత్ర రంజాన్‌ మాసంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన అమెరికా, ఇజ్రాయెల్‌కు తగిన శిక్ష తప్పదని షియా పెద్దలు ర్కొన్నారు. ఖమేనీ హత్యను పిరికి పందల చర్య అని తీవ్రంగా మండిపడ్డారు. అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. భారత ప్రధాని మోదీ జోక్యం చేసుకొని ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇరాన్‌లో ఉండిపోయిన భారతీయులందరినీ యుద్ధ ప్రాతిపదికన వెంటనే రప్పించే ప్రయత్నం చేయాలన్నారు. పురానీ హవేలీ నుంచి కొనసాగిన ర్యాలీ చివరలో చార్మీనార్‌ ఎమ్మెల్యే మీర్‌ జుల్పికర్‌ అలీ, ఎమ్మెల్సీ మీర్జా హసన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement