
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అరాచకాలను వైఎస్ జగన్ మరోసారి మీడియా సమావేశంలో ఎండగట్టారు. లిక్కర్ స్కాం అంటూ బేతాళ కథలు చెబుతూ.. అక్రమ కేసులు, అరెస్టులతో ప్రతీకార రాజకీయాలకు దిగారని మండిపడ్డారు. విద్యుత్ దగ్గరి నుంచి ఇసుక దాకా ప్రతీ దాంట్లోనూ స్కాం జరుగుతోందని, ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.













