వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ కలిశారు. చెన్నైలో జరిగిన జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో విజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్, విజయ్‌లు ఆప్యాయంగా పలకరించుకున్నారు.


