సిట్‌ లీకులతోనే ఆ కథనాలు.. జడ్జి ఎదుట ధనుంజయ్‌రెడ్డి ఆవేదన | Ex IAS Dhanunjaya Reddy Allegations On SIT Before ACB Judge | Sakshi
Sakshi News home page

సిట్‌ లీకులతోనే ఆ కథనాలు.. జడ్జి ఎదుట ధనుంజయ్‌రెడ్డి ఆవేదన

Jul 22 2025 2:06 PM | Updated on Jul 22 2025 3:51 PM

Ex IAS Dhanunjaya Reddy Allegations On SIT Before ACB Judge

ఫైల్‌ ఫొటో

సాక్షి, విజయవాడ: అక్రమ లిక్కర్‌ కేసులో అరెస్టైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌ రెడ్డి.. ఏసీబీ కోర్టు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైల్లో ఉన్న తన గురించి, బయట ఉన్న తన కుటుంబం గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ జడ్జి ముందు ఇవాళ ఆవేదన వెలిబుచ్చారాయన.  

‘‘మేం ఎకరం విస్తీర్ణం ఉన్న జైల్లో ఉన్నాం. జైలు పక్కన బిల్డింగ్ టెర్రస్‌ పైనుంచి మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారు. పై నుంచి అడిగితే మేం ఫోటోస్ తీస్తున్నామని చెబుతున్నారు. నేను ఐదుగురితో మాట్లాడినట్టు సెల్‌ఫోన్‌ ట్రాక్ ద్వారా గుర్తించినట్టు పేపర్‌లో ఓ వార్త చూశాను. ఆ కథనంలో పేర్కొన్న ఐదుగురిలో ఇద్దరిని మాత్రమే నేను కలిశానంతే. మిగతా ముగ్గురిని ఇప్పటి వరకు ఎప్పుడూ నేను కలవలేదు. కావాలంటే ప్రపంచంలో ఏ దర్యాప్తు సంస్థతో నైనా విచారణ చేయించుకోవచ్చని కోరుతున్నాను

మాజీ సీఎస్, మాజీ ఫారెస్ట్ కన్జర్వేటర్ నా బినామీలు అని కథనాలు రాస్తున్నారు. నేను విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు అంఉదలో పేర్కొన్నారు. నేను నా లైఫ్‌లో కొన్న ఒకే ఒక్క శాంట్రో కారు. నా భార్య మరో కారు వాడుతోంది. ఇవి రెండు విలాసవంతమైన కార్లా?. పత్రికల్లో వస్తున్న కథనాలతో మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ విధంగా మాపై వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. సిట్ అధికారులే లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు.

గత 20 రోజులుగా పత్రికల్లో వార్తలు చూస్తే మేం ఛార్జ్ షీట్ చదవాల్సిన అవసరం లేదు. చార్జీషీట్‌లో ప్రతి పేరా గురించి పత్రికల్లో రాశారు. ఇది ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ కేసు. నేను కోర్టులో ఈ విషయం చెప్పాను. కాబట్టి రేపట్నుంచి సిట్ మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. అయినా అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం అని చెప్పారాయన.

Dhanunjaya Reddy: జైలులో మా ఫోటోలు తీసి ఎల్లో మీడియాకు ఇస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement