లిక్కర్‌ కేసుతో బీఆర్‌ఎస్‌ నష్టపోయింది | Massive Loss To BRS Party In Elections Due To Fake Liquor Scam Case, Says KTR | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసుతో బీఆర్‌ఎస్‌ నష్టపోయింది

Feb 28 2026 5:23 AM | Updated on Feb 28 2026 1:37 PM

Massive Loss To BRS Party In Elections due to Fake Liquor Scam Case: KTR

మా నేతలపై నమోదైన కేసులు కూడా కల్పితాలే

కవితకు న్యాయం జరిగింది

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుతో కవితకు న్యాయం జరిగిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ‘అయితే మద్యం కుంభకోణం అనే సాకుతో ఢిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని కూల్చారు. ఈ కేసు మూలంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సైతం రాజకీయంగా నష్టపోయింది..’ అని కేటీ ఆర్‌ శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొ న్నారు.

‘మద్యం పాలసీ కేసు తరహాలోనే మా నాయ కులపై నమోదైన ప్రతి కేసు అబద్ధం, రాజకీయ ప్రేరేపితం, కల్పితమని త్వరలో తేలిపోతుంది. అసత్యాలతో కూడిన, కుట్రపూ రిత కేసులను, ఆరోపణలను మీడియా ట్రయల్స్‌ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజ లను తప్పుదోవ పట్టించడానికి, మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తూ సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధా న్య తనిస్తూ న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ ’నవ భారతం’లో బాగా పెరిగిపోయింది. కానీ చివరకు న్యాయమే గెలుస్తుంది..’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement