ఉద్యోగుల కోటా రూ. 745 కోట్లు విడుదల | Telangana Govt Releases Rs 745 Crore To Clear Pending Bills Of Govt Employees, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల కోటా రూ. 745 కోట్లు విడుదల

Feb 28 2026 3:59 AM | Updated on Feb 28 2026 1:03 PM

Telangana Govt releases Rs 745 crore to clear pending bills of Govt employees

ఫిబ్రవరి నెల బిల్లుల విడుదలకు భట్టి ఆదేశం

గ్రామ పంచాయతీలకు రూ. 389 కోట్లు విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన బకాయిల చెల్లింపుల హామీలో భాగంగా ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.745 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగు లు, పెన్షనర్లకు సంబంధించి వివిధ రకాల బిల్లు ల బకాయిలను నెలవారీగా చెల్లిస్తామని, కనీసం రూ.700 కోట్ల చొప్పున ఇ స్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గతేడాది ఆగస్టు నెల నుంచి ప్రతి నెలా రూ.700 కోట్లకు తగ్గకుండా నిధులు విడుదల చేస్తూ వచ్చింది. 

తాజాగా ఫిబ్రవరికి సంబంధించి రూ.745 కోట్లు విడుదల చేయాలని, ఈ నిధులకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆ దేశించారు. విడుదలైన బిల్లులో గ్రాట్యు టీ, జీపీఎఫ్, సరెండర్‌ లీవ్‌ అడ్వాన్సులకు సంబంధించిన బిల్లులున్నాయి. అలాగే గ్రామ పంచాయతీ బకాయిలకు సంబంధించి కూడా భట్టి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రూ.389 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో సంబంధిత బిల్లులన్నీ క్లియర్‌ చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు.  

Advertisement
 
Advertisement
Advertisement