
తాడేపల్లి : ఏపీలో కూటమి ప్రభుత్వం అండతో యథేచ్ఛగా కత్తీ మద్యం తయారవుతోందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. టీడీపీ నేతలే కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు( శనివారం, అక్టోబర్ 4వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ఈ కల్తీ మద్యానికి సామాన్య ప్రజలు బలి అవుతున్నారని ధ్వజమెత్తారు. ‘ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల కల్తీ మద్యం వ్యాపారం జోరందుకుంది.
చంద్రబాబు సొంత జిల్లా పక్కనే కల్తీ మద్యం తయారవుతోంది. కొన్ని లక్షల లీటర్ల కల్తీ మద్యం తయారీకి కావాల్సిన ముడి పదార్ధాలను కూడా పోలీసులు పట్టుకున్నారు. జగన్ హయాంలో జరగని మద్యం స్కాంని జరిగినట్టు చూపించే ప్రయత్నం చేశారు. కానీ మన కళ్లెదుటే జరుగుతున్న కల్తీ మద్యం గురించి ఎందుకు నోరు మెదపటం లేదు?, ఆర్గనైజ్డ్ స్కాం చేస్తున్నారు. తన తప్పులను కప్పి పుచ్చుకోవటానికి జగన్ చుట్టూ ఉన్న పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు.
ప్రభుత్వానికి రావాల్సిన మద్యం ఆదాయం అంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. చంద్రబాబు చేసే వ్యవస్థీకృత పాపాల్లో ఎల్లోమీడియాకు కూడా భాగస్వామ్యం ఉంది. అందుకే టీడీపీ నేతల కల్తీ మద్యం గురించి వార్తలు కూడా రాయటం లేదు. చంద్రబాబు కల్తీ మద్యం తాగి 80% ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ, కల్తీ మద్యం రాకూడదనే జగన్ హయాంలో ప్రభుత్వ షాపుల ద్వారా విక్రయాలు చేశారు. మద్యం తాగొద్దని చెప్పాల్సిన ప్రభుత్వ పెద్దలే మద్యం అందిస్తామని చెప్తున్నారు. ఈ మద్యం తాగి ప్రజల ధన, మాన, ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రతి మూడు మద్యం బాటిళ్ళలో ఒకటి కల్తీ మద్యమే. సీబిఎన్ సిండికేట్ కల్తీ మద్యాన్ని తయారు చేస్తోంది. అంబేద్కర్ విగ్రహాన్ని తగులపెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:
టీడీపీ నేతలే సూత్రధారులుగా.. నకిలీ మద్యం మాఫియా