కర్ణాటక పవర్ పాలిటిక్స్‌లో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఐదేళ్లు తానే సీఎంనంటూ సిద్ధరామయ్య.. అధిష్టానం తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ ఇటు డీకే శివకుమార్‌లు పోటాపోటీగా ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ పంచాయితీ ఢిల్లీకి రేపోమాపో షిఫ్ట్ అవుతుందనే ప్రచారం ఇవాళ జోరుకుంది. అయితే ఈలోపే..
కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. పదవీ త్యాగం నేపథ్యంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2004లో అధికారాన్ని త్యాగం చేశారు. తనకు బదులుగా మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేశారు’’ అని అన్నారాయన.
కర్ణాటకలో అధికార పంపిణీపై ఊహాగానాల వేళ ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటనే విశ్లేషణ అక్కడ నడుస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ రంగంలోకి దిగి కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం మరింత ముదరకుండా మంతనాలు జరుపుతున్నారు. సీఎం మార్పు నిర్ణయాన్ని ఇక సోనియా గాంధీకే వదిలేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంతో అధిష్టానంతో చర్చించేందుకు రెండ్రోజుల్లో ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే..
ఈలోపు రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ కర్ణాటక పరిణామాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘హైకమాండ్ పిలిస్తే కచ్చితంగా ఢిల్లీ వెళ్తా. అధిష్టాన నిర్ణయమే నాకు ఫైనల్. ఏ విషయంలోనూ నాకు తొందరలేదు’’ అని అన్నారు. మరోవైపు.. డీకే శివకుమార్‌తో ఉన్న ఫొటోను సిద్ధరామయ్య షేర్ చేయడంతో ఈ కథ సుఖాంతం అయ్యిందా? అనే చర్చ జోరందుకుంది.
ಶಕ್ತಿ ಮತ್ತು ಗೃಹಲಕ್ಷ್ಮಿ ಯೋಜನೆ ಜಾರಿಯಾದ ಮೇಲೆ ತಲಾ ಆದಾಯದಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ದೇಶದಲ್ಲಿಯೇ ಮೊದಲ ಸ್ಥಾನದಲ್ಲಿದೆ. ಐಸಿಡಿಎಸ್ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪರಿಣಾಮಕಾರಿಯಾಗಿ ಜಾರಿ ಮಾಡಿರುವ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ದೇಶದಲ್ಲಿಯೇ ಕರ್ನಾಟಕ ಮೊದಲನೇ ಸ್ಥಾನದಲ್ಲಿದೆ. ಶಕ್ತಿ ಯೋಜನೆ ಜಾರಿಯಾದ ಮೇಲೆ ಉದ್ಯೋಗಕ್ಕೆ ಹೋಗುವ ಮಹಿಳೆಯರ ಪಾಲು ಶೇ 23% ಇದ್ದರೆ, ಗ್ರಾಮೀಣ… pic.twitter.com/Hq9iz8BvvG
— Siddaramaiah (@siddaramaiah) November 28, 2025


