హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఏకకాలంలో 40 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కేపీహెచ్‌బీకాలనీ: నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయిన తర్వా త తెలంగాణలో రైల్వే అభివృద్ధి వేగవంత మైందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రైల్వేలైన్ల నిర్మాణం, స్టేషన్ల ఆధునికీకరణ సహా రాష్ట్రంలో ఏక కాలంలో 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ జరుగుతోందన్నారు. హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌లో ప్రతిరోజూ 62 సబర్బన్ ట్రైన్లు, ఎంఎంటీఎస్ ట్రైన్లు ఆగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, బోరబండ, ఫలక్‌నుమా వంటి స్టేషన్లకు ఈ స్టేషన్ నుంచి కనెక్టివిటీ ఉందన్నారు.
ఇప్పుడు మరింత కనెక్టివిటీ, మరిన్ని సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిరోజూ ఈ స్టేషన్ ద్వారా సుమారు 5,400 మంది ప్రయాణికులు సేవలు వినియోగించుకుంటున్నారన్నారు. 16 స్పెషల్ ట్రైన్లు సంక్రాంతి పండుగ సమయంలో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇక్కడ ఆగబోతున్నాయని చెప్పారు కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం దాదాపుగా పూర్తయ్యిందన్నారు.
హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా త్వరలో ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌ను యాదాద్రి వరకు పొడిగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కాజీపేటపరిధిలో నిర్మి స్తున్న రైల్వే మల్టీ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులను శని వారం పరిశీలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ పాల్గొన్నారు.


