తమిళనాడు మంత్రి పెరియా కరుప్పన్ చిక్కుల్లో పడ్డారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో(డిసెంబర్ 27న ఆయన బర్త్‌డే) అశ్లీల నృత్యాల్ని ప్రొత్సహించారాయన. పొట్టి దుస్తుల్లో అమ్మాయిలు డ్యాన్స్ చేస్తుంటే సంతోషంగా చప్పట్లు చరుస్తూ ఆయన జాలీగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో దుమారం రేగుతోంది.
వీడియోలో మంత్రి పెరియా కరుప్పన్.. ముందువరుసలో జిల్లా స్థాయి పార్టీ నాయకులతో కలిసి కూర్చుని ప్రదర్శనను చూస్తున్నట్లు కనిపించారు. ఆ డ్యాన్సర్లను చూస్తూ మీసాలను మెలేశారాయన. ఆ తర్వాత ఆయన వేదికపై ఉన్న కళాకారులను దిగమని సంకేతాలు చేస్తూ.. తన దగ్గరగా నృత్యం చేయమని సూచిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో వాళ్లు ఆయన దగ్గరకు వచ్చి స్టెప్పులు వేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో మంత్రి తీరును పలువురు తప్పుబడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి.. డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకల్లో ఇలాంటి నృత్యాలను ప్రొత్సహించడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అన్నాడీఎంకే, బీజేపీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మహిళలకు గౌరవం ఇచ్చే తీరు ఇదేనా? అని బీజేపీ నిలదీస్తోంది. అర్థనగ్నంగా ఉన్న మహిళలను తమ వద్దకు పిలిపించుకుని ఇలా మురిసిపోయే నేతలకు.. తమ భద్రత గురించి మహిళలు ఎలా చెప్పుకోగలరు? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కరుప్పున్ చరిత్ర గురించి పాపం వాళ్లకు తెలియదేమో. ఇది పగటిపూట జరిగిందని అదృష్టం, లేకపోతే ఏమి జరిగేదో ఊహించలేం అంటూ అన్నాడీఎంకే ఘాటు చురకలు అంటించింది. పలువురు నెటిజన్లు సైతం ఈ వీడియోపై మండిపడుతున్నారు. గతంలో ఓ మహిళతో ఆయన్న సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజా ఘటన నేపథ్యంలో ఆ వీడియోను పలువురు తెరపైకి తెచ్చారు. ఈ ఘటనపై డీఎంకే పార్టీ, ఉదయ్‌నిధి ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదు.
மீசையை முறுக்கிக்கொண்டே ஆட்டத்தை ரசிக்கும் அமைச்சர் பெரிய கருப்பன்... வைரல் வீடியோவ முழுசா பாருங்க.... pic.twitter.com/D1sHnbpmd8
— Kathir News (@KathirNews) November 26, 2025


