breaking news
Tamil Nadu politics
-
‘ఇదేం స్ట్రాటజీ సోదరా?’.. దోస్తీ అంటూనే విజయ్‌తో కుస్తీ!
తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. విజయ్ ఏర్పాటు చేయబోయే సెక్యులర్ కూటమికి దూరంగా ఉంటామని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. అంతేకాదు.. 120 రోజుల విజయ్ పాలనపై తీవ్ర విమర్శలకు సిద్ధపడినట్లు బహిరంగంగా ప్రకటించాయి. ఇది చాలదన్నట్లు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. ఇవన్నీ డీఎంకేకు లాభం చేకూర్చే నిర్ణయాలేనని, ప్రతిపక్షానికి మళ్లీ అవి దగ్గరవుతున్నాయా? అనే చర్చా జోరందుకుంది.తమిళనాడులో అక్టోబర్ 6న జరగనున్న రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. మదురాంతకంలో సీపీఎం, ధారాపురంలో సీపీఐ అభ్యర్థులను బరిలోకి దించనున్నాయి. సెప్టెంబర్ 15న అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో టీవీకే నేతృత్వంలోని కూటమితో పాటు డీఎంకే, అన్నాడీఎంకే–బీజేపీ కూటమి, నామ్ తమిళర్ కట్చి ఇప్పటికే రంగంలో ఉన్నాయి. వామపక్షాల తాజా నిర్ణయంతో పోరు ఐదు కోణాల్లో సాగనుంది. అయితే ఈ పోటీ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని.. విజయ్ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. దీంతో బయటి నుంచే సపోర్ట్ చేస్తున్న వామపక్షాలు.. ఉప ఎన్నికల వేళ మాత్రం అదే ప్రభుత్వ అభ్యర్థులకు ఎదురుగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ నిర్ణయం డీఎంకేకు లాభం చేకూర్చేందుకు కాదని లెఫ్ట్ పార్టీలు స్పష్టం చేశాయి. టీవీకే ఏర్పాటు చేయబోయే కొత్త కూటమిలో మేం చేరబోం. మూడు ప్రధాన కూటములకూ వ్యతిరేకంగా మేం పోటీ చేస్తున్నాం. అంతే తప్పా ఏ పార్టీకో లాభం చేకూర్చేందుకు మేం పోటీ చేయడం లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం తేల్చిచెప్పారు. బయట మద్దతు.. లోపల విమర్శలు2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మెజార్టీకి కొంత దూరంలో నిలిచిన విజయ్ ప్రభుత్వానికి సీపీఐ, సీపీఎం బయట నుంచి మద్దతు ప్రకటించాయి. ప్రజల తీర్పును గౌరవించడం, గవర్నర్ పాలనకు అవకాశం లేకుండా చూడటం, పరోక్షంగా బీజేపీ పాలన రాకుండా అడ్డుకోవడమే తమ మద్దతు ఉద్దేశమని అప్పట్లో వామపక్షాలు తెలిపాయి. అయితే కేబినెట్లో మాత్రం చేరలేదు. అలాగే టీవీకే అధికారిక కూటమిలోనూ భాగం కాలేదు.ఇప్పుడు ఉప ఎన్నికల్లో మాత్రం టీవీకే అభ్యర్థులపై పోటీకి దిగుతున్నాయి. దీంతో ‘ప్రభుత్వానికి మద్దతు.. అభ్యర్థులకు వ్యతిరేకం’ అనే వామపక్షాల వైఖరి రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దీనిపై విమర్శలు వచ్చినా.. ఉప ఎన్నికలు ప్రభుత్వం మార్పు కోసం జరిగేవి కావని షణ్ముగం స్పష్టం చేశారు. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయడం తమ రాజకీయ నిర్ణయమని తెలిపారు.120 రోజుల పాలనపై ప్రచారంలోనే కౌంటర్ఉప ఎన్నికల ప్రచారాన్ని విజయ్ ప్రభుత్వంపై విమర్శలకు వేదికగా చేసుకుంటామని సీపీఎం ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వ తొలి 120 రోజుల పాలన, ఆర్థిక విధానాలు, పరిపాలనా చర్యలు, అసెంబ్లీ పనితీరుపై తమ అభిప్రాయాలను ప్రజలకు వివరిస్తామని షణ్ముగం చెప్పారు. ముఖ్యంగా ‘నియో లిబరల్’ ఆర్థిక విధానాలపై తమ అభ్యంతరాలను ప్రచారంలో ప్రస్తావిస్తామన్నారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లో పారదర్శకత ఉండాలని వామపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. విదేశీ పెట్టుబడులతో పాటు స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాయి.సచివాలయం విషయంలోనూ విభేదాలుచెన్నైలోని పట్టినప్పాక్కంలో కొత్త సచివాలయం, అసెంబ్లీ సముదాయం నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపైనా వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయంపై మత్స్యకారుల జీవనోపాధి, పర్యావరణం, ట్రాఫిక్ తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించాలని కోరాయి. అసెంబ్లీలో డీఎంకే అధినేత స్టాలిన్‌పై విజయ్ చేసిన వ్యాఖ్యలు, చేతి సైగలపైనా సీపీఎం గతంలో తీవ్రంగా స్పందించింది. సభను వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చొద్దని షణ్ముగం సూచించారు.‘ఇది ప్రజలపై రుద్దిన ఎన్నిక’మదురాంతకం, ధారాపురం ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయన్న దానిపైనా వామపక్షాలు టీవీకేపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 2026 ఎన్నికల్లో ఈ రెండు స్థానాల నుంచి అన్నాడీఎంకే తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కే. మరగతం కుమారవేల్, పి. సత్యబామలు ఆ తర్వాత రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఇప్పుడు అదే స్థానాల నుంచి టీవీకే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.ఎన్నికైన కొద్ది రోజులకే ఎమ్మెల్యేలు పార్టీ మారి రాజీనామా చేయడం ప్రజల తీర్పును అవమానించడమేనని సీపీఎం విమర్శించింది. ఈ పరిణామాల వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని.. ఇవి సహజంగా వచ్చిన ఎన్నికలు కావని, ప్రజలపై రుద్దిన ఎన్నికలని షణ్ముగం వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పు వెనుక ‘హార్స్ ట్రేడింగ్’ జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు.రెండు సీట్లలో గెలిస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తమ గొంతును మరింత బలంగా వినిపించవచ్చన్నది వామపక్షాల లెక్క. అందుకే ప్రభుత్వం విషయంలో విజయ్‌కు మద్దతు కొనసాగిస్తూనే.. ఎన్నికల విషయంలో మాత్రం టీవీకేను ఢీకొట్టాలని నిర్ణయించాయి. అంటే.. ప్రభుత్వం నిలబడేందుకు దోస్తీ.. తమ రాజకీయ బలం చాటుకునేందుకు కుస్తీ! ఇదే ఇప్పుడు తమిళనాడు ఉప ఎన్నికల్లో లెఫ్ట్ అనుసరిస్తున్న ‘ఇదేం స్ట్రాటజీ సోదరా?’ అనే ప్రశ్నకు అసలు సమాధానం.ఇదీ చదవండి: బిహార్‌లో బీజేపీకి ఝలక్ -
తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది కరెక్టే: స్టాలిన్
అసెంబ్లీ వేదికగా స్టాలిన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి విజయ్ చేసిన ‘అవినీతి’ ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు పుట్టించాయి. అలాగే స్టాలిన్‌పైనా విజయ్ బాడీ షేమింగ్ చేయడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో స్టాలిన్ వాటిపై స్పందించారు. తన తండ్రి, డీఎంకే మాజీ సీఎం కరుణానిధి హయాంలో జరిగిన పరిణామాలను గుర్తుచేస్తూ.. ‘‘తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది నిజమే. అబద్ధం కాదు’’ అంటూ ఈ ఉదయం ఓ వీడియోను రిలీజ్ చేశారాయన. తన తండ్రి కరుణానిధి, తనను విజయ్ టార్గెట్‌గా చేసుకోవడంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో తన దవడ వెనుక కథ ఇదేనంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారాయన. ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి మెరీనా బీచ్‌లో భారీ సభ నిర్వహించి మీసా చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని స్టాలిన్ గుర్తుచేశారు. అనంతరం 1976 జనవరి 31న కేంద్ర ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసిందన్నారు. ఆ వెంటనే గోపాలపురం ఇంటికి పోలీసులు వచ్చి తనను మీసా కింద అరెస్టు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.‘‘ఆ రోజు నేను ఇంట్లో లేను. నా కొడుకు ప్రచారానికి వెళ్లాడు.. రేపు వస్తాడు. వచ్చిన వెంటనే నేనే ఫోన్ చేస్తా.. వచ్చి అరెస్టు చేసుకోండి’’ అంటూ కరుణానిధి పోలీసులను వెనక్కి పంపారని తెలిపారు. మరుసటి రోజు తాను ఇంటికి వచ్చిన తర్వాత కరుణానిధే పోలీసులకు ఫోన్ చేసి తనను అరెస్టు చేయించారని చెప్పారు. జైల్లో తనను తీవ్రంగా హింసించారని స్టాలిన్ పేర్కొన్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులను ఉంచే ప్రదేశంలో చిన్న గదిలో పది మందిని బంధించారని, అదే గదిలో ఒకే కుండను మూత్ర విసర్జనకు ఉపయోగించాల్సి వచ్చేదని వివరించారు. రాత్రిళ్లు నిద్రపోనివ్వకుండా పోలీసులు లాఠీలతో కొట్టేవారని, బూట్లతో తన్నేవారని చెప్పారు. ఖైదీల దాడిలో ఎంపీ చిట్టిబాబు మరణించారని, తన దవడ ఎముక విరిగిందని తెలిపారు. నాటి దాడుల గాయాల గుర్తులు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు.‘‘మా సిద్ధాంత నాయకుడినని చెబుతున్నావు. పెరరింజర్ అన్నా(సి.ఎన్. అన్నాదురై) కాలం నుంచి ఇదే డీఎంకే చరిత్ర. అందులో నేనూ భాగం కావడం గర్వంగా ఉంది. ఎవరెంత తక్కువ చేసి చూపించాలని చూసినా చరిత్రను మార్చలేరు’’ అని స్టాలిన్ అన్నారు.సర్కారియా కమిషన్.. విజయ్‌కు మరో కౌంటర్అదే సమయంలో సర్కారియా కమిషన్, అవినీతి ఆరోపణలపైనా విజయ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. సర్కారియా కమిషన్ ఏర్పడిన తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అనేక ప్రభుత్వాలు మారాయని గుర్తుచేశారు. ఆ ఆరోపణల్లో నిజం ఉంటే ఇన్నేళ్లలో తప్పకుండా చర్యలు జరిగేవని అన్నారు. ఈడీ కేసులను ప్రస్తావిస్తూ కూడా విజయ్‌పై స్టాలిన్ విమర్శలు చేశారు. ఈడీ నమోదు చేసిన అనేక కేసుల్లో ఆరోపణలు నిరూపితం కాలేదని, నిందితులు నిర్దోషులుగా బయటపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈడీని ఉపయోగిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కాంగ్రెస్ నేతలపైనా ఈడీ కేసులు పెట్టిన విషయాన్ని విజయ్ ఎలా మర్చిపోయారని ప్రశ్నించారు.అసెంబ్లీని వివాదాలకు వేదిక చేయొద్దుతమిళనాడు అసెంబ్లీకి ఎంతో గౌరవం, చరిత్ర ఉందని.. అక్కడ ప్రజా సమస్యలపై చర్చ జరగాలని స్టాలిన్ సూచించారు. శాంతిభద్రతలు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి, తమిళనాడు హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై చర్చించాలని కోరారు. అనవసర వివాదాలను అసెంబ్లీలోకి తీసుకురావద్దని విజయ్‌కు హితవు పలికారు.విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటికి వచ్చి కలిసిన విషయాన్ని కూడా స్టాలిన్ గుర్తుచేశారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో తనపై విజయ్ తీవ్ర విమర్శలు చేశానని ఆయన చెప్పగా.. ‘‘పర్లేదు తమ్ముడూ.. వాటిని మనసులో పెట్టుకోను’’ అని తాను చెప్పినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు విజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ ఆ పదవికి తగ్గ హుందాతనం కనిపించాలని సూచించారు.‘సినిమా షూటింగ్‌లా పాలన’విజయ్ ప్రభుత్వ పనితీరుపైనా స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. తాము నిర్మించిన వంతెనపై నిలబడి ఫొటోషూట్లు చేయడం, అసెంబ్లీని రీల్స్‌కు వేదికగా మార్చడం సరికాదన్నారు. సమర్థవంతమైన పాలనపై దృష్టి పెట్టకుండా సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో హత్యలు, దొంగతనాలు, మహిళలపై నేరాలు పెరిగాయని, శాంతిభద్రతలు దిగజారిపోయాయని విమర్శించారు. పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దు చేసి తమిళనాడు అభివృద్ధిని 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. రైతులకు పూర్తి రుణమాఫీ, ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు రూ.2,500 సాయం వంటి హామీల విషయంలోనూ విజయ్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విమర్శించారు.‘‘అప్పుడు చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నది మరొకటి. మార్పు కావాలని ఓటేసిన యువత ఇప్పుడు నిజంగా ఎలాంటి మార్పు వచ్చిందో గమనిస్తోంది’’ అని స్టాలిన్ అన్నారు.అధికారం లేకున్నా ప్రజల కోసం పోరాటమేచివరగా డీఎంకే కార్యకర్తలకు స్టాలిన్ కీలక సందేశం ఇచ్చారు. ప్రజలు పూర్తిగా తమకు మద్దతు ఇవ్వకపోవడంతో అధికారంలోకి రాలేకపోయామని, కానీ ప్రభుత్వం చేసే తప్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ‘‘మనకేం సంబంధం’’ అనే ధోరణి ఉండకూడదన్నారు. అధికారంలో ఉండటం, లేకపోవడం రెండూ ప్రజాసేవలో భాగమేనని పేర్కొన్నారు. తమిళనాడు హక్కులు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కోసం డీఎంకే ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ‘‘వాళ్ల(ప్రజలను ఉద్దేశించి..) తాతల కోసం పోరాడాం. వాళ్ల తండ్రుల కోసం పోరాడాం. ఇప్పుడు వాళ్ల కోసం పోరాడతాం. ఇదే డీఎంకే చరిత్ర. ఆ చరిత్ర ఎప్పటికీ మారదు.. మారకూడదు’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు.வீட்ல என்னை meet பண்ணப்ப சொன்னதை மறந்துட்டீங்களா தம்பி விஜய்? pic.twitter.com/kzpwXi14L8— M.K.Stalin (@mkstalin) September 10, 2026సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీలో పోలీస్ శాఖపై చర్చకు సీఎం విజయ్ సమాధానం ఇస్తూ.. ఎమర్జెన్సీ–MISA అంశాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో దవడ దగ్గర చేతితో హావభావం చేశారు. ఈ సైగపై డీఎంకే నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాలిన్ ఎమర్జెన్సీ సమయంలో పోలీసుల దాడిలో దవడ విరిగిన విషయాన్ని విజయ్ ఎగతాళి చేశారని ఆరోపించారు. వామపక్షాలు కూడా విజయ్ తీరును తప్పుబట్టాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం.. స్టాలిన్ గాయాన్ని హేళన చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. అయితే దీనిపై సెప్టెంబర్ 8న విజయ్ వివరణ ఇచ్చారు. తన బాడీ లాంగ్వేజ్ అనుకోకుండా వచ్చిందని, ఎవరినీ వ్యక్తిగతంగా బాధపెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బీజేపీకి చెక్ పెట్టేందుకే విజయ్‌కు తోడుగా.. -
విజయ్ కూటమికి కొత్త పేరు.. వాళ్లు దూరం.. తమిళనాట కొత్త లెక్కలు!
తమిళనాడు రాజకీయాల్లో కొత్త కూటమి ఆవిర్భవించింది. అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతృత్వంలోని కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’గా పేరు ఖరారైంది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ అధ్యక్షతన బుధవారం చెన్నైలోని పనైయూర్లో జరిగిన సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ కూటమిలో టీవీకేతో పాటు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉన్నాయి. కూటమి పేరులోనే మత సామరస్యం, సామాజిక న్యాయం, విజయ్ రాజకీయ గుర్తింపు కనిపించేలా రూపొందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి నాయకత్వం విజయ్‌దే అని నేతలు స్పష్టం చేశారు.వీసీకే నేత ఎస్ఎస్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ పేరు విజయ్ ఆలోచన నుంచి వచ్చిందని తెలిపారు. బీజేపీ, ‘ఫాసిస్టు శక్తులకు’ వ్యతిరేకంగా కూటమి పనిచేస్తుందనే విషయాన్ని పేరు స్పష్టం చేస్తుందని చెప్పారు. టీవీకే బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలకు కూడా దీనితో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌తో విభేదాల్లేవ్..ఇటీవల ‘విజయ్ ఫర్ పీఎం’ అంటూ టీవీకే వర్గాల్లో వినిపిస్తున్న నినాదాలపై కాంగ్రెస్‌లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే టీఎన్‌సీసీ అధ్యక్షుడు బి.మాణిక్కం ఠాగూర్ మాత్రం టీవీకే, కాంగ్రెస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పారు. సరైన సమయంలో కూటమి ప్రధానమంత్రి అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలిపారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్లు పెరగడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కూటమి జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్‌లో చేరుతుందా? అనే ప్రశ్నకు వీసీకే నేత బాలాజీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. టీవీకేకు ప్రస్తుతం ఎంపీలు లేరని, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వచ్చిన తర్వాత ఇండియా కూటమిలో చేరే అంశం ఉంటుందని చెప్పారు. దీంతో రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో జాతీయ రాజకీయాల వైపు కూడా విజయ్ అడుగులు వేయనున్నారా? అన్న చర్చ మొదలైంది.వామపక్షాలు మాత్రం దూరం..కూటమి ఏర్పాటులో మరో కీలక అంశం వామపక్ష పార్టీల గైర్హాజరు. సీపీఐ, సీపీఎం నేతలు సమావేశానికి హాజరు కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో టీవీకేకు వామపక్షాలు మద్దతు ఇచ్చినప్పటికీ.. తాజా కూటమి సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నాయి. అయితే టీవీకే నేత ఆధవ్ అర్జునా కమ్యూనిస్టు పార్టీలు త్వరలోనే కూటమిలో చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే, కూటమి తన రాజకీయ ప్రయాణాన్ని రాబోయే ఉప ఎన్నికలతో ప్రారంభించనుంది. అభ్యర్థుల ప్రకటన త్వరలో ఉంటుందని నాయకులు తెలిపారు. కూటమి భవిష్యత్ నిర్మాణం, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, స్టీరింగ్ కమిటీ వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు.టీవీకే 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్‌తో కలిసి అధికార కూటమికి అధికారిక రూపం ఇచ్చింది. మరోవైపు డీఎంకే నేతృత్వంలోని కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటములకు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త ఫ్రంట్ నిలవనుంది. రాబోయే ఉప ఎన్నికల్లో ఈ మూడు శక్తుల మధ్య పోటీకి ఇది వేదిక కానుంది. అయితే విజయ్ నేతృత్వంలోని ఈ కూటమి ఎన్నికల కూటమిగానే కొనసాగుతుందా? లేదంటే తమిళనాడు రాజకీయాల్లో దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: గెట్ రెడీ ఫర్ సీబీఐ రైడ్స్! -
‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, కోలీవుడ్ నటి త్రిష కృష్ణన్ బంధం గురించి చాలాకాలంగా అక్కడ చర్చ నడుస్తోంది. అయితే ఆమెను ఉద్దేశించి.. నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యవహారంపై సీఎం విజయ్ కూడా భగ్గుమన్నారు. మహిళల్ని కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఈ ఎపిసోడ్‌పై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళలను కించపరిచేందుకు.. వారి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ధోరణేనని ఆమె వ్యాఖ్యానించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం కంగనా మీడియాతో మాట్లాడారు. మహిళలు ఉద్యోగం చేస్తున్నా, విజయవంతమైనా, నాయకురాలిగా ఉన్నా, అధికార స్థానంలో ఉన్నా.. వారిని కిందకు లాగేందుకు.. ఆమె పరువు, గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయడం మనకు కొత్తేం కాదు. అలాగని ఈ సమస్య భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచమంతటా ఉందని పేర్కొన్నారామె. ఈ క్రమంలోనే త్రిష ఎపిసోడ్‌ను ఆమె ప్రస్తావించారు. తమిళనాడులో మొన్న ఏం జరిగిందో అంతా చూశారు. ఎంతో గౌరవనీయమైన నటి ఒక వ్యవహారంలో చిక్కుకున్నారు. ఆ వ్యవహారంలో సంబంధం ఇద్దరి మధ్య ఉంది. కానీ, దూషణలు, వ్యక్తిత్వాన్ని కించపర్చడం మాత్రం మహిళపైనే జరుగుతున్నాయి. ఎందుకలా?” అని కంగనా అన్నారు. ఆ ధోరణి ఇంకెప్పుడు ఆగుతుందని వ్యాఖ్యానించారామె. సమాజం తనను తాను ఈ విషయంలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని.. మహిళలను మనం ఎలా చూస్తున్నాం? నిజంగా వారిని గౌరవిస్తున్నామా? అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలని వ్యాఖ్యానించారు.ఆగస్టు 3న కావేరీ జలాల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు త్రిష పేరు ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. దీనికి ఆయన స్పందించిన తీరు వివాదాస్పదమైంది. త్రిషను ఉద్దేశించే ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదవడంతో ఆగస్టు 4న ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.అయితే తాను త్రిష పేరును ప్రస్తావించలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఉదయనిధి చెప్పారు. కావేరీ నదిని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్య చేశానని ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. త్రిషకు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు, మహిళా నేతలు స్పందించారు. కంగనా కూడా గతంలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. బహిరంగంగా అసభ్యకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేయడం ఏ నాగరిక సమాజమూ అంగీకరించదని పేర్కొన్నారు. ఉదయనిధిపై తీసుకున్న చట్టపరమైన చర్యలు మంచి ఉదాహరణగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.ఇదే వివాదం నేపథ్యంలో తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ సోమవారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశరు. మహిళలపై వ్యక్తిగత దూషణలు, ద్వంద్వార్థ వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చని, కానీ మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు మాత్రం చోటు ఉండకూడదని హెచ్చరించారు. మహిళలపై దూషణలు, వ్యక్తిగత దాడులు కొనసాగితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అంతా మా ఇష్టం అంటే కుదరదిక్కడ -
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సోమవారం తీవ్ర గందరగోళం మధ్య సాగాయి. రాష్ట్రంలో వరుస హత్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై అధికార టీవీకే ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం నిలదీయడంతో సభలో వాగ్వాదం, నినాదాలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. దీనికి ముఖ్యమంత్రి విజయ్ ఘాటుగా బదులిస్తూ.. నేరస్తులు ఏ పార్టీకి చెందినవారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో డీఎంకేపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ‘పార్టీ ఫండ్స్’ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేశారని ఆరోపించడం సభలో మరింత వేడి పెంచింది.సభ ప్రారంభమైన వెంటనే డీఎంకే సభ్యులు రాష్ట్రంలో పెరుగుతున్న హత్యలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, వరుసగా హత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దీనిపై చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ కోరారు. ఈ అంశంపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు డీఎంకే సభ్యులు ప్రయత్నించడంతో సభలో ఉద్రిక్తత మొదలైంది.దీనిపై ముఖ్యమంత్రి విజయ్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం నేరాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. పోలీసులు మంచివారికి మిత్రులుగా, నేరస్తులకు శత్రువులుగా ఉండాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. నేరస్తుడు ఏ పార్టీకి చెందినవాడైనా చట్టం ముందు సమానమేనని తెలిపారు.‘పోలీసులు పవర్ సెంటర్ కాకూడదు’పోలీసు వ్యవస్థ ప్రజలను భయపెట్టే పవర్‌సెంటర్‌గా మారకూడదని విజయ్ అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన బాధ్యతగా ఉండాలని చెప్పారు. గత మూడు నెలల్లో జరిగిన నేరాలను ఒకేసారి జరిగిన ఘటనలుగా చూడటం సరికాదని, వాటిలో అనేకం పాత కక్షలు, ప్రతీకారాల కారణంగా జరిగినవేనని వివరించారు.డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కోయంబత్తూరులో జరిగిన ఓ కాలేజీ విద్యార్థి హత్య కేసులో 36 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 37 జిల్లాల్లో యాంటీ డ్రగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని, చెన్నైలో మూడు నెలల్లో ఎన్డీపీఎస్ చట్టం కింద 330 కేసులు నమోదు చేసి 556 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.డీఎంకేపై విజయ్ సంచలన ఆరోపణలుశాంతిభద్రతల అంశంతో మొదలైన అసెంబ్లీ రచ్చ.. ఆ తర్వాత అవినీతి ఆరోపణలతో మరింత ముదిరింది. తమపై అవినీతి ఆరోపణలకు ఆధారాలు చూపించాలని విపక్షాలు పదేపదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. విజయ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పత్రాన్ని ప్రస్తావించారు.గత డీఎంకే ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల నుంచి కాంట్రాక్టు విలువలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు ‘పార్టీ ఫండ్స్’ పేరుతో వసూలు చేశారని** ఆయన ఆరోపించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ సప్లై (MAWS) శాఖ పరిధిలో ప్రభుత్వ పనులు చేపట్టే కాంట్రాక్టర్ల నుంచి ఈ మొత్తాలను లంచాల రూపంలో వసూలు చేశారని ఈడీ పత్రంలో పేర్కొన్నట్లు విజయ్ సభలో చదివి వినిపించారు.‘లంచాలు.. లోన్ ఈఎంఐల్లా వసూలు’ఈ క్రమంలో పురుషోత్తం అనే వ్యక్తి పేరును ప్రస్తావించిన విజయ్.. ఆయన నుంచి రూ.29 లక్షలు లంచంగా వసూలు చేసినట్లు ఈడీ నివేదికలో ఉందన్నారు. అయితే ఆ మొత్తం ఒక్కసారిగా తీసుకోలేదని.. లోన్ ఈఎంఐలు చెల్లించినట్టుగా విడతల వారీగా వసూలు చేశారని విజయ్ ఆరోపించారు. అంతేకాదు.. ఈడీ పత్రంలో పేర్కొన్నట్లు ‘పార్టీ ఫండ్స్’కు ప్రత్యక్ష లబ్ధిదారులుగా అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, అప్పటి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రవి ప్రసాద్‌తో పాటు మరికొందరి పేర్లు ఉన్నాయని విజయ్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు తనవి కావని, ఈడీ పత్రంలో ఉన్నవేనని ఆయన స్పష్టం చేశారు.సర్కారియా కమిషన్ నివేదిక ప్రస్తావనడీఎంకేపై అవినీతి ఆరోపణలకు చారిత్రక నేపథ్యం ఉందని చెప్పేందుకు విజయ్ సర్కారియా కమిషన్ నివేదికను కూడా ప్రస్తావించారు. వీరాణం నీటి సరఫరా పథకానికి సంబంధించిన వ్యవహారంలో ‘పార్టీ ఫండ్’ పేరుతో 2.5 శాతం డిమాండ్ చేశారన్న ఆరోపణలు కమిషన్ నివేదికలో ఉన్నాయని చెప్పారు. అప్పట్లో టెండర్ విలువ రూ.16 కోట్లుగా ఉందని తెలిపారు.2001లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ మంత్రి పొన్నయ్యన్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారని విజయ్ గుర్తుచేశారు. ‘కొంచెం లోతుగా పరిశీలిస్తే మరెన్నో విషయాలు బయటకు వచ్చాయి’ అంటూ డీఎంకేపై విమర్శలు గుప్పించారు.చివరకు వాకౌట్..విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుపడుతూ.. నినాదాలు చేశారు. పలువురు డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పోడియం చుట్టూ చేరడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.ఇదీ చదవండి: డీ బాస్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కాంగ్రెస్ నేత -
స్టాలిన్ ఆశలకు బ్రేక్.. టీవీకే బాబుకు రిలీఫ్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొలత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ ధ్రువీకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ పిటిషన్ అసలు విచారణకే అర్హమైనది కాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్‌ను తమిళగ వెట్రి కజగం (టీవీకే) అభ్యర్థి వీఎస్ బాబు ఓడించారు. బాబుకు 82,997 ఓట్లు (45.09 శాతం) రాగా.. స్టాలిన్‌కు 74,202 ఓట్లు (40.32 శాతం) వచ్చాయి. దీంతో బాబు 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్టాలిన్ రెండో స్థానంలో నిలిచారు. అయితే మే 4న ఫలితాలు వెలువడగా.. మే 7నే 14 ఈవీఎంల బర్న్ట్ మెమరీ, మైక్రోకంట్రోలర్‌ను పరిశీలించాలని ఎన్నికల సంఘానికి స్టాలిన్ దరఖాస్తు చేశారు. కానీ, ఈ 14 ఈవీఎంలు నియోజకవర్గంలోని మొత్తం 286 యంత్రాల్లో 5 శాతం. అయితే ఈ పరిశీలన జూలై 29న మాత్రమే జరిగింది. పరిశీలన సమయంలో రెండు ఈవీఎంలు పనిచేయడం ఆగిపోయాయని, మరో యంత్రానికి సంబంధించిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లపై అడ్రస్ ట్యాగ్లు సరిగ్గా లేకపోవడంతో పాటు సీల్ విషయంలోనూ లోపాలు ఉన్నాయని స్టాలిన్ ఆరోపించారు. ఒక కంట్రోల్ యూనిట్ తన పేరున్న బ్యాలెట్ యూనిట్‌ను గుర్తించలేదని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.అన్ని వీవీప్యాట్ లెక్కింపు కోరుతూ..కొలత్తూరు నియోజకవర్గంలోని మొత్తం 286 ఈవీఎంలను పరిశీలించడంతో పాటు 100 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని స్టాలిన్ కోర్టును కోరారు. ఈవీఎంల పరిశీలనలో బయటపడిన లోపాల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. వీఎస్ బాబు ఎన్నికను చెల్లనిదిగా ప్రకటించాలని, తనను విజేతగా ప్రకటించాలని కూడా అభ్యర్థించారు.ఆలస్యంగా ఈవీఎంల పరిశీలన?స్టాలిన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కీలక వాదన చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మే 7న ఈవీఎంల పరిశీలనకు దరఖాస్తు చేసినప్పటికీ.. ఎన్నికల సంఘం జూలై 29న పరిశీలన చేపట్టిందన్నారు. అప్పటికి ఎన్నికల పిటిషన్ దాఖలు చేసేందుకు నిర్దేశించిన 45 రోజుల గడువు ముగిసిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశీలనలో లోపాలు బయటపడిన తర్వాత స్టాలిన్ ఎన్నికల పిటిషన్ ఎలా దాఖలు చేయగలరని ప్రశ్నించారు.ఈసీ అభ్యంతరం ఇదే..అయితే స్టాలిన్ పిటిషన్‌ను విచారించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం వాదించింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బి) ప్రకారం ఎన్నికల ఫలితాలను సవాలు చేయాలంటే ఎన్నికల పిటిషన్ ద్వారానే వెళ్లాలని పేర్కొంది. ఆర్టికల్ 226 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ ద్వారా ఆ ప్రక్రియను పక్కదారి పట్టించలేరని తెలిపింది.ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్ ‘నాట్ మెయింటెయినబుల్’ అని పేర్కొంటూ కొట్టివేసింది. దీంతో కొలత్తూరు ఎన్నికల ఫలితాలను ఈవీఎంల ఆధారంగా సవాలు చేసిన స్టాలిన్ ప్రయత్నానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది.ఇదీ చదవండి: అలా.. విడాకులిచ్చేయాల్సి వచ్చింది! -
అలా కేసులు పెట్టడం అమానవీయం.. విజయ్ ఫైర్
ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం ఎవరైనా శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టవచ్చని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. అయితే అవి హింసాత్మకంగా మారకుండా, ప్రజలకో.. ప్రభుత్వ ఆస్తులకో నష్టం కలిగించకుండా ఉండాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం అసెంబ్లీ సాక్షిగా ఓ కీలక ప్రకటన చేశారు.గత డీఎంకే ప్రభుత్వంలో రైతులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం విజయ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే వాళ్లు ధర్నాలు చేపడితే కేసులు పెట్టారని.. అది అమానవీయమని మండిపడ్డారాయన. ఆయా కేసులు ఐదేళ్ల తర్వాత కూడా ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని సభలో తెలియజేశారు. ఈ నేపథ్యంలో రైతులు, టీచర్లపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. దీంతో 2021 మే నుంచి 2026 వరకు ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులన్నీ రద్దు కానున్నాయి.రైతులపై కేసులెందుకు?రాష్ట్రానికి.. దేశానికి రైతులే వెన్నెముక అని విజయ్ పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రైతులు, స్థానికులు చేపట్టిన ఆందోళనల సందర్భంగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ముఖ్యంగా సిప్కాట్ పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం సందర్భంగా రైతులపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. విజయ్ ప్రకటన చేసిన సమయంలో ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ సభలోనే ఉండడం గమనార్హం.డీఎంకే హయాంలో పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక రైతులు, గ్రామస్తులు సుదీర్ఘంగా ఆందోళనలు చేశారు. ఈ తరుణంలో.. విమానాశ్రయాన్ని రద్దు చేస్తూ విజయ్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. టీచర్లపైనా..ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేసినప్పటికీ వారిపైనా కేసులు పెట్టారని సీఎం విజయ్ తెలిపారు. ఆ కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును వినియోగించుకున్నందుకు కేసులతో వేధించడం సరికాదని వ్యాఖ్యానించారు.ఎన్ని కేసులు?అయితే డీఎంకే హయాంలో రైతులు, ఉపాధ్యాయులపై వివిధ ఆందోళనలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయనే పూర్తి సంఖ్యను విజయ్ ప్రభుత్వం ఈ ప్రకటనలో వెల్లడించలేదు. అయితే గతంలో తమిళనాడులో వివిధ ఉద్యమాలకు సంబంధించిన పెండింగ్ కేసులపై ప్రభుత్వాలు దశలవారీగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే విజయ్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష డీఎంకే స్పందించాల్సి ఉంది. ఆ ఇబ్బందుల్ని అర్థం చేసుకున్నాంగత డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపిన వారిని అమానవీయంగా వ్యవహరించారని విజయ్ ఆరోపించారు. కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, ఇతర వ్యక్తిగత వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు ఉపశమనం కల్పించేందుకే కేసుల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా, ఇటీవలే యాంటీ-నీట్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 2న పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు డీఎంకే హయాంలో రైతులు, టీచర్లపై నమోదైన కేసులను కొట్టేయాలని నిర్ణయించడం గమనార్హం.ఇదీ చదవండి: కాంగ్రెస్ ప్లాన్‌బీ.. వాళ్లకు బంపర్ ఆఫర్ -
‘విజయ్ ఫర్ పీఎం’.. గుంటనక్క కథతో కాంగ్రెస్ సెటైర్!
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పేరుతో మరో కొత్త చర్చ మొదలైంది. 2029లో ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్ను ప్రొజెక్ట్ చేస్తూ ఆయన పార్టీ టీవీకే వర్గాలు కొంత కాలంగా ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే–సీవోటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ప్రధాని పదవికి విజయ్ మూడో స్థానంలో నిలవడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. ఈ తరుణంలో.. అక్కడి ప్రతిపక్ష డీఎంకేతో పాటు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది.రాజకీయ ఉద్దండులను తోసేసి మరీ.. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తర్వాత ప్రధాని రేసులో విజయ్ ఉన్నారన్నది ఇండియాటుడే సర్వేలో వెల్లడైంది. అంతేకాదు సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగానూ ఆయనకు అర్హత ఉందంటూ రాహుల్ గాంధీ తర్వాతి ప్లేస్‌ను కట్టబెట్టారు. దీంతో విజయ్‌కు జాతీయ స్థాయిలో ఆదరణ ఉందని.. రాబోయే రోజుల్లో పక్కా దేశానికి ప్రధాని అవుతారంటూ టీవీకే హడావిడి చేస్తోంది. అయితే ఈ ప్రచారంపై డీఎంకే నేత ఆర్ఎస్ భారతి స్పందిస్తూ ఆయన పార్టీ కార్యకర్తలు కోరుకుంటే విజయ్ పీఎం ఏంటి.. ఏకంగా ఐక్యరాజ్యసమితి అధిపతి అవుతారని సెటైర్ వేశారు.“వారి ఊహలకు హద్దుల్లేవు.. ఏదైనా ఊహించుకోనివ్వండి” అంటూ ఆర్ఎస్ భారతి కామెంట్ చేశారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే ఆ పార్టీ ఆశయం ఏమైపోతుందో అంటూ ఇంకో చురక అంటించారు.కాంగ్రెస్ గుంటనక్క కథ.. ఇండియా టుడే సర్వే, టీవీకే చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ కూడా పరోక్షంగా స్పందించినట్లు ఆయన తాజా ట్వీట్‌తో స్పష్టమవుతోంది. ‘ది ఫాక్స్ ఫేక్ పోల్’ పేరుతో ఓ నక్క కథను ఎక్స్‌లో పంచుకున్న ఆయన.. సర్వేలో ఎంతమందిని ప్రశ్నించారు? ఎక్కడ నిర్వహించారు? ఏ ప్రశ్నలు అడిగారు? ఫలితాలను ఎలా లెక్కించారు? వంటి అంశాలను ప్రస్తావించారు. “ప్రతి సంఖ్య నిజాన్ని చెప్పదు.. ప్రతి సర్వే ప్రజల గొంతుక కాదు” అంటూ తేల్చేశారు. ఆయన చెప్పిన కథలో ఏముందంటే..ఒక అడవిలో సింహం, ఏనుగు మంచి స్నేహితులు. అడవికి సంబంధించి ఏ నిర్ణయమైనా ఇద్దరూ కలిసే తీసుకుంటారు. వారి స్నేహాన్ని చూసి ఈర్ష్యపడిన గుంటనక్క.. కొందరిని మాత్రమే అడిగి ఓ సర్వే నిర్వహిస్తుంది. ఆ సర్వే పేరుతో సింహానికి ఏనుగుపై, ఏనుగుకు సింహంపై అనుమానాలు కలిగించి వాళ్లను విడగొట్టాలని చూస్తుంది. చివరకు ఓ చీమ.. ముందుకు వచ్చి నక్కను అందరి ముందే నిలదీస్తుంది. సర్వేలో ఎంతమందిని అడిగారు? ఎక్కడ నిర్వహించారు? ఏ ప్రశ్నలు వేశారు? ఫలితాలను ఎలా లెక్కించారు? అని ప్రశ్నించడంతో నక్క నీళ్లునములుతూ కనిపిస్తుంది. అలా ఏనుగు-సింహం స్నేహం చెడిపోకుండా కాపాడుతుంది. படித்ததில் பிடித்த ஒரு குட்டி கதை …நரியின் போலி கருத்துக்கணிப்புஒரு காட்டில் சிங்கமும் யானையும் நெருங்கிய நண்பர்களாக இருந்தனர்.காட்டில் எந்தப் பெரிய முடிவாக இருந்தாலும், இருவரும் ஒன்றாக ஆலோசனை செய்வார்கள்.ஒருநாள், அந்த நட்பைப் பார்த்து பொறாமைப்பட்ட நரி, ஒரு…— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) August 30, 2026ఇండియాటుడే చానెల్ ఈ మధ్యే తమిళంలోనూ అడుగు పెట్టింది. అది సీఎం విజయ్ చేతుల మీదుగానే ప్రారంభం కావడం గమనార్హం.విజయ్‌కు మూడో స్థానంఆగస్టు 28న వెలువడిన తాజా ఇండియా టుడే–సీవోటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ప్రధాని పదవికి ప్రజల ఎంపికలో విజయ్ మూడో స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. వీటితో పాటు గత ఆరు నెలల్లో నిర్వహించిన మరో 91,795 ఇంటర్వ్యూల డేటాను కూడా విశ్లేషణలో ఉపయోగించారు. మొత్తం 9.2% మంది విజయ్ తదుపరి ప్రధాని కావడానికి అనుకూలంగా ఓటేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి 48.7%, రాహుల్ గాంధీకి 27.1% మద్దతు లభించింది. దీంతో 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా టీవీకే వర్గాల్లో ‘విజయ్ ఫర్ పీఎం’ నినాదం మరింత బలంగా వినిపిస్తోంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విజయ్ను ప్రధాని చేయాలంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ తరుణంలో మిత్రపక్షం కాంగ్రెస్ నుంచే కౌంటర్లు రావడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: సెప్టెంబర్ 17న తమిళ రాజకీయాల్లో బిగ్ బాంబ్? -
యాక్షన్ ప్లాన్ ఏది?.. నేపాల్‌లో తమిళ యాత్రికుల మిస్సింగ్
నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మృతుల సంఖ్య పెరుగుతుండగా.. అక్కడికి వెళ్లిన భారతీయ యాత్రికుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళ యాత్రికుల పరిస్థితిపై ఆ రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.కుంభకోణానికి చెందిన సూపర్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మొత్తం 57 మంది తమిళ యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు ఇప్పటికే అక్కడి అధికారులు ప్రకటించారు. వీరిలో 20 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందగా.. మరో 37 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే టీవీకే సర్కార్ ఈ మధ్యాహ్నాం దాకా ఎలాంటి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.ఏం చర్యలు తీసుకున్నారు?ఈ వ్యవహారంపై తమిళనాడు టీవీకే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. నేపాల్‌లో చిక్కుకున్న తమిళ యాత్రికుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశ్నించారు. “ఎంతమంది యాత్రికులు గల్లంతయ్యారు? ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు ఎన్ని కాల్స్ వచ్చాయి? ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారు?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా ఆ 57 మంది తమిళ యాత్రికులను సురక్షితంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ.. నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల రక్షణ కోసం ప్రత్యేక హెలికాప్టర్ పంపాలని కోరింది.LoP Udhayanidhi Stalin in Tamil Nadu Assembly on Nepal floods: "Many Tamils who went missing in Nepal are still unreachable. How many calls were received on the Government helpline? What action has been taken? - Udhayanidhi questions.""All 57 Tamils must be rescued and brought… https://t.co/wENvCSTZUl— ANI (@ANI) August 27, 202657 కాదు.. 106 మందితమిళనాడు మంత్రి రాజ్‌మోహన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అక్కడి అధికార యంత్రాగంతో ఎప్పటికప్పుడు సమన్వయం జరుపుతున్నామని తెలిపారు. కుంభకోణం ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 57 మంది వెళ్లగా.. చెన్నైకి చెందిన మరో ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మరో 49 మంది యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. వారి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు.చివరి ఫోన్ కాల్.. నో రెస్పాన్స్తమ కుటుంబ సభ్యుల నుంచి చివరిసారిగా వచ్చిన ఫోన్ కాల్ తర్వాత యాత్రికుల బంధువుల్లో ఆందోళన మరింత పెరిగింది. విష్ణు రామస్వామి అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన తల్లి, ఇద్దరు సోదరీమణులు యాత్రలో ఉన్నారని తెలిపారు. “ఆగస్టు 23న వారు బయలుదేరారు. ఢిల్లీ, ఖాట్మండు చేరుకున్న తర్వాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫోన్ చేసేవారు. ఆగస్టు 26 ఉదయం 6.15 గంటలకు చివరిసారి మాట్లాడారు. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత ఫోన్ సంబంధాలు తెగిపోయాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు.విజయ్ అత్యవసర సమావేశంఅసెంబ్లీలో నేపాల్ వరదల మిస్సింగ్‌పై ఆందోళనలు వ్యక్తం అయ్యాక.. ముఖ్యమంత్రి విజయ్ ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.Nepal tragedy - Cm instructions Chief Minster of Tamil Nadu conducted a review meeting to oversee the relief measures post the Nepal tragedy CM has instructed Thiru Ashish Kumar, IAS, Resident Commissioner,TN House, New Delhi along with a team to proceed to Kathmandu to… pic.twitter.com/EqYLS4YzyF— Vignesh Theni (@Vignesh_twitz) August 27, 2026ఆచూకీ కోసం ప్రయత్నాలునేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన భారతీయుల వివరాలను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తున్నాయి. చాలామంది యాత్రికుల బృందాలు వరదల కంటే ముందే ఆ ప్రాంతాన్ని దాటినట్లు సమాచారం అందుతోంది. దీంతో యాత్రికుల సురక్షిత తరలింపుపై కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: విపత్తుల నేపాల్.. ఆ ట్రాక్ రికార్డు అంత ఘోరం మరి! -
బీజేపీకి గుడ్‌బై.. ఆ వెంటనే విజయ్ TVK బంపర్ ఆఫర్!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన తమిళగ వెట్రి కజగం (TVK) రాజకీయంగా విస్తరించేందుకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకే పరిమితం కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ అవకాశాలను ఇప్పటికే పరిశీలించింది. ఈ క్రమంలో తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన నటుడు దేవన్‌కు మాంచి ఆఫర్ ఇచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా బీజేపీపై రగిలిపోతున్న ఆ సీనియర్ నటుడే ఓ జాతీయ మీడియా చానెల్‌కు వెల్లడించారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా అంది వచ్చిన అవకాశాన్ని విజయ్ టీవీకే సకాలంలో అందిపుచ్చుకుంది. అద్భుత విజయంతో అధికారం చేపట్టింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ కన్ను పక్క రాష్ట్రాలపై పడింది. విజయ్ క్రేజ్, అలాగే.. రాజకీయ పరిస్థితులను బేరీజూ వేసుకుని విస్తరణకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే కేరళలో టీవీకే విస్తరణకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మలయాళ ఇండస్ట్రీలో సీనియర్ నటుడైన దేవన్‌కు.. టీవీకే పార్టీ తాజాగా కేరళ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆఫర్ చేసింది. దేవన్ ఆగస్టు 16న బీజేపీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆయన బీజేపీపై భగ్గుమన్నారు. దాదాపు ఐదేళ్లు పార్టీలో ఉన్నప్పటికీ తనకు ఎలాంటి బాధ్యత ఇవ్వలేదని, పనిచేయాలన్నా అవకాశం కల్పించలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాజీనామా చేసిన మరుసటి రోజే సీఎం విజయ్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని దేవన్ తెలిపారు.#WATCH | Kollam, Keralam: On joining TVK after resigning from BJP, Malayalam actor Devan said, "...I've been working for the BJP very affirmatively, aggressively, taking a lot of risks. But they couldn't understand my mission and my planning. They are against all these things. I… pic.twitter.com/q9PW7Ur3Tp— ANI (@ANI) August 23, 2026ఆ తర్వాత టీవీకేకి చెందిన ఇద్దరు నేతలు తన ఇంటికి వెళ్లి దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపినట్లు చెప్పారు. అనంతరం సీనియర్ నేతలతో గూగుల్ మీట్ ద్వారా కూడా చర్చలు జరిగినట్లు వెల్లడించారు. ఈ చర్చల్లో కేరళ TVK రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తనకు ఆఫర్ చేసినట్లు దేవన్ తెలిపారు.విజయ్‌తో భేటీ తర్వాతే ప్రకటనదేవన్ త్వరలో చెన్నై వెళ్లి విజయ్ను కలవనున్నారు. సెప్టెంబర్ 10 తర్వాత ఈ భేటీ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విజయ్‌తో చర్చించిన అనంతరం TVKలో చేరిక, కేరళ పార్టీ బాధ్యతలు చేపట్టడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.విజయ్, దేవన్‌కు సినిమా రోజుల నుంచే మంచి పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. ఆ అనుబంధమే ఇప్పుడు రాజకీయాల్లోనూ కొత్త సమీకరణానికి దారితీస్తుందన్న ఆసక్తి నెలకొంది.తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే!మలయాళంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన దేవన్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. బాషా, ధర్మక్షేత్రం, రౌడీ మొగుడు, శుభాకాంక్షలు, పెళ్లి చేసుకుందాం, చన్నకేశవరెడ్డి, దేశముదురు, ఏ మాయ చేశావె, ఢమరుకం, హార్ట్ ఎటాక్, రాజుగారి గది-2, సాహో వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. దేవన్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదు. విద్యార్థి దశలో కాంగ్రెస్, KSUతో అనుబంధం ఉన్న ఆయన.. 2004లో కేరళ పీపుల్స్ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో దాన్ని నవ కేరళ పీపుల్స్ పార్టీగా పునరుద్ధరించి, 2021లో బీజేపీలో విలీనం చేశారు. అనంతరం కేరళ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేసి TVK వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం కేరళలో అధికార, ప్రతిపక్ష కూటముల మీద జనాలకు అసంతృప్తి నెలకొందని, మాంచి స్ట్రాటజీతో ముందుకెళ్తే టీవీకే రాణించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారాయన.కేరళలో ‘కొత్త ప్రత్యామ్నాయం’..కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్.. ఈ రెండు కూటముల మధ్యే అధికార పంపిణీ రొటీన్‌గా మారింది. ఈ మధ్యలో బీజేపీ ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమోనని భావించినా ఫలితం దక్కలేదు. ప్రజలు కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని, విజయ్ నేతృత్వంలోని TVK వైపు యువత, విద్యార్థులు ఆసక్తి చూపించొచ్చని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్‌కు కేరళలో మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఆయన డబ్బింగ్ సినిమాలు విపరీతంగా ఆడేవి. గతంలో అక్కడికి వెళ్లిన ఆయన.. అభిమానులతో దిగిన సెల్ఫీలు సైతం నెట్టింట పంచుకునేవారు. విజయ్ రాజకీయ ఎంట్రీ, విజయాన్ని సైతం అక్కడి ప్రజలు నిశితంగా గమనించారు. దీంతో ఆయన ఎంట్రీ ఇస్తే ఆదరణ దక్కవచ్చని దేవన్ అంటున్నారు. టీవీకేలోకి దేవన్ ఎంట్రీ జరిగితే.. కేరళలో TVKకి తొలి కీలక అడుగు పడినట్లే. అయితే ఒకవైపు తమిళనాడులో పార్టీని బలోపేతం చేస్తూనే.. కేరళలో సినీ రంగంలో పరిచయం ఉన్న నేతను ముందుకు తీసుకురావడం ద్వారా విజయ్ తన పార్టీని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారా అన్న చర్చ మొదలైంది.ఇదీ చదవండి: ఎస్ఐ చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు -
మాట నిలబెట్టుకున్న తమిళనాడు సీఎం విజయ్
మేనిఫెస్టో పేరిట అడ్డగోలు హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని ఎగ్గొట్టడం.. కొందరికి అలవాటే!. ముఖ్యంగా ఇప్పుడున్న కొన్ని ప్రభుత్వాలు ప్రజలను అలా మోసం చేస్తున్నవే. అయితే అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి కాగా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నారు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ సోమవారం కీలక ప్రకటన చేశారు. పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం వెల్లడించారు. చెన్నై సమీపంలో ప్రతిపాదించిన ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు, స్థానికులకు అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు.‘‘పరందూర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తున్నాం. ప్రతిపాదిత విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’’ అని విజయ్ తెలిపారు. వీటితో పాటు ఎన్నికల హామీలైన మూడు ఉచిత సిలిండర్ల పథకం పొంగల్ నుంచి ప్రారంభిస్తామని, అక్టోబర్ 2 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(డీలక్స్ బస్సులకూ వర్తింపజేస్తూ) పథకం మొదలుపెడతామని.. అలాగే మిగతా మేనిఫెస్టో హామీలపైనా స్పష్టత ఇచ్చారు. 🚨Chief Minister Vijay announces that the TVK government will abandon the proposed Parandur airport project. RIP TN Economy...🙏🙂 pic.twitter.com/ga7qbFvT64— Chennai Updates (@UpdatesChennai) August 24, 2026రైతుల ఆందోళనకు అండగా..చెన్నైకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని కాంచీపురం జిల్లాలోని పరందూర్‌లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రాజెక్ట్ వల్ల బహుళ పంటలు పండే వ్యవసాయ భూములు, నీటి వనరులు దెబ్బతింటాయని స్థానిక రైతులు, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.టీవీకే అధినేతగా ఉన్నప్పటి నుంచే విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించారు. 2024 అక్టోబర్‌లో విక్రవాండి సభలోనే ఈ అంశంపై స్పందించిన ఆయన.. పారిశ్రామిక అభివృద్ధికి విమానాశ్రయాలు అవసరమే అయినా, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి నిర్మాణాలు చేపట్టకూడదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే ప్రజల హామీని నెరవేరుస్తానని చెప్పిన విజయ్.. తాజాగా ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు.డీఎంకే హయాంలోనే ప్రతిపాదనపరందూర్ ఎయిర్‌పోర్ట్‌కు 2025 ఏప్రిల్‌లో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది. అయితే అప్పటి డీఎంకే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లింది. టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపాదిత స్థలాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించి.. నీటి వనరులు, సారవంతమైన భూములను కాపాడేలా చర్యలు తీసుకుంటామని పార్టీ నేతలు వెల్లడించారు.విజయ్ ప్రకటనపై డీఎంకే కౌంటర్అయితే విజయ్ నిర్ణయంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. గతంలో తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్ట్‌కు సంబంధించిన మా ఫైళ్లను బయటపెట్టేందుకు విజయ్‌కు అనుమతి ఇస్తున్నాం. వారం రోజుల్లో వాటిని బయటపెట్టకపోతే.. అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తాం’’ అని అన్నారు.ఎన్నికల ముందు పరందూర్ ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన విజయ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిర్ణయాన్ని అమలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రైతులు, పర్యావరణ పరిరక్షణ అంశాలను ముందుకు తెస్తూ తీసుకున్న ఈ నిర్ణయం.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: మిడ్డిలో విజయ్ ఎమ్మెల్యే??.. కీర్తన రియాక్షన్ ఇదే -
సెటైర్ల సంగ్రామం.. ఉదయనిధి వర్సెస్ టీవీకే
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వాడీవేడిగా సాగాయి. అధికార టీవీకే ప్రభుత్వం, ప్రతిపక్ష డీఎంకే మధ్య రాజకీయ విమర్శలు వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరాయి. ఒకానొక టైంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం సభలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకరిపై ఒకరు వ్యంగ్య వ్యాఖ్యలు చేసుకోవడంతో స్పీకర్ జోక్యం చేసుకుని ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాల్సి వచ్చింది.శాసనసభలో టీవీకే సర్కార్‌పై ఉదయ్‌నిధి స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలకు కార్లు గిఫ్ట్ ఇచ్చే ప్రకటన చేశాక.. టీవీకే ఎమ్మెల్యే సింధు ముఖ్యమంత్రి విజయ్ను ప్రశంసిస్తూ ఎంజీఆర్ చిత్రంలోని పాట పాడడంపై ఉదయనిధి స్పందించారు. ‘‘మనం అసెంబ్లీకి వచ్చామా? లేదంటే సూపర్ సింగర్ కార్యక్రమానికి వచ్చామా? అనే సందేహం వస్తోంది’’ అంటూ ఎద్దేవా చేశారు. అలాగే ఎమ్మెల్యేలకు కారు అనేది అనవసరమైన ఖర్చు అని, తమ 59 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు అవి అక్కర్లేదంటూ సీఎం విజయ్ ప్రకటనను తిరస్కరించారు.అలాగే అసెంబ్లీ సమావేశాల్ని లైవ్ ప్రసారం చేయకపోవడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే రికార్డుల నుంచి కొన్ని వ్యాఖ్యలను తొలగించినా.. అవి సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అవుతున్నాయని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విజయ్ సర్కార్‌కు ఆయన ఓ సవాల్ సైతం విసిరారు.సినిమా డైలాగులొద్దు..ఇటీవల సీఎం విజయ్.. గత డీఎంకే ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి ఫైళ్లు తన వద్ద ఉన్నాయని అన్నారు. ఆ వ్యాఖ్యలను ఉదయనిధి ప్రస్తావిస్తూ.. ‘‘ఆ ఫైళ్లను బయటపెట్టండి. సినిమా పంచ్ డైలాగులు వద్దు’’ అంటూ విజయ్‌కు సవాల్ విసిరారు. ‘‘ఆధారాలు ఉంటే విడుదల చేయండి. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోండి. డీఎంకే ఎలాంటి బెదిరింపులకు భయపడదు’’ అని అన్నారు.Leader of the Opposition and DMK leader Udhayanidhi Stalin announced in the Tamil Nadu Assembly that all 59 DMK MLAs will not accept the newly announced government-provided cars. He said such expenditure is unnecessary when Tamil Nadu is facing a heavy debt burden.… pic.twitter.com/RsyYpEEHMB— IndiaToday (@IndiaToday) August 21, 2026నిర్మల్ వ్యాఖ్యలతో దుమారం.. సభలో మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ ఉదయనిధి స్టాలిన్‌ను ప్రస్తావిస్తూ తొలుత ‘‘గౌరవనీయ కరూర్ ఎమ్మెల్యే’’ అని అన్నారు. వెంటనే దాన్ని సరిదిద్దుతూ ‘‘కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యే’’ అని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలతో సీఎం విజయ్ సహా ఎమ్మెల్యేల్లో కొందరు నవ్వుకున్నారు. కరూర్‌కు గతంలో.. ప్రస్తుతం కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యేగా ఉంది బాలాజీ సెంథిల్. అవినీతి ఆరోపణల్లో ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘కరూర్ గ్యాంగ్’ను డీఎంకే అధిష్టానం రక్షిస్తుందంటూ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తుంటారు. నిర్మల్ కుమార్ ఆ కోణంలోనే అలా మాట్లాడి ఉంటారని అంతా భావిస్తున్నారు.అయితే నిర్మల్ స్పందించిన ఉదయనిధి వ్యంగ్యంగా.. ‘‘గౌరవనీయ సంఘీ మంత్రి’’ అంటూ వ్యాఖ్యానించి, ఆ వెంటనే ‘‘విద్యుత్ మంత్రి’’ అని సరిదిద్దుకున్నారు. ఈ వ్యాఖ్యలపై టీవీకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మల్ కుమార్ గతంలో.. బీజేపీకి పని చేశారు. ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరి.. కిందటి ఏడాది టీవీకే కండువా కప్పుకున్నారు. బహుశా ఈ కోణంలోనే ఉదయనిధి పంచ్ వేశారు.అయితే.. ఈ సెటైర్ల సంగ్రామం ఇక్కడే ఆగిపోలేదు. నిర్మల్ కుమార్ మరోసారి లేచి.. ‘‘సాధారణంగా ఎవరైనా బాత్రూమ్లో 5 నుంచి 10 నిమిషాలు ఉంటారు. కానీ మూడు గంటలు బాత్రూమ్లో ఉన్న గౌరవనీయ మంత్రి’’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.செந்தில் பாலாஜிய "கரூர் கம்பெனி"னு சொன்னா @Udhaystalin ஏன் இவ்ளோ கோவம் வருது... FYI, DVAC'ல "கரூர் Gang"னு mention ஆகி இருக்கு.. அதுக்கும் தனக்கும் சம்பந்தம் இருக்குனு அவரே ஒதுக்குகிறாரா LoP...??@CTR_Nirmalkumar Mass 🔥🔥🔥#TVK #TVKGovt #DMK #UdhaynidhiStalin #TNAssembly… pic.twitter.com/qwlRXxVIlh— Gomathi Sivam (@GomatiSivam) August 21, 2026 one of a kind blud 👺 pic.twitter.com/cXBx1qoHvX— Fayas.naxiim🐿️ (@_faaaz) August 21, 2026 కావేరీ నీటి వివాదం సమయంలో.. నటి త్రిష మీద ఉదయనిధి స్టాలిన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో.. ఉదయనిధిని అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లినప్పుడు ఆయన భార్య కిరుతిగా ‘‘ఆయన బాత్రూమ్లో ఉన్నారు.. కొంత సమయం ఇవ్వండి’’ అని చెప్పిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఉదయనిధిపై నెట్టింట ట్రోలింగ్ కూడా నడిచింది. ఆ ఘటనను ఉద్దేశించే నిర్మల్ కుమార్ ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. Everyone attacking Udhay 🤣🤣😹🤣 pic.twitter.com/BD7yHgmrAV— Pokkiri_Victor (@Pokkiri_Victor) August 21, 2026దీనిపై ఉదయనిధి కూడా స్పందిస్తూ.. ‘‘బాత్రూమ్లో ఎవరు, ఎంతసేపు ఉంటారో లెక్కించే ప్రత్యేక శాఖను తమిళనాడులో ఏర్పాటు చేశారా?’’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో సభ తప్పుదోవ పడుతుందని గుర్తించిన స్పీకర్ జేసీడీ ప్రభాకర్.. ఇరు పక్షాలను సముదాయించి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.మరి బంగ్లా ఎందుకో?అయితే.. ఉదయనిధి వ్యాఖ్యలకు టీవీకే కీలక నేత, మంత్రి ఆధవ్ అర్జునా కౌంటర్ ఇచ్చారు. సీఎం విజయ్ ఎమ్మెల్యేలందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతోనే కార్ల ప్రకటన చేశారని స్పష్టం చేశారు. చిన్న పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించేందుకు వాహనం అవసరమని పేర్కొన్నారు. ఇది విలాసం కాదని, ప్రాథమిక అవసరమని అన్నారు.‘‘ఇప్పటికే కారు ఉన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వ వాహనానికి దరఖాస్తు చేయరు. టీవీకే విధానం స్పష్టంగా ఉంది. అందరికీ ఒకే విధమైన అవకాశం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం’’ అని ఆధవ్ అర్జునా తెలిపారు.అదే సమయంలో ఉదయనిధిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘‘కారు వద్దంటున్న ప్రతిపక్ష నేత.. ఇప్పటికే మూడు బంగ్లాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఎందుకు ఉంటున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు వాహనాల కేటాయింపు అనేది ప్రోటోకాల్‌లో భాగమని స్పష్టం చేశారు.🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/CiVO6eKlpC— Pokkiri_Victor (@Pokkiri_Victor) August 21, 2026ఇదీ చదవండి: విజయ్ సరెండర్.. డీఎంకే చేతికి చిక్కిన అస్త్రం! -
విజయ్ను రాహుల్‌గాంధీ ద్రోహి అంటారా?
తమిళనాడులో డీలిమిటేషన్ అంశం మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ విషయంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ వైఖరి మారిందంటూ అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం విజయ్ తన వైఖరిని సడలించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పుడు విజయ్ మిత్రపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చేస్తారని నిలదీస్తున్నాయి.. డీఎంకే ఎంపీ దయానిధి మారన్, సీఎం విజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో డీలిమిటేషన్ బిల్లుపై ఓ పెద్ద జాతీయ పార్టీ డీఎంకేను ‘‘తమిళనాడు ద్రోహులు’’గా అభివర్ణించిందని గుర్తు చేశారు. డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే ఎప్పుడూ తన వైఖరిని మార్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ వైఖరిలో మార్పు కనిపిస్తోందని ఆరోపించారు.‘‘అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ఒక తీర్మానం, అసెంబ్లీలో మరో తీర్మానం చేసి డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నిలిచిన విజయ్.. ఇప్పుడు న్యాయమైన డీలిమిటేషన్ కావాలని చెబుతున్నారు. మరి విజయ్ను రాహుల్‌గాంధీ ద్రోహి అంటారా?’’ అంటూ దయానిధి మారన్ ప్రశ్నించారు.అర్ధరాత్రి భేటీతో మార్పు వచ్చిందా?కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విజయ్ భేటీ అయిన తర్వాతే ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని డీఎంకే ఆరోపిస్తోంది. గతంలో డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించిన టీవీకే.. ఇప్పుడు ‘‘న్యాయమైన డీలిమిటేషన్’’ అంటూ కొత్త వైఖరి తీసుకుందని విమర్శించింది. ఈ పరిణామాలను డీఎంకే రాజకీయంగా ఉపయోగించుకుంటూ విజయ్ స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఇది పూర్తి యూటర్న్: అన్నాడీఎంకేవిజయ్ వైఖరిపై అన్నాడీఎంకే కూడా తీవ్రంగా స్పందించింది. టీవీకే ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుందని ఆరోపించింది. ‘‘ఇప్పుడు మీరు చెబుతున్నదే కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తర్వాత మాట మార్చడం ఎందుకు?’’ అంటూ అన్నాడీఎంకే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. డీలిమిటేషన్ అంశంపై టీవీకే ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని అన్నాడీఎంకే ‘‘రాజకీయ డ్రామా’’గా అభివర్ణించింది.టీటీవీ దినకరన్ విమర్శలుఅమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) నేత టీటీవీ దినకరన్ కూడా విజయ్‌పై విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీవీకే అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఆరోపించారు. డీలిమిటేషన్ అంశంలో విజయ్ వైఖరి మారడంతో ఆ రాజకీయ వ్యూహం బయటపడిందని వ్యాఖ్యానించారు.మా వైఖరిలో మార్పు లేదు: టీవీకేవిమర్శల నేపథ్యంలో టీవీకే ఐటీ విభాగం స్పందించింది. డీలిమిటేషన్ అంశంపై పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. తమిళనాడు ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని, న్యాయమైన డీలిమిటేషన్ కోసం మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని పేర్కొంది.డీలిమిటేషన్‌పై కొత్త రాజకీయ సమరండీలిమిటేషన్ అంశం ఇప్పటికే తమిళనాడులో సున్నితమైన రాజకీయ అంశంగా మారింది. ఇప్పుడు విజయ్ వైఖరిలో మార్పు వచ్చిందనే ఆరోపణలు రావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విజయ్ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు ముప్పేట విమర్శలు గుప్పిస్తుండగా.. టీవీకే మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. దీంతో రానున్న రోజుల్లో డీలిమిటేషన్ అంశం తమిళనాడు రాజకీయాల్లో కీలక చర్చగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: డీలిమిటేషన్.. కేంద్రం కీలక నిర్ణయం -
క్లీన్ గవర్నెన్స్.. విజయ్ సంచలన నిర్ణయాలు
వరస సంచలన నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. తాజాగా.. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకూ కొత్త ప్రభుత్వ కార్లు అందించనున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. చట్ట సభ్యుల్లో చాలామంది కొత్తవాళ్లని.. పైగా వాళ్లంతా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారని.. అందుకే ఈ నిర్ణయమని ప్రకటించారాయన. అంతేకాకుండా.. మరికొన్ని సంక్షేమ ప్రకటనలు సైతం చేశారు.ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుందని సీఎం విజయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వ వాహనాలను సమకూర్చనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుత అసెంబ్లీలో తొలిసారి ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు సాధారణ కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చినవారని.. వారికి ప్రజా సేవ చేసేందుకు అవసరమైన రవాణా సదుపాయం ఉండాలని సీఎం వివరించారు. దీంతో పాటు కారు డ్రైవర్ జీతం, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.75 వేల భత్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదనంగా మరో రూ.25 వేలుఅంతేకాకుండా ఎమ్మెల్యే కార్యాలయంలో అధికారిక పనుల కోసం సహాయకుడిని నియమించుకునేందుకు నెలకు రూ.25 వేల గ్రాంట్ ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం వీసీకే ఎమ్మెల్యే జోతిమణి చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో వెలువడింది. ఎమ్మెల్యేలకు అవసరమైన లాజిస్టికల్ సపోర్ట్ లేకుండా సమర్థంగా పనిచేయడం కష్టమని ఆమె అసెంబ్లీలో ప్రస్తావించారు.‘క్లీన్ గవర్నెన్స్’ కోసమే..ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనాలు, ఇతర సదుపాయాలు కల్పించడం వల్ల నియోజకవర్గ పర్యటనలు సులభమవడంతో పాటు ప్రజల సమస్యలపై వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని విజయ్ ప్రభుత్వం చెబుతోంది. అధికారిక పనులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా పాలన సాగించవచ్చన్నది ప్రభుత్వ వాదన.అయితే ఎమ్మెల్యేలకు వాహనాలు, భత్యాలపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. 234 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వాహనాలు, నిర్వహణ, డ్రైవర్, సహాయకుల ఖర్చులు రాష్ట్ర ఖజానాపై అదనపు భారం అవుతాయని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వాలు ఆర్థిక పరిమితుల కారణంగా ఇలాంటి డిమాండ్లను పక్కన పెట్టాయని ఓ డీఎంకే ఎమ్మెల్యే సభలోనే ప్రస్తావించారు.వైద్య విద్యకు రూ.351 కోట్లుఎమ్మెల్యేల సదుపాయాల ప్రకటనతో పాటు వైద్య రంగంలోనూ విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశ సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.351 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా మొత్తం 6,098 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి.వీటిలో బీఎస్సీ నర్సింగ్‌లో 660, నర్సింగ్ కళాశాలలు, పాఠశాలల్లో 1,925, 12 పారామెడికల్ కోర్సుల్లో 2,778, వైద్య కోర్సుల్లో 735 అదనపు సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ఏడు కొత్త ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు.పెరంబలూరులో ఆసుపత్రిపెరంబలూరులో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో 400 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యాధునిక వైద్య సేవలను అందించేలా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయనున్నారు.ఆరోగ్య బీమా పరిమితి రూ.25 లక్షలకుముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద ప్రస్తుతం ఉన్న వార్షిక చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఖరీదైన వైద్య చికిత్సలు అవసరమైన కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభించే అవకాశం ఉంది.అదే సమయంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు అదనపు వైద్య, శస్త్రచికిత్స సేవలను కూడా పథకం పరిధిలోకి తీసుకురానున్నారు. చెన్నై స్టాన్లీతో పాటు తిరునెల్వేలి, తూత్తుకుడి, చెంగల్పట్టు, తిరువారూర్, కరూర్, కన్యాకుమారి ఆసుపత్రుల్లో ఈ సేవలను అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.జీతం ఫ్లస్..తమిళనాడు ఎమ్మెల్యేలకు ఒకప్పుడు రూ.55 వేల నెలవారీ వేతనం ఉండేది. 2017లో అప్పటి ప్రభుత్వం అలవెన్సులన్నీ కలిపి రూ.1.05 లక్షలకు పెంచింది. ఇందులో ప్రాథమిక వేతనం రూ.30 వేలు, నియోజకవర్గ అలవెన్స్ రూ.25 వేలు, టెలిఫోన్ అలవెన్స్ రూ.7,500, ఇతర అలవెన్సులు ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రికి వేతనం సుమారు రూ.2.05 లక్షల దాకా ఉంది. విజయ్ సర్కార్ ఇప్పుడు ఆ వేతనానికి అదనంగా.. కారు+డ్రైవర్+పీఏ జీతం కోసం లక్ష అదనంగా చెల్లించనుంది. -
‘రెస్పెక్ట్’ రచ్చ.. క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్
తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కేవలం పేరుతో సంబోధించడంపై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే పరిస్థితి చేజారిపోకుండా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రంగంలోకి దిగారు. తనదైన స్టైల్లో ఆ వివాదానికి ముగింపు పలికారు.అసెంబ్లీలో ఆరోగ్య, రెవెన్యూ శాఖల పద్దులపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న నగదు పంపిణీ, ఓటుకు నోటు తరహా రాజకీయాలను ప్రస్తావిస్తూ మంత్రి రంజిత్ కుమార్ డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచేవారని, తన కాంచీపురం నియోజకవర్గంలో ఒక్కో ఓటుకు రూ.1,500 వరకు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా గతంలో అమలైన ఎన్నికల వ్యూహాలను ప్రస్తావిస్తూ.. డీఎంకే వ్యవస్థాపక నేతల్లో ఒకరైన, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని మంత్రి కేవలం పేరుతోనే సంబోధించారు. సాధారణంగా తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధిని ‘కలైంజర్’, ‘మాజీ ముఖ్యమంత్రి’ వంటి గౌరవప్రదమైన సంబోధనలతో ప్రస్తావించే సంప్రదాయం ఉంది. దీంతో డీఎంకే సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.. @TVKVijayHQ : அவர் சார்பா நான் மன்னிப்பு கேட்டுக்கொள்கிறேன் ! 🥺❤️#TNAssembly pic.twitter.com/ZUEf9gWWUJ— Prakash Vijay (@PrakazVijay_Of) August 17, 2026మంత్రి ఆర్వీ రంజిత్ కుమార్ తన ప్రసంగంలో కరుణానిధిని ఎలాంటి గౌరవప్రదమైన బిరుదు లేకుండా పేరుతో ప్రస్తావించడంతో డీఎంకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ నేతృత్వంలో డీఎంకే సభ్యులు నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఎం సి. జోసెఫ్ విజయ్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. కరుణానిధిని ఆ విధంగా సంబోధించడం సరైనది కాదని అంగీకరించిన ఆయన.. ‘‘ఆయన తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను’’ అని ప్రకటించారు. సీఎం జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మంత్రి మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే మంత్రి బదులు సీఎం విజయ్ క్షమాపణలు చెప్పడాన్ని ఓ వర్గం అభినందిస్తుండగా.. ఆ క్షమాపణ ఏదో మంత్రితో చెప్పిచ్చి ఉంటే బాగుండేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. -
విజయ్ మంచివారే.. ఆయనపై ఆ నమ్మకం ఉంది: అన్నామలై
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీవీకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్‌పై, బీజేపీ మాజీ నేత కె. అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయ్ చాలా మంచివారని, ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రశంసింస్తూనే.. అదే సమయంలో మంత్రులు, అధికారుల పనితీరుపై ఓ కన్నేసి ఉంచాలని సీఎంకు సలహా ఇచ్చారు.బీజేపీకి గుడ్‌బై చెప్పిన తర్వాత.. సొంత రాజకీయ వేదిక దిశగా అన్నామలై అడుగులు వేస్తున్నారు. ‘వీ ద లీడర్స్’ పేరుతో ప్రారంభించిన ఉద్యమాన్ని భవిష్యత్‌లో రాజకీయ పార్టీగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ వేదిక ద్వారా కార్యకర్తలు, వాలంటీర్లను సమీకరించే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ‘వీ ద లీడర్స్’ (WTL) సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో అన్నామలై మాట్లాడుతూ.. సీఎం విజయ్ చాలా మంచివారని, ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. అయితే కొందరు మంత్రులు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి తన వద్ద ఆడియో ఆధారాలు కూడా ఉన్నాయని ప్రకటించారు.‘2 నుంచి 4 శాతం కమిషన్ అడుగుతున్నారు’కొంతమంది మంత్రులు గత ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నామలై ఆరోపించారు. ‘‘ఓట్లు కొనడానికి డబ్బు ఖర్చు చేశాం.. ఇప్పుడు టెండర్లలో 2 శాతం, 3 శాతం, 4 శాతం ఇవ్వాలని అడుగుతున్నారంటూ’’ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని ఇప్పుడే పెద్ద వివాదంగా మార్చడం లేదని.. ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసిన తర్వాత దీనిపై మరింతగా మాట్లాడతానని అన్నామలై తెలిపారు. ‘‘సీఎం విజయ్ మంత్రులు, అధికారులపై నియంత్రణ ఉంచాలి. లేదంటే పాలన దారి తప్పే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని చెప్పిన ఆయన.. అదే సమయంలో మంత్రులు, అధికారుల పనితీరుపై సీఎం విజయ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలంటే తరచూ సమీక్షలు నిర్వహించాలని కోరారు.విజయ్ సర్కార్‌కు ఏడాది సమయంకొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడం సరికాదని అన్నామలై అభిప్రాయపడ్డారు. తమిళనాడులో రాజకీయ మార్పు జరిగిందని, ప్రజలు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని అన్నారు. 234 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తొలిసారి అసెంబ్లీకి వచ్చారని పేర్కొంటూ.. వారికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని సూచించారు. ‘‘వాళ్లు సరిగ్గా పనిచేస్తే అభినందిస్తాం.. తప్పులు చేస్తే మొదట ప్రశ్నించేది మేమే’’ అని అన్నామలై అన్నారు. ప్రభుత్వం తీసుకునే మంచి నిర్ణయాలను కూడా తాము స్వాగతిస్తామని తెలిపారు.ఆ ప్రచారాన్ని ఖండిస్తూ.. తాను బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నానన్న విమర్శలను అన్నామలై ఖండించారు. కేంద్ర హోంశాఖ నుంచి ఢిల్లీకి రావాలని ఆహ్వానం వచ్చినా.. తమిళనాడులోనే ఉండి ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన రాజకీయ ప్రయాణం రాష్ట్ర ప్రయోజనాలకే అంకితమని చెప్పారు. కావేరీ జలాల అంశంలోనూ తమిళనాడు ప్రయోజనాలకే కట్టుబడి ఉంటానని అన్నామలై తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ మేకెదాటు ప్రాజెక్టును వ్యతిరేకించానని గుర్తుచేశారు. కావేరీ వివాదానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు.అన్నామలై వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని చెబుతూనే.. మరోవైపు అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా విజయ్ ప్రభుత్వంపై పరోక్ష ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో టీవీకే ప్రభుత్వం ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
భాష ముఖ్యం బిగిలూ!
తమిళనాడులో భాషా రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. మంత్రి తమిళ ఉచ్చారణ, వ్యాకరణంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేయగా.. బీజేపీ కూడా రంగంలోకి దిగి తమిళ భాషను గౌరవించాలని డిమాండ్ చేసింది. దీంతో ‘భాషా ప్రేమ’ వర్సెస్ ‘వ్యక్తిగత శైలి’ అనే చర్చ మొదలైంది.ఆగస్టు 5న తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ తమిళంలో ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగంలో పలుచోట్ల వ్యాకరణ, ఉచ్చారణ లోపాలు కనిపించాయని డీఎంకే ఎమ్మెల్యే టీ.ఎం. రాజేంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు ఆర్థిక మంత్రి స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడాలి” అని తాజాగా జరిగిన చర్చలో ఆయన సూచించారు. ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ వంటి కీలక ప్రసంగం చేస్తున్నప్పుడు భాషపై మరింత శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు.‘నా తమిళం.. నా స్టైల్’డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రి మేరీ విల్సన్ తీవ్రంగా స్పందించారు. తన మాట్లాడే విధానాన్ని ప్రశ్నించడం సరికాదని అన్నారు. “నా తమిళం గురించి నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా ప్రత్యేక శైలి. నేను ఇలాగే మాట్లాడగలను. అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇదే నా శైలి. మీ కోసం నేను మార్చుకోలేను” అంటూ మంత్రి ఘాటుగా బదులిచ్చారు.వివాదం పెరగడంతో అసెంబ్లీ స్పీకర్ జోక్యం చేసుకుని సభ్యులు ఈ అంశాన్ని తేలికగా తీసుకోవాలని సూచించారు. ప్రజలు అర్థం చేసుకునేలా మంత్రి ప్రసంగించారని, భాషపై చర్చను సానుకూలంగా చూడాలని కోరారు.మతం ప్రస్తావనతో మరింత వేడితనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ మంత్రి విల్సన్ తన మత విశ్వాసాలను ప్రస్తావించారు. “క్రైస్తవం నాకు ప్రేమ, సానుభూతి అనే ఒకే భాషను నేర్పింది. నేను బైబిల్ నుంచి దాన్ని నేర్చుకున్నాను. నేను పుట్టుకతో క్రైస్తవుడిని” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. భాషా వివాదంలోకి మత ప్రస్తావన రావడంపై పలువురు స్పందించారు.‘తప్పులను అంగీకరించాలి’: డీఎంకేడీఎంకే సీనియర్ నేత టీ.కే.ఎస్. ఇళంగోవన్ మంత్రి తీరుపై విమర్శలు చేశారు. “బడ్జెట్ చదివే సమయంలో అనేక చోట్ల తమిళంలో తప్పులు జరిగాయి. దాన్ని అంగీకరించకుండా సమర్థించుకోవడం సరికాదు. ఆర్థిక మంత్రి భాషను సరిగ్గా చదవగలగాలి” అని అన్నారు.తమిళంను అవమానించొద్దు: బీజేపీఈ వివాదంలో బీజేపీ కూడా జోక్యం చేసుకుంది. తమిళ భాషను తక్కువ చేసి మాట్లాడే వ్యాఖ్యలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. “మతం ఏదైనా కావచ్చు. కానీ భావోద్వేగం, గుర్తింపు పరంగా మనమంతా తమిళులమే. మీ మతాన్ని గౌరవించడంలో తప్పులేదు. కానీ తమిళ భాషను కించపరిచే వ్యాఖ్యలను అంగీకరించలేం. మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.విజయ్ సూచనతమిళ భాషపై రేగిన వివాదంపై విజయ్ స్పందించినట్లు తెలుస్తోంది. మంత్రి విల్సన్ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. “తమిళం మన అస్తిత్వం.. దాని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ. భాష విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి” అంటూ సూచించినట్లు సమాచారం.భాషా గౌరవమా? వ్యక్తిగత స్వేచ్ఛా?ఈ వివాదం ఇప్పుడు తమిళనాడులో పెద్ద చర్చకు దారితీసింది. ఒక వర్గం “తమిళం ప్రపంచంలోని పురాతన భాషల్లో ఒకటి.. దాన్ని సరిగ్గా మాట్లాడటం ప్రతి ఒక్కరి బాధ్యత” అంటుండగా.. మరోవర్గం “భాషలో చిన్న తప్పుల కంటే ప్రజలకు అర్థమయ్యేలా పాలన అందించడం ముఖ్యం” అని వాదిస్తోంది. -
విజయ్ బిగ్ ప్లాన్.. షాకిచ్చిన ప్రత్యర్థులు! వాట్ నెక్స్ట్?
తమిళనాడు గొంతును ఢిల్లీ వరకు వినిపించేందుకు ముఖ్యమంత్రి విజయ్ చేసిన ప్రయత్నానికి అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆయన ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన డీఎంకే, అన్నాడీఎంకే దూరంగా ఉండాలని నిర్ణయించాయి. దీంతో తమిళనాడులో ఐక్య పోరాటానికి విజయ్ చేసిన ప్రయత్నం ప్రారంభంలోనే రాజకీయ విభేదాలను ఎదుర్కొంటోంది.కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై చర్చించేందుకు తమిళనాడు ఎంపీలతో ముఖ్యమంత్రి విజయ్ సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరినీ ఆహ్వానిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీ భేదాలను పక్కన పెట్టి ఒకే నిర్ణయంతో ముందుకు వెళ్లాలని ఆయన ప్రయత్నించారు.డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తమిళనాడు నుంచి ఏకాభిప్రాయంతో కూడిన వైఖరిని రూపొందించాలన్నది విజయ్ లక్ష్యంగా కనిపించింది. అయితే..డీఎంకే, అన్నాడీఎంకే బహిష్కరణవిజయ్ ప్రయత్నాలకు మొదటి దశలోనే అడ్డంకి ఎదురైంది. తమిళనాడులో కీలక రాజకీయ శక్తులైన డీఎంకే, అన్నాడీఎంకే ఈ సమావేశానికి హాజరు కావడం లేదని ప్రకటించాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ సభ్యులను కలిగి ఉన్న డీఎంకే గైర్హాజరు కావడం విజయ్ సమావేశానికి పెద్ద లోటుగా మారింది. అన్నాడీఎంకే కూడా దూరం కావడంతో తమిళనాడులోని ప్రధాన పార్టీల మధ్య డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదని స్పష్టమైంది.డీలిమిటేషన్ ఎందుకు వివాదం?కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియలో 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించే అవకాశం ఉంది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్యను సుమారు 850 వరకు పెంచే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. అయితే దక్షిణాది రాష్ట్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా నియంత్రణలో ముందున్న తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఈ విధానం నష్టం చేస్తుందని వాటి వాదన. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు పెరుగుతాయని.. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.తమిళనాడు భయం ఇదే..ప్రస్తుతం తమిళనాడుకు లోక్‌సభలో 39 స్థానాలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన కొత్త లెక్కలు అమలు చేస్తే రాష్ట్రం జాతీయ రాజకీయాల్లో తన ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీలు చెబుతున్నాయి. కేవలం ఎంపీ స్థానాలే కాకుండా.. కేంద్ర నిధుల కేటాయింపులు, పన్నుల పంపిణీ వంటి అంశాల్లోనూ దక్షిణాది రాష్ట్రాల మాట బలహీనపడే అవకాశం ఉందన్నది వాటి ప్రధాన వాదన.డీఎంకే వైఖరిపై స్పష్టతఇటీవల డీలిమిటేషన్ అంశంలో డీఎంకే వైఖరి మారిందన్న ప్రచారం జరిగింది. దీనిపై ఆ పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ.. డీఎంకే మొదటి నుంచీ డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తోందని, భవిష్యత్‌లోనూ అదే వైఖరితో ఉంటుందని స్పష్టం చేశారు. 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా కొనసాగించాలని, అన్ని రాష్ట్రాలకు సమానంగా స్థానాలు పెంచాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాల వారీగా కొత్తగా ఎన్ని స్థానాలు వస్తాయో ముందుగానే ప్రకటించాలని కోరుతోంది.విజయ్‌కు బిగ్ టెస్ట్ఇటీవలే రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతున్న విజయ్‌కు డీలిమిటేషన్ అంశం కీలక పరీక్షగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో అన్ని పార్టీలను కలుపుకోవాలన్న ఆయన ప్రయత్నం ప్రశంసలు అందుకున్నప్పటికీ.. ప్రధాన పార్టీల గైర్హాజరు ఆయన ముందున్న రాజకీయ సవాళ్లను బయటపెట్టింది. డీలిమిటేషన్‌పై తమిళనాడు తరఫున ఒకే గొంతుక వినిపించాలని విజయ్ ప్రయత్నిస్తున్న వేళ.. డీఎంకే, అన్నాడీఎంకే దూరంగా ఉండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఢిల్లీలో తమిళనాడు గళం ఎంత బలంగా వినిపిస్తుందన్నది ఇకపై జరిగే రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. -
ఎన్ని అవమానాలకైనా సిద్ధమే.. విజయ్ స్పీచ్ తో దద్దరిల్లిన అసెంబ్లీ
-
తమిళనాడు అసెంబ్లీలో CM విజయ్ Vs ఉదయనిధి స్టాలిన్
-
నో చీప్ పాలిటిక్స్.. ఉదయ్‌నిధికి విజయ్ స్ట్రాంగ్ కౌంటర్
కావేరి జల వివాదం, కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకెదాటు ఆనకట్ట అంశంపై తమిళనాడు అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా.. ఆ అవసరం లేదంటూ ముఖ్యమంత్రి విజయ్ తేల్చేశారు. అలాగే కావేరి వివాదంపై కర్ణాటకతో చర్చలకు తానే ప్రతిపాదించానని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌కు ‘చీప్ పాలిటిక్స్’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.తమిళనాడు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం.. అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలకు విజయ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మేకెదాటు అంశాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. “మేకెదాటు ఆనకట్ట విషయంలో చౌకబారు రాజకీయాలు(చీప్ పాలిటిక్స్) చేయాలని నేను అనుకోవడం లేదు. కావేరి జలాల విషయంలో మా వైఖరిని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా తెలియజేశాం. నది జలాల హక్కులు, మేకెదాటు అంశంలో మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదు” అని విజయ్ అన్నారు.అఖిలపక్షం నిర్వహించాల్సిన అవసరం లేదని.. కావేరి జలాల విషయంలో తమ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాపాడేందుకు చివరి వరకు పోరాడుతుందని, ఎలాంటి రాజీకి వెళ్లబోమని కుండబద్ధలు కొట్టారు. అలాగే తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం ఎలాంటి అవమానాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు. క్రెడిట్ కోసం పాకులాడం..గతంలో ఎవరు ఏం చేశారన్న విషయాలను ప్రస్తావిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తాము భావించడం లేదని సీఎం చెప్పారు. “ఎవరు క్రెడిట్ తీసుకుంటారు? ఎవరికీ రాజకీయ ప్రయోజనం కలుగుతుంది? అనే దానిపై మాకు ఆసక్తి లేదు. కావేరి సమస్య పరిష్కారానికి ఏం చేయాలో మాకు తెలుసు. ఈ అంశాన్ని న్యాయపరమైన మార్గాల్లోనే ముందుకు తీసుకెళ్తాం” అని ఆయన స్పష్టం చేశారు.VIDEO | Cauvery is our lifeline, I do not want to play politics around it; wrote to PM on Mekedatu issue, we will protect state's rights, says CM Vijay speaking in Tamil Nadu Assembly.#CMVijay #TamilNaduAssembly #CauveryWater(Source: Third Party)(Full video available on PTI… pic.twitter.com/XCQrzRohHa— Press Trust of India (@PTI_News) August 7, 2026అఖిలపక్ష భేటీకి ఉదయనిధి డిమాండ్అయితే మేకెదాటు ప్రాజెక్టుపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు. కర్ణాటక కావేరి నదిపై మేకెదాటు ఆనకట్ట నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. అసెంబ్లీలో ఉదయనిధి మాట్లాడుతూ.. ఇది రాజకీయ అంశం కాదని, రైతుల జీవనాధారానికి సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు.“అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించడం లేదు? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రధానికి లేఖ రాసినందుకు ప్రస్తుత సీఎం విమర్శించారు. ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి. ఇది ప్రజల జీవనాధారానికి సంబంధించిన విషయం” అని ఉదయనిధి అన్నారు. కావేరి అంశంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.పేపర్ కౌంటర్కురువై (కావేరి డెల్టాలో వేసే ప్రత్యేక వరి సాగు) పంట సేకరణకు, కరువు నష్టపరిహారానికి మధ్య తేడా కూడా తెలియదా? కేవలం పేపర్లు చదివితే సరిపోదు.. రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలి అంటూ సీఎం విజయ్‌కు చురకలు అంటించారు. అయితే.. దీనికి ఆ తర్వాత మాట్లాడిన విజయ్ కౌంటర్ ఇచ్చారు. కేవలం ఒక విషయం గురించి మాట్లాడటం కాదు.. మొత్తం వాస్తవాలు తెలుసుకోవాలి. ముందు వెనకా మొత్తం పేపర్లు చదివి ఉంటే అసలు పరిస్థితి ఏమిటో అర్థమయ్యేది అంటూ ఆయన బదులిచ్చారు.முன்ன பின்ன பேப்பர் படிச்சிருந்தா தான தெரியும்!! 😭😅🤭#CmJosephVijay #CmVijay #Tnassembly pic.twitter.com/BpWGhqatF0— Meena 🐿️❤️ (@hsmeenatchi26) August 7, 2026సీఎం కర్ణాటక పర్యటనపై గందరగోళంమేకెదాటు వివాదంపై తమిళనాడు సీఎం విజయ్ కర్ణాటకకు వెళ్లి చర్చలు జరుపుతారన్న వార్తలు కూడా రాజకీయంగా చర్చకు దారితీశాయి. అయితే దీనిపై ప్రభుత్వంలోని కొందరు మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేసినట్లు ఉదయనిధి అసెంబ్లీలో ప్రస్తావించారు. “వ్యవసాయ మంత్రి సీఎం కర్ణాటక వెళ్తారని చెప్పారు. మరోవైపు ఇద్దరు మంత్రులు అలాంటి పర్యటన లేదని చెప్పారు. కర్ణాటక నేతలు కూడా తమిళనాడు సీఎం రావడం తమకు ఇష్టం లేదని, నీళ్లు విడుదల చేయడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు” అని ఉదయనిధి అన్నారు.డెల్టా రైతుల పరిస్థితిపై ఉదయనిధి ఆందోళనకావేరి నీటి కొరత ప్రభావం డెల్టా జిల్లాల రైతులపై పడుతోందని ఉదయనిధి పేర్కొన్నారు. సీఎం విజయ్ స్వయంగా డెల్టా ప్రాంత రైతులను కలుసుకుని వారి సమస్యలు వినాలని కోరారు. గత ప్రభుత్వం హయాంలో 6.8 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే.. ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం 1.5 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగిందని ఆయన ఆరోపించారు.డీలిమిటేషన్ అంశంపైనా విజయ్ దూకుడుఇదిలా ఉండగా.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కూడా సీఎం విజయ్ దృష్టి సారించారు. ఈ అంశంపై తమిళనాడు ఎంపీలతో శనివారం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అన్ని పార్టీలతో కలిసి చర్చించేందుకు విజయ్ ముందుకు వచ్చారు.కాగా, డీలిమిటేషన్‌ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు పార్టీలు వాదిస్తున్నాయి. ఈ అంశంలో రాష్ట్ర ప్రయోజనాలపై ఏకాభిప్రాయం సాధించేందుకు విజయ్ ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి.ఉదయనిధి అరెస్టు.. కావేరి వివాదం మరింత వేడిఇదిలా ఉండగా.. కావేరి వివాదం నేపథ్యంలో సీఎం విజయ్, నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్ అరెస్టు కావడం కూడా రాజకీయ వివాదానికి దారితీసింది. తన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించినవి కాదని, కావేరి నది పరిరక్షణ కోసమే మాట్లాడానని ఉదయనిధి స్పష్టం చేశారు. తనను అరెస్టు చేయడం కావేరి, మేకెదాటు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తకుండా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని ఆయన ఆరోపించారు.మేకెదాటు ప్రాజెక్టుపై పాత వివాదంకర్ణాటక కావేరి నదిపై మేకెదాటు వద్ద భారీ జలాశయం నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమిళనాడుకు రావాల్సిన నీటి ప్రవాహంపై ప్రభావం పడుతుందని తమిళనాడు వాదిస్తోంది. ఈ అంశంపై రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజా పరిణామాలతో కావేరి జల వివాదం మరోసారి తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. సీఎం విజయ్ అఖిలపక్ష భేటీకి నిరాకరించడం, ఉదయనిధి ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు లేవనెత్తడంతో అసెంబ్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. -
తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ ప్రభుత్వం
-
త్రిష మేడం రాజకీయ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
-
తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్
చెన్నై: తమిళనాడులో కొత్త రాజకీయ శకానికి తెరలేపుతూ.. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఎన్. మరియా విల్సన్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, మహిళా సాధికారత, విద్య, యువత ఉపాధి, ఆరోగ్యం, క్రీడలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపొందించారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్న ఆర్థిక మంత్రి విల్సన్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంతో పాటు పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో సీఎం విజయ్‌పై ఆయన ప్రశంసలు గుప్పించారు.మహిళలకు బంగారం.. పెళ్లి కానుకTVK ఎన్నికల హామీల్లో కీలకమైన ‘అన్నన్ సీర్ తిట్టం’ పథకానికి బడ్జెట్లో రూ.812 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు వివాహ సమయంలో 8 గ్రాముల (ఒక సవరన్) బంగారు నాణెం, పట్టు చీర అందించనున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘తై మామన్ తంగా మోదిరం తిట్టం’ పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించే ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించనున్నారు. ఈ పథకానికి రూ.560 కోట్లు కేటాయించారు.విద్యకు భారీ కేటాయింపులువిద్యారంగానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖకు రూ.44,527 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.8,393 కోట్లు కేటాయించారు. కళాశాల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించే ‘వెట్రి ల్యాప్‌టాప్ పథకం’ కోసం రూ.2 వేల కోట్లు కేటాయించారు. డిజిటల్ విద్యను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు ‘పళ్లి నిరైవు తిట్టం’ కింద రూ.300 కోట్లు కేటాయించారు. మొత్తం 3,734 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ‘సూపర్ క్లీన్.. సూపర్ క్యాంపస్’ పథకం కింద తొలిదశలో 10 వేల పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, భద్రత కోసం రూ.139 కోట్లు కేటాయించారు.విద్యార్థులకు సైకిళ్లు.. కొత్త హాస్టళ్లు11వ తరగతి విద్యార్థులకు హెల్మెట్, వాటర్ బాటిల్‌తో కూడిన సైకిళ్లు అందించే ‘పుతియా పయనం.. పుతియా వేగం’ పథకానికి రూ.277 కోట్లు కేటాయించారు. దీని ద్వారా 5.3 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. విద్యార్థుల వసతి సదుపాయాల కోసం తమిళనాడు స్టూడెంట్ హాస్టల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. TN-SUDAR పథకం కింద 200 ఆధునిక హాస్టళ్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.యువతకు స్కిల్ ట్రైనింగ్ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ‘వెట్రి స్కిల్ ట్రైనింగ్ స్కీమ్’ను ప్రకటించారు. 13 లక్షల మంది యువతకు పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ అందించనున్నారు. తొలి దశలో 20 వేల మంది యువతకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహకారంతో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నారు. ఇందుకోసం రూ.150 కోట్లు కేటాయించారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు, అధ్యాపకులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణ అందించే ప్రణాళికను కూడా ప్రభుత్వం ప్రకటించింది.క్రీడలకు ప్రోత్సాహంక్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 ఒలింపిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించారు. తమిళనాడు క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.ఆరోగ్య రంగానికి రూ.23 వేల కోట్లకు పైగావైద్యం, ప్రజారోగ్య శాఖకు రూ.23,353 కోట్ల నిధులు కేటాయించారు. గర్భిణుల కోసం ‘తై కేర్’ పేరుతో ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రసవ సమయం దగ్గర పడిన మహిళలకు ఉచిత భోజనం, వైద్య సహాయం, ఆరోగ్య పర్యవేక్షణ అందించనున్నారు. వృద్ధుల కోసం దశలవారీగా 1,000 మొబైల్ జెరియాట్రిక్ ట్రీట్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కేంద్రంలో వైద్యుడు, నర్సు, ఫిజియోథెరపిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి.NEETపై మరోసారి వ్యతిరేకతబడ్జెట్ ప్రసంగంలో NEET పరీక్షపై TVK ప్రభుత్వం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. వైద్య ప్రవేశాలను 12వ తరగతి మార్కుల ఆధారంగా పాత విధానంలోనే నిర్వహించేలా NEETను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.కేజీ నుంచి లా వరకు కొత్త ప్రకటనలుమదురైలో 300 మంది విద్యార్థుల సామర్థ్యంతో ప్రత్యేక ప్రభుత్వ లా కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఐదు కొత్త ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు (ITI) ఏర్పాటు చేయడానికి రూ.90 కోట్లు కేటాయించారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ‘అన్నల్ అంబేద్కర్ ఓవర్సీస్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్’ పథకం కింద ఒక్కో విద్యార్థికి గరిష్ఠంగా రూ.36 లక్షల వరకు సాయం అందించనున్నారు.పారదర్శక పాలనపై ఫోకస్గత ప్రభుత్వ పాలనలో టెండర్ల కేటాయింపుల్లో కొందరు వ్యక్తులు, వర్గాలకు ప్రయోజనం కలిగించే ‘కట్’ విధానం ఉండేదని ఆర్థిక మంత్రి విమర్శించారు. అలాంటి విధానాలకు ముగింపు పలికి.. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పన్ను, పన్నేతర ఆదాయాలను పెంచే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో తమిళనాడు అప్పులు పెరిగాయని, వాటిని నియంత్రిస్తూ అభివృద్ధి కొనసాగిస్తామని తెలిపారు.ఇతర హైలైట్స్* EV ఛార్జింగ్ స్టేషన్ల కోసం రూ.50 కోట్లు కేటాయింపు* ఐదేళ్లలో 20 వేల పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యం* మైనారిటీ సంక్షేమం కోసం రూ.1,700 కోట్లు* హజ్ యాత్ర సబ్సిడీని రూ.25 వేల నుంచి రూ.35 వేలకు పెంపు* సామాజిక న్యాయ శాఖకు రూ.3,937 కోట్లు* దివ్యాంగుల సంక్షేమ శాఖకు రూ.1,485 కోట్లు* డ్రగ్ ఫ్రీ తమిళనాడు కార్యక్రమం కోసం ప్రత్యేక చర్యలుమొత్తంగా.. విజయ్ సర్కార్ తొలి బడ్జెట్ ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల విస్తరణ, యువత-మహిళల సాధికారత, డిజిటల్ విద్య, పారదర్శక పాలన చుట్టూ తిరిగింది. తొలి బడ్జెట్‌తోనే తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రజలకు స్పష్టం చేసే ప్రయత్నం చేసింది. -
ఆయన ప్రచారం చేస్తే నీ డిపాజిట్ గల్లంతే!
తమిళనాడు రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. నటి త్రిషపై వ్యాఖ్యల వివాదంలో కేసు, అటుపై నాటకీయ పరిణామాల నడుమ అరెస్టైన ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్.. హైకోర్టు ఊరటతో గత రాత్రి విడుదలయ్యారు. ఆ రిలీజ్ అయిన వెంటనే ఆయన టీవీకే అధినేత విజయ్‌పై ‘జోకర్ సర్కార్’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తంజావూర్ పీఎస్‌లో అసభ్యకర వ్యాఖ్యల కేసులో విచారణ అనంతరం గత రాత్రి ఉదయ్‌నిధి రిలీజ్ అయ్యారు. ఆ సమయంలో డీఎంకే శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికాయి. ఆపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై తీసుకున్న చర్యలను “సర్కస్ ప్రభుత్వం” వ్యవహారంగా అభివర్ణించారు. పోలీసులు తనను ఉగ్రవాదిలా తీసుకెళ్లారని ఆరోపించారు. తన అరెస్టు అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఉదయ్‌నిధి అన్నారు. కావేరీ జలాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. టీవీకే ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. మేకేదాటు డ్యామ్, కావేరీ నీటి వివాదంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.అంతేకాకుండా టీవీకే అధినేత విజయ్ను, విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. విజయ్ను డమ్మీ సీఎంగా అభివర్ణించాడు. అంతేకాదు.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎలాంటి డబుల్‌మీనింగ్ డైలాగు కొట్టలేదని.. సింగిల్ మీనింగ్‌తోనే మాట్లాడానని అన్నారు. మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ కేసుపై చట్టపరంగా పోరాడతానని తెలిపారు. టీవీకే ఘాటు కౌంటర్ఉదయ్నిధి వ్యాఖ్యలకు టీవీకే ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఆ పార్టీ నేత ఆధవ్ అర్జున ఆ వ్యాఖ్యలను ఖండించారు. తమ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. విజయ్ ప్రజల మద్దతుతో రాజకీయాల్లోకి వచ్చారని, డీఎంకేను తాము ప్రత్యర్థిగా కూడా చూడటం లేదని వ్యాఖ్యానించారు.“మా నాయకుడిని విమర్శించాలంటే అర్హత ఉండాలి. ఉదయ్‌నిధి స్టాలిన్‌కి దమ్ముంటే.. తన తాత, తండ్రి రాజకీయ వారసత్వాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి. ఆ నియోజకవర్గంలో విజయ్ ఒక్కసారి ప్రచారం చేసినా చాలు.. ఉదయ్‌నిధికి డిపాజిట్ కూడా దక్కదు” అంటూ ఆధవ్ అర్జున సవాల్ విసిరారు.త్రిష వ్యాఖ్యలతో మొదలైన వివాదంకావేరీ జల వివాదంపై తంజావూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయ్‌నిధి స్టాలిన్ ప్రసంగిస్తుండగా.. ప్రేక్షకుల నుంచి త్రిష పేరు వినిపించింది. దీనికి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యల్లో ద్వంద్వార్థం ఉందని టీవీకే ఆరోపించింది.రాజకీయాల్లో మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని టీవీకే విమర్శించింది. ఉదయ్‌నిధి క్షమాపణలు చెప్పేంత వరకు ఊరుకోబోమని అంటోంది. అయితే తన వ్యాఖ్యలకు వక్రీకరణ జరిగిందని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని ఉదయ్‌నిధి వివరణ ఇచ్చారు. డీఎంకే కూడా విజయ్ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం డీఎంకే–టీవీకే మధ్య రాజకీయ పోరుగా మారింది. ఇవాళ్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. -
ఉదయ్‌నిధి బాత్రూంలో ఉన్నారు.. కాస్త ఆగండి
డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెంచింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చెన్నైలోని నివాసానికి వెళ్లిన సమయంలో చోటుచేసుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులను కాస్త ఆగాలంటూ ఉదయ్‌నిధి భార్య కృతికా విజ్ఞప్తి చేసిన దృశ్యాలు చర్చకు దారితీశాయి.తంజావూరులో కావేరీ నీటి వివాదంపై జరిగిన డీఎంకే నిరసన కార్యక్రమంలో ఉదయ్‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని.. సీఎం విజయ్ను అవమానించేలా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయ్‌నిధిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు.వైరల్‌గా మారిన వీడియోలో.. పోలీసులు ఉదయ్‌నిధిని కలిసేందుకు ఆయన ఇంట్లో వేచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో కృతికా ఉదయ్‌నిధి, డీఎంకే నేత మా. సుబ్రమణియన్ పోలీసులతో మాట్లాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. “ఆయన టాయిలెట్లో ఉన్నారు. కాస్త సమయం ఇవ్వండి” అంటూ కృతికా పోలీసులను కోరారు. మరికొన్ని నిమిషాలు ఆగాలని విజ్ఞప్తి చేశారు.On Cam: Moments Before Udhayanidhi Stalin Arrest- TIMES NOW accesses the sequence of events- On Cam: Udhayanidhi's wife argues with policemen@dharannniii & @DEKAMEGHNA breaks down the details. pic.twitter.com/WMdaMW0r99— TIMES NOW (@TimesNow) August 4, 2026 VIDEO CREDITS:TimesNowదీనికి స్పందించిన ఓ పోలీసు అధికారి.. తాము చట్టపరమైన విధులు నిర్వహించేందుకు వచ్చామని, ఎక్కువ సమయం వేచి ఉండలేమని పేర్కొన్నారు. “ఎంతసేపు వేచి ఉండాలి? ఇది మా విధి. మేం చట్టాన్ని ఉల్లంఘించడం లేదు” అంటూ ఆయన చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది.మా. సుబ్రమణియన్ కూడా పోలీసులను మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఉదయ్‌నిధి సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలని, న్యాయవాది కూడా వస్తారని చెప్పారు. అలాగే ఉదయ్‌నిధిని తంజావూరుకు తీసుకెళ్లాల్సి ఉందని.. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం ఉంటుందని, బయలుదేరే ముందు కొంత సమయం ఇవ్వాలని మంత్రి కోరినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం అనంతంగా వేచి ఉండలేమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపారు.கைது செய்து தஞ்சாவூர் அழைத்து செல்லப்படும் எதிர்க்கட்சி தலைவர்.. ஜன்னல் ஓரத்தில் பெரும் யோசனையோடு அமர்ந்து செல்லும் உதயநிதிDMK | Udhayanidhi Arrest | Udhayanidhi Speech | #NewsTamil24x7 #UdhayanidhiStalin #PoliceArrest pic.twitter.com/6afl9S9XCo— News Tamil 24x7 (@NewsTamilTV24x7) August 4, 2026ఏ కేసులో అరెస్ట్?కావేరీ నీటి సమస్యపై తంజావూరులో జరిగిన డీఎంకే నిరసనలో ఉదయ్‌నిధి చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి కారణమైంది. నిరసన సమయంలో కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరును ప్రస్తావించగా.. ఉదయ్‌నిధి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం, ఉద్దేశపూర్వక అవమానం, బెదిరింపులు, కుట్ర తదితర ఆరోపణలతో పాటు తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్లను కూడా చేర్చినట్లు సమాచారం.రాజకీయంగా ముదిరిన వివాదంఉదయ్నిధి అరెస్టు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో కొత్త దుమారానికి దారితీసింది. అధికార టీవీకే, బీజేపీ నేతలు ఉదయ్‌నిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డీఎంకే మాత్రం ఈ కేసును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది. కావేరీ సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని పెద్దదిగా చేస్తున్నారని డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
ఉదయ్నిధికే మా మద్దతు: ప్రేమలత విజయ్‌కాంత్
తమిళనాట ఉదయ్‌నిధి స్టాలిన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ కేసు నమోదు చేసి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవైపు పలువురు ఉదయ్‌నిధి వ్యాఖ్యల్ని తప్పుబడుతుంటే.. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయ్‌కాంత్ మాత్రం ఆ అరెస్ట్‌ను ఖండించారు.డీఎంకే నేత, ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌పై పోలీసు చర్యల నేపథ్యంలో మంగళవారం డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ మీడియా ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ్‌నిధి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొంటూ.. ఆయనకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో రాజకీయ భిన్నాభిప్రాయాలను అరెస్టులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రభుత్వాన్ని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని ప్రేమలత విజయకాంత్ అన్నారు. ఒకరి వ్యాఖ్యలను మరో పార్టీ రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప.. అరెస్టులు పరిష్కారం కాదని పేర్కొన్నారు. స్వతంత్ర భారతంలో రాజకీయ వ్యాఖ్యలపై అరెస్టులు చేయడం ప్రజల్లో అసంతృప్తిని, ప్రజాస్వామ్యంపై అనుమానాలను పెంచుతుందని వ్యాఖ్యానించారు.“ఉదయ్‌నిధి మాట్లాడిన దాంట్లో తప్పు లేదు”ఉదయ్‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ప్రేమలత.. ఆయన మాటల్లో తప్పేమీ లేదని అన్నారు. రాజకీయ వేదికలపై ప్రతిపక్ష నేతలకు తమ అభిప్రాయాలను చెప్పే హక్కు ఉందని స్పష్టం చేశారు. “ఉదయ్‌నిధికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. అందులో అభ్యంతరకరం ఏంటో అర్థం కావడం లేదు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.నీటి కోసం మేం పోరాడుతుంటే..ఇదే సమయంలో తమిళనాడులోని రాజకీయ పోరాటాలపై కూడా ప్రేమలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలపై, ముఖ్యంగా కావేరీ జలాల సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు నటుడు విజయ్ రాజకీయ పోరాటం చేస్తున్న తీరును ప్రస్తావిస్తూ.. “మేం నీటి కోసం పోరాడుతుంటే.. నటి కోసం విజయ్ పోరాడుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరురాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు అరెస్టులను ఉపయోగించడం సరైన విధానం కాదని ప్రేమలత విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఉన్న హక్కులే ప్రతిపక్షాలకు కూడా ఉంటాయని అన్నారు.అధికార పార్టీ, ముఖ్యమంత్రి తమ అభిప్రాయాలను రాజకీయ వేదికలపై వ్యక్తం చేయవచ్చని.. అదే విధంగా ప్రతిపక్షాలు కూడా తమ వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లే హక్కు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలను ఎదుర్కోవాల్సింది రాజకీయంగానే కానీ.. అరెస్టులతో కాదని స్పష్టం చేశారు.చట్టం అందరికీ సమానంగా ఉండాలిఇటీవల రాణిపేటలో జర్నలిస్టులపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలను ప్రస్తావించిన ప్రేమలత.. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై మాత్రం తక్షణ చర్యలు తీసుకోవడం చట్ట అమలులో సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు ప్రతిపక్ష నేతపై అరెస్టు చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తగదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలని కోరారు. మొత్తంగా.. ఉదయ్‌నిధి స్టాలిన్ విషయంలో ప్రేమలత విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. -
ఉదయ్‌నిధి స్టాలిన్ అరెస్ట్
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ తమిళగ వెట్రి కగళం పార్టీ ఫిర్యాదు చేయంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టీవీకే నిరసనల నడుమ పోలీసులు ఆయన నివాసం వద్ద భారీగా మోహరించగా.. ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈ మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టు విచారణ జరపనుంది.మంగళవారం ఉదయం ఉదయనిధి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్ట్ తర్వాత ఆయన్ని తరలించే క్రమంలో డీఎంకే శ్రేణులు పోలీసులకు అడ్డు పడ్డాయి. వాహనాన్ని అడ్డుకుని వాగ్వాదానికి దిగాయి. అయినప్పటికి పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో ఉదయ్‌నిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. ఎవరి పేరును నేను ప్రస్తావించలేదు. ఈ కేసును న్యాయపరంగా తేల్చుకుంటా అని ఆయన అన్నారు. విచారణ నిమిత్తం ఆయన్ని తరలించినట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే.. సోమవారం తంజావూరులో కావేరీ జలాల అంశంపై జరిగిన డీఎంకే కార్యక్రమంలో ఉదయ్‌నిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న సమయంలో.. కొందరు కార్యకర్తలు సినీ నటి త్రిష పేరుతో నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఉదయ్‌నిధి.. కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా, ‘నీళ్లు’ మాత్రం అక్కడికి వెళ్తాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి డబుల్ మీనింగ్‌గా చేసిన వ్యాఖ్యలేనని టీవీకే ఆరోపిస్తోంది. Udhayanidhi Stalin has landed in controversy after making an alleged double-meaning remark during a Cauvery protest speech when the crowd began chanting "Trisha"The video has gone viral, ruling TVK calls the comment "disgusting" and BJP demands his arrest over the remark. DMK… pic.twitter.com/Ay4S0i9HCv— Nabila Jamal (@nabilajamal_) August 3, 2026కేసు నమోదు.. హైకోర్టులో పిటిషన్ఉదయ్నిధి వ్యాఖ్యల నేపథ్యంలో తంజావూర్ పీఎస్‌లో టీవీకే ఫిర్యాదు చేసింది. సీఎం విజయ్ను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనపై ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు రావాల్సి ఉంది. ఈలోపే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం.“బహిరంగ క్షమాపణలు చెప్పాలి”.. ఉదయ్‌నిధి వ్యాఖ్యలపై టీవీకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. మహిళలను అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పార్టీ నేతలు స్పష్టం చేశారు. క్షమాఫలు చెప్పే దాకా ఉదయ్‌నిధి స్టాలిన్‌ను వదలబోమని అంటున్నారు.ఉదయ్‌నిధి ఇంటి వద్ద భారీ భద్రత.. ఆ వెంటనే అరెస్ట్టీవీకే నిరసనల నేపథ్యంలో చెన్నైలోని ఉదయ్‌నిధి స్టాలిన్ నివాసం వద్ద పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను పెంచారు. ఆ సమయంలో డీఎంకే కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో హైడ్రామా నెలకొంది. అయితే ఆ తర్వాతే ఉదయ్‌నిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ (NCW)ను టీవీకే ఆశ్రయించింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పళా సెల్వకుమార్ ఫిర్యాదు చేస్తూ.. ఉదయ్‌నిధి ప్రసంగానికి సంబంధించిన వీడియోలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయ్‌నిధి నుంచి వివరణ కోరాలని, బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని మహిళా కమిషన్‌ను విజ్ఞప్తి చేశారు. అలాగే సంబంధిత చట్టాల కింద చర్యలు తీసుకునేలా పోలీసులకు సూచించాలని కోరినట్లు టీవీకే వెల్లడించింది.బీజేపీ సైతం డీఎంకేపై ఫైర్ఆ వ్యాఖ్యలు మహిళను(త్రిష) కించపరిచేలా ఉన్నాయని, రాజకీయ నాయకుల స్థాయికి తగవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తమిళనాడు బీజేపీ కూడా స్పందించింది. ఉదయ్‌నిధి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజా జీవితంలో ఉన్న నేతలు మహిళల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని బీజేపీ నేతలు పేర్కొన్నారు.రాజకీయ పోరుకు కొత్త అస్త్రంఇప్పటికే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే, డీఎంకే మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో త్రిష ప్రస్తావన వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. టీవీకే ఈ అంశాన్ని మహిళా గౌరవానికి సంబంధించిన అంశంగా తీసుకుని ముందుకు వెళ్తుండగా.. డీఎంకే లేదా ఉదయ్‌నిధి స్టాలిన్ నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది. -
కావేరీ కత్తి.. విజయ్‌కు తొలి పరీక్ష!
తమిళనాడు రాజకీయాల్లో కావేరీ జల వివాదం మరోసారి వేడి పుట్టిస్తోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వానికి ఇది తొలి పెద్ద రాజకీయ సవాల్‌గా మారింది. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ముందు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి.. ఒకటి కర్ణాటకతో నీటి హక్కుల పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? రెండోది.. రాష్ట్రంలో ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?కావేరీ అంశం తమిళనాడులో కేవలం నీటి సమస్య మాత్రమే కాదు.. ఇది రైతుల జీవనాధారం, ప్రాంతీయ హక్కులు, రాజకీయ ప్రతిష్ఠతో ముడిపడిన సున్నితమైన అంశం. అందుకే ఈ విషయంలో ఏ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తుంటాయి.అఖిలపక్ష సమావేశం కోసం డీఎంకే ఒత్తిడికావేరీ వివాదంపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డీఎంకే సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు డ్యామ్ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం కూడా అన్ని పార్టీలను కలుపుకుని వ్యూహం రూపొందించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.డీఎంకే వాదన ప్రకారం.. కావేరీ వంటి కీలక అంశాల్లో రాజకీయ భేదాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలి. ముఖ్యమంత్రి విజయ్ అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని డీఎంకే ప్రశ్నిస్తోంది.‘ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాం’అయితే టీవీకే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించడం లేదు. టీవీకే సీనియర్ నేత, మంత్రి సీటీఆర్ నిర్మల్‌కుమార్ మాట్లాడుతూ.. కావేరీ అంశంపై ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగిందని, అన్ని పార్టీల మద్దతుతో తీర్మానం కూడా ఆమోదించామని తెలిపారు. అసెంబ్లీలో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మళ్లీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన వాదిస్తున్నారు. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని టీవీకే ఆరోపిస్తోంది.చర్చల నుంచి రాజకీయ విమర్శల దిశగా.. కావేరీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించిన విజయ్ ప్రభుత్వ వైఖరిలో ఇప్పుడు రాజకీయ దూకుడు కూడా కనిపిస్తోంది. విజయ్ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన కొద్ది రోజులకే.. మంత్రి ఆర్. నిర్మల్‌కుమార్ కర్ణాటక సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. డీకే శివకుమార్ కర్ణాటక ప్రయోజనాల కంటే డీఎంకే నాయకత్వం ప్రభావంతో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. “ఆయన సొంత పార్టీ నేతగా కాకుండా డీఎంకేతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది” అంటూ విమర్శలు చేశారు.అయితే కావేరీ వంటి సున్నితమైన అంశంలో ఇలాంటి రాజకీయ ఆరోపణలు ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత వేడెక్కించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.విజయ్ వ్యూహం వెనుక..అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు గతంలో కావేరీ వివాదం తీవ్రంగా మారిన ప్రతిసారి అఖిలపక్ష సమావేశాలను ఆశ్రయించాయి. అయితే విజయ్ ప్రభుత్వం మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంటోంది. సమస్యను నేరుగా చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది.కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ కోసం బెంగళూరు వెళ్లాలని విజయ్ భావించినట్లు సమాచారం. అయితే కర్ణాటకలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది. ఇక్కడే విజయ్‌కు అసలు పరీక్ష మొదలవుతుంది.రాజకీయ అనుభవం ఉన్న పార్టీల మాదిరిగా ఉద్యమాల మార్గాన్ని ఎంచుకోవాలా? లేక చర్చల ద్వారా పరిష్కారం సాధించే ప్రయత్నం చేయాలా? అనే విషయంలో ఆయన నిర్ణయం కీలకం కానుంది.కావేరీ నీటి వివాదం దశాబ్దాలుగా తమిళనాడు-కర్ణాటక మధ్య కొనసాగుతున్న సమస్య. ఇది మరీ ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో ఎప్పుడూ భావోద్వేగ అంశమే. డెల్టా ప్రాంత రైతులకు కావేరీ నీరు అత్యంత కీలకం. నీటి విడుదలలో ఆలస్యం జరిగిన ప్రతిసారి తమిళనాడులో రైతుల ఆందోళనలు, రాజకీయ నిరసనలు తీవ్ర స్థాయికి చేరుతాయి. అందుకే ఈ అంశంలో ఏ ప్రభుత్వం బలహీనంగా కనిపించినా ప్రతిపక్షాలకు అది రాజకీయ ఆయుధంగా మారుతుంది.డీఎంకే ఆందోళనతో మరింత వేడికావేరీ నీటి సమస్య, రైతుల అంశంపై టీవీకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని డీఎంకే ఆగస్టు 3న తంజావూరులో భారీ నిరసనకు సిద్ధమవుతోంది. ఈ ఆందోళన ద్వారా విజయ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డీఎంకే భావిస్తోంది. మరోవైపు టీవీకే మాత్రం తమ ప్రభుత్వం తమిళనాడు హక్కుల విషయంలో రాజీ పడదని చెబుతోంది.విజయ్ ముందు రెండు మార్గాలుప్రస్తుతం కావేరీ వివాదం విజయ్ రాజకీయ నాయకత్వానికి తొలి పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాల ఒత్తిడి.. మరోవైపు కర్ణాటకతో సున్నితమైన జల వివాదం.. ఇంకోవైపు రైతుల అంచనాలు.. ఈ మూడు అంశాలను సమతుల్యం చేయాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి విజయ్‌కు ఎదురైంది. కావేరీ విషయంలో విజయ్ తీసుకునే నిర్ణయం కేవలం ఒక నీటి వివాదానికి పరిష్కారం చూపడమే కాదు.. ఆయన పరిపాలనా శైలి, రాజకీయ పరిపక్వతకు కూడా తొలి కొలమానంగా మారనుంది. -
పాపం ధనుష్.. ఆ మాటలకే ఇన్ని తిట్లా?
సినీ పరిశ్రమకు, రాజకీయాలకు మధ్య అనుబంధం తమిళనాట కొత్తేమీ కాదు. తెరపై భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న పలువురు నటులు.. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వేదికగా మార్చుకుని.. ఆ తర్వాత రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ ప్రయాణం ఇప్పుడు మరికొందరు సినీ ప్రముఖుల భవిష్యత్తుపైనా ఆసక్తి పెంచింది.ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో ధనుష్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. అభిమానుల్లో, నెటిజన్లలో కొత్త చర్చకు కారణమయ్యాయి. అయితే ధనుష్ అసలు రాజకీయాల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆయన మాటలను కొందరు పొలిటికల్ యాంగిల్లో విశ్లేషిస్తున్నారు. తన అభిమానులను ఉద్దేశించి ధనుష్ మాట్లాడుతూ.. కేవలం సినిమా వేడుకలు, అభిమానుల సమావేశాలకే పరిమితం కాకుండా.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.“ఒకచోట ఇంతమంది కలవడం వెనుక ఎంతో శక్తి ఉంది. ఆ శక్తికి ఒక లక్ష్యం ఉండాలి. ఆడియో లాంచ్‌లు, మీటింగ్స్‌కే పరిమితం కాకుండా.. మీ చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయండి. మీ ప్రాంతంలోని కుటుంబాలకు అండగా నిలవండి. మీపై నేను మరింత గర్వపడేలా చేయండి” అంటూ ధనుష్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.ఇక్కడి నుంచే అసలు చర్చ మొదలైంది. “ఇది కేవలం అభిమానులకు ఇచ్చిన సామాజిక సందేశమా? లేదంటే భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి సంకేతమా?” అని చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ చర్చకు మరో కారణం విజయ్ రాజకీయ ప్రయాణమే. విజయ్ కూడా గతంలో తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ధనుష్ కూడా అదే దారిలో వెళ్తున్నారా? అంటూ కొందరు పోల్చడం మొదలుపెట్టారు.ఇటు విజయ్ అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని తప్పుబడుతున్నారు. “విజయ్ బాటను కాపీ చేస్తున్నారా?” అంటూ కొందరు సోషల్ మీడియాలో ధనుష్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ధనుష్‌ను ఆయన మాజీ మామ, సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో పోలుస్తూ కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఏళ్ల తరబడి ఊహాగానాలు వచ్చినప్పటికీ.. చివరకు ఆయన వెనక్కి వెళ్లిపోయారు. విజయ్ గెలుపు సమయంలోనూ అభినందించకుండా ‘అసూయ’ను ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో “రజినీకాంత్ వల్లే కాలేదు.. ఇంక ధనుష్ ఏం చేస్తారు?” అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అయితే ధనుష్ అభిమానులు మాత్రం సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం మాత్రమే రాజకీయ ఎంట్రీకి సంకేతం కాదని, ప్రతి హీరో వ్యాఖ్యలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదంటున్నారు. రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఇప్పటిదాకా ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలు అభిమానులను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరిన సందేశంగానే కనిపిస్తున్నాయి. కానీ తమిళనాడులో సినీ హీరోలకు ఉన్న ప్రజాదరణ, అభిమాన సంఘాల ప్రభావం కారణంగా ఇలాంటి చిన్న వ్యాఖ్యలు కూడా పెద్ద రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి. -
విజయ్ బ్రో.. వెరీ రాంగ్ బ్రో!
తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రభావం కొత్త విషయం కాదు. కానీ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఓ నటుడిగా విజయ్‌కి ఉన్న క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఆయన నటించిన ‘చివరి చిత్రం’ జన నాయగన్ విడుదల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అదే సమయంలో.. ఈ కోలాహలం ఇటు రాజకీయ చర్చకూ దారితీసింది.‘జన నాయగన్’ విడుదల సందర్భంగా విజయ్ అభిమానుల నుంచి భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ అభిమానంలో పాలకులు సైతం పోటీ పడ్డారు. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు తమిళనాడు మంత్రులు, అధికార పార్టీ నేతలు థియేటర్లకు తరలివెళ్లారు. అసెంబ్లీ స్పీకర్ నుంచి పలువురు మంత్రుల వరకు సినిమా వేడుకల్లో పాల్గొన్నారు. కొందరు అభిమానులతో కలిసి థియేటర్లలో సందడి చేయగా.. మరికొందరు సోషల్ మీడియాలో సినిమాకు ప్రచారం చేశారు.మంత్రి టీకే ప్రభు సినిమా స్టిక్కర్లను ఇళ్ల తలుపులు, ఆటోలకు అంటించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరో మంత్రి సినిమా చూస్తూ భావోద్వేగానికి గురైన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. రాష్ట్రంలో కీలక సమస్యలు బోలెడన్ని పెండింగ్‌లో ఉన్నాయని.. పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సినిమా వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైందేనా? అనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి.నీట్ నుంచి రైతుల వరకు..నీట్‌పై అభ్యంతరాలతో మొదటి నుంచి కేంద్రం నుంచి పోరాడుతోంది తమిళనాడునే. అసలు ఆ పరీక్షను రద్ద చేయాలనే డిమాండ్ మొదలైంది కూడా అక్కడి నుంచే. అలాంటి రాష్ట్రంలో.. నీట్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో తమది మొదటి నుంచి ఒకే మాట అని విజయ్ టీవీకే చెబుతోంది.అయితే నిరసనల్లో మాత్రం ఆ పార్టీకి చెందిన నేతలెవరూ కనిపించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్న వేళ.. విజయ్ సినిమా వంకతో పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టు, కావేరీ నీటి విడుదల, డెల్టా రైతుల సమస్యలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సినిమా విడుదల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించడం విమర్శలకు కారణమైంది.వెరీ రాంగ్ బ్రో.. ఇటీవల తమిళనాడులో వరుసగా కస్టడీ మరణాల ఆరోపణలు కలకలం రేపాయి. పోలీసుల వేధింపులతో నలుగురు మరణించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలీసు దౌర్జన్యాలపై గళమెత్తిన విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.గతంలో కస్టడీ బాధిత కుటుంబాలను కలిసిన విజయ్.. పోలీసు సంస్కరణలు తీసుకురావాలని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సినిమా హీరో కావొచ్చు, కానీ..విజయ్ రాజకీయ ప్రయాణం మొత్తం ప్రజా సమస్యల చుట్టూనే సాగింది. అవినీతి, పరిపాలనా లోపాలు, ప్రజల హక్కుల కోసం పోరాడతానని ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ముందున్న అసలు పరీక్ష.. అభిమానుల సీఎంగా కాకుండా ప్రజల సీఎంగా నిరూపించుకోవడం. సినిమా విజయోత్సవాలు రాజకీయంగా నష్టం చేయకపోయినా.. ప్రజా సమస్యలపై స్పందన ఆలస్యమైతే ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా సినీ మత్తు వీడి రంగంలోకి దిగాలనే అభిప్రాయమై వ్యక్తమవుతోంది. View this post on Instagram A post shared by Chennai Live (@chennailive1048) -
విజయ్.. ఒక దెబ్బకు రెండు పిట్టలు!
నీట్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న వేళ.. తమిళగ వెట్రి కళగం అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలన్నదే తమ పార్టీ విధానమని ప్రకటించారు. కేవలం పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్‌లు వంటి అంశాలను సరిదిద్దితే సరిపోదని.. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష విధానాన్నే పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారాయన. అయితే ఈసారి ఆయన టార్గెట్ కేవలం నీట్ మాత్రమే కాదని అనిపిస్తోంది.ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో టీవీకే కీలక ప్రకటన చేసింది. వైద్య విద్య ప్రవేశాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం విద్య రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా (Concurrent List)లో ఉంది. అంటే కేంద్రం, రాష్ట్రాలు రెండూ దీనిపై చట్టాలు చేయవచ్చు. అయితే విద్యను రాష్ట్ర జాబితా (State List)లోకి మార్చాలని టీవీకే కోరుతోంది.ఒకవేళ దీనికి రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉంటే.. మధ్యంతర పరిష్కారంగా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించే ప్రత్యేక విధానం తీసుకురావాలని సూచించింది. TVK అభిప్రాయం ప్రకారం.. స్థానిక పరిస్థితులు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వైద్య విద్య విధానాలను రాష్ట్రాలే రూపొందించుకునే అవకాశం ఉండాలి.కేంద్రంపై విమర్శ.. డీఎంకేపై కౌంటర్విజయ్ తాజా ప్రకటనలో రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ విధానాన్ని వ్యతిరేకించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీవీకే.. అదే సమయంలో తమిళనాడులో ప్రధాన ప్రత్యర్థి అయిన డీఎంకేపైనా ప్రశ్నలు సంధించింది.2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే అధికారంలోకి వస్తే నీట్‌ను రద్దు చేస్తామని(చేయిస్తామని) హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని టీవీకే విమర్శించింది.“మేమే నీట్‌ను రద్దు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేయం” అంటూ పరోక్షంగా డీఎంకేను టార్గెట్ చేసింది టీవీకే. ఒకే అంశంతో అటు కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తూ.. ఇటు డీఎంకే హామీలను ప్రశ్నించే వ్యూహాన్ని విజయ్ అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.పాత వివాదమే.. కొత్త రాజకీయ రంగుతమిళనాడులో ఈ అంశం కొత్తది కాదు. వైద్య విద్య ప్రవేశాల్లో జాతీయ స్థాయి పరీక్ష అవసరమా? లేదంటే రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలా? అనే చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. నీట్‌ను వ్యతిరేకించేవాళ్లు.. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విధానం ప్రతికూలంగా మారుతోందని వాదిస్తున్నారు. కోచింగ్ వ్యవస్థకు ప్రాధాన్యం పెరిగి, సామాన్య కుటుంబాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. మరోవైపు అనుకూల వర్గాలు మాత్రం దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల్లో ఒకే ప్రమాణం ఉండేందుకు జాతీయ స్థాయి పరీక్ష అవసరమని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పేపర్ లీకేజీ వివాదం.. తమిళనాడు చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది.విజయ్‌కు రాజకీయంగా కీలకమా?సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. టీవీకేను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. యువత, విద్యార్థులు, రాష్ట్ర హక్కులు వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుంటున్నారు. తమిళనాడులో విద్య, సామాజిక న్యాయం అంశాలు ఎప్పటి నుంచో కీలక రాజకీయ అంశాలు. ఈ నేపథ్యంలో నీట్ వ్యతిరేకతను బలంగా వినిపించడం ద్వారా విద్యార్థుల్లో, యువ ఓటర్లలో తన పార్టీకి స్థానం పెంచుకునే ప్రయత్నంగా ఈ అడుగును చూస్తున్నారు.NEET రగడ.. పొలిటికల్ గేమ్‌గా మారుతుందా?ఇప్పటివరకు నీట్ వివాదం ప్రధానంగా పరీక్షా విధానం, లీక్‌లు, సంస్కరణల చుట్టూ తిరిగింది. కానీ తమిళనాడులో మాత్రం ఇది కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాజకీయ ఆధిపత్య పోరుగా మారే అవకాశం కనిపిస్తోంది. విజయ్ తాజా వైఖరి చూస్తే.. నీట్ అంశాన్ని కేవలం విద్యా సమస్యగా కాకుండా రాజకీయ చర్చగా మార్చే ప్రయత్నం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. NEET వ్యతిరేకతతో కేంద్రంపై విమర్శలు, డీఎంకేపై ఎదురుదాడి.. రెండింటినీ ఒకేసారి సాధించే వ్యూహంతో విజయ్ ముందుకు సాగుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
అన్నా.. పురుగుల అన్నం పెడ్తున్నారు!
‘‘అన్నా.. హాస్టల్లో భోజనం సరిగ్గా ఉండదు.. అన్నంలో పురుగులు వస్తున్నాయ్’’ అంటూ పిల్లలు చెప్పిన మాటలకు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చలించిపోయారు. చెన్నైలోని సైదాపేటలో ఉన్న ఎంసీ రాజా సోషల్ జస్టిస్ స్టూడెంట్స్ హాస్టల్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హాస్టల్‌కు చేరుకున్న విజయ్.. అక్కడి వసతులు, నిర్వహణ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత లోపాలు, నీటి సమస్యలు, సిబ్బంది కొరత వంటి అంశాలను వివరించారు.ఫిర్యాదు చేస్తే కొద్దిరోజులే.. హాస్టల్లో అందించే భోజనం నాణ్యతపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ఆహారంలో పురుగులు కనిపిస్తున్నాయని, భోజనం విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించడం లేదని వారు సీఎంకు తెలిపారు. గతంలో విద్యార్థుల ఆందోళనల తర్వాత కొంతకాలం ఆహారం నాణ్యత మెరుగుపడిందని, కానీ కొద్దిరోజులకే మళ్లీ పాత పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగదిలో పరిశుభ్రత పాటించడం లేదని, సిబ్బంది గ్లౌజులు, క్యాప్స్ వంటి రక్షణ పరికరాలు ఉపయోగించడం లేదని చెప్పారు.హాస్టల్స్ లో దయనీయ స్థితి..సీఎం విజయ్ వద్ద తమ గోడు వినిపించిన విద్యార్థులు అభివృద్ధిలో టాప్ 5 స్థానాల్లో ఉన్న తమిళనాడులో వాస్తవ పరిస్థితులు ఇవి..#CMVijay pic.twitter.com/JTgr31HMGW— UttarandhraNow (@UttarandhraNow) July 17, 2026వసతులపై విద్యార్థుల ఫిర్యాదులుహాస్టల్లో నీటి సరఫరా సమస్యలు, మరుగుదొడ్ల నిర్వహణ లోపాలు, సిబ్బంది కొరత, భద్రతా లోపాలపై కూడా విద్యార్థులు ముఖ్యమంత్రికి వివరించారు. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, హాస్టల్లో భద్రతపై ఆందోళన ఉందని తెలిపారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు.రాత్రి ఆలస్యంగా కోచింగ్ తరగతులు లేదా పనుల నుంచి వచ్చే విద్యార్థులకు గేట్లు మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు విద్యార్థులు చెప్పారు. స్పోర్ట్స్ సదుపాయాలు, ఆధునిక జిమ్, లైబ్రరీలో మరిన్ని పుస్తకాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.సీఎం స్పందన.. అధికారులకు ఆదేశాలువిద్యార్థుల సమస్యలను ఓపికగా విన్న సీఎం విజయ్.. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భోజనం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని సూచించారు. హాస్టల్లోని వంటగది, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలను స్వయంగా పరిశీలించిన విజయ్.. సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. తదుపరి తనిఖీ నాటికి అన్ని లోపాలు సరిచేయాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.రూ.44.50 కోట్లతో నిర్మించిన హైటెక్ హాస్టల్సైదాపేటలోని ఈ 10 అంతస్తుల హాస్టల్‌ను గత డీఎంకే ప్రభుత్వ హయాంలో సుమారు రూ.44.50 కోట్లతో నిర్మించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మించారు. లిఫ్ట్‌లు సహా పలు ఆధునిక సదుపాయాలు ఉన్నప్పటికీ.. నిర్వహణ లోపాలపై విద్యార్థుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో సీఎం స్వయంగా తనిఖీ చేపట్టినట్లు సమాచారం.వరుసగా రెండో ఆకస్మిక తనిఖీముఖ్యమంత్రి విజయ్ ఇటీవల చెన్నైలోని ఎగ్మోర్ చిన్నారుల ఆసుపత్రిని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాజాగా విద్యార్థుల హాస్టల్‌ను సందర్శించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. “సమస్యలు చెప్పేందుకు ప్రజలు సీఎం వద్దకు వెళ్లడం కాదు.. సీఎం స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లడం” అనే విధంగా ఆయన తనిఖీలపై చర్చ జరుగుతోంది. -
వివాదాల నేపథ్యంలో.. విజయ్ సంచలన నిర్ణయం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కీలక పరిపాలనా నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ. అరుణ్‌ను రాష్ట్ర విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించారు. నియామకం జరిగిన రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.అరుణ్‌ను ఈ ఏడాది మే నెలలో విజయ్ ప్రభుత్వం విజిలెన్స్ చీఫ్‌గా నియమించింది. అయితే అప్పటి నుంచే ఆయన నియామకం వివాదాస్పదమైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆయనను "డీఎంకే అనుకూల అధికారి" అంటూ విమర్శించింది. ఆ సమయంలో ఆయన గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయనను తప్పనిసరి నిరీక్షణ (Compulsory Wait)లో ఉంచిన విషయం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక ఆయన విజిలెన్స్ చీఫ్‌గా నియామకంపై మద్రాస్ హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవినీతి నిరోధక సంస్థకు నాయకత్వం వహించే అధికారి నిష్కళంకమైన ప్రతిష్ఠ కలిగి ఉండాలని, "సీజర్ భార్యపై ఎలాంటి అనుమానం ఉండకూడదన్నట్లే, విజిలెన్స్ డైరెక్టర్‌పై కూడా ఎలాంటి అనుమానాలకు తావుండకూడదు" అని కోర్టు వ్యాఖ్యానించింది. (వివరణ: ప్రాచీన రోమ్ పాలకుడు జూలియస్ సీజర్ తన భార్యపై ఎలాంటి ఆధారాలు లేకపోయినా అనుమానాలు రావడంతో విడాకులు ఇచ్చి, "నా భార్యపై అనుమానం కూడా ఉండకూడదు" అన్నాడు. అప్పటి నుంచే "Caesar's wife must be above suspicion" అనే సామెత ప్రాచుర్యంలోకి వచ్చింది. మద్రాస్ హైకోర్టు ఈ సామెతనే ప్రస్తావించింది)..ఏ. అరుణ్ తమిళనాడు కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) హోదాలో ఉన్న ఆయన గతంలో చెన్నై నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనను డీవీఏసీ వంటి అత్యంత కీలకమైన అవినీతి నిరోధక విభాగానికి అధిపతిగా నియమించడం అప్పట్లోనే చర్చకు దారితీసింది. ఇలాంటి సంస్థకు నాయకత్వం వహించే అధికారి ఎంపికలో పారదర్శకత, నిష్పాక్షికత అత్యంత కీలకమని న్యాయస్థానం అభిప్రాయపడింది... ఈ నేపథ్యంలో నియామకంపై వచ్చిన విమర్శలు, న్యాయస్థాన పరిశీలన మధ్య కేవలం రెండు నెలల్లోనే అరుణ్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తూ విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమిళనాడులో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.ఏడీజీపీ హోదాలో ఉన్న అరుణ్‌ను చెన్నైలోని తమిళనాడు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం డీవీఏసీ(DVAC) లో ప్రత్యేక దర్యాప్తు విభాగం ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న సీ. మహేశ్వరి ఐపీఎస్‌కు విజిలెన్స్ డైరెక్టర్ బాధ్యతలను అదనంగా అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
విజయ్‌పై అభిమానం.. ఆమె ఉద్యోగానికే ఎసరు!
చెన్నై: అభిమానం ఉండొచ్చు.. కానీ ఆ అభిమానం హద్దులు దాటితే మూల్యం చెల్లించక తప్పదు. తొలినాళ్ల నుంచే విజయ్‌కు వీరాభిమానిగా ఉన్న ఒకావిడ విధి నిర్వహణలో చేసిన పని.. చివరకు ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ ఆగ్రహానికి గురి చేసింది. అభిమాని అయినా డోంట్‌కేర్ అని అనేసింది. ఫలితంగా ఆమె ఉద్యోగమే ప్రమాదంలో పడింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై ఉన్న అభిమానంతో ఓ ప్రభుత్వ పాఠశాల హెడ్మిస్ట్రెస్ తీసుకున్న నిర్ణయం.. చివరకు ఆమె సస్పెన్షన్‌కు దారితీసింది. తరగతులు జరుగుతున్న సమయంలో విద్యార్థులకు సీఎం విజయ్ కరూర్ సభను ప్రొజెక్టర్‌పై ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) చేసి చూపించడంతో తమిళనాడు ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకుంది.కరూర్ జిల్లాలోని పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో హెడ్‌మిస్ట్రెస్‌గా పనిచేస్తున్న ఎస్. మల్లిగా విజయ్‌కు వీరాభిమాని. శుక్రవారం తరగతి గదిలో విద్యార్థులను కూర్చోబెట్టి సీఎం విజయ్ కరూర్ సభను ప్రొజెక్టర్‌పై ప్రత్యక్షంగా వీక్షించేలా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది.విషయం తెలిసిన వెంటనే పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో ఇది హెడ్మిస్ట్రెస్ వ్యక్తిగత నిర్ణయమేనని తేలడంతో ఆమెను తక్షణమే సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఇదే తరహాలో జరిగిన మరో ఘటనపైనా విచారణ కొనసాగుతోందని వెల్లడించారు."పాఠశాలల్లో రాజకీయాలకు ఎలాంటి స్థానం లేదు. విద్యాసంస్థలు రాజకీయ వేదికలు కావు.. అవి భావితరాలను తీర్చిదిద్దే జ్ఞాన కేంద్రాలు" అని మంత్రి స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మినహా పుట్టినరోజు వేడుకలు, రాజకీయ సభలు లేదంటే ఇతర ప్రభుత్వేతర కార్యక్రమాలకు పాఠశాలల్లో అనుమతి ఉండదని తెలిపారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రైవేట్ సంస్థల సభ్యులు నేరుగా విద్యార్థులతో సమావేశాలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.కరూర్ జిల్లా ప్రాథమిక విద్యాధికారి జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో.. విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ మార్గదర్శకాల ఉల్లంఘన, జూలై 9న విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్‌ను పాటించకపోవడం వంటి ఆరోపణలను ప్రస్తావించారు. పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యే వరకు హెడ్మిస్ట్రెస్ మల్లిగా సస్పెన్షన్‌లోనే కొనసాగనున్నారు.ఇటీవల సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు పాఠశాల ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహించడం కూడా వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే మద్రాస్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలై ఉండగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యాసంస్థల్లో రాజకీయ కార్యకలాపాలపై తమిళనాడు ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. -
ఆ టైంలో పోలీసుల్ని నమ్మాను.. కానీ, నన్నే నిందించారు
కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తొలిసారి సీఎం హోదాలో స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి తనపై, తన పార్టీపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన.. గత ప్రభుత్వంతో పాటు పోలీసుల తీరును తప్పబట్టారు. ఈ క్రమంలో ఈ విషాదం తనను జీవితాంతం వెంటాడుతుందని భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం కరూర్‌లో పర్యటించిన విజయ్.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఉద్యోగ నియామకాల పత్రాలను అందజేశారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘కరూర్ తొక్కిసలాట ఎంతో బాధను మిగిల్చింది. మన సోదరీమణుల పిల్లలను కోల్పోయాం. ఎన్ని విజయాలు వచ్చినా.. ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేం’’ అని విజయ్ అన్నారు.41 మంది మృతి.. వంద మందికి పైగా గాయాలుగత ఏడాది సెప్టెంబర్‌లో కరూర్‌లోని వేలుసామిపురంలో టీవీకే నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. విజయ్ను చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ ఘటనలో చిన్నారులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.‘‘పోలీసులను నమ్మాను.. కానీ నన్నే నిందించారు’’తొక్కిసలాటకు టీవీకే కారణమన్న ఆరోపణలను విజయ్ తోసిపుచ్చారు. ర్యాలీలో భద్రత, జన నియంత్రణ బాధ్యతలు పోలీసులవేనని అన్నారు. “జనాన్ని నియంత్రిస్తారని పోలీసు శాఖను నమ్మాను. ఆ రోజు వారికి ధన్యవాదాలు కూడా చెప్పాను. కానీ జరిగిన మరణాలకు నన్నే బాధ్యుడిని చేశారు” అని విజయ్ వ్యాఖ్యానించారు. కరూర్ పోలీసులు పరిస్థితి విషమిస్తున్న విషయాన్ని ముందుగానే తమకు తెలియజేసి ఉంటే ప్రమాదాన్ని నివారించగలిగేవారని ఆయన అన్నారు.“పెరంబలూరు పోలీసులు చేసినట్టుగా కరూర్ పోలీసులు మమ్మల్ని ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారు? పరిస్థితి అదుపు తప్పుతోందని చెప్పి ఉంటే చర్యలు తీసుకునేవాళ్లం. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లింది కూడా పోలీసులే. ఇదంతా ఓ డ్రామాలా అనిపిస్తోంది. దీని వెనుక ఎవరు ఉన్నారు?” అని విజయ్ ప్రశ్నించారు.విజయ్‌కు కరూర్ ప్రజల బ్రహ్మరథంకరూర్ పర్యటన సందర్భంగా విజయ్ ప్రయాణించిన మార్గం మొత్తం అభిమానులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. టీవీకే కేడర్‌తో పాటు ముఖ్యమంత్రిని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కొందరు సీఎం కాన్వాయ్‌కు దిష్టి తీశారు. పోలీసులు కూడా జనాన్ని నియంత్రించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ దశలో భారీగా దూసుకొచ్చిన జనసందోహం కారణంగా కొందరు పోలీసులు కూడా అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ సమయంలో విజయ్ భద్రతా సిబ్బంది స్పందించి కిందపడిన పోలీసులను పైకి లేపి సహాయం చేశారు. ఈ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.கரூர் நோக்கிய பயணத்தில் முதலமைச்சர் விஜயை பார்க்க வழிநெடுகிலும் கூடியிருந்த கூட்டம்.. முதலமைச்சரை பார்க்க முண்டியடித்த கூட்டத்தால், தடுமாறி கீழே விழுந்த போலீஸ்.. கைகொடுத்து தூக்கி விட்ட முதலமைச்சர் விஜயின் பாதுகாவலர்கள்#Karur | #CMVijay | #Vijay | #CMVijayKarurVisit |… pic.twitter.com/2Qh9cm2Ltd— Polimer News (@polimernews) July 10, 2026డీఎంకే ప్రభుత్వంపైనా విమర్శలుకరూర్ ఘటనపై గత డీఎంకే ప్రభుత్వ వ్యవహార శైలిని కూడా విజయ్ ప్రశ్నించారు. భద్రతా ఏర్పాట్లు, జన నియంత్రణలో లోపాలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, పోలీసులు చేసిన ఆరోపణలను టీవీకే ఇప్పటికే ఖండించింది. విజయ్ ఆలస్యంగా రావడం వల్లే భారీగా జనం చేరారని పోలీసులు పేర్కొన్న వాదనలను ఆ పార్టీ తోసిపుచ్చింది.బాధితుల జ్ఞాపకార్థం స్మారకంకరూర్ విషాదంలో మృతి చెందిన వారి జ్ఞాపకార్థం తమ పార్టీ తరఫున స్మారకాన్ని నిర్మిస్తామని విజయ్ ప్రకటించారు. “కరూర్ నా హృదయం నుంచి ఎప్పటికీ దూరం కాదు. బాధితుల జ్ఞాపకార్థం ఇక్కడ స్మారకం నిర్మిస్తాం” అని ఆయన తెలిపారు.నల్ల దుస్తులతో విజయ్..సీఎం అయ్యాక బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులోనే విజయ్ కనిపిస్తూ వస్తున్నారు. అయితే.. కరూర్‌కు సీఎంగా తొలిసారి వెళ్లిన విజయ్ తన వేషధారణతోనూ ఓ సందేశం ఇచ్చారు. సాధారణంగా ధరించే నలుపు-తెలుపు దుస్తులకు భిన్నంగా పూర్తిగా నల్ల దుస్తుల్లో ఆయన కనిపించారు. విషాదానికి, సంతాపానికి ప్రతీకగా భావించే నలుపు రంగును ఎంచుకోవడం ద్వారా బాధిత కుటుంబాల పట్ల సానుభూతిని, సంఘీభావాన్ని వ్యక్తం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కరూర్ పర్యటనను వేడుకగా కాకుండా.. విషాద ఘటనను గుర్తు చేసుకునే సందర్భంగా చూపించేందుకు విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.విజయ్ వైఖరి ఇలా..కరూర్ ఘటన తర్వాత విజయ్ వైఖరిపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. ఘటన జరిగిన తర్వాత ఆయన అక్కడికి వెళ్లకుండా తప్పించుకున్నారని డీఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే నేతలు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను టీవీకే వర్గాలు ఖండించాయి. ఘటన జరిగిన మరుసటి రోజే విజయ్ వీడియో సందేశం విడుదల చేసి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.అనంతరం కరూర్‌లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించాలని విజయ్ ప్రయత్నించారు. అయితే అప్పటి డీఎంకే ప్రభుత్వం, పోలీసులు భద్రతా కారణాలను చూపుతూ ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదని టీవీకే ఆరోపించింది. దీంతో విజయ్ కరూర్ బాధిత కుటుంబాలను మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌కు పిలిపించి వారిని పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు.తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారి కరూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను స్వయంగా కలుసుకుని పరామర్శించడంతో పాటు, ప్రభుత్వం తరఫున ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. సీఎం హోదాలో విజయ్ చేసిన తొలి కరూర్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తొక్కిసలాట ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు, పోలీసులపై లేవనెత్తిన ప్రశ్నలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. -
విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!
గోవధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. మత స్వేచ్ఛ, చట్టబద్ధ హక్కులు, న్యాయవ్యవస్థ అధికార పరిధి అంశాలపై రాజకీయ దుమారం చెలరేగింది.మద్రాస్ హైకోర్టు మే 27న ఇచ్చిన తీర్పు తమిళనాడు జంతు సంరక్షణ చట్టం–1958కు విరుద్ధంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును తాజాగా ఆశ్రయించింది. పదేళ్లు దాటిన, వ్యవసాయ పనులకు లేదంటే సంతానోత్పత్తికి.. పనికిరాని ఆవులను నిర్దిష్ట నిబంధనల ప్రకారం వధించేందుకు చట్టం అనుమతిస్తోందని, అయితే హైకోర్టు ఎలాంటి మినహాయింపులూ లేకుండా రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించడం చట్ట పరిధిని మించిన నిర్ణయమని పేర్కొంది.అంతేకాదు, కోయంబత్తూరులో బక్రీద్ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో జంతువుల వధను నిరోధించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఆ అంశానికే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్రానికి వర్తించేలా ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది చట్టసభ అధికారాలను న్యాయస్థానం భర్తీ చేసినట్లేనని తన పిటిషన్లో పేర్కొంది.ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ఆలస్యంగా తీసుకున్న చర్యగా విమర్శిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే.. ఈ విషయంలో టీవీకే ప్రభుత్వం దాదాపు నెల రోజుల తర్వాత స్పందించిందని ఆరోపించింది. బక్రీద్ సందర్భంగా మాత్రమే దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించడంతో ముస్లింలతో పాటు కొన్ని హిందూ దేవాలయాల్లో జరిగే సంప్రదాయ బలిపూజలపైనా ప్రభావం పడిందని పేర్కొంది. ఇలాంటి కీలక అంశంలో ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిందని, ఆలస్యంగా స్పందించడం వల్ల ప్రజల్లో అయోమయం నెలకొందని విమర్శించింది.మరోవైపు, మణితనేయ మక్కల్ కచ్చి (MMK) అధ్యక్షుడు ఎం.హెచ్. జవహిరుల్లా ఈ తీర్పు రాజ్యాంగంలోని మత స్వేచ్ఛ హక్కును దెబ్బతీస్తోందని ఆరోపించారు. లైసెన్స్ పొందిన స్లాటర్ హౌస్‌లలో మాత్రమే బలులు నిర్వహించాలనడం ఆచరణ సాధ్యం కాదని, సంప్రదాయ మతాచారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.అయితే తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాలు జంతువుల వధను నియంత్రిస్తున్నాయని, వాటిని పూర్తిగా పక్కనబెట్టి హైకోర్టు సంపూర్ణ నిషేధం విధించడం న్యాయపరంగా సమంజసం కాదని స్పష్టం చేసింది. న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాతే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే సమయంలో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో అధికార–ప్రతిపక్షాల మధ్య కొత్త రాజకీయ పోరుకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కొత్త స్క్రిప్ట్ రాసే పనిలో దళపతి విజయ్!
సినిమా తెరపై దశాబ్దాల పాటు ‘దళపతి’గా అభిమానులను ఊర్రూతలూగించిన సి. జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయనపై అందరికీ సందేహాలే!. ‘‘రాజకీయాలు తెలియదు’’, “ఎలాంటి అనుభవం లేదు”, “పాలన అంటే సినిమా చేయడం కాదు” ఇలా.. ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ తమిళనాడు ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్న కొద్ది నెలల్లోనే.. విజయ్ తనపై ఉన్న ఆ అనుమానాలనే లక్ష్యంగా చేసుకుని ఒక్కో అడుగుతో సమాధానం చెబుతున్నట్టు కనిపిస్తోంది.మొదట్లోనే ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజకీయాల కంటే పాలనపైనే ఫోకస్ పెట్టినట్టు సంకేతాలు ఇచ్చాయి. బాధ్యతలు చేపట్టిన వెంటనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటనతో కోట్లాది కుటుంబాలకు నేరుగా ఊరట కలిగించారు. అదే సమయంలో ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా “సింగప్పెన్ టాస్క్ ఫోర్స్” ఏర్పాటు చేయడం మరో కీలక నిర్ణయంగా మారింది.వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ మద్యం దుకాణాల(TASMAC) విషయంలో కూడా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. దేవాలయాలు, పాఠశాలలు, బస్టాండ్ల సమీపంలో ఉన్న దుకాణాలను దశలవారీగా మూసివేయడం ద్వారా “పాలనలో కఠినత” అనే సందేశాన్ని బలంగా పంపింది.అయితే విజయ్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నది కేవలం నిర్ణయాలు కాదు.. ఆ వెనుక ఉన్న “పాలనా శైలి”. ప్రతి రోజు సమయానికి సచివాలయానికి చేరుకోవడం, గంటల తరబడి ఫైళ్లపై దృష్టి పెట్టడం, అధికారులపై క్రమశిక్షణను తప్పనిసరి చేయడం వంటి అంశాలు కొత్త చర్చకు దారితీశాయి. సంప్రదాయ రాజకీయ నేతలలా కాకుండా, ఆయన కార్పొరేట్ సీఈఓ తరహాలో పాలన నడుపుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది.అంతేకాదు, వ్యక్తిగత అలవాట్లు కూడా ఈ కథనంలో భాగమయ్యాయి. టైం కంటే ముందే ‘ఆఫీస్’కు వెళ్తున్న ఆయన.. సాదాసీదాగా సెక్రటేరియెట్‌లోని తన ఛాంబర్ భోజనం చేయడం, అనవసర రాజకీయ సమావేశాలను తగ్గించడం వంటి విషయాలు ఆయన “డిసిప్లిన్ ఫస్ట్” పాలనా విధానానికి ఉదాహరణలుగా చెబుతున్నారు. అధికార వర్గాల్లో సమయపాలనను కఠినంగా అమలు చేయడం కూడా అదే దిశలోని సంకేతం.విజయ్ ప్రభుత్వం కేవలం సంక్షేమంపై మాత్రమే కాదు, వ్యవస్థ మార్పుపై కూడా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అమ్మా ఉణవగం క్యాంటీన్ల ఆధునీకరణ, నిలిచిపోయిన తాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, రైతులకు ఆర్థిక ప్యాకేజీలు వంటి నిర్ణయాలు ప్రజల రోజువారీ జీవితంపై ప్రభావం చూపేలా ఉన్నాయి. అదే సమయంలో ఆర్థిక పారదర్శకత కోసం ఫైనాన్స్ వైట్‌పేపర్ విడుదల చేయడం కూడా చర్చనీయాంశమైంది.రాజకీయంగా చూస్తే కేంద్రంతో ఆయన వైఖరి కూడా సమతుల్యంగానే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ, నీతి ఆయోగ్ సమావేశాల్లో పాల్గొనడం ద్వారా.. తమిళనాడు ప్రయోజనాలను బలంగా వినిపిస్తూనే, కేంద్రంతో విభేదాలను పెద్దగా పెంచకుండా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.మరో కీలక అంశం.. అవినీతి వ్యతిరేక చర్యలు. హెచ్ఆర్&సీఈ శాఖకు చెందిన పలు ప్రాజెక్టులను రద్దు చేయడం, పర్యవేక్షణ వ్యవస్థను కఠినతరం చేయడం, కాంట్రాక్ట్ వ్యవస్థపై నియంత్రణ పెంచడం వంటి చర్యలు ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయి.అయితే ఈ కథ ఇంకా పూర్తికాలేదు. కొన్ని ఎన్నికల హామీలు అమలు దశలోనే ఉన్నాయి. ప్రతిపక్షాలు మాత్రం ఇంకా అనుభవం లోపం, పాలనా స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. విమర్శలు తగ్గకపోయినా, వాటికి సమాధానం ఇప్పుడు మాటలతో కాదు, నిర్ణయాలతో వస్తోంది. సినిమాల్లో ఎలా అయితే ప్రతి సన్నివేశానికి ఒక క్లైమాక్స్ ఉంటుందో, రాజకీయాల్లో విజయ్ కూడా తన పాలనను అదే తరహాలో “పర్ఫార్మెన్స్ మోడ్”లో నడుపుతున్నాడన్న భావన బలపడుతోంది. ఇది తాత్కాలిక ఉత్సాహమా? లేక స్థిరమైన రాజకీయ మార్పుకు ఆరంభమా అన్నది రాబోయే కాలమే నిర్ణయించాలి. -
స్టాలిన్ అలా అనకపోయి ఉంటే... ఇదంతా జరిగేదా?
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరగబోతోందా? అధికారంలోకి వచ్చిన రెండు నెలలు కూడా పూర్తికాకముందే సీఎం జోసెఫ్ విజయ్ కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీశారు. డీఎంకేను పూర్తిగా ఒంటరి చేయడమే లక్ష్యంగా దాని మాజీ మిత్రపక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బుధవారం జరగనున్న కీలక సమావేశం తమిళ రాజకీయాల దిశనే మార్చే అవకాశముందనే చర్చ సాగుతోంది.సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా తన మిత్రపక్షాలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్, విడుతలై చిరుతైగళ్ కట్చి (VCK), సీపీఐ, సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం (MDMK) వంటి పార్టీలను ఆహ్వానించారు. వీటిలో చాలా పార్టీలు గతంలో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లో భాగస్వాములే కావడం గమనార్హం.అధికారికంగా డీఎంకేకు గుడ్‌బై?ఈ సమావేశానికి ముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న విడుతలై చిరుతైగళ్ కట్చి (VCK) అధినేత తిరుమావళవన్ పార్టీ అధికారికంగా డీఎంకే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే ప్రభుత్వానికి VCK మద్దతు ప్రకటించినప్పటికీ, ఇప్పుడు అధికారికంగా డీఎంకేతో బంధం తెంచుకోవడం పెద్ద రాజకీయ పరిణామంగా భావిస్తున్నారు.డీఎంకే మాజీ మిత్రులంతా విజయ్ వైపు?ఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వంలో భాగమయ్యారు. ఇటీవల వైకో నేతృత్వంలోని ఎండీఎంకే కూడా డీఎంకేతో దశాబ్దాల అనుబంధానికి ముగింపు పలికింది. అయితే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం డీఎంకేతోనే కొనసాగుతున్నారు. ఇక సీపీఐ, సీపీఎం వైఖరి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.సెక్యులర్ ఫ్రంట్‌కు శ్రీకారంవిజయ్ నేతృత్వంలో కొత్త "సెక్యులర్ కూటమి" ఏర్పాటు దిశగా ఈ సమావేశం తొలి అడుగుగా భావిస్తున్నారు. ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా.. ప్రభుత్వాన్ని మరింత స్థిరంగా ఉంచడం, మిత్రపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడం, భవిష్యత్ స్థానిక సంస్థలు, ఉపఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే వ్యూహంపై చర్చించే అవకాశముంది.స్టాలిన్ వ్యాఖ్యలే కారణమా?ఇటీవల డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ "తమిళనాడులో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు" అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల తర్వాతే విజయ్ మిత్రపక్షాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రక్రియ వేగం పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ స్థిరత్వంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టడంతో పాటు, డీఎంకే మాజీ మిత్రులంతా తమవైపే ఉన్నారనే సంకేతాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని అత్యంత ప్రాధాన్యంగా నిర్వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో "స్టాలిన్ ఆ వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే... విజయ్ ఇంత వేగంగా కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు పావులు కదిపేవారా?" అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్న విజయ్ టీమ్..ఈ కీలక సమావేశానికి హాజరుకావాలని టీవీకే సీనియర్ నేతలు, మంత్రులు ఎన్. ఆనంద్, ఆదవ్ అర్జున్ స్వయంగా వివిధ పార్టీల అగ్రనేతలను కలిసి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా వీసీకే అధినేత తిరుమావళవన్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఆహ్వాన పత్రం అందించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.డీఎంకేకు ఇది పెద్ద రాజకీయ సవాలేనా?2019 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమే తమిళ రాజకీయాలను శాసించింది. కానీ ఇప్పుడు అదే కూటమిలోని భాగస్వాములు ఒక్కొక్కరుగా విజయ్ వైపు చేరడం సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీగానే మిగులుతుందా? లేక కొత్త రాజకీయ ఫ్రంట్‌కు అధికారిక శ్రీకారం చుడుతుందా? అన్నది ఒక ప్రశ్న అయితే... స్టాలిన్ చేసిన ఒక్క వ్యాఖ్యే ఈ మొత్తం రాజకీయ వేగానికి కారణమైందా? అన్న ప్రశ్న కూడా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అంతే ఆసక్తిగా చర్చనీయాంశమవుతోంది. -
తమిళనాడు సీఎం విజయ్ సంచలన ఆదేశం
సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన పాలనా శైలితో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన.. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ జోక్యానికి తావులేకుండా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, నేరస్తులు ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా ఉపేక్షించవద్దని అధికార యంత్రాంగానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, కమిషనర్లు, ఐజీలు, డీఐజీలు సహా రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం విజయ్ రెండు రోజుల ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. నామక్కల్ కవింజర్ మాళిగైలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొన్నారు. మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన, వ్యవస్థీకృత నేరాల అణచివేతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు.సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం అధికారులను ఉద్దేశించి విజయ్ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి శక్తిమంతులైనా, ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నవారైనా నిష్పాక్షికంగా చట్టప్రకారం శిక్షించాలి. అమాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకూడదు అని అధికారులను ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించాలని సూచించారు.మహిళల భద్రత, చిన్నారుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం విజయ్ స్పష్టం చేశారు. మహిళలపై నేరాలు, పోక్సో కేసుల విచారణలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, విద్యార్థులు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో నిఘా పెంచి డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు సూచించారు.రాష్ట్రాన్ని 'డ్రగ్స్-ఫ్రీ తమిళనాడు'గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని విజయ్ ప్రకటించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, అక్రమ మద్యం తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు, ఖనిజాల స్మగ్లింగ్, వ్యవస్థీకృత నేరాలపై రాజీపడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, వాటి మూలాలను గుర్తించి ముందస్తుగా అడ్డుకోవడంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.రౌడీషీటర్లు, బెయిల్‌పై బయట ఉన్న నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని విజయ్ ఆదేశించారు. సైబర్ నేరాలు, కుల ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించేలా యంత్రాంగం పనిచేయాలని పేర్కొన్నారు. భూ వివాదాలు హింసాత్మక ఘటనలకు దారితీయకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక పరిష్కార కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.అవినీతికి తావులేని పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విజయ్ స్పష్టం చేశారు. తాగునీరు, వైద్యం, విద్య, విద్యుత్, ప్రజా రవాణా వంటి మౌలిక సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.మూడు విడతల్లో జరుగుతున్న ఈ ఉన్నతస్థాయి సదస్సులో తొలి రోజు కలెక్టర్లు, పోలీసు అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. రెండో రోజు జిల్లాల అభివృద్ధి పనులపై కలెక్టర్లతో, అనంతరం పోలీసు అధికారులతో సీఎం విజయ్ విడివిడిగా సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశాల ముగింపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కలెక్టర్లు, పోలీసు అధికారులు, అటవీ శాఖ అధికారులను సీఎం విజయ్ స్వయంగా సత్కరించి పురస్కారాలు అందజేయనున్నారు.అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పాలన, శాంతిభద్రతలు, మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై సీఎం విజయ్ తీసుకుంటున్న కఠిన వైఖరి తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన పాలనా శైలి ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. -
విజయ్‌తో భేటీ.. 24 గంటల్లోనే సీన్ రివర్స్!
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. విజయ్ ఫ్యాక్టర్‌తో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా.. ప్రతిపక్ష డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్‌లో చీలికలు కనిపిస్తున్నాయి. ఆఖరికి స్టాలిన్‌తో ఎనిమిదేళ్లకు పైగా కలిసి నడిచిన ఎండీఎంకే కూడా కూటమికి గుడ్‌బై చెప్పింది. పైగా రాజకీయ ప్రత్యర్థిని ఆకాశానికెత్తడంతోనే ఆగిపోకుండా.. సంచలన ఆరోపణలు చేస్తూ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఇదంతా స్టాలిన్‌కు బిగ్ షాక్ అని అంతా భావించారు. కానీ..ఇక్కడే తమిళ రాజకీయాల్లో ఎవరూ ఊహించనిది జరిగింది. పొలిటికల్ గేమ్‌లో పావులు తారుమారు అయ్యాయి. డీఎంకేకు షాక్ ఇవ్వాలనుకున్న వైకోకే.. 24 గంటలు గడవక ముందే పెద్ద షాక్ తగిలింది. ఆయన పార్టీకి చెందిన 150 మందికిపైగా కీలక నేతలు డీఎంకే కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం ఎండీఎంకే అధినేతను రాజకీయంగా ఇరకాటంలో పడేసినట్లయ్యింది.చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం 'అన్నా అరివాలయం'లో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి. శివగంగా, తిరువల్లూర్, విరుధునగర్, తిరుపూర్ జిల్లాలకు చెందిన రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, న్యాయవాదులు, విద్యార్థి విభాగ నేతలు డీఎంకే కండువా కప్పుకున్నారు. తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీకి చెందిన సుమారు 40 మంది విద్యార్థులు కూడా డీఎంకేలో చేరడం విశేషం.MDMK announced yesterday it was withdrawing from the DMK alliance, today some key functionaries of MDMK joined the DMK in the presence of M. K. Stalin. pic.twitter.com/gxnxpBaTvF— Vignesh Theni (@Vignesh_twitz) June 28, 20261994లో డీఎంకేతో విభేదాల కారణంగా వైకో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే)ను స్థాపించారు. ఆ తర్వాత అనేక రాజకీయ ఒడిదొడుకుల మధ్య గత ఎనిమిదేళ్లుగా.. డీఎంకే నేతృత్వంలోని కూటమిలోనే కొనసాగారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎస్పీఏ కూటమి నుంచే పోటీ చేశారు. ఎండీఎంకేకు నాలుగు అసెంబ్లీ స్థానాలు కేటాయించగా.. అందులో మూడు స్థానాల్లో డీఎంకే ఎన్నికల గుర్తు ఉదయించే సూర్యుడు గుర్తుపై అభ్యర్థులను బరిలోకి దించడం గమనార్హం. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో వైకో.. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ను పలుమార్లు ప్రశంసించారు. ఆయన రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తూ.. ప్రత్యామ్నాయ రాజకీయాలపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే టీవీకే ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు గుప్పించడం, ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపై వైకో ప్రశ్నలు లేవనెత్తడం గమనార్హం. ఇదేదీ చాలదన్నట్లు.. విజయ్‌తో భేటీ కావడం కూడా తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. MDMK chief Vaiko expresses confidence in CM Vijay, stating he is equipping himself to govern effectively and will be fully prepared within the next six months. pic.twitter.com/xmvKHkXn4i— VARTA ( वार्ता ) (@varta24news) June 25, 2026తదనంతరం జరిగిన ఎండీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నుంచి వైదొలుగుతున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజా తీర్పుకు విరుద్ధంగా తెరవెనుక రాజకీయ ఒప్పందాలు జరిగాయని ఆరోపిస్తూ, ఆ కారణంగానే పొత్తు నుంచి బయటకు వస్తున్నట్లు తీర్మానంలో పేర్కొంది. ఎన్నికలు సమీపించినప్పుడు కొత్త రాజకీయ పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని కూడా వెల్లడించింది. అయితే విజయ్ నేతృత్వంలోని టీవీకేతోనే ఎండీఎంకే పొత్తు ఉండొచ్చన్న ఊహాగానాలు తమిళనాడు రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.వైకో కూటమి నుంచి వైదొలగడం డీఎంకేకు రాజకీయ ఎదురుదెబ్బగా మారుతుందని తొలుత భావించినా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం పూర్తిగా భిన్న చిత్రాన్ని చూపించాయి. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై స్టాలిన్ మౌనం పాటించడం కూడా చర్చనీయాంశమైంది. స్పందనలతో కాకుండా.. భారీ చేరికలతోనే రాజకీయంగా సమాధానం ఇచ్చారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజయ్ ఫ్యాక్టర్, వైకో ఎత్తుగడలు, ఎండీఎంకేలో చోటుచేసుకున్న భారీ వలసలు... ఇవన్నీ కలిసి తమిళనాడు రాజకీయాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. -
చిక్కుల్లో విజయ్ మంత్రి.. డీఎంకే ఎంట్రీతో ముదిరిన వివాదం
చేతిలో ఏటీఎం కార్డు.. మొబైల్ స్క్రీన్‌పై తెల్లటి పొడి.. కరెన్సీ నోటు.. ఆ పక్కనే నవ్వులు చిందిస్తున్న అమ్మాయి.. ఇదంతా చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. టీవీకే ఎమ్మెల్యే, తమిళనాడు మంత్రి డీ శరత్‌కుమార్‌కు డ్రగ్స్ అలవాటు ఉందా? అంటూ పలువురు పశ్నిస్తున్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో స్వయంగా సీఎం విజయ్ పాల్గొన్న వేళ.. ఈ వీడియో బయటకు రావడం తమిళనాట కలకలం రేపింది.తమిళనాడు మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి డి. శరత్‌కుమార్‌కు సంబంధించిన ఓ వ్యక్తిగత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో మంత్రి ఏటీఎం కార్డుతో మొబైల్ స్క్రీన్‌పై తెల్లటి పొడి వంటి పదార్థాన్ని నలిపినట్లు కనిపిస్తోంది. పక్కనే రూ.500 నోటు కూడా ఉండటంతో పలువురు సోషల్ మీడియా వినియోగదారులు అది మాదకద్రవ్యమేనని ఆరోపించారు. కొందరు ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై శరత్ వివరణ ఇచ్చుకున్నారు. ఆ వీడియో పాతదని.. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తీసిందని.. దానిని తాను ఇన్స్టాగ్రామ్ 'క్లోజ్ ఫ్రెండ్స్' స్టోరీలో షేర్ చేశానని.. అది ఇప్పుడు వైరల్ అవుతోందని అన్నారాయన. Old video of TVK Minister Sarathkumar is viral online where he was caught using drugs during IPL.He gave an explanation that it was some tablet/ milk power for his baby. But where is the baby and wife here?(1/n)pic.twitter.com/T6LXICsYUp— GeoMedicus (@dr_harish_s) June 26, 2026ఇక డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన శరత్‌కుమార్.. భార్య, చిన్న కుమార్తెతో కలిసి వీడియో విడుదల చేశారు. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగిందని.. అప్పటికి తన కుమార్తెకు ఏడాదిన్నర వయసు మాత్రమేనని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారి మాత్ర మింగకపోవడంతో, వైద్యుడి సూచన మేరకు మాత్రను పొడిచేసి ద్రవంలో కలిపి ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. వీడియోలో కనిపిస్తున్నది అదే మాత్ర అని, దీనిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.Did a #TamilNadu minister really get caught handling drugs during an #IPL match? An old video of Tamil Nadu Minister for Human Resources Management D. Sarathkumar has resurfaced online, triggering drug-related allegations on social media.The clip shows the minister using a bank… pic.twitter.com/gBZ7aKR2lX— The New Indian Express (@NewIndianXpress) June 26, 2026అయితే ఈ వివరణతో వివాదం ఆగలేదు. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై స్పందిస్తూ.. వీడియోలో కనిపించిన తీరు డ్రగ్స్ తీసుకునే విధానాన్ని పోలి ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి విజయ్ ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని.. అలాంటి సమయంలో మంత్రిపై వచ్చిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.ఈ వివాదంపై బీజేపీ కూడా స్పందించింది. మంత్రి శరత్‌కుమార్ వివరణ ఇచ్చినప్పటికీ, వైరల్ వీడియోపై పోలీసులు దర్యాప్తు చేసి నిజానిజాలు బయటపెట్టాలని బీజేపీ నేత నారాయణన్ తిరుపతి డిమాండ్ చేశారు.గత నెలలోనే మంత్రి పదవి చేపట్టిన శరత్‌కుమార్‌కు ఈ వివాదం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ వీడియో వైరల్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వీడియోలో కనిపించేది నిజంగా డ్రగ్సా? లేక మంత్రి చెబుతున్నట్లుగా చిన్నారికి ఇచ్చే మందేనా? అనే అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. -
రీల్స్.. ఐటెం సాంగ్స్.. విజయ్‌కు ఉదయనిధి స్ట్రాంగ్ కౌంటర్
తమిళనాడు అసెంబ్లీలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి విజయ్ ప్రతిపక్షం పేరు ప్రస్తావించకుండానే తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే దీనికి డీఎంకే తరఫున ఉదయనిధి స్టాలిన్.. విజయ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత డీఎంకే ప్రభుత్వ పథకాలనే కొత్తగా తమవిగా విజయ్ ప్రచారం చేసుకుంటున్నారని ఉదయనిధి ఆరోపించారు. మహిళా హక్కుల భృతి, పాఠశాల అల్పాహార పథకం.. ఈ పథకాలు డీఎంకే హయాంలోనే ప్రారంభమయ్యాయని, ఇప్పుడు వాటిపై కొత్త ప్రభుత్వం స్టిక్కర్ అతికించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రంగా పెరిగాయని, కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చిందని అన్నారు. కావేరీ డెల్టా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మినీ పవర్ కట్ల నుంచి భారీ విద్యుత్ అంతరాయాల వరకు ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. "అన్నా వస్తే పవర్ వస్తుంది అన్నారు.. ఇప్పుడు తమిళనాడుకే పవర్ పోయింది" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.మహిళల భద్రత అంశంపైనా ఉదయనిధి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విజయ్ ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే 200కు పైగా లైంగిక నేరాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. "మహిళలపై జరుగుతున్న నేరాలు చూస్తుంటే మనం తమిళనాడులో ఉన్నామా? లేదంటే ఉత్తరప్రదేశ్‌లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అయితే సభలో అత్యంత చర్చనీయాంశంగా మారింది మాత్రం.. సీఎం విజయ్‌పై ఆయన చేసిన వ్యక్తిగత, రాజకీయ విమర్శలే. "అసెంబ్లీని సినిమా హాల్లా మార్చేశారు. సభలో కూడా నటించడం మొదలుపెట్టారు" అంటూ ఉదయనిధి ఎద్దేవా చేశారు. విజయ్ ప్రసంగాన్ని ఉద్దేశించి.. "విజయ్ నటిస్తుంటే స్పీకర్ కట్ చెబుతున్నారు.. మళ్లీ యాక్షన్ చెప్పగానే మొదలుపెడుతున్నారు" అని ఉదయ్‌నిధి వ్యాఖ్యానించారు.అంతేకాదు, "రేపటి నుంచి విజయ్ అసెంబ్లీకి క్యార్వాన్, మేకప్ మ్యాన్, ఫైట్ మాస్టర్లను కూడా తీసుకొస్తారేమో’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ కావడానికే అసెంబ్లీని వాడుకుంటున్నారు. రీల్స్ చేసుకోవడానికే వస్తున్నారా? పాలనపై బాధ్యత లేదా? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. సభలో విజిల్స్ వేయడం కనిపిస్తోంది. రేపు ఎమ్మెల్యేలతో ఐటెం సాంగ్స్‌కు డ్యాన్సులు చేయిస్తారేమో అంటూ ఉదయ్‌నిధి, టీవీకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.ఇదిలా ఉంటే అంతకు ముందు సీఎం విజయ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతిపై విచారణలు కొనసాగుతాయని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. "మాది యాక్టర్ పార్టీ అని ఎగతాళి చేశారు. కానీ ప్రజల మధ్య నుంచే వచ్చి ఈ స్థాయికి చేరుకున్నాం" అంటూ విమర్శలకు సమాధానం ఇచ్చారు.అయితే.. ఉదయ్‌నిధి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అధవ్ అర్జున్.. పార్టీ పేరు కూడా చెప్పకుండానే కొందరు ఉలిక్కిపడుతున్నారని వ్యాఖ్యానించారు. అవినీతి జరిగి ఉంటే ఆ డబ్బంతా తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుస్తామని చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.మొత్తానికి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు అధికార టీవీకే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మధ్య రాజకీయ పోరుకు వేదికగా మారాయి. సీఎం విజయ్ విమర్శలు.. ఉదయనిధి చేసిన ప్రతివిమర్శలు.. వాటికి అధికార పక్షం ఇచ్చిన కౌంటర్లు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. -
విజయ్ బిగ్ మూవ్.. ఇరకాటంలో కాంగ్రెస్!
కావేరీ నది జలాలపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న మేకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతూ.. కేంద్రం కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని తన రాష్ట్ర రైతుల హక్కులను కాపాడే దిశగా గట్టి వైఖరి ప్రదర్శించారు.కర్ణాటక ప్రభుత్వం రూ. 9,000 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ జలాశయ ప్రాజెక్ట్ ఏకపక్ష చర్యగా ఉందని ఆ తీర్మానంలో తమిళనాడు ఆరోపించింది. కావేరీ జల వివాద ట్రైబ్యునల్ తీర్పు (2007).. అలాగే సుప్రీంకోర్టు తీర్పు (2018)ను ఉల్లంఘించే ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందని తీర్మానంలో సీఎం విజయ్ పేర్కొన్నారు.ఈ తీర్మానం ప్రకారం కావేరీ బేసిన్ ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతమని, అందుబాటులో ఉన్న నీరు రాష్ట్రాల మధ్య పంచబడిపోయిందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు నీటి వినియోగానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మేకెదాటు ప్రాజెక్ట్‌కు ఎలాంటి అనుమతులు, సాంకేతిక లేదంటే పర్యావరణ క్లియరెన్స్‌లు ఇవ్వకూడదని తమిళనాడు అసెంబ్లీ తరఫున కోరారాయన. కేంద్ర జల సంఘం కూడా ఈ ప్రాజెక్ట్ వివరాల నివేదికను పరిశీలించకూడదని తీర్మానంలో సూచించారు.నీరు అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని, దాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని సీఎం విజయ్ స్పష్టం చేశారు. రాజకీయ భేదాలు ఉన్నా ప్రజల ప్రయోజనాల విషయంలో అందరూ ఏకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చర్చలో డీఎంకే, ఇతర పక్షాలు సైతం తీర్మానానికి మద్దతుగా మాట్లాడాయి.#TamilNadu CM Joseph #Vijay passed a resolution in assembly opposing Karnataka’s Mekedatu dam on Cauvery, citing tribunal and #SupremeCourt violations.#20xSubscribedSMEIPO pic.twitter.com/WaMKj7isb7— News Update (@NewsNew1578) June 19, 2026బెంగళూరు తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి కోసం ఈ ప్రాజెక్ట్ అవసరమని కర్ణాటక చెబుతోంది. అయితే.. తమిళనాడు మాత్రం ఇది తమ రాష్ట్ర నీటి హక్కులకు నష్టం కలిగిస్తుందని గట్టి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి.. కర్ణాటక సమర్పించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తిరస్కరించాలని కోరడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో మేకెదాటు వివాదం మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయంగా వేడెక్కింది.👉ఈ తీర్మానంలో అత్యంత కీలక అంశంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన చీలిక. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, అదే పార్టీకి చెందిన నాయకత్వం ఉన్నప్పటికీ తమిళనాడు కాంగ్రెస్ నాయకులు మాత్రం విజయ్ సర్కార్ తీసుకున్న తీర్మానానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా విభేదాలకు దారితీసింది. రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ వేర్వేరు వైఖరులు తీసుకోవడం కాంగ్రెస్‌ను చిక్కుల్లోకి పడేసింది.కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మేకెదాటు ప్రాజెక్ట్ తమ రాష్ట్ర అభివృద్ధి, బెంగళూరు తాగునీటి అవసరాలకు అవసరమని వాదిస్తున్నారు. కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని ముందుకు సాగుతామని వారు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి అనుకూలంగా స్పందిస్తూ, కావేరీ జలాలపై తమిళనాడు హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడలేమని వారు చెబుతున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ నేతలు భిన్న భిన్న వైఖరులు తీసుకోవడంతో కాంగ్రెస్ హైకమాండ్‌కు పరిస్థితి ఇరకాటంగా మారింది. ఈ ప్రాజెక్టు నేపథ్యం.. మేకెదాటు ప్రాజెక్ట్ కర్ణాటకలోని కనకపుర–రామనగర ప్రాంతాల మధ్య కావేరీ నదిపై నిర్మించాలనుకుంటున్న బ్యాలెన్సింగ్ జలాశయ ప్రాజెక్ట్. మేకెదాటు అంటే కన్నడలో “మేక దూకిన స్థలం” అని అర్థం. ఇక్కడ నది సన్నని లోయలో వేగంగా ప్రవహిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం బెంగళూరుకు తాగునీరు అందించడం మరియు జలవిద్యుత్ ఉత్పత్తి చేయడం.కావేరీ నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించాలన్నది కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదన. ఇదేం కొత్తది కాదు. 1940 నుంచే ఉంది. అయితే 2017లో అప్పటి ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. అయితే మేకెదాటు వల్ల దిగువ రాష్ట్రం తమిళనాడు నీటి ప్రవాహం తగ్గుతుందని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అంశం మాత్రమే కాకుండా రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక జల వివాదంగా మారింది. -
‘కుక్క’ వ్యాఖ్యలపై దుమారం.. స్పందించిన లారెన్స్
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మధ్య నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి దారితీసింది. అధికారంలో ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ పనితీరుపై మాట్లాడుతుండగా.. ఆయన చేసిన "కుక్క" పోలిక సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమైంది. దీంతో లారెన్స్ స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.ఇటీవల మీడియాతో మాట్లాడిన లారెన్స్.. కొత్త ఇంటికి మారినప్పుడు ఆ పరిసరాలు, అక్కడి పరిస్థితులు, అక్కడ తిరిగే కుక్కల అలవాట్లు కూడా తెలుసుకోవడానికి సమయం పడుతుందని ఉదాహరణ చెప్పారు. అలాగే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికీ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను కొందరు ప్రజలను ఉద్దేశించి చేసినట్లుగా అర్థం చేసుకోవడంతో వివాదం చెలరేగింది.దీనిపై ఎక్స్‌లో స్పందించిన లారెన్స్.. తాను ప్రజలను ఎప్పుడూ తన తల్లితో సమానంగా భావిస్తానని స్పష్టం చేశారు. "నేను ప్రజలను కుక్కలతో పోల్చానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవం. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందన్న ఉద్దేశంతోనే ఆ ఉదాహరణ చెప్పాను. ఎక్కడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు" అని పేర్కొన్నారు. అంతేకాకుండా పూర్తి వీడియో చూడకుండా వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరారు. తన మాటల అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.Hi everyone,I would like to clarify a misunderstanding regarding my recent press meeting.I have always said that my fans and the people are equal to my mother. Some are spreading false news that I referred to people as dogs, which is completely untrue and misleading. All I… pic.twitter.com/576GhWsI61— Raghava Lawrence (@offl_Lawrence) June 14, 2026అయితే వివరణ ఇచ్చినప్పటికీ.. లారెన్స్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగలేదు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోయినా, ఆయన ఉపయోగించిన ఉపమానం అనవసర వివాదానికి తావిచ్చిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, పూర్తి వ్యాఖ్యలను సందర్భంతో పాటు చూడాలని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. దీంతో "కుక్క" వ్యాఖ్యల వివాదం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.ఇదిలా ఉండగా, గత కొద్ది రోజులుగా లారెన్స్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఇటీవల ఆయన ప్రకటించారు. అందుకు తన తల్లి అంగీకరించారనని.. ప్రజలు డిసైడ్ చేయడమే ఆలస్యమని అన్నారు. అయితే ఏ పార్టీలో చేరతారన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ముఖ్యమంత్రి విజయ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో టీవీకేలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతోంది. -
పుట్టినరోజు నాడే.. విజయ్ నుంచి బిగ్ లాంచ్?
రాజకీయాల్లో గెలవాలంటే కేవలం ప్రజాబలం మాత్రమే కాదు.. తమ మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లే ‘బలం’ కూడా అవసరమే. అందుకే డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను అన్‌లిమిటెడ్‌గా వాడేసుకుంటున్నాయి పార్టీలు. అలాగే.. పార్టీలకు అనుకూలంగా పేపర్లు, టీవీ చానెల్స్ ఉండటం కొత్త విషయం కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అఖండ విజయం సాధించింది. అయితే ఆ గెలుపులో మీడియా కంటే.. సోషల్ మీడియానే అధిక పాత్ర పోషించింది. అందుకు కారణం.. అప్పటి అధికార, ప్రతిపక్షాల చేతుల్లోనే మీడియా చానెల్స్, పేపర్లు మొత్తం ఉండడం. ఆ సమయంలో ఆయన ఈ పరిస్థితిని పార్టీ మీటింగ్‌లోనూ ప్రస్తావించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు తన టీవీకే పార్టీ తరఫున కొత్త వార్తా చానెల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. జూన్ 22న ‘వెట్రి న్యూస్’ అనే న్యూస్ చానెల్ సీఎం విజయ్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోందట. అదే రోజు ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం. తమిళగ వెట్రి కగళం అంటే తమిళ విక్టరీ క్లబ్ అని అర్థం. విజయ్ తన పేరులోని విజయాన్ని పార్టీకి పెట్టారు. ఇప్పుడు చానెల్‌కు కూడా వెట్రి(విజయం) అనే ఉంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ప్రముఖ ఇన్ఫ్లున్సెయర్, పొలిటికల్ అనలిస్ట్‌గా పేరుగాంచిన మణికందన్ భాస్కరన్ తన bbtrackermanix ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయం ప్రకటించారు. దీంతో టీవీకే వర్గాలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. రాజకీయ పార్టీలు, మీడియా మధ్య ఉన్న అనుబంధం దేశంలో.. తమిళనాడులో కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా రాజకీయాలు, మీడియా రంగం పరస్పరం ప్రభావితం చేసుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీలు మీడియా వేదికలను వినియోగించుకోవడం సాధారణంగా మారిపోయింది.తమిళనాడులో అధికార డీఎంకేకు మద్దతుగా భావించే మీడియా సంస్థల్లో ప్రముఖంగా సన్ టీవీ గ్రూప్ పేరు వినిపిస్తుంది. డీఎంకే తొలి కుటుంబంతో సన్ గ్రూప్‌కు ఉన్న సాన్నిహిత్యం బహిరంగ రహస్యమే. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు అనుబంధంగా జయ టీవీ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. పార్టీ కార్యక్రమాలు, నాయకత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ ఛానెల్ కీలక పాత్ర పోషించింది. అలాగే విజయ్‌కాంత్ పార్టీ కోసం కెప్టెన్ అనే ఓ చానెల్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతెందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (AMMK) నేత టీవీవీ దినకరన్‌కు అనుకూలంగా జయా న్యూస్, ఇతర మీడియా వేదికలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అధికారాన్ని అందుకున్న విజయ్ ఇప్పుడు మీడియా రంగంలో కూడా తన ముద్ర వేయాలనుకుంటున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ విధానాలు, రాజకీయ సందేశాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘వెట్రి న్యూస్’ వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఛానెల్ పూర్తిస్థాయి వార్తా సంస్థగా పనిచేస్తుందా? లేదంటే పార్టీ అనుకూల వేదికగా నిలుస్తుందా? అన్నది ప్రారంభం తర్వాతే స్పష్టత రానుంది. వెట్రి న్యూస్ చానెల్ యాజమాని ఎవరు?.. దాని వెనుక ఏ సంస్థ అయినా స్పాన్సర్షిప్ ఉండనుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. విజయ్‌కు అత్యంత ఆప్తుడైన ఓ వ్యాపారవేత్త ఈ చానెల్‌ను టేకప్ చేస్తారని.. డీఎంకే హయాంలో వివాదాస్పదుడిగా పేరుగాంచిన ఓ ప్రముఖ న్యూస్ యాంకర్ ఆ చానెల్‌ను హ్యాండిల్ చేయబోతున్నారని ప్రచారం మాత్రం జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే శాటిలైట్, డిజిటల్ విభాగాల కోసం జర్నలిస్టులు, వీడియోగ్రాఫర్లు, జిల్లా రిపోర్టర్లు, న్యూస్ ఎడిటర్లు తదితర పోస్టులకు నియామక ప్రకటనలు కూడా వెలువడటం చర్చనీయాంశంగా మారింది. ఇటు ఛానెల్ ప్రారంభంపై తమిళగ వెట్రి కళగం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. -
విజయ్ ఫొటో కోసం.. కుర్చీ ఖాళీ!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రజాదరణ ఇప్పుడు కేవలం రాజకీయ సభలకే పరిమితం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాల్లోనూ ఆయన ఫొటోలు ప్రధాన చర్చగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ చిత్రపటాన్ని అన్ని కార్యాలయాల్లో ఉంచి తీరాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే.. తిరునెల్వేలిలో చివరకు మేయర్ ‘కుర్చీ’నే ఖాళీ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు అక్కడ జరిగిందంటే.. తిరునెల్వేలి కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మేయర్ జి. రామకృష్ణన్ కార్యాలయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ ఫొటో ఏర్పాటు చేశారు. అయితే దానిని గదిలో మధ్యభాగంలో, మేయర్ కుర్చీకి నేరుగా పైన ఉంచాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తలు కోరినట్లు సమాచారం. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రామకృష్ణన్.. తన నిరసనను మరోలా వ్యక్తం చేశారు. ఆయన తన కుర్చీలో కూర్చోకుండా పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని కార్యాలయ పనులు నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని.. నిరసన తెలిపేందుకే తాను ఇలా చేస్తున్నానని అన్నారాయన. రెండు వారాల క్రితం కార్పొరేషన్ కార్యాలయంలోని అన్ని గదుల్లో విజయ్ ఫొటోలను ఏర్పాటు చేయాలని కోరగా అంగీకరించామని, ఇప్పుడు తన కుర్చీ పైనే ఫొటో ఉండాలని పట్టుబడటం అనవసర వివాదాలకు దారితీస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజా సేవలకు ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు.అసలు వివాదం రెండు వారాల క్రితమే మొదలైంది. అప్పట్లో కూడా మేయర్ రామకృష్ణన్ నిరసనగా తన టేబుల్‌పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఫొటోను ఉంచి సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఇదే తరహా వివాదం కోయంబత్తూరులోనూ చోటుచేసుకుంది. అక్కడ మేయర్ ఆర్. రంగనాయకి తొలుత తనకు కేటాయించిన గదిలో విజయ్ ఫొటో పెట్టడాన్ని వ్యతిరేకించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో చివరకు అంగీకరించారు. అయినప్పటికీ స్టాలిన్ ఫొటోను తొలగించేందుకు మాత్రం నిరాకరించారు.కరూర్‌లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరింది. విజయ్ ఫొటో పక్కనే స్టాలిన్ ఫొటోను కూడా ఉంచాలని డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి అన్నాడీఎంకే, కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ నేతల ఫొటోలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో సమావేశం రాజకీయ వాగ్వాదాలకు వేదికగా మారింది.కూనూర్‌లో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విజయ్ ఫొటోతో పాటు స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి చిత్రాలను ఉంచగా, టీవీకే కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆ ఫొటోలను తొలగించడంతో వివాదం చెలరేగింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద మోహరించాల్సి వచ్చింది.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం ఫొటోల వివాదం మాత్రమే కాదు. స్థానిక సంస్థల్లో టీవీకే ఎమ్మెల్యేలు, డీఎంకే లేదంటే ఇతర పార్టీల కౌన్సిలర్ల మధ్య సమన్వయ లోపానికి ఇది ప్రతిబింబంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ఆధిపత్య పోరు మరింత తీవ్రమవుతోందని వారు భావిస్తున్నారు. అయితే ఈ రాజకీయ పోరులో ప్రజా సమస్యలు పక్కన పడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Polimer News (@polimernews) VIDEO Credits: polimernews -
ఇదేం జెలసీ లోకేశ్?
చారాణ కోడికి.. బారాణా మసాలా!. కానీ, ఏపీలో ఏ కోడి కోయకుండానే చంద్రబాబు సర్కార్ మసాలా నూరుతోంది. లేని అభివృద్ధిని ఉన్నట్లుగా చూపించేందుకు డిజిటల్ ప్రమోషన్ల పేరిట కోట్లు కుమ్మరిస్తోంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రంలో యువ ఐటీ మంత్రి.. అందునా ఫస్ట్ టైం మహిళా ఎమ్మెల్యే.. అతితక్కువ ఖర్చుతో పెట్టుబడుల్ని ఆకర్షించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తేడా సహజంగానే రాజకీయ వర్గాల్లో పెద్ద డిబేట్‌కు దారితీసింది..విజయ్ కేబినెట్లో పరిశ్రమల మంత్రిగా ఉన్న ఎస్. కీర్తన ప్రస్తుతం సోషల్ మీడియా స్టైల్ పాలనతో హాట్ టాపిక్‌గా మారారు. మొన్నటి ఎన్నికల్లో శివకాశిలో నెగ్గిన ఆమె.. కొన్నిచోట్ల తెలుగులో ప్రచారం చేసి అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు పాలనలోనూ అదే జెన్‌జీ మార్క్ చూపిస్తూ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలకు నేరుగా డిజిటల్‌గా రిక్వెస్టులు పంపడం, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్ వాడటం వంటివి తమిళనాడులో కొత్త చర్చకు దారి తీశాయి.దీంతో సహజంగానే కొంతమంది కంపెనీల దృష్టి తమిళనాడు వైపు మళ్లుతోందన్న ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కీర్తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ “రీల్స్ మంత్రిగా పాలన సాగుతోంది” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై ఆమె మాత్రం “అంత తొందరెందుకు?.. వెయిట్ అండ్ సీ ఫర్ రిజల్ట్” అంటూ స్పందిస్తూ తన దారి తాను కొనసాగిస్తున్నారు.ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అక్కడి రాజకీయాల్లో వేలు పెట్టడం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం వివాదానికి మరింత వేడి పెంచాయి. పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని కీర్తనకు ఇచ్చిన సూచన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. ఒకవైపు ఇది సాధారణ సలహాగా కనిపించినా.. మరోవైపు ఈ వ్యాఖ్యల తర్వాత తమిళనాడులో ప్రతిపక్షాలు ఆ అంశాన్ని పట్టుకుని కీర్తనపై విమర్శలు మరింత తీవ్రతరం చేసినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇక ఈ మొత్తం వ్యవహారం వెనుక మరో కోణం కూడా చర్చలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా మారకముందు కీర్తన పొలిటికల్ కన్సల్టెంట్‌గా పలు రాష్ట్రాల ఎన్నికలకు పని చేసిన అనుభవం ఉంది. ఇందులో భాగంగా టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని వినికిడి. విశేషం ఏంటంటే.. ఆ సమయంలోనే ఆమె తెలుగు నేర్చుకోవడంతో పాటు డిజిటల్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్లపై మంచి పట్టు సాధించారట. అయితే వేగంగా పెంచుకుంటున్న డిజిటల్ ఇమేజ్, యువతలో కీర్తనకు లభిస్తున్న ఫాలోయింగ్ వంటి అంశాలు కొందరు రాజకీయ వర్గాల్లో కంటగింపుగా మారుతున్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యమే లోకేష్ ఎంట్రీకి కారణమైందని చర్చ నడుస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో కీర్తన చేస్తున్న కొత్త తరహా ప్రయోగాలు.. ఏపీలోని సంప్రదాయ ప్రమోషన్ మోడల్‌ను ప్రశ్నిస్తున్నాయన్న భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంతోనే ‘మీ రాష్ట్రం సంగతి మీరు చూస్కోవచ్చు కదా!’ అంటూ కొందరు తమిళులు లోకేశ్‌ను నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్‌తో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒకవైపు కీర్తన ప్రయత్నం చేస్తుంటే.. ప్రజాధనాన్ని అభివృద్ధి కంటే ఇమేజ్ బిల్డింగ్‌కు అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది కూటమి ప్రభుత్వం. కీర్తన నేపథ్యానికి తోడు.. వాడుతున్న డిజిటల్ కమ్యూనికేషన్ స్టైల్, యువతలో ఆమెకు పెరుగుతున్న ఫాలోయింగ్ కూడా లోకేష్ వర్గానికి అసౌకర్యంగా మారిందన్న చర్చ ఉంది. దీంతో ఈ మొత్తం వ్యవహారం పాలసీ డిబేట్ కంటే వ్యక్తిగత రాజకీయ ఈర్ష్యగా మారిందన్న వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి. వెరసి ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు ‘జెలసీ పాలిటిక్స్’ చర్చగా మారింది. -
బీజేపీని ఎదుర్కొనే ధైర్యం విజయ్‌కు లేదా?
తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ సీటు సరికొత్త హీటు పుట్టిస్తోంది. పార్టీ పుట్టి, అధికారంలోకి వచ్చాక తమ తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించింది విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే పార్టీ. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారం వెనుక కృతజ్ఞత కాదని.. రాజకీయ లెక్కలు ఉన్నాయని అంటోంది. ఆ విమర్శలు ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.తమిళగ వెట్రి కళగం (TVK) తన తొలి రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించడంపై అధికార డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి విజయ్ ఉద్దేశపూర్వకంగానే తన పార్టీ నేతలను రాజ్యసభకు పంపకుండా కాంగ్రెస్‌కు సీటు ఇచ్చారని ఆరోపించింది. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఈ పని చేశారని ఎద్దేవా చేసింది. డీఎంకే అధికార ప్రతినిధి శ్రవణన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాజ్యసభకు వెళ్తే ప్రతి జాతీయ అంశంపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా నేరుగా పోరాడాల్సి ఉంటుంది. అందుకే టీవీకే నుంచి ఎవరినీ రాజ్యసభకు పంపలేదు" అని విమర్శించారు. విజయ్ బీజేపీపై తన అసలు రాజకీయ వైఖరిని బయటపెట్టేందుకు సిద్ధంగా లేరని.. పార్లమెంట్ వేదికపై బీజేపీని నేరుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని భావించే ఆ బాధ్యతను కాంగ్రెస్‌పైకి నెట్టేశారని డీఎంకే ఆరోపిస్తోంది.If you go to Rajya Sabha you’ll have to take a stand on every issue. More importantly you have to oppose BJP directly. That’s the only reason no member from TVK was sent to Rajya Sabha. Let’s not forget that Mr. Vijay did not even meet the Congress leaders, Mrs. Sonia Gandhi,… pic.twitter.com/qZZnS7jGAM— Saravanan Annadurai (@saravofcl) June 3, 2026ఇదిలా ఉండగా.. తన తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించడం ద్వారా రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరింత బలపరిచినట్లు టీవీకే చెబుతోంది. మరీ ముఖ్యంగా ఇరు పార్టీల సంబంధాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా జరిగిన మంతనాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడినే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే డీఎంకే ఈ నిర్ణయాన్ని రాజకీయ వ్యూహంగా కాకుండా.. విజయ్ రాజకీయ సంకోచంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో తాము ముందుంటే, టీవీకే మాత్రం స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా ముందుకెళ్తోందని డీఎంకే వాదిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అసలు చర్చ రాజ్యసభ సీటు గురించి కాదు.. విజయ్ నిజంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కట్టుబడి ఉన్నారా? లేదంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలనుకుంటున్నారా? అన్నదే డీఎంకే లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఇచ్చిన ఒక రాజ్యసభ సీటు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద సిద్ధాంతపరమైన చర్చకు దారి తీసింది. డీఎంకే విమర్శలకు టీవీకే ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
అలా చేయకపోతే.. అదే జరిగేది: ఎంకే స్టాలిన్
చెన్నై: తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించేందుకే తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ పార్టీ కూటమి భాగస్వాములను తానే అనుమతించినట్లు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. శనివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు మిత్రపక్షాలు తనకు తెలిపినప్పుడు తాను అభ్యంతరం చెప్పలేదన్నారు.'మీరు వెళ్ళవచ్చు. అది మీ ఇష్టం, మీ ప్రజాస్వామ్య హక్కు. నేను మిమ్మల్ని ఆపను' అని చెప్పాను. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే నేను వారికి అభ్యంతరం చెప్పలేదని.. ఎందుకంటే రాష్ట్రపతి పాలన వస్తే అది తమిళనాడులో బీజేపీ పాలనకు దారి తీసే అవకాశం ఉందంటూ ఆయన పేర్కొన్నారు.గతంలో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న పార్టీల మద్దతుపైనే ప్రస్తుత (టీవీకే) ప్రభుత్వం ఆధారపడి నడుస్తోందని ఆయన అన్నారు. డీఎంకే అధికారంలోకి రావాలని నమ్మి, మా కూటమిలో భాగమైన పార్టీల మద్దతు వల్లే ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తోంది. టీవీకేకు మద్దతు ఇచ్చే ముందు తాము స్టాలిన్‌కు సమాచారం అందించినట్లు కూటమి పార్టీల నాయకులు బహిరంగంగానే అంగీకరించారు’’ అంటూ స్టాలిన్ చెప్పుకొచ్చారు.అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమిపై స్టాలిన్ స్పందిస్తూ... ఎన్నికల ఓటములు పార్టీని నిరుత్సాహపరచలేన్నారు. గెలుపోటములు సహజం. విజయాలు వచ్చినప్పుడు మనం తలబిరుసుగా ప్రవర్తించం.. అలాగని ఓటమికి నిరాశ పడిపోము. మనకు విజయావకాశాలు లభించకపోయినా.. అధికారంలో లేకపోయినా... ప్రతిపక్ష పాత్రలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం’’ అని స్టాలిన్ పేర్కొన్నారు. -
సస్పెన్స్‌కు తెర.. బీజేపీకి అన్నామలై గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత, రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావశీల నాయకుడిగా పేరున్న అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించినట్లు సమాచారం.పార్టీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో అన్నామలై రాజీనామా చేయబోతున్నారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో హైకమాండ్ ఆయన్ని ఢిల్లీకి పిలిపించుకుని భేటీలు జరిపింది. అయితే ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. అంతర్గతంగా జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఆయన రాజీనామాను ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది.బిజెపి సభ్యత్వానికి అన్నామలై చేసిన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించారని.. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. కే అన్నామలై.. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్నేళ్లలో వేగంగా ఎదిగిన యువ నాయకుల్లో ఒకరు. 1984 జూన్ 4న జన్మించిన ఆయన.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్‌లో ర్యాంక్ కొట్టారు. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా కర్ణాటకలో విధులు నిర్వహించారు. కఠినమైన, నిష్పాక్షిక అధికారిగా గుర్తింపు పొందిన ఆయన, కొంతకాలానికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.అలా మొదలైంది.. 2020 ఆగస్టులో బీజేపీలో చేరడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచింది. పార్టీలో చేరిన తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. యువతను ఆకర్షించే ప్రసంగాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో తమిళనాడులో బీజేపీకి కొత్త ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారాయన. అయితే ఆ ఫలితంతో సంబంధం లేకుండా.. అదే ఏడాది ఆయనను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టి, డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. నొచ్చుకుని..రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ స్థిరమైన పట్టు సాధించడంలో సవాళ్లు ఎదురయ్యాయి. ఆపై లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడారాయన. అయినప్పటికీ ఆయన వ్యక్తిగత ఇమేజ్, దూకుడు నాయకత్వం తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అన్నామలై.. గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే పొత్తును ఆయన వద్దన్నారని.. ఆ ఎఫెక్ట్‌తోనే(పళనిస్వామి ఒత్తిడితోనే) ఆయన్ని బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తప్పించారని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోగా.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన క్రియాశీలకంగా కనిపించలేదు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత ఆయన బీజేపీని వీడబోతున్నారని ప్రచారం మొదలైంది. అయితే ఆ వార్తలను తమిళనాడు బీజేపీ యూనిట్ తోసిపుచ్చుతూ వచ్చింది. మరోవైపు.. అన్నామలైని వదులుకోకూడదని మంచిది కాదని ఆరెస్సెస్ బీజేపీకి సూచిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు ఆయనతో చర్చించారు. అయితే ఆ చర్చలు విఫలం కావడంతో తాజాగా ఆయన రాజీనామాను ఆమోదించింది.ఇక అన్నామలై తదుపరి అడుగు ఏమిటన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఆయన త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని అంచనా. మొత్తంగా, అన్నామలై రాజీనామాతో తమిళనాడు బీజేపీకి పెద్ద దెబ్బ తగిలినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
రాజీనామా రచ్చ అంతా ఉత్తదేనా?
తమిళనాడు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ‘అన్నామలై రాజీనామా’ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. బీజేపీని వీడబోతున్నారన్న ఊహాగానాల మధ్య ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారాయన. అయితే ఆయన తన రాజీనామా లేఖ అందించారనే ప్రచారం జోరుగా జరుగుతుండగా.. అసలు అలాంటి చర్చే జరగలేదన్న సమాచారం బయటకు వచ్చింది. దీంతో అసలు అన్నామలై వ్యూహం ఏమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది. ఆయన ఢిల్లీలో మకాం వేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో భేటీ కావడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. తన అసంతృప్తిని నేరుగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సమావేశాల్లో రాజీనామా అంశం ప్రస్తావనకే రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బదులుగా తమిళనాడులో పార్టీ పరిస్థితి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఏఐఏడీఎంకేతో పొత్తు ప్రభావం వంటి అంశాలపై అన్నామలై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారన్నది ఉత్త ప్రచారంగా తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని అన్నామలై ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఏఐఏడీఎంకేతో పొత్తు పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతోందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావడం కూడా ఆయన అసంతృప్తికి కారణమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అంతేకాదు, రాష్ట్ర బీజేపీ నేతలు, మిత్రపక్ష నేతల్లో కొందరి వైఖరిపైనా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తామని, రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ను కూడా ఢిల్లీకి పిలిపించినట్లు వార్తలు వచ్చాయి. రేపు అన్నామలై చెన్నైకి వస్తారని ఆయన అనుచర గణం చెబుతోంది. దీంతో ఆయన స్పందిస్తేనే.. ఈ ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, అన్నామలై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అది బీజేపీకి అనుబంధంగా ఉంటుందా? లేదంటే కొత్తగా పార్టీ పెట్టడం, లేదంటే పార్టీ కంటే ముందుగా ఒక సామాజిక-ప్రజా వేదికను నిర్మించడంపై ఉంటుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. యువతతో పాటు వివిధ వర్గాల వారిని కలుపుకోవాలన్న వ్యూహంపై ఆయన దృష్టి పెట్టినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు, ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ తిరస్కరించారన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో అన్నామలై ఆలోచనలు కేవలం పదవుల చుట్టూ కాకుండా, భవిష్యత్ రాజకీయ ప్రణాళికల వైపు సాగుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
విజయ్‌కు గట్టి పోటీ! అతడి ఎంట్రీతో సంచలనం తప్పదా?
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. బీజేపీకి అన్నామలై గుడ్‌బై చెప్పారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలో ఉండగా, డీఎంకే–అన్నాడీఎంకే వంటి సంప్రదాయ పార్టీలు ప్రతిపక్ష పాత్రలో కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.డీఎంకే–అన్నాడీఎంకే మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విముఖ రాజకీయ పోరాటానికి ఇప్పుడు కొత్త శక్తులు సవాల్‌గా నిలుస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ఇందులో ముఖ్యంగా సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీఎం విజయ్ నాయకత్వం ఒకవైపు చర్చనీయాంశంగా ఉండగా, మరోవైపు బీజేపీలో తనదైన ముద్ర వేసుకున్న అన్నామలై పేరు మరింత బలంగా వినిపిస్తోంది.అన్నామలై బీజేపీని వీడుతున్నారన్న వార్తలను కేవలం సంస్థాగత మార్పుగా మాత్రమే చూడలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు ఉన్న దూకుడు రాజకీయ శైలి, యువతలో ఉన్న క్రేజ్, ప్రత్యక్ష విమర్శల ధోరణి ఆయనను తమిళ రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముఖంగా నిలబెట్టాయి. ఎన్నికల్లో పెద్ద విజయాలు సాధించకపోయినా, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆకర్షణను పూర్తిగా తక్కువ అంచనా వేయలేమన్న చర్చ సాగుతోంది. అందుకే బీజేపీ ఆయన్ని నిలువరించే ప్రయత్నాలు చేస్తోంది.ఇక సీఎం విజయ్ విషయానికి వస్తే.. కొత్త ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆయన రాజకీయ ప్రయాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని విశ్లేషణలు ఉన్నాయి. పార్టీ నిర్మాణ బలం, అనుభవం వంటి అంశాల్లో ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లోటును ప్రత్యర్థులు ఎలా ఉపయోగించుకుంటారన్నదే భవిష్యత్ రాజకీయ సమీకరణాన్ని నిర్ణయించనుంది.ఈ నేపథ్యంలో అన్నామలై పాత్రపై చర్చ మరింత కీలకంగా మారింది. ఆయన బీజేపీలోనే కొనసాగి పార్టీని బలోపేతం చేస్తారా? లేక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగి సీఎం విజయ్ టీవీకేకు, డీఎంకే–అన్నాడీఎంకే కూటములకు ప్రత్యక్ష సవాల్‌గా మారతారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల విజయాలకంటే కూడా ఆయనకు ఉన్న ఇమేజ్, యువతలో ప్రభావం ఆయనను ఒక “పొలిటికల్ ఫోర్స్”గా చూస్తున్న వాదన బలపడుతోంది.ప్రస్తుత పరిస్థితుల్లో “సీఎం విజయ్ ప్రభుత్వానికి ప్రధాన రాజకీయ సవాలుగా ఎవరు ఎదుగుతారు?” అనే ప్రశ్నే తమిళనాట కీలకంగా మారింది. ఈ కోణంలో చూస్తే అన్నామలై ప్రవేశం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి తమిళ రాజకీయాలు మరో కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. ఒకవైపు సీఎం విజయ్ కొత్త ప్రభుత్వం, మరోవైపు డీఎంకే–అన్నాడీఎంకే సంప్రదాయ ప్రతిపక్ష బలాలు, మధ్యలో అన్నామలై వంటి కొత్త ముఖం రాజకీయ సమీకరణాన్ని మరింత ఉత్కంఠగా మార్చుతోంది. రాబోయే రోజుల్లో తమిళనాట అసలైన ప్రతిపక్ష శక్తి ఎవరు అన్నదానికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మక్కల్ శక్తి ఇయక్కం పేరుతో అన్నామలై కొత్త ఉద్యమం?
-
అసలు కారణం చెప్పేసిన అన్నామలై!
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం మరింత బలపడుతోంది. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో ఆయన భేటీ కావడం.. ఆ భేటీ సారాంశం బయటకు రావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.ఇకపై తాను సొంత రాజకీయ మార్గంలో ముందుకు సాగాలనుకుంటున్నట్లు అన్నామలై పార్టీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీతో స్నేహపూర్వకంగానే విడిపోవాలని కోరుకున్నప్పటికీ, ఆయనను బీజేపీలోనే కొనసాగించాలని అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నామలై మాత్రం తన నిర్ణయంపై దృఢంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ప్రస్తుతం బీజేపీలో భవిష్యత్తు కనిపించడం లేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన అధిష్టానం ఇచ్చిన పలు ఆఫర్లను తిరస్కరించినట్లు సమాచారం. మొదట ఒక సామాజిక-రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమాన భావజాలం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన వాలంటీర్ నెట్‌వర్క్‌ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘వీ ది లీడర్స్’ సంస్థే భవిష్యత్ రాజకీయ ప్రాజెక్టుకు పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత జరగబోయే ఉపఎన్నికల్లోనే అన్నామలై తన రాజకీయ బలాన్ని పరీక్షించుకునే అవకాశం ఉందని తమిళనాట జోరుగా చర్చ మొదలైంది. ముఖ్యంగా.. తమిళగ వెట్రి కగళం అధినేత, సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చిలోనే అన్నామలై పోటీ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ.. తిరుచ్చిలో వీలు కాకుంటే అన్నాడీఎంకే నుంచి టీవీకేలో చేరిన ఎమ్మెల్యేల ప్లేస్‌లో ఉప ఎన్నికలు గనుక వస్తే.. ఏదో ఒక స్థానం నుంచి కూడా పోటీ చేయొచ్చని చర్చించుకుంటున్నారు.అన్నామలై నిష్క్రమణకు ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకోవడం కూడా ఈ పరిణామాలకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అన్నామలై దూకుడు ప్రచారాలు, పాదయాత్రలు, సోషల్ మీడియా వ్యూహాలతో బీజేపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. తమిళనాడులో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపారు.అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని అన్నామలై భావించారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ పొత్తు నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో మార్పులు కోరడంతో అన్నామలై అధ్యక్ష పదవి కోల్పోయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ విషయంలోనే ఆయన డీప్‌గా హర్టయినట్లు అధిష్టానానికి ఇచ్చిన తాజా వివరణతో స్పష్టమవుతోంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయకపోవడం, ప్రచారంలోనూ పెద్దగా కనిపించకపోవడం ఆయనను పార్టీ పక్కన పెట్టిందనే ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. బీజేపీకి గుడ్‌బై చెప్పి అన్నామలై తన దారి తాను చూసుకుంటారా? లేదంటే బుజ్జిగింపులకు లొంగిపోయి ఏదైనా ట్విస్ట్ ఇస్తూ బీజేపీతోనే కొనసాగుతారా?? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెర పడనుంది. -
అన్నామలైకి మైనస్సే! తమిళనాడులో కొత్త పార్టీ..?
-
తమిళ రాజకీయాల్లో కొత్త స్క్రిప్ట్.. అన్నామలైకి మైనస్సే!
తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ కలకలం నడుస్తోంది. బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలైపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని.. వరుస అవమానాల నేపథ్యంలో అనుచరుల నుంచి ఆయనపై ఒత్తిళ్లు పెరిగాయని.. అందుకే పార్టీకి గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఆ ప్రచార సారాంశం. అయితే ఈ వ్యవహారంలో రాజకీయ వాతావరణం వేడెక్కించింది మాత్రం.. ఇందులోకి సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరు వచ్చి చేరడం.మాజీ ఐపీఎస్ అయిన అన్నామలైకి తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంది. అలా ఆయనకు ప్రత్యేకంగా అనుచర గణం ఏర్పడింది. ఇక డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ చీఫ్‌గా ఓ మినీ యుద్ధమే చేశారు. ఈ విషయంలో అప్పటి ప్రతిపక్షం అన్నాడీఎంకే కంటే ఆయన బెటర్ అవుట్‌పుట్ కనబరిచారు. అయితే.. బీజేపీ ఆ క్రేజ్‌ను సరిగ్గా వాడుకోలేదనే చర్చ నడుస్తుంటుంది అక్కడ.ఎన్నికల ముందు పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించడం, అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా మొండి చేయి, ఎన్నికల ప్రచారంలోనూ ప్రాధాన్యత తగ్గించడం లాంటి పరిణామాలు ఆయన అనుచరుల్లో తీవ్ర అసహనం పెంచింది. ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు తగ్గిపోవడంతో కొత్త పార్టీ ప్రతిపాదన తెర మీదకు వచ్చిందని తెలుస్తోంది. ఈ పరిణామాల తర్వాత సోషల్ మీడియాలో “అన్నామలై కొత్త పార్టీ పెడతారా?” అన్న చర్చ వేగంగా పెరిగింది. దీనికి కారణాలుగా నెటిజన్లు చూపుతున్న అంశాలు ఇవి:యువ నాయకుడిగా ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్బీజేపీ రాష్ట్ర నాయకత్వ మార్పుల తర్వాత వచ్చిన అనిశ్చితిసాంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన మాట్లాడే శైలి.. ఇవన్నీ కలిపి “తమిళనాడులో కొత్త రాజకీయ శక్తి” అనే ఊహాగానాలకు బలం ఇచ్చాయి.మరోవైపు.. అన్నామలైకి రాజ్యసభ సీటు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించారనే ప్రచారం ఈ మధ్యే వినిపించింది. అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ భావించిందని.. ఆ ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారని.. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి లేదంటే తన పార్టీకి ఆర్థికంగా ఉపయోగపడే వ్యక్తికే ఇవ్వాలనే యోచనలో ఆయన ఉన్నారనన్నది ఆ ప్రచార సారాంశం. ఈలోపు..మరో ప్రచారం తోడైంది. సీనియర్ నటుడు రజినీకాంత్ ఆశీర్వాదంతోనే అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నారని సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తులపై చర్చ వచ్చిన ప్రతిసారీ రజినీకాంత్ పేరు సహజంగానే తెరపైకి వస్తుంది. ఆయనకు ఉన్న విస్తృతమైన ఫ్యాన్ బేస్ అందుకు ప్రధాన కారణం. అలా అన్నామలై కొత్త పార్టీకి రజినీ సపోర్ట్ అంటూ జోరుగా పోస్టర్లతో ప్రచారం నడుస్తోంది. రజినీకాంత్ కర్ణాటక మూలాలు కలిగి ఉండటం, అలాగే అన్నామలై ఐపీఎస్ అధికారిగా కర్ణాటకలో పనిచేయడం వల్ల ఇద్దరి మధ్య “ కర్ణాటక కనెక్షన్” ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే..అన్నామలై చుట్టూ నడుస్తున్న చర్చకు ఒక సమాంతర వాదన కూడా బలంగా వినిపిస్తోంది. రజినీకాంత్ రాజకీయ ప్రయాణం స్వయంగా ఒక “అన్ఫినిష్డ్ చాప్టర్”గా మిగిలిపోయిందని.. కాబట్టి అనన్నామలైకు ఆ అవసరమే లేదన్నది ఆ వాదన. రజినీకాంత్ 2017–2021 మధ్య రాజకీయ ప్రవేశానికి గట్టి సంకేతాలు ఇచ్చినా, చివరికి పార్టీ ప్రారంభించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలోనే ఆయన ఆరోగ్యం, రాజకీయ ఒత్తిళ్లు, సంస్థాగత బలం లేకపోవడం వంటి కారణాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ కొందరు విశ్లేషకులు—“పొలిటికల్ స్పేస్‌లో రజినీకాంత్ ఒక ‘మిస్డ్ ఛాన్స్’ మాత్రమే” అని వ్యాఖ్యానిస్తారు.ఇక మరో అంశం సోషల్ మీడియాలో తరచుగా చర్చకు వస్తోంది. రజినీకాంత్ ఇటీవల కొన్ని రాజకీయ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా అధికార పార్టీలపై ఆయన నేరుగా ఎలాంటి స్పష్టమైన విమర్శలు చేయకపోవడం, ఆయనను “పాసివ్ స్టాండ్”లో ఉన్న నేతగా చూపిస్తోందని ఒక వాదన ఉంది. కొంతమంది అయితే ఆయన స్టాలిన్‌ను కలిసిన సందర్భాలను ప్రస్తావిస్తూ, ఆయన డీఎంకేకు సానుకూలంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో విజయ్ రాజకీయంగా ఎదుగుతున్న సందర్భంలో.. ఆయన విజయాన్ని రజినీకాంత్ బహిరంగంగా అభినందించలేదన్న అంశాన్ని కూడా కొందరు ఉదాహరణగా చూపుతున్నారు. దీనిపై వచ్చిన వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి. “నాకేం అసూయ లేదు” అని ఇచ్చిన స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీశాయి. దీనిని ఆధారంగా చేసుకుని, రజినీ ఇప్పుడు “యాక్టివ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్” కలిగిన వ్యక్తి కాదన్న అభిప్రాయం మరింత బలపడుతోంది.ఈ నేపథ్యంతోనే అన్నామలై వంటి యువ నాయకుడికి రజినీ మద్దతు అవసరం లేదని. కారణం, ఆయనకు ఇప్పటికే ఉన్నది ఒక వేరే పొలిటికల్ ఐడెంటిటీ. ఐపీఎస్ నేపథ్యం, బీజేపీలో ఎదిగిన సంస్థాగత అనుభవం, సోషల్ మీడియాలో ఉన్న యువ ఫాలోయింగ్.. ఇవే ఆయనకు ప్రధాన బలం అని ఈ వర్గం భావిస్తోంది. -
ఢిల్లీలో అన్నామలై.. రెండు రోజుల్లో జరిగేది ఇదేనా?
బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండురోజుల్లో అన్ని చెబుతానని, కూర్చుని మాట్లాడుకుందామని విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆయన మద్దతుదారులు పోస్టర్లను హోరెత్తిస్తున్నారు.ఈ పరిస్థితులలో చెన్నై నుంచి ఢిల్లీకి ఆయన బయలుదేరి వెళ్లారు. సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆయన బీజేపీ జెండా లేని కారులో రావడం చర్చకు దారి తీసింది. ఆయన్ని మీడియా ప్రతినిధులు చుట్టు ముట్టి ప్రశ్నలను సంధించగా, అన్నింటికి రెండురోజులలో సమాధానం చెబుతానని, కూర్చుని మాట్లాడుకుందామని, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటూ ముందుకెళ్లారు. కాగా, ఢిల్లీ వెళ్లిన అన్నామలై మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.కాగా, కె.అన్నామలై త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు సోమవారం తమిళనాట వార్తలు షికార్లు చేశాయి. వీటిపై ఆయన స్పందించలేదు. కానీ సోమవారం హడావుడిగా ఢిల్లీకి వెళ్లి పార్టీ చీఫ్ నితిన్ నబిన్‌తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. ఢిల్లీకి వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న అన్నామలైను మీడియా పలకరించింది. ‘‘రెండ్రోజుల్లో మనందరం కూర్చుని మాట్లాడుకుందాం. నా తదుపరి కార్యాచరణను మీకు తెలియజేస్తా’’అని చెప్పి వెళ్లిపోయారు.త్వరలో ఆయన సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వార్తలొచ్చాయి. బీజేపీలో తనకిక భవిష్యత్ లేదు అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్ ప్రభంజనం ధాటికి ప్రధాన ద్రవిడ పార్టీలు చెల్లాచెదురుకాగా బీజేపీ కేవలం ఒకే ఒక్క చోట విజయబావుటా ఎగరేసింది.జూన్ నాలుగోతేదీన అన్నామలై పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో అదేరోజున ఆయన తన రాజకీయ భవిష్యత్ నిర్ణయాలను వెలువరించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. 41 ఏళ్ల అన్నామలై 2011 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి. బెంగళూరు సౌత్ డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా బదిలీచేసిన కాలంలో 2019లో హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామాచేసి తమిళనాడులో రాజకీయాల్లో చేరారు. తమిళనాడు బీజేపీ చీఫ్‌గా ఉంటూ మంచి పేరు సంపాదించారు. -
నన్ను గెలవలేవ్ అన్నారు సీఎంగా మీ ముందుకొచ్చా
-
విజయ్ సతీమణి బీజేపీలోకి?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ జోరందుకున్నట్లు తెలుస్తోంది. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితం ఆ చర్చల కేంద్రంగా మారింది. ఆయన సతీమణి సంగీత సోర్నలింగంకు బీజేపీ ఆహ్వానం పలికిందని.. అతిత్వరలో ఆమె ఆ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారమే అందుకు కారణం. చెన్నై రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.ఎన్నికలకు ముందు విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ అనేక ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. తన భర్తకు ఓ ప్రముఖ నటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంగీత ఆరోపించడం.. అదే సమయంలో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం సంచలన చర్చకు దారి తీసింది. అయితే ఈ విషయాలపై విజయ్ కుటుంబం ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. మరోవైపు, విజయ్ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారాన్ని కొందరు నడిపించారన్న వాదనలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి.ఆ తర్వాత సంగీత విజయ్ను భారీగా భరణం కోరారని.. మనస్పర్థల నేపథ్యంలోనే పిల్లలతో భర్తకు దూరంగా ఉంటున్నారనే కథనాలు తమిళ మీడియాలో తరచూ కనిపించాయి. అభిమానుల తలనొప్పి లేకుండా చెన్నైలో కాకుండా విదేశాల్లోనే గడుపుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో కుటుంబ విభేదాల ప్రభావం ఎన్నికలపై పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వ్యక్తిగత వివాదాల కంటే రాజకీయ మార్పుకే ప్రజలు ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ సంగీత, పిల్లలు కనిపించకపోవడం మరోసారి చర్చకు దారితీసింది.ఇప్పుడు అదే కుటుంబ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. సంగీత బీజేపీలో చేరే అవకాశాలపై చెన్నై రాజకీయ వర్గాల్లో గుసగుసలు(Gossips) వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన ఓ ప్రముఖ సినీ నటి, జాతీయ స్థాయి నాయకురాలు ఈ చేరిక కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. విజయ్ రాజకీయంగా బలపడుతున్న తరుణంలో ఆయన కుటుంబానికి చెందిన ఎవరైనా ప్రత్యర్థి రాజకీయ శిబిరంలో చేరితే అది సహజంగానే చర్చనీయాంశం అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు, విజయ్ వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయడం లేదంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రచారం ఉండొచ్చని కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా, సంగీత సోర్నలింగం శ్రీలంక తమిళ వ్యాపార కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తి. అనంతరం ఆమె కుటుంబం బ్రిటన్‌కు వలస వెళ్లి లండన్‌లో స్థిరపడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సోర్నలింగం కుమార్తె అయిన సంగీత.. లండన్‌లోనే చదువుకున్నారు. విజయ్‌కు అభిమానిగా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారి, 1999లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు.అయితే గత కొన్నేళ్లుగా సంగీత–విజయ్‌ల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం తమిళనాట తరచూ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎన్నికల సమయంలో విడాకుల పిటిషన్, ఆరోపణల వార్తలు వెలుగులోకి రావడం అభిమానులకు సైతం మింగుడు పడలేదు. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ చేరిక ప్రచారం కూడా అదే కోవకి చెందింది అయ్యి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. విజయ్ను బద్నాం చేసే కుట్రలో ఇదో భాగమని.. అందుకే సంగీత బీజేపీలో చేరతారని రాజకీయ ఊహాగానాలు తెరపైకి వచ్చాయని చెన్నై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
చివరకు మిగిలింది రూ.140 మాత్రమే!
తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం.. ఎన్నికల్లో ఘన విజయం.. ఆయన చుట్టూ ప్రజాదరణ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మళ్లీ కదిలిస్తోంది. యువతలో కనిపిస్తున్న మద్దతు, మార్పు కోరుకునే వాతావరణం నేపథ్యంలో ఒక పాత చరిత్ర మళ్లీ చర్చలోకి వచ్చింది. అదే కామరాజ్ ఓటమి. ఒకప్పుడు అపార ప్రజాదరణ కలిగిన మహానేత కూడా ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న సందర్భమది.. కామరాజ్ జీవితం భారత రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం. చిన్న వయసులోనే విద్యను వదిలేసినా, ఆయన ప్రజల మధ్యే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. గ్రామాలు, ప్రజల అవసరాలు, సమస్యలు.. ఇవే ఆయన పాలనకు మార్గదర్శకాలు అయ్యాయి. మాటల కంటే పనితోనే రాజకీయాన్ని నడిపిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. అలా ఆయనకు “తమిళనాడులోని ప్రతీ గ్రామాన్ని రెండుసార్లు సందర్శించిన నేత” అనే ముద్ర కూడా ఉంది. 1953–64 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన తమిళనాడులో విద్యా విప్లవానికి బాటలు వేశారు. వేల సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయడం, పేదలకు ఉచిత విద్యను విస్తరించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం వంటి నిర్ణయాలు రాష్ట్ర సామాజిక రూపురేఖలను మార్చేశాయి. గ్రామీణ విద్యుతీకరణ, సాగునీటి ప్రాజెక్టులు, రవాణా అభివృద్ధి.. ఇవన్నీ ఆయన పాలనలో వేగంగా విస్తరించాయి. రాజకీయంగా కాకుండా పాలనాపరంగా ఆయనను “బిల్డర్ ఆఫ్ తమిళనాడు”గా చూస్తారు.అయితే ఇదే ప్రజాదరణ ఆయనకు రాజకీయ రక్షణ ఇవ్వలేదు. ద్రావిడ రాజకీయాల ఉధృతి, ఐడెంటిటీ పాలిటిక్స్, సినిమా ప్రభావం వంటి అంశాలను ఆయన తక్కువ అంచనా వేశారని విశ్లేషకులు చెబుతారు. డీఎంకే ఎదుగుదలతో పాటు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చివరికి 1967లో తన సొంత ప్రాంతంలోనే ఆయన ఓటమిని ఎదుర్కొన్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేతే ప్రజల తీర్పుతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీని ప్రధానిగా నిలబెట్టడంలో ఆయన పాత్ర కీలకమైంది. కానీ కాలక్రమేణా కాంగ్రెస్‌లోనే అంతర్గత మార్పులు, ఇందిరాగాంధీ కొత్త రాజకీయ శైలి, జనాకర్షణ రాజకీయాలు ఆయన ప్రభావాన్ని తగ్గించాయి. చివరికి ఆయన రాజకీయ ప్రయాణం ఒక “మౌన ముగింపు”కు చేరింది.అయితే ఆయన మరణానంతరం ఆయన జీవితం మరో కోణంలో వెలుగులోకి వచ్చింది. అత్యంత సరళ జీవితం గడిపిన ఆయన వద్ద కేవలం రూ.140 మాత్రమే మిగిలాయి. అదీ ఆయన పడుకునే దిండులో దొరికాయి. ఖాదీ దుస్తులు, కొన్ని పుస్తకాలు, రెండు జతల చెప్పులు.. ఆయన చివరి గుర్తులుగా మిగిలాయి. కానీ ఆయన నిర్మించిన విద్యా వ్యవస్థ, పాలనా మౌలిక వసతులు మాత్రం ఇప్పటికీ తమిళనాడును నడిపిస్తున్నాయి.ఇప్పుడీ చరిత్ర మళ్లీ ఎందుకు గుర్తొస్తోంది అంటే.. తమిళనాడులో విజయ్ చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చలే కారణం. సినిమా ప్రభావం, యువత ఆకర్షణ, మార్పు.. ఇవి కొత్త రాజకీయ శక్తిగా మారుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డబ్బు ప్రభావం తగ్గి, భావోద్వేగ ఓటింగ్ పెరుగుతోందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు శివకుమార్ (సూర్య, కార్తి తండ్రి) చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు మరింత వేడి తెచ్చాయి. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన భావన ఒకటే.. ప్రజల తీర్పును ఎవరూ శాశ్వతంగా అంచనా వేయలేరు. “కామరాజ్ లాంటి మహానేతనే ప్రజలు ఒకప్పుడు ఓడించారు. ఇది ప్రజాస్వామ్య స్వభావాన్ని చూపించే ఉదాహరణ. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఆ ప్రవాహాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. విజయ్ విజయం నాకు వ్యక్తిగతంగా ఆనందం కలిగిస్తోంది. కానీ చివరికి నిర్ణయం తీసుకునేది ప్రజలే” అని ఆయన పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా, తమిళనాడు రాజకీయాల్లో తరచుగా కనిపించే “నాయకత్వ మార్పుల చక్రాన్ని” మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఒకవైపు కామరాజ్ లాంటి ప్రజా సేవా ప్రతీకలు ఓటమిని ఎదుర్కొన్న చరిత్ర, మరోవైపు కొత్త తరంలో సినీ ప్రభావంతో ఎదుగుతున్న రాజకీయ ఆకర్షణ.. ఈ రెండు విరుద్ధ ధోరణులు ఇప్పుడు ఒకే చర్చలో కలుస్తున్నాయి. ఇక అసలు ప్రశ్న ఏంటంటే.. ప్రజల తీర్పు నిజంగా స్థిరమైన విలువలపై ఆధారపడుతుందా? లేదంటే ప్రతి తరం తన అవసరాలు, భావోద్వేగాలు, ఆశల ప్రకారం కొత్త నాయకులను ఎంచుకుంటుందా? అని. -
తమిళనాడు సీఎం విజయ్ ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ దేశ రాజధానిలో తన తొలి అధికారిక పర్యటనను ముగించుకుని గురువారం చెన్నైకి ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవకుండానే ఆయన పర్యటన ముగిసింది. సోనియా, రాహుల్‌తో విజయ్ సమావేశం రద్దయింది. ముఖ్యమంత్రి తన పర్యటనను కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేసుకున్నారని.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ క్రిస్టోఫర్ తిలక్ చెప్పుకొచ్చారు.అయితే, ప్రచారం జరుగుతున్నట్లుగా విజయ్, రాహుల్ గాంధీల భేటీ రద్దు కాలేదని... కేవలం వాయిదా మాత్రమే పడిందని తిలక్ పేర్కొన్నారు. సీఎం నీతి ఆయోగ్ సమావేశం కోసం జూన్ 11 ప్రాంతంలో మళ్లీ ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు రాహుల్, సోనియా గాంధీలను కలుస్తారని తాను భావిస్తున్నట్లు ఆయన మీడియాతో అన్నారు.కాగా, తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి బుధవారం ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీతో విజయ్‌కి ఇదే తొలి భేటీ కావడం విశేషం. ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం విజయ్ తిరిగి తమిళనాడు భవన్‌కు చేరుకున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిశారు. రాష్ట్ర నిధులపై చర్చించారు.ఈ క్రమంలో జాతీయ ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ విజయ్ సమావేశమవుతారంటూ ప్రచారం జరిగింది. అటు అధికార పక్ష అగ్రనేతలను, ఇటు ఇండియా కూటమి ప్రతిపక్ష నేతలనూ సమానంగా కలుస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. చివరికి సోనియా, రాహుల్‌లతో భేటీ కాకుండానే విజయ్ పర్యటన ముగిసింది. -
పవన్‌పై కోపం చల్లారట్లేదా?
టాలీవుడ్ సీనియర్ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ రాజకీయాల్లో సినిమా హీరోల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో.. ఆ చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత సినీ–రాజకీయ విమర్శలుగా మొదలైన రియాక్షన్లు ఇప్పుడు సెటైర్ వార్‌ను దాటి మరింత భావోద్వేగ దశకు చేరుకున్నాయి.మొదట సోషల్ మీడియాలో ఆగ్రహంగా మొదలైన ప్రతిస్పందనలు ఇప్పుడు క్రమంగా విభిన్న రూపాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో సెటైర్లతో బదులిచ్చిన నెటిజన్లు, ఇప్పుడు తమ అభిమాన హీరో వ్యక్తిత్వం, సినీ ప్రస్థానం, సామాజిక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ మరింత గట్టిగా స్పందిస్తున్నారు.పవన్ ప్రసంగంలో “కటౌట్లు, హాలోగ్రామ్స్ పెట్టుకుని ఈజీగా గెలిచేసి సీఎంలు అయ్యారు” అనే వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో, కొందరు అభిమానులు దాన్ని తమ హీరోలపై వ్యాఖ్యలుగా భావించారు. దీంతో తమిళనాడు సోషల్ మీడియా వేదికలపై “పవన్ సార్… మా దళపతి మీలా కాదు” అనే వాక్యం విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. ఇది నేరుగా విజయ్ అభిమానుల భావోద్వేగ కౌంటర్‌గా మారింది.విజయ్ అభిమానులు ఈ కౌంటర్ ద్వారా ఆయన 25 ఏళ్ల సినీ ప్రస్థానం మాత్రమే కాదు, ప్రజలతో ఏర్పరుచుకున్న అనుబంధాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. “కేవలం హైప్ వల్ల కాదు… నిజమైన ఫ్యాన్ బేస్, గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ వల్లే ఆయన నిలిచారు” అనే వాదనలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం చేయడం, ఫ్యాన్స్ అసోసియేషన్ల ద్వారా విద్యా సామగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాగే తమిళనాడులో వరదలు, తుఫాన్లు వచ్చిన సమయంలో ఆయన ప్రకటించిన విరాళాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న విధానాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.“సినిమాల్లో మాత్రమే హీరో కాదు… అవసరమైన సమయంలో ప్రజలతో నిలబడే వ్యక్తి” అంటూ కొందరు విజయ్ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. మరికొందరు ఆయన వ్యక్తిత్వం, అభిమానులతో మెలిగే తీరు, పబ్లిక్‌లో చూపించే సింప్లిసిటీని ఉదాహరణగా చూపిస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ చర్చ కేవలం సినిమా లేదా రాజకీయ వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, ఇద్దరు నటుల వ్యక్తిత్వాల పోలిక దాకా వెళ్లిన పరిస్థితి వెళ్లింది.#Ilayathalapathy Vijay's helping hand rare old pics! @AllYGirL85 @vijayrambomaxim @Anything4Vj @yok382 @Vicky_VjMsd pic.twitter.com/CgkJS3F0b9— Balaji (@balajiganesan26) August 15, 2016#Vijay has donated relief materials worth Rs 3cr to people affected by Chennai floods #Theri #Ilayathalapathy pic.twitter.com/jCsVZVvIbW— Nandhakumar (@ActorVijayFan1) December 20, 2015మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను వేరే కోణంలో చూస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు కాదని, రాజకీయ అనుభవాలపై చేసిన సరదా వ్యాఖ్యలేనని వారు చెబుతున్నారు. 15 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను హైలైట్ చేయడమే ఉద్దేశమని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. విజయ్ కంటే పవనే తోపు అంటూ విజయ్ అభిమానులతో వాదనకు దిగుతున్నారు. దీంతో.. పవన్ వ్యాఖ్యలపై విజయ్ అభిమానుల కోపం ఇంకా చల్లారడం లేదు. మొత్తానికి పవన్ వ్యాఖ్యలు ఒక సాధారణ రాజకీయ హాస్యంగా మొదలై, ఇప్పుడు తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల మధ్య భావోద్వేగ పోరుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.Cutouts pettukoni gelichadu 👍 pic.twitter.com/hPoFawOwOp— JD⚡ (@JohnDurdeno) May 26, 2026 -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు(వేలుమణి వర్గం) పళనిస్వామితో సమావేశమయ్యారు. పళనిస్వామితో రాజీపడ్డ తిరుగుబాట ఎమ్మెల్యేల వర్గం.. అన్నాడీఎంకేలో చీలిక లేదంటూ ప్రకటించారు. పళనిస్వామికి వేలుమణి బృందం పూర్తి మద్దతు తెలిపింది. పళనిస్వామితో సమావేశం అనంతరం స్పీకర్‌ను కలిసిన రెబల్ ఎమ్మెల్యేలు(వేలుమణి బృందం) తామంతా పార్టీగా మళ్లీ ఒకటిగా ఉన్నామంటూ స్పష్టం చేశాయి.తాము ఎల్లప్పుడూ కలిసికట్టుగానే ఉంటామంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. పళనిస్వామి పట్ల తమ విధేయతను చాటుకున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత పళనిస్వామికి వ్యతిరేకంగా సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో అన్నాడీఎంకేలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ వర్గం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించగా.. పళనిస్వామి తిరస్కరించారు. అయితే, తిరుగుబాటు వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి మాటను పక్కనబెట్టి.. విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ వ్యవహారం ముదరడంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పళనిస్వామి స్పీకర్‌కు లేఖ కూడా రాశారు.స్పీకర్ కార్యాలయంలో అనర్హత వేటు ప్రక్రియ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తిరుగుబాటు వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరడంతో ఆ వర్గానికి పెద్ద షాక్ తగిలింది. స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతున్నందున ఈ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈపీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి నివాసంలో ఆయన్ను కలిసి సంధి ప్రకటించారు. ఈ సమావేశం అనంతరం పళనిస్వామి తమ నాయకుడని వారు స్పష్టం చేశారు. గతంలో కొన్ని భిన్నాభిప్రాయాల వల్లే ఈ తిరుగుబాటు జరిగిందంటూ పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని.. తమ డిమాండ్లను పరిశీలించడానికి పళనిస్వామి అంగీకరించారని నేతలు వెల్లడించారు. తిరుగుబాటుదారులు మళ్లీ సొంత పార్టీలోకి తిరిగి రావడంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ కార్యాలయంలో దాఖలు చేసిన దరఖాస్తును పళనిస్వామి ఉపసంహరించుకున్నారు. -
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్
-
విజయ్ సంచలన నిర్ణయం తమిళ్ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్
-
అన్నాడీఎంకే సంక్షోభంలో కీలక మలుపు
అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల అనంతరం పార్టీ లోపల మొదలైన విభేదాలు ఇప్పుడు రాజీ, పునఃసమీకరణల దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఇచ్చిన పిటిషన్‌ను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో “తమదే అసలైన అన్నాడీఎంకే వర్గం” అంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన రెబల్ శిబిరం కూడా వెనక్కి తగ్గే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల స్పీకర్‌ను కలిసిన ఈపీఎస్.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అలాగే టీవీకేలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారడం మొదలైంది. రెబల్ వర్గంలో సంఖ్యా బలం క్రమంగా తగ్గిపోవడం, పలువురు ఎమ్మెల్యేలు తిరిగి ఈపీఎస్ వైపు మొగ్గు చూపడం ఈ పరిణామాలకు కారణంగా కనిపిస్తోంది.ఎన్నికల తర్వాత సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, విజయ్‌భాస్కర్ నేతృత్వంలో ఏర్పడిన రెబల్ వర్గం మొదట తమ బలం 30 మంది ఎమ్మెల్యేలని ప్రకటించింది. అయితే అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వ బలనిరూపణ సమయానికి ఆ సంఖ్య 25కు చేరింది. ఇప్పుడు వరుస పరిణామాల తర్వాత ఆ సంఖ్య 16కి పడిపోయిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రెబల్ వర్గ భవిష్యత్తుపై అనుమానాలు మొదలయ్యాయి.బలపరీక్ష సమయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి రెబల్స్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మద్దతుకు ప్రతిఫలంగా కేబినెట్లో కీలక మంత్రి పదవులు దక్కుతాయని ఆ వర్గం ఆశించినట్లు తెలుస్తోంది. కానీ టీవీకే మిత్రపక్షాల అభ్యంతరాలతో అది జరగలేదు. అయితే రాజకీయ ప్రాధాన్యం రాకపోవడంతో అసంతృప్తి పెరిగినట్లు సమాచారం. భవిష్యత్‌లో పార్టీలో స్థానం, పదవుల పునరుద్ధరణ, రాజకీయ భద్రత వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తిరిగి ఈపీఎస్ శిబిరం వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.ఇప్పటికే కొందరు రెబల్ ఎమ్మెల్యేలు తమ నిర్ణయాలను మార్చుకుని ఈపీఎస్‌కు చేరువవుతున్నారు. మరోవైపు టీవీకే వైపు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అధికారికంగా విజయ్ శిబిరంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరికి భవిష్యత్ ఉపఎన్నికల్లో టీవీకే తరఫున అవకాశాలు ఇవ్వొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.ఈ పరిణామాలన్నింటి మధ్య ఈపీఎస్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట కఠిన వైఖరి తీసుకున్న ఆయన.. ఇప్పుడు రాజీ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రెబల్స్‌పై చర్యల పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం ద్వారా అసంతృప్త వర్గాలను తిరిగి పార్టీలో కలుపుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ మరోసారి ఏకీకృతం కావచ్చన్న చర్చ మొదలైంది.అయితే ఇదంతా జరుగుతున్నప్పటికీ విజయ్ ప్రభుత్వానికి తక్షణ ప్రమాదం ఏమీ లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అసెంబ్లీలో 144-22 తేడాతో విజయ్ ప్రభుత్వం బలనిరూపణలో విజయం సాధించింది. కాబట్టి రెబల్స్ మద్దతు ఉపసంహరించుకున్నా(మ్యాజిక్ ఫిగర్ 118) ప్రభుత్వ స్థిరత్వంపై పెద్దగా ప్రభావం ఉండదని చెబుతున్నారు. కానీ ఈ పరిణామాలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలను మాత్రం పూర్తిగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.మొత్తంగా చూస్తే… అన్నాడీఎంకేలో మొదలైన అంతర్గత పోరు ఇప్పుడు రాజకీయ పునర్వ్యవస్థీకరణ దిశగా సాగుతోంది. రెబల్ వర్గం బలహీనపడుతుండగా, ఈపీఎస్ మళ్లీ పార్టీపై పట్టు బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో విజయ్ టీవీకే చుట్టూ తిరుగుతున్న రాజకీయ లెక్కలు తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త సమీకరణానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తమిళనాడులో నేరగాళ్లకు ఫ్రీ పాస్
తమిళనాడు విజయ్ ప్రభుత్వానికి హనీమూన్ ముగిసినట్లే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాలకే రాష్ట్రంలో వరుసగా నేరాలు ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత అన్నామలై సంచలన ఆరోపణలకు దిగారు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా మైనర్లపై జరిగిన అఘాయిత్యాలు ఆయన ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టాయి. మదురైలో మీనాక్షి ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలుడి హత్య, కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎన్నికల ముందు భారీ హామీలు ఇచ్చిన విజయ్… ఇప్పుడు వరుస ఘటనలపై ఎందుకు కఠినంగా స్పందించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనలపై బీజేపీ నేత కే అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “తమిళనాడులో డ్రగ్ దందాదారులు, లైంగిక నేరస్తులు, హంతకులకు ఫ్రీ పాస్ దొరికినట్టుంది. గతం నుంచి రాష్ట్ర పోలీసులు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. కొత్త టీవీకే ప్రభుత్వం ఇంకా సంబరాల మూడ్‌లోనే ఉన్నట్లుంది. ఇప్పుడైనా బయటకు వచ్చి వాస్తవాలను ఎదుర్కొవాలి” అంటూ ఆయన సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ కూడా చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా “ఇది తమిళనాడా? లేక ఉత్తరప్రదేశ్నా?” అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు మార్పు తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టవ్యవస్థను అదుపులో పెట్టలేకపోతోందని విమర్శించారు. అన్నాడీఎంకే నేత పళనిస్వామి కూడా మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. “మహిళల రక్షణ ఎక్కడుంది?” అంటూ విజయ్ను నిలదీశారు. ఇక కోయంబత్తూరు ఘటనపై పరిశ్రమల మంత్రి స్పందించిన తీరు కూడా వివాదానికి దారితీసింది. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో బీజేపీ తీవ్రంగా విమర్శించింది. అనంతరం పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు చిరునవ్వులు చిందించిన వీడియోలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో చట్టవ్యవస్థ అంశం ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి తొలి పెద్ద రాజకీయ పరీక్షగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఈ విమర్శల మధ్య సీఎం విజయ్ మాత్రం ఒక పోక్సో కేసు తీర్పును ఉదాహరణగా చూపిస్తూ.. ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తూత్తుకుడి జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మూడు నెలల్లోనే డబుల్ డెత్ పెనాల్టీ విధించడాన్ని ప్రస్తావిస్తూ… మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందని తెలిపారు.అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇప్పుడు విజయ్‌కు అసలైన సవాలు మొదలైందని భావిస్తున్నారు. ఎన్నికల హామీలు ఇవ్వడం ఒకటైతే… చట్టవ్యవస్థను సమర్థంగా నడిపించడం మరో విషయం అని చెబుతున్నారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేస్తుందన్నదే తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. -
అన్నాడీఎంకేకు షాక్‌ల మీద షాకులు
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మరో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఇప్పటికే ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంబసముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా.. అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్‌కు రాజీనామా సమర్పించారు. ఆయన టీవీకేలో చేరే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటికే సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు శిబిరాలుగా విడిపోవడం తెలిసిందే. మొత్తం 47 మందికిగాను పళణి స్వామి వర్గంలో 22 మంది, సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో శాసనసభా పక్షం, విప్ హోదాపై వివాదం కొనసాగుతోంది.ఈ పరిస్థితుల్లో తిరుగుబాటు బృందంలోని మరగతం కుమరవేల్, సత్యభామ, జయకుమార్ అనే ముగ్గురు ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు రాజీనామా లేఖలను సమర్పించారు. వాటిని ఆయన వెంటనే ఆమోదించడం, టీవీకే ముఖ్య నేత, మంత్రి ఆధవ్ అర్జున సమక్షంలో ఆ పార్టీలో చేరడం చకచకా జరిగిపోయాయి. ఈ నెల 13వ తేదీన అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో పార్టీ విప్‌ను ధిక్కరిస్తూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయడం గమనార్హం. -
అన్నాడీఎంకేకు బిగ్ షాక్ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే లోకి జంప్
-
సైలెంట్‌గా స్కెచ్.. పెద్ద రిస్క్ చేస్తున్న విజయ్
వాడిపోతున్న చెట్టు నుంచి ఒక్కో ఆకు రాలినట్టు.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యే కదలికే అధికార సమీకరణాలను మార్చేస్తోంది. మొన్నటిదాకా కూటముల చుట్టూ తిరిగిన అక్కడి రాజకీయం.. ఇప్పుడు “ఎవరి వద్ద ఎంత సంఖ్యాబలం?” అనే లెక్క దిశగా పయనిస్తోంది. రాజకీయ వర్గాలు దానికి ముద్దుగా పెట్టిన పేరు “ఆపరేషన్ L”. ఎల్ అంటే లాటరీ? లీవ్? ఏదైనా రాజకీయ సెటైర్‌నా?.. ఏ అర్థం తీసుకున్నా… ఈ ఆపరేషన్ మధ్యలో నిలిచింది మాత్రం విజయ్ రాజకీయ దూకుడే! అదెలా సాగుతుందంటే.. తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కగళం పార్టీ ఇప్పుడు సాధారణ పార్టీ విస్తరణ దశను దాటి, స్వతంత్ర మెజారిటీ లక్ష్యంగా అడుగులు వేస్తోందన్న చర్చ బలపడుతోంది. మొదట్లో ఇది కూటమి నిర్వహణలా కనిపించినా… ఇప్పుడు మాత్రం “సోలో పవర్” కోసం సాగుతున్న రాజకీయ ఆపరేషన్లా మారిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఈ పరిణామాలకు తెరలేపింది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వరుస రాజీనామాలే. పెరందురై ఎమ్మెల్యే ఎస్ జయకుమార్, మధురాంతకం ఎమ్మెల్యే కె. మరగతం కుమరవేల్, ధారాపురం ఎమ్మెల్యే పి. సత్యభామ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి.. ఆ తర్వాత టీవీకే నాయకత్వాన్ని(ఆధవ్ అర్జునను) కలవడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అధికారికంగా వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినా.. రాజకీయంగా మాత్రం విజయ్ “విజిల్” గుర్తుపై మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.“ఆపరేషన్ L” అలా మొదలైందా?అన్నాడీఎంకే వర్గాల్లో ఈ పేరుకు అనేక అర్థాలు వినిపిస్తున్నాయి. కొందరు “Lottery” అంటుంటే… మరికొందరు “Leave” అంటున్నారు. కానీ పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న సెటైర్ మాత్రం వేరే — అన్నాడీఎంకే రెండాకులలో(Two Leaves గుర్తు) ఒక్కో “ఆకు” ఇప్పుడు ఊడిపోతోందన్న వ్యాఖ్య.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీవీకే లెక్క కూటమి నుంచి మెజారిటీకి షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం టీవీకేకి సుమారు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వం స్థిరంగానే ఉన్నా… ఒకే నాయకుడి చుట్టూ నిర్మితమైన పార్టీ శాశ్వతంగా మిత్రపక్షాలపై ఆధారపడకూడదన్న భావన టీవీకేలో బలపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.. 234 స్థానాల అసెంబ్లీలో 118 మ్యాజిక్ ఫిగర్. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే.. “కూటమి ప్రభుత్వం” క్రమంగా “ఒకే పార్టీ ప్రభుత్వం”గా మారే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు సమాచారం. అంటే.. తాజాగా మూడు స్థానాలు, ఫస్ల్ 1.. మొత్తంగా నాలుగన్నమాట. పోను పోను ఆ సంఖ్యా పెరగవచ్చనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. అయితే ఈ రాజకీయ లెక్క అంత సులభం కాదు. ఎందుకంటే..మిత్రపక్షాలు ఊరుకుంటాయా?అధికారంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, విడుదలై చిరుత్తైగల్ కట్చి వంటి పార్టీలు ఇప్పుడు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మొదట అన్నాడీఎంకే రెబెల్స్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చలపై వామపక్షాలు, వీసీకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది తెలిసిందే. అదే ఒత్తిడితో విజయ్ చివరి నిమిషంలో వ్యూహం మార్చి… “కేబినెట్లో చోటు కాదు, కానీ పార్టీ తలుపులు తెరిచి ఉంచడం” అనే మార్గాన్ని ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్… టీవీకే పూర్తి మెజారిటీ దిశగా సాగితే భవిష్యత్తులో తన రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోతుందా? అనే ఆందోళనలో ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో, ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే టీవీకేని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి కూడా కాంగ్రెస్‌కు లేదు. దీంతో మిత్రపక్షాలు ఇప్పుడు “మద్దతు ఇస్తూనే దూరం పాటించే” రాజకీయ ధోరణిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక అన్నాడీఎంకే పరిస్థితి చూస్తే… అది ఇప్పుడు రెండు సమాంతర యుద్ధాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండగా… మరోవైపు ఎడప్పాడి పళనిస్వామి వర్గం తిరుగుబాటు నేతలను మళ్లీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీని కాపాడేందుకు ఇప్పుడు యాంటీ-డిఫెక్షన్ చట్టమే చివరి రక్షణగా మారిందన్న చర్చ జరుగుతోంది.చట్టపరమైన చిక్కుల్లేకుండా..అయితే టీవీకే మాత్రం ఆ అడ్డంకిని కూడా రాజకీయంగా చాకచక్యంగా దాటే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరుగా పార్టీ మార్పు కాకుండా… ముందుగా రాజీనామా.. తర్వాత ఉపఎన్నికలో మళ్లీ పోటీ అనే మోడల్‌ను అనుసరించడం ద్వారా చట్టపరమైన చిక్కులను తగ్గించాలనే వ్యూహం అమలవుతోందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఇందులో మరో ఆసక్తికర అంశం సామాజిక సమీకరణాలు.టీవీకే టార్గెట్ చేస్తున్న వారిలో రాజకీయంగా బలహీనంగా ఉన్నవారు, పార్టీ లోపల ఒంటరితనంలో ఉన్నవారు, ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇది కేవలం రాజకీయ ఆపరేషన్ మాత్రమే కాదు… సామాజిక లెక్కతో కూడిన వ్యూహమన్న మాట.అసలు సమస్య అదే..అయితే ఈ వ్యూహంలో మరో కీలక కోణం కూడా ఉంది. ఉపఎన్నికల రాజకీయ, ఆర్థిక భారం. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగితే… అది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, భారీ ఖర్చుతో కూడిన ప్రక్రియ కూడా. ఒక్కో ఉపఎన్నిక నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం, భద్రత, ఎన్నికల సిబ్బంది, ప్రచార వ్యయాలు కలిపి కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఒకేసారి పలుచోట్ల ఉపఎన్నికలు వస్తే ఆ భారం మరింత పెరిగే అవకాశం ఉంది.ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మలచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. “రాజకీయ లాభాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు” అన్న విమర్శలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉపఎన్నిక అనేది గెలుపు గ్యారెంటీ ఉన్న రాజకీయ గేమ్ కాదు. అధికార ప్రభావం, విజయ్ ఇమేజ్ బలంగా కనిపిస్తున్నా… రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మళ్లీ ప్రజల తీర్పు కోరాల్సిందే. స్థానిక అసంతృప్తి, కుల సమీకరణాలు, తిరుగుబాటు నేతల ప్రభావం వంటి అంశాలు ఫలితాలను తారుమారు చేసే అవకాశమూ ఉంది.అందుకే ఈ వ్యూహాన్ని రాజకీయ వర్గాలు “హై రిస్క్ – హై రివార్డ్” ఆపరేషన్‌గా విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ ఈ లెక్క సక్సెస్ అయితే… టీవీకే కూటమి రాజకీయాల నుంచి బయటపడి స్వతంత్ర మెజారిటీ దిశగా అడుగులు వేయొచ్చు. కానీ విఫలమైతే మాత్రం అదే వ్యూహం రాజకీయంగా తిరుగుదెబ్బ అయ్యే ప్రమాదం కూడా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. ఒకప్పుడు ద్రావిడ పార్టీల బలం అనుకున్న కూటములే, ఇప్పుడు అస్థిరతకు సంకేతాలుగా మారుతున్నాయి. విజయ్ నిజంగానే ముందుగానే ఈ వ్యూహాన్ని రచించారా? లేక పరిస్థితులే ఆయనకు అనుకూలంగా మారాయా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో రాజకీయ మార్పులు ఒక్కసారిగా రావడం లేదు. నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి, ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్యేకు సమీకరణాలు నెమ్మదిగా మారిపోతున్నాయి. -
విజయ్‌తో దోస్తీ.. ఉదయనిధి అది గుర్తుంచుకుంటే మంచిది
తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం తర్వాత ఏర్పడిన అంతర్గత విబేధాలు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా బహిరంగంగా మాటలు విసురుకునే స్థాయికి చేరుకున్నాయి. విజయ్ ఫ్యాక్టర్ కారణంగా డీఎంకే–కాంగ్రెస్ మధ్య ఉన్న దీర్ఘకాలిక పొత్తు తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.కాంగ్రెస్‌ను ఇకపై నమ్మం.. అంటూ ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రెండు దశాబ్దాలుగా ఆ పార్టీ తమపైనే ఆధారపడిందని.. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ తమను వెన్నుపోటు పొడిచిందని .. అధికారం కోసం టీవీకేతో చేతులు కలిపిందని.. ఈ విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దని.. కాంగ్రెస్‌ను ఇకపై దగ్గరికి రానివ్వకూడదంటూ తీవ్రంగా మాట్లాడారాయన. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. డీఎంకేకు కష్టకాలంలోనూ కాంగ్రెస్ అండగా నిలిచిందని, పొత్తు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి పార్టీపైనే అనవసర వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారాయన.‘‘కాంగ్రెస్ ఎప్పుడూ సెక్యులర్ కూటమి కోసం పనిచేసింది. డీఎంకేతో ఉన్న భాగస్వామ్యం పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. రాజకీయంగా అనవసర ఉద్రిక్తతలను పెంచుతాయి’’ అని ఉదయనిధికి మాణికం ఠాగూర్ హెచ్చరికలు జారీ చేశారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడడంతో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చేసింది. విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటులో మద్దతు ప్రకటించింది. ఆపై విజయ్ కేబినెట్లో రెండు స్థానాలు దక్కించుకుంది. ఈ పరిణామాలన్నీ డీఎంకేకు కోపం తెప్పించాయి. కాంగ్రెస్‌పై వెన్నుపోటు రాజకీయమంటూ బహిరంగ విమర్శలకు దిగింది. అయితే తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ కాంగ్రెస్ కూడా డీఎంకేకు కౌంటర్ ఇవ్వసాగింది.ఈలోపు.. తామింక ఇండియా కూటమిలో లేమని, లోక్‌సభలో తమ ఎంపీల సిట్టింగ్ విషయంలో పునరాలోచన చేయాలంటూ డీఎంకే నేత కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు డీఎంకే లేఖ రాశారు. దీంతో తమిళనాడు పరిణామాలు.. దేశ రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి.ఇద్దరికీ ఇద్దరూ అండగానే!కేంద్ర రాజకీయాల్లో యూపీఏ ప్రభుత్వాల సమయంలో కాంగ్రెస్‌కు డీఎంకే బలమైన మద్దతుగా నిలిచింది. ఆ దోస్తీతోనే ఇటు తమిళనాడులోనూ కాంగ్రెస్ విజయాలకు కారణమవుతూ వచ్చింది. అలాగే డీఎంకేకు కష్టకాలంలో కాంగ్రెస్ అండగా నిలిచిందన్న మాణికం ఠాగూర్ వ్యాఖ్యలకు రాజకీయంగా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 1990ల చివరి నుంచి తమిళనాడులో డీఎంకే–కాంగ్రెస్ మధ్య పొత్తు కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తమిళనాడులో గణనీయమైన సీట్లు రావడానికి కూటమి కీలకంగా నిలిచింది. అలాగే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయంలో డీఎంకే ఓటు బ్యాంక్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మరోవైపు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో డీఎంకే కీలక మిత్రపక్షంగా వ్యవహరించింది. కేంద్ర మంత్రివర్గంలో కూడా డీఎంకేకు ప్రాధాన్యత దక్కింది. బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో రెండు పార్టీలు చాలాకాలం కలిసి పనిచేశాయి. అందుకే ఇప్పుడు ఇరు పార్టీల మధ్య పెరుగుతున్న విభేదాలు కేవలం తాజా రాజకీయ రగడగానే కాకుండా.. రెండు దశాబ్దాల రాజకీయ భాగస్వామ్యంలో ఏర్పడిన పెద్ద చీలికగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. -
‘వాళ్లను ఎప్పటికీ మన దరిదాపుల్లోకి రానివ్వద్దు’
చెన్నై: తమిళగ వెట్రి కజగం (టీవీకే)కి కాంగ్రెస్ మద్దతు తెలపడంపై డీఎంకే నేత, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే క్యాడర్ అండతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంతో సీట్లు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతలకు కనీస కృతజ్ఞత, మర్యాద" లేదంటూ డీఎంకే యువజన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మండిపడ్డారు. డీఎంకే ఇకపై కాంగ్రెస్‌ను ఎప్పటికీ నమ్మకూడదన్నారు."కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకోవడానికి డీఎంకే క్యాడరే కారణం. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు వారికి ఓటు వేశారు. కానీ ఈరోజు కొన్ని పదవుల కోసం వారు మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పారిపోయారు. వాళ్లను ఎప్పటికీ మన దరిదాపుల్లోకి రానివ్వద్దు. అతి త్వరలోనే తమిళనాడు ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారు" అంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు కూడా కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన విమర్శలు గుప్పించారు. "దేశవ్యాప్తంగా బీజేపీ విజయాలకు ప్రధాని మోదీ, అమిత్ షాలే కారణమని నేను అనుకునేవాడిని. కానీ భారత్‌లో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఇప్పుడు స్పష్టమవుతోంది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మా నాయకుడు ఎంకే స్టాలిన్ కాంగ్రెస్‌ను తన భుజాలపై మోశారు" అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. యువతకు, ముఖ్యంగా జెన్ జెడ్ (Gen Z) ఓటర్లకు రాజకీయంగా అవగాహన కల్పించాలని, కుటుంబాలు, తొలిసారి ఓటు వేసే వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంచాలని డీఎంకే యువజన విభాగం కార్యకర్తలను ఉదయనిధి స్టాలిన్ కోరారు. -
స్టాలిన్-పళనిది కలేనా?
ఆరు దశాబ్దాల తమిళనాడు రాజకీయ చరిత్రలో.. తొలిసారిగా ఏర్పడిన సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఎంతకాలం నిలుస్తుంది?. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కొలువుదీరి రెండు వారాలు గడవక ముందే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకేలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అంటూ ప్రకటలు చేస్తున్నాయి. వీటిపై టీవీకే స్పందించింది. “మాకు అధికార అనుభవం తక్కువ కావొచ్చు.. కానీ సిద్ధాంతాల విషయంలో మా నిబద్ధత చాలా బలంగా ఉంది” అంటూ ఘాటు బదులే ఇస్తోంది. ఇంతకాలం డీఎంకే, అన్నాడీఎంకేలు ద్రవిడ సిద్ధాంతం పేరు చెప్పుకుని ప్రజలను మభ్యపెట్టాయని.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని టీవీకే నేత, తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి అరుణ్‌రాజ్ ఆరోపించారు. అయితే.. విజయ్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం “సామాజిక న్యాయం, లౌకికవాదం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ” అనే ఉమ్మడి సిద్ధాంతాలపై ఏర్పడిందని, కాబట్టి ఆ ఆలోచనలే ఉండబోవని చెప్పారాయన. చెన్నైలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలుతుందన్న ప్రతిపక్షాలకు కౌంటర్ కూడా ఇచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవాలో, అవినీతికి ఎలా వాడుకోవాలో బాగా నేర్చుకున్నాయి. అందుకే మాకు ప్రజలు ఓటేసి గెలిపించారు. మా కూటమి సాధారణ రాజకీయ పొత్తు కాదని, సిద్ధాంతాల కలయిక అని స్పష్టం చేశారు. టీవీకే, ఐయూఎంఎల్, వీసీకే కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం బయట నుంచి వామపక్షాల మద్దతుతో కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాల అసెంబ్లీలో ఈ కూటమికి 121 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే బయట మద్దతు భవిష్యత్తులో సమస్య అవుతుందన్న వాదనను అరుణ్‌రాజ్ ఖండించారు. “ప్రజలకు మంచి పాలన అందిస్తే.. ప్రజాదరణ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కాబట్టి ప్రతిపక్షాలది కలే అని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో ఇంతకాలం కూటములతో అధికారంలోకి వచ్చినా.. భాగస్వామ్య పార్టీలకు పాలనలో వాటా ఇవ్వలేదు. కానీ మా(టీవీకే పార్టీ) అధినేత విజయ్ మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారాన్ని పంచుకున్నారని చెప్పారు. దీనిని ఆయన “ప్రజాస్వామ్యానికి నిజమైన గౌరవం”గా అభివర్ణించారు. ఈ కారణాల వల్లే మా అధినేత కూడా అదే ధీమాతో ఉన్నారని అరుణ్ చెప్పుకొచ్చారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా టీవీకే ప్రభుత్వం వెనక్కి తగ్గదని అరుణ్‌రాజ్ స్పష్టం చేశారు. విద్యా నిధుల విడుదల, వన్‌నేషన్-వన్ ఎలక్షన్, సీఏఏ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. అయితే ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికీ సిద్ధమేనన్నారు.ఆరోగ్యశాఖ మంత్రిగా తన తొలి లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమేనని చెప్పారు. “డబ్బు లేక అప్పులు చేసినా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమ్మకం తగ్గింది. దాన్ని మళ్లీ పెంచాలి” అని అన్నారు.ఇదిలా ఉంటే.. విజయ్ తన కేబినెట్ విస్తరణను కూడా పూర్తి చేశారు. వీసీకే నుంచి ఓ దళిత నేత, ఐయూఎంఎల్ నుంచి మరో నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ‘రెయిన్బో క్యాబినెట్’ను విజయ్ రూపొందించారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు హాట్ చర్చకు దారి తీసింది. గత ప్రభుత్వ హయాంలో అరెస్టై జైల్లో ఉన్న ప్రముఖ యూట్యూబర్ ‘సావుక్కు’ శంకర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. శంకర్‌పై గూండా యాక్ట్‌ను ఎత్తేయాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. దీంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సావుక్కు శంకర్(Savukku Shankar) అనే పేరు తమిళనాడులో రాజకీయాలు, మీడియా, ప్రజాస్వామ్య చర్చల్లోనూ తరచూ వినిపిస్తుంటుంది. సావుక్కు అంటే కొరడా అని అర్థం. విజిల్‌బ్లోయర్‌గా, సిస్టమ్‌కి బలైన వ్యక్తిగా ఆయన అక్కడి జనాలు భావిస్తుంటారు. అదే సమయంలో ఆయన నోటి దురుసును విమర్శించేవాళ్లు లేకపోలేదు. ఆయన ట్రాక్ రికార్డు చెప్పాలంటే.. గత ఐదేళ్ల కాలంలో ఏకంగా తొమ్మిదిసార్లు అరెస్ట్ అయ్యారు ఆయన. ఎవరీ సావుక్కు శంకర్.. ఆచిముత్తు శంకర్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి. విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగంలో క్లర్క్‌గా పని చేశారు. అయితే 2008లో తమిళనాట సంచలనం సృష్టించిన ఆడియో లీక్ కేసులో సస్పెండ్ అయ్యి.. దర్యాప్తు తదనంతరం ఉద్యోగం పొగొట్టుకున్నారు. ఆ స్కాంలో ఓ మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఆపై సావుక్కు అనే వెబ్సైట్, యూట్యూబ్ చానెళ్ల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. అవినీతి, అధికార దుర్వినియోగం బయటపెట్టిన వ్యక్తిగా ఆయనకంటూ తమిళనాట ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలక్రమంలో ఆయన నోటి నుంచి నిజాలే వస్తాయని జనం భావించేంతగా పరిస్థితి చేరుకుంది. దీంతో వ్యవస్థ నుంచి ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలపై ఆయన చేసిన విమర్శలు, న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు.. ప్రజల్లో ఒక వర్గానికి ఆయనను ధైర్యవంతుడిగా చూపించాయి. అవినీతి వ్యతిరేకంగా పోరాడే యువత, ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నవారు ఈయనకు మద్దతుగా నిలిచేవారు. అదే సమయంలో.. మహిళలపై నోరు పారేసుకోవడం, వ్యక్తిగత దాడులు ఆయనపై కాస్త నెగెటివిటీని క్రియేట్ చేశాయి. డీఎంకే హయాంలో..2021లో స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శంకర్‌పై వరుసగా కేసులు నమోదయ్యాయి. గూండాస్ యాక్ట్ కింద పలుమార్లు అరెస్టు కావడం, ఎన్డీపీఎస్ కేసులు ఎదుర్కొన్నప్పటికీ, కోర్టులు మాత్రం ఆయన్ని నిర్దోషిగా తీర్పునిస్తూ డీఎంకే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసేవి. అంతెందుకు 2024లో, మద్రాస్ హైకోర్టు ఆయనపై ఉన్న ఓ సంబంధించి నిర్బంధాల్ని రద్దు చేసింది. దీంతో.. డీఎంకే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఆయన్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని తమిళ ప్రజలు భావించేవారు. ‘‘తప్పుడు కేసులతో స్టాలిన్ ప్రభుత్వం నా నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది’’ అంటూ స్వయంగా ఆయన కూడా ఆరోపించేవారు. ఈ ఏడాది పరువు నష్టం కేసులోనూ మద్రాస్ హైకోర్టు ఆయనకు బెయిల్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగానే..2026 ఏప్రిల్‌లో చెన్నై పోలీసులు గూండాస్ చట్టం కింద నిర్బంధం విధించారు. ఏపీలో అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకువచ్చే సమయంలో పోలీసులపై రాళ్లు విసిరారని కేసు పెట్టారు. అయితే ఈ కేసులో ఆయన నిర్దోషి అని విజయ్ ప్రభుత్వం గుర్తించింది. అడ్వైజరీ బోర్డు పరిశీలనలో ఆయన నిర్బంధానికి తగిన కారణం లేదని తేలడంతో విడుదల చేయాలని ఆదేశించింది. ఆయనపై ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. వాటిలో చిక్కులను పరిశీలించాక ఆయన్ని విడుదల చేయాలని పోలీసు శాఖకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడో విషయం ఏంటంటే.. సావుక్కు శంకర్ విజయ్‌నూ వదల్లేదు. కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే అధినేత తీరును ఏకిపారేస్తూ వీడియో సిరీస్ తీశాడు. వాటికి విపరీతంగా ఆదరణ దక్కింది. -
సీఎం విజయ్ ఆర్మీ ప్రమాణస్వీకారం
-
సెక్రటేరియట్ కు వెళ్లిన సీఎం విజయ్.. మంత్రి ఆధవ్ అర్జునకు ప్రత్యేక శుభాకాంక్షలు
-
విజయ్ గవర్నెన్స్ ఫాక్ట్ చెక్.. 108 సీట్లు..1000 అబద్దాలు ?
-
సీఎం విజయ్ యూటర్న్
-
వైద్య సేవల జీపును నడిపి- చెక్ చేసిన సీఎం విజయ్
-
లంచంపై ఫిర్యాదు చేస్తే లక్ష బహుమతి!
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారా?. అవినీతి రహిత పాలన కోసం కఠిన చర్యలు అవలంభిచబోతున్నారా?. ఇందు కోసం తొలి అడుగు.. అవినీతి నిరోధక శాఖ ప్రక్షాళనతోనే ప్రారంభించబోతున్నారా?. లంచం అడిగినా అధికారులపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే నజరానా ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. అవినీతి రహిత సమాజం నిర్మాణం కోసం విజయ్ సర్కార్ ప్రొత్సాహక పథకం తేబోతున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందులో భాగంగా.. అధికారులు ఎవరైనా వెయ్యి లంచం అడిగినా పిర్యాదు చేస్తే లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించినట్లు ఆ వార్త సారాంశం. అవినీతి ఫిర్యాదుల కోసం 24 గంటలు పని చేసేలా 1800 425 1555 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారని.. అలాగే ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తారన్నది ఆ కథనం సారాంశం. అంతేకాదు.. ఫిర్యాదుదారుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వమని ప్రభుత్వం భరోసా ఇవ్వబోతోందట. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలించేందుకు అడుగులు వేశారని చెబుతున్నారు. ఇక ప్రభుత్వ శాఖల్లో రాజకీయ జోక్యం, అంతర్గత అవినీతి నిర్మూలించేందుకు చర్యలు చేపట్టినట్లు చర్చ నడుస్తోంది. ఇందుకుగానూ అన్ని శాఖలకు మూడు నెలల గడువు విధించారని.. పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు.. టెండర్లు, కాంట్రాక్టులు పారదర్శకత కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ఆ కథనాలు ఊటంకించాయి. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు అవినీతి రహిత సమాజంలో ప్రజలను భాగస్వాముల్ని చేస్తూ సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయమంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. -
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
మార్పు నినాదంతో ఘన విజయం సాధించిన విజయ్ అధికార పీఠం అధిరోహించడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని అంతా భావించారు. సినీ స్టార్‌గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. పార్టీ పెట్టడం దగ్గరి నుంచి సీఎంగా ప్రమాణం చేసే వరకు ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేశారు. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కానీ విజయ్ పాలనలో కనిపిస్తున్న శైలి ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది..తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అఖండ విజయం, సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు చర్చనీయాంశంగా మారాయి. ఈ దెబ్బకు ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. అంతెందుకు ఒకప్పుడు ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేసిన తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇప్పుడు ఆయన పట్ల పాజిటివిటీ కనిపిస్తోంది. అందుకు ఇక్కడి ఓ స్టార్ కమ్ లీడర్‌తో కంపేరిజన్ కూడా ఓ కారణం కావొచ్చు. అయితే ఇదంతా సోషల్ మీడియా వల్లే. అదే సమయంలో.. విజయ్ శైలిలో సినిమాటిక్ టచ్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రమాణస్వీకార సమయంలో సెల్ఫీ వీడియో తీయడం.. ప్రతిపక్ష నేతలను కలవడం, పాలనాపరంగా దూకుడు నిర్ణయాలు, ఓ చైల్డ్ యాక్టివిస్ట్ రిక్వెస్ట్‌తో సచివాలయంలో కుర్చీపై వేసిన టవల్‌ను తీసేయడం, టిఫిన్ బాక్స్ తెచ్చుకుని భోజనం చేస్తున్నట్లు వైరల్ అయిన AI ఫోటోలు.. ఇలా ప్రతీది సోషల్ మీడియాను కుదిపేసినవే. అయితే తాజాగా దివ్యాంగుల సంఘాలతో జరిగిన మీటింగ్ వీడియో రీల్‌గా బయటకు రావడం.. దుమారం రేపింది.A Person is taking a selfie video while CM Joseph Vijay is conducting a meeting! Best of Luck to Tamil Nadu for this comedy show for next 5 Years pic.twitter.com/ntG5gRndRM— Amitabh Chaudhary (@MithilaWaaala) May 19, 2026పాలనా సమావేశాలకు సంబంధించిన వీడియోలు అధికారికంగా బయటకు రావడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరీ సినిమా ప్రమోషన్లా మార్చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులేమో.. విజయ్ నిజంగా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడని, ఆయన సాదాసీదా జీవనశైలి ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి అని అంటున్నారు. అయితే.. అధికారిక సమావేశాలను రీల్లుగా మార్చడం, AI ఫోటోలు వాడటం, పాలనను ప్రచార వేదికగా మార్చడం సరైందేనా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో దివ్యాంగుల హక్కుల ఉద్యమకారుడు డా. పి. సిమ్మచంద్రన్ స్పందించారు. సీఎం అనుమతి తీసుని ఆ వీడియోను తీశా.. అందులో తప్పేముంది? అని అంటున్నారాయన. విజయ్ సినీ స్టార్ కావడం వల్ల ఆయన ప్రతి చర్యలోనూ ఒక సినిమాటిక్ ఇమేజ్ కనిపిస్తోంది. ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి పాలించాలని స్టాలిన్, రజనీకాంత్, కమల్‌హాసన్‌లాంటి సినీ ప్రముఖులు.. అలాగే ఇటు మిత్రపక్షాలు సూచిస్తున్నాయి. అయినా ఇప్పటికప్పుడు అందులోంచి ఆయన బయటపడలేకపోతున్నారు. అయితే ఇలాంటి చర్యలు ఆయనకు ప్రజాదరణను పెంచినా రాజకీయ విమర్శలకు అవకాశం ఇచ్చినట్లే అవుతోంది. “పాలనలో గంభీరత తగ్గిపోతుందా?”, “ప్రచారం హద్దు దాటుతోందా?” అనే విమర్శలకు గుప్పించేందుకు ప్రతిపక్షాలకు స్వయంగా విజయే ఆయుధం అందించినట్లు అవుతోంది.కొత్త కాదు కదా!రీల్ కల్చర్ అనేది కొత్తది కాదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యంగా యువ నాయకులు, సోషల్ మీడియా వేదికలను పాలనలో భాగం చేసుకుంటున్నారు. అంతెందుకు.. తెలంగాణ, ఏపీలో చోటామోటా నేతల దగ్గరి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సమావేశాలు,ప్రజా కార్యక్రమాలను రీల్ల రూపంలో షేర్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ముఖ్యమంత్రుల అధికారిక పేజీల్లో చిన్న వీడియోలు, రీల్స్ ద్వారా పాలనలోని నిర్ణయాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా “మన్ కీ బాత్” వంటి కార్యక్రమాలను డిజిటల్ కంటెంట్‌గా మార్చి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది కదా. అలాంటప్పుడు విజయ్ విషయంలోనే ఎందుకీ చర్చ?. తప్పా? ఒప్పా?.. అది నిర్ణయించాల్సింది..ఎన్నికల్లో ఆయన సాధించిన గెలుపు ఓ కారణం అయితే.. సినీ స్టార్ బ్యాక్‌గ్రౌండ్ మరో కారణంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ఆయన పాలనలో కనిపిస్తున్న ప్రతి చిన్న చర్య సినిమాటిక్ ఇమేజ్ బిల్డింగ్‌గా అంతా భావిస్తున్నారు. అందుకే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది ప్రజలకు చేరువ కావడానికి, పారదర్శకతను చూపించడానికి ఉపయోగపడవచ్చు. కానీ అదే సమయంలో, పాలనను సినిమాటిక్ ప్రచారంగా మార్చే ప్రమాదం కూడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఇదే పద్ధతి సాధారణంగా ప్రచార సాధనంగా మాత్రమే కనిపిస్తే.. విజయ్ విషయంలో అది ఆయన సినీ ఇమేజ్‌తో మిళితమై ప్రత్యేకంగా చర్చకు దారితీస్తోంది. సినీ స్టార్‌గా విజయ్ ప్రజలను ఆకట్టుకున్నారు. అలాగని పాలనలో కూడా అదే శైలి కొనసాగిస్తానంటే కాస్త కష్టమే. ఈ సినిమాటిక్ పాలన ప్రజాస్వామ్యానికి కొత్త శక్తి ఇస్తుందా? లేక ప్రచార హద్దులు దాటుతోందా? అనేది కాలమే నిర్ణయించాలి’’ అని తమిళ రాజకీయాలను అధ్యయనం చేస్తున్న తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నారు. -
విజయ్ కేబినెట్ మీటింగ్ లో సెల్ఫీ తీసుకుంటున్న అంకుల్
-
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
-
సనాతన ధర్మంపై టీవీకే ఎమ్మెల్యే యూటర్న్
-
విజయ్ సర్కార్ ఏ క్షణమైనా కూలిపోవచ్చు
చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని.. తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయి. ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు. కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండాలి అని ఆయన పిలుపు ఇచ్చారు. అలాగే రాజకీయాల్లో ఓటమి తాత్కాలికమని.. డీఎంకే మళ్లీ బలంగా తిరిగి వస్తుందని పార్టీ శ్రేణుల్లో ఆయన ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.తమిళనాడులో సూర్యుడు (డీఎంకే గుర్తు) ఎప్పటికీ అస్తమించడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. కానీ మళ్లీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా గెలుచుకుంటాం అని స్టాలిన్ అన్నారు.అందుకే స్టాలిన్ కామెంట్లు!తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం చిన్న పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో మద్దతు విషయంలో పెద్ద హైడ్రామానే నడిచింది. చివరకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, అన్నాడీఎంకే రెబల్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మిత్రపక్షాల మద్దతు ఉపసంహరణ, లేదంటో విజయ్‌కు మద్దతు ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. ఈ రెండింటిలో ఏదైనా జరగొచ్చని స్టాలిన్ అంచనా వేస్తున్నారు. అందుకే ఆయన పై వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.ఇప్పటికే ఎన్నికల ఓటమి కారణాలను విశ్లేషించేందుకు స్టాలిన్ 36 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాలను సేకరించి, పార్టీ బలహీనతలను గుర్తించనుంది. తద్వారా మళ్లీ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఏం చేయాలో స్టాలిన్ వ్యూహ రచన చేస్తారని సమాచారం. అలాగే సోషల్ మీడియాలోనూ డీఎంకే వీక్‌గా ఉందని.. దానిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. -
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
‘‘నేనేం రాజకీయాల్లో లేను. నాకంటే వయసులో చిన్నోడు సీఎం అయ్యాడని నేనెందుకు కుళ్లుకుంటా?’’ అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించడం ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి పరామర్శించడం.. గొప్ప విజయంతో సీఎం అయిన విజయ్ను, అదీ పెద్ద స్టార్‌గా ఉండి కూడా మర్యాదకైనా పలకరించకపోవడంపై రజనీ అభిమానుల నుంచే పెదవి విరుపులు కనిపించాయి. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చిందనేది భోగట్టా. అయితే.. రజనీకాంత్ మాట్లాడిన కొన్నిగంటల తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో విజయ్ ఫ్యాన్ అయిన తన కొడుక్కి రజనీ ఫ్యాన్ అయిన ఓ తండ్రి హితబోధ చేస్తాడట. అది ‘బాషా’ రేంజ్ ఎలివేషన్ కావడంతో ఆ కొడుకు కన్నీరు పెట్టాడంట. విజయ్ అభిమాని చేసిన పోస్ట్ అంటూ అది హల్ చల్కావడంతో.. ‘‘రజనీ ది గ్రేట్’’ అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే అదంతా అభిమానులను శాంతింపజేయడం.. తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం రజనీ తరఫున జరిగిన పీఆర్ స్టంట్ అంటూ ఓ బాంబ్ పేలడం ఈ ఎపిసోడ్‌ను మరో మలుపు తిప్పింది. సినీ ప్రపంచంలో అభిమానుల మధ్య పోటీలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, రజనీ–విజయ్ విషయంలో “ఫ్యాన్ వార్ చరిత్ర” కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తొలినాళ్లలో ఇద్దరూ వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా కనిపించినా.. అభిమానుల మధ్యే విభేదాలో లేదంటో స్టార్ డమ్ విషయంలో ఇగో అనేదో ఏమో తెలియదుగానీ పోను పోను ఆ ఇద్దరి ఆటిట్యూడ్‌ను అవి పూర్తిగా మార్చేశాయి. సినిమాలపరంగానే కాదు.. రాజకీయాలతోనూ ఆ గ్యాప్ మరింతగా ముదిరింది. 1990ల చివరలో రజనీ అప్పటికే “సూపర్‌స్టార్” స్థాయిలో ఉన్నాడు. ఆ టైంలోనే విజయ్ యువ హీరోగా ఎదుగుతున్నాడు. ఆరోజుల్లో రజనీ సినిమా విడుదలైతే తమిళనాట పండుగ వాతావరణం నెలకొనేది. అయితే దానికి పోటీగా విజయ్ అభిమానులు ‘మాస్ వాతావరణాన్ని సృష్టిస్తూ’ సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఇది రజనీ అభిమానులకు ఏమాత్రం సహించేది కాదు. అలా ఈ పోటీ నెమ్మదిగా బాక్సాఫీస్ కలెక్షన్ల దాకా వెళ్లింది. ఇద్దరి సినిమాలు ఒకేసారి, కాస్త గ్యాప్‌లో లేదంటే ఒకే ఏడాదిలో విడుదలైనా సరే.. హిట్లు-ఫట్లు, కలెక్షన్ల లెక్కలు చూపిస్తూ కొట్టుకోసాగారు. ఈ క్రమంలో ఫేక్ కలెక్షన్ల ఆరోపణలతో పరస్పరం తిట్టిపోసుకోవడం.. ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేసుకోవడం.. క్రమంగా సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ వార్స్ దాకా చేరుకుందది. ఆ సమయంలో ఇద్దరూ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్‌ను వారించడం.. మళ్లీ రిపీట్ కావడం అవుతూ ఉండేది. ఈలోపు.. విజయ్ సినీ కెరీర్ ఎవరూ అందుకోలేనంత పీక్స్‌కు చేరుకుంది.కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఇద్దరి ఫ్యాన్స్.. జైలర్ సినిమా టైంలో రజనీ వ్యాఖ్యలతో మళ్లీ మొదలుపెట్టారు. ‘‘కాకి ఎప్పుడూ గద్దను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగని గద్ద తన స్థాయిని తగ్గించుకోలేదు. అంతకంతకు పైకి ఎగిరిపోతుంది. మన స్థాయిని తగ్గించకుండా.. మన దారిలో ముందుకు పోవాలి’’ అంటూ రజనీకాంత్ చెప్పిన కుట్టీ స్టోరీ విజయ్ అభిమానులకు మంట తెప్పించింది. విజయ్ను కాకితో పోల్చాడంటూ అవమానంగా ఫీలై తలైవా మీద సోషల్ మీడియాలో దండయాత్ర చేశారు. ఇది ఎంతదాకా చేరిందంటే.. తన వ్యాఖ్యలను విజయ్ అభిమానులు పొరపాటుగా అర్థం చేసుకున్నారని స్వయంగా రజనీనే వివరణ ఇచ్చుకునేదాకా. దీనికి కౌంటర్‌గానే విజయ్ ‘లియో’ క్లైమాక్స్‌లో గద్ద రిఫరెన్స్ చూపించారనే ప్రచారం ఒకటి ఉంది. పొలిటికల్ టర్న్..!90వ దశకంలో భయంకరమైన ఫ్యాన్డమ్ను చవిచూసిన రజనీ.. ఆ టైంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. అయితే ఆధ్యాత్మిక ధోరణి, ఆరోగ్య సమస్యలు, మరేయితర కారణాలతో తెలియదుగానీ ఆయన ఆ పని చేయలేదు. బదులుగా జయలలితను ఢీ కొడుతూ డీఎంకే పార్టీ(కరుణానిధి.. ఎంకే స్టాలిన్) కుటుంబానికి మద్దతు ఇస్తూ వచ్చారు. అదలా కొన్నేళ్లపాటు సాగింది. చివరకు సొంతంగా రాజకీయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గడం ఆయన అభిమానుల్ని సైతం బాధించింది. అదే సమయంలో.. విజయ్ టీవీకే పార్టీ ప్రకటన, రాజకీయ దూకుడు.. తాజా తమిళనాడు విక్టరీ.. రజనీ ఫ్యాన్స్‌ను మరింత కుంగదీసింది. అది తారాస్థాయికి చేరుకుని రజనీనే తిట్టిపోసేదాకా చేరుకుంది. నిజానికి రజనీకాంత్ స్టైల్, మేనరిజంను అనుకరిస్తూనే విజయ్ సినిమాలపరంగా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడని కోలీవుడ్‌లో ఒక టాక్. అంతెందుకు విజయ్ అభిమానులు కూడా ఆ విషయాన్ని నిర్మోహమాటంగానే ఒప్పుకుంటారు. కానీ, రజనీ అభిమానుల్లో ఇలాంటి మెచ్యూరిటీ ఏమాత్రం కనిపించదు. విజయ్ను ఎంతసేపు తిట్టడం, వీలైనప్పుడల్లా ట్రోలింగ్ చేయడంతోనే గడిపేస్తుంటారు. ఇంత జరుగుతున్నా రజనీ ఏనాడూ తన అభిమానుల్ని వద్దని వారించిన పని చేయలేదు. ఇటు విజయ్ కూడా ఏనాడూ రజనీ ఫ్యాన్స్ చేస్తున్న దాడిపై నేరుగా స్పందించలేదు. బదులుగా తన అభిమానులకు “పాజిటివ్‌గా ఉండండి, కష్టపడి పనిచేయండి”.. ‘‘ నీ విజయంతో ఎదుటివారిని ఓడించు.. నీ నవ్వుతో వారిని మట్టికరిపించు’’ ఇలాంటి మోటివేషన్ స్పీచ్‌లతో సందేశాలిస్తూ వచ్చాడు. విజయ్ రాజకీయ పార్టీ పెట్టాక కూడా ఆ హుందాతనం అలాగే కొనసాగడం అది అటు తన అభిమానులనే కాదు.. రజనీ, అజిత్.. ఇలా ఇతర హీరోల ఫ్యాన్స్‌ను కూడా ఆకట్టుకోగలిగింది. ఒకరకంగా ఇదే ఆయనపై గౌరవం మరింత పెంచి.. ఆయన నాయకత్వానికి బలం చేకూరింది. అయితే ‘‘ఆ స్టార్డమ్ నుంచి బయటకు వచ్చి సీఎంగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అంటూ విజయ్‌కు రజనీ ఇచ్చిన సలహా.. అక్కసు వెల్లగక్కడంకాక మరేంటనే? కోణంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. తన సమకాలీకుడు(కమల్ హాసన్) స్వయంగా వెళ్లి విజయ్ను అభినందించడం.. విజయ్ విజయంపై మొక్కుబడిగా ఎక్స్‌లో ఓ మెసేజ్ పెట్టడం.. ఆపై తాజా ప్రెస్‌మీట్ వ్యాఖ్యల ఆంతర్యం.. విజయ్ విషయంలో రజనీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటున్నారు. -
అన్నాడీఎంకేలో సంక్షోభం.. పళనిస్వామి కొత్త స్కెచ్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పళని స్వామి రాజీనామా చేయాలన్న నినాదాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎస్పీ వేలుమణి దూకుడు పెంచారు. నమదు అమ్మ పత్రిక వ్యవస్థాపకుడి స్థానంలో పళని స్వామి పేరును తొలగించి, తనపేరును వేసుకున్నారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు ముక్కలైన విషయం తెలిసిందే.ఓ శిబిరం సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తుండగా, మరో శిబిరం పళణి స్వామితో కలిసి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఈ అంతర్గత కలహాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై మాజీ మంత్రులు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు.ఎన్నికల ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ఎడప్పాడి పళనిస్వామి తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని వేలుమణి, షణ్ముగం నేతృత్వంలోని 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం నినాదాన్ని అందుకుంది. ఎడప్పాడిని లొంగదీసుకోవడానికి వేలుమణి వర్గం పార్టీ ప్రత్యేక సర్వసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టింది.ఇందుకోసం సర్వసభ్య కమిటీ సభ్యుల నుంచి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే పత్రిక నమదు అమ్మకు వ్యవస్థాపకుడిగా ఇది వరకు పళనిస్వామి పేరు ఉండేది. అయితే, తాజాగా ఆయన పేరు ను తొలగించి తన పేరును ఎస్పీవేలుమణి వేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పార్టీ పత్రికను తనగుప్పెట్లోకి తెచ్చుకున్న ఎస్పీ వేలుమని మరి కొద్ది రోజులలో పార్టీని కూడా కైవశం చేసుకోవడం ఖాయం అని పళని వ్యతిరేక ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.ఇదే సమయంలో తిరుగుబాటు చేసిన 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎడప్పాడి పళనిస్వామి తరఫున తమిళనాడు గవర్నర్ కార్యాలయానికి, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి ఇప్ప టికే వినతిపత్రం సమర్పించారు. ఒకవేళ స్పీకర్ లేదా గవర్నర్ ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే, కోర్టులకు వేసవి సెలవులు ముగిసిన తర్వాత న్యాయపరమైన చర్యల ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే గవర్నర్‌ను కలిసి స్వయంగా విన్నవించేందుకు పళణిస్వామి అనుమతి కోరి ఉండటం గమనార్హం.ఇక, ఎస్పీ వేలుమణి బృందం అయితే, పార్టీ ఫిరాయింపు ల నిరోధక చట్టం నుండి తప్పించుకుని, అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల మద్ద తు అవసరంగా గుర్తించారు. దీంతో తమ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను 32కు పెంచుకోవడానికి వేలుమణి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.పళణి స్వామి వెనుక ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతా లు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, ఇరు శిబిరాల్లో ఈ వివాదం భగ్గుమంటోంది. విల్లుపురంలో సీవీషణ్ముం, పళని స్వామి వర్గం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యాలయాలకు భద్రతను పెంచారు. -
పారిశ్రామిక ప్రతినిధులతో సీఎం విజయ్ సమావేశం
-
ప్రారంభంలోనే బిగ్ షాక్.. 24 గంటల్లోనే విజయ్ యూ టర్న్
-
పుష్ప పాలిటిక్స్..! పుష్ప సినిమాను గుర్తుచేసిన డీఎంకే నేత ఉదయనిధి
-
ఎంజీఆర్.. జయ.. పళని.. అది షరా మామూలే!
సాక్షి, చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేలో చీలిక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్‌కు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు 24 మంది మద్దతు ప్రకటించడం.. రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చేసింది. ఈ తరుణంలో వాళ్లను కీలక పదవుల నుంచి తొలగిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఆ పార్టీలో ‘చీలిక’ కొత్తేమీకాదు. కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడేందుకు అన్నాదురై నేతృత్వంలో డీఎంకే పేరిట తమళనాట తొలి ప్రాంతీయ ద్రావిడ పార్టీ ఆవిర్భవించిన కాలం నుంచి చీలిక పర్వం సాగుతున్నది. డీఎంకే దివంగత అధ్యక్షుడు కరుణానిధితో పొడసూపిన విభేదాల కారణంగా సినీ నటుడు ఎంజీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న పార్టీ అన్నాడీఎంకే. ఎంజీఆర్ జీవించి ఉన్నంత కాలం సైన్యం తరహాలో కదిలిన ఈ పార్టీ ఆయన మరణానంతరం తదుపరి చీలికను ఎదుర్కొంది. 1972లో పార్టీ స్థాపించిన నాటినుంచి నేటి వరకు అనేకసార్లు వర్గ పోరును ఎదుర్కొంది. ఈ సమయంలో రెండుసార్లు అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ స్తంభింపచేసింది. ఆ చీలిక పర్వం సాగిందిలా.. ∙1972 అక్టోబర్ 18న డీఎంకే నుంచి బహిష్కరణకు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) పార్టీని స్థాపించారు. ∙1987 డిసెంబర్ 24న ఎంజీఆర్ మరణంతో ఆయన సతీమణి జానకీ రామచంద్రన్, పార్టీ ప్రచార కార్యదర్శి జయలలిత మధ్య తలెత్తిన విభేదాలు అన్నాడీఎంకే చీలికకు దారి తీసింది. 1988లో నాటి ఎంజీఆర్ విశ్వాసపాత్రుడు ఆర్ఎం వీరప్పన్ 98 మంది ఎమ్మెల్యేలతో జానకి వర్గానికి మద్దతు ఇచ్చారు. అసెంబ్లీలో హింసాత్మక ఘటనలు జరగడంతో అప్పట్లో రాష్ట్రపతి పాలన విధించారు. ∙1989 ఎన్నికలలో జయలలిత వర్గం 27 సీట్లు గెలవగా.. జానకి వర్గం 1 సీటుకే పరిమితమైంది. ఆ సమయంలో అన్నాడీఎంకే రెండాకుల గుర్తును ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా స్తంభింపచేసింది. దీంతో జానకి రాజకీయాల నుంచి తప్పుకోగా పార్టీ జయలలిత నాయకత్వం గుప్పెట్లోకి చేరింది. ∙1990లో పార్టీ సీనియర్ నేత తిరునావుక్కరసు తిరుగుబాటుతో జయలలిత ఆయనను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. తన రాజకీయ గురువు పేరిట ఆయన ‘ఎంజీఆర్ ఏడీఎంకే’ను స్థాపించారు. ∙1995లో జయలలితతో విభేదాల నేపథ్యంలో ఆర్ఎం వీరప్పన్ పార్టీ నుంచి విడిపోయి ‘ఎంజీఆర్ కళగం’ఏర్పాటు చేశారు. ఆ తరువాత అన్నాడీఎంకే పూర్తిగా జయలలిత వశమైంది. ∙2011 ఎన్నికలలో గెలుపొందిన అన్నాడీఎంకే 2016 ఎన్నికలలో మరోసారి గెలిచి చరిత్ర సృష్టించిన జయలలిత నిష్క్రమణతో అన్నాడీఎంకేలో మళ్లీ చీలిక మొదలైంది. ∙2016 డిసెంబర్ 5న జయలలిత మరణం పార్టీలో చీకటి రోజుగా మిగిలింది. జయలలిత జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన సమయంలో ఆమె నమ్మిన బంటు సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వం ఆమె మరణంతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ∙జయలలిత మరణానంతర పరిణామాలతో 2017 ఫిబ్రవరిలో ఆమె నెచ్చెలి శశికళ సీఎం కావాలనుకోవడంతో పన్నీరు సెల్వం ధర్మయుద్ధం చేశారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యమైంది. అనంతరం అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లగా.. కూవత్తూరులో జరిగిన రాజకీయ క్యాంప్‌తో పళణిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జయలలిత మరణం నేపథ్యంలో చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం మరోమారు స్తంభింపబడింది. ∙2017 ఆగస్టులో సీఎం పళణిస్వామి , పన్నీరు సెల్వం ఏకమయ్యారు. వీరి కలయికతో అదే ఏడాది మరోసారి పారీ్టలో చీలిక తప్పలేదు. శశికళ ప్రతినిధి దినకరన్‌ను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించడంతో ఈ చీలిక నెలకొంది. ఆ తరువాత అన్నాడీఎంకే నుంచి ఆవిర్భవించినదే అమ్మమక్కల్ మున్నేట్ర కళగం. ∙2021 అసెంబ్లీ ఎన్నికల తరువాత మరోసారి అన్నాడీఎంకేలో చీలిక తప్పలేదు. పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య ఏకనాయకత్వం విషయంలో తలెత్తిన వివాదం ఇందుకు కారణం. పన్నీరు సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పరిరక్షణ కోసం ఇయక్కం పేరిట శిబిరంతో రాజకీయాన్ని సాగించారు. ∙2022–23 మధ్యకాలంలో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత పళణి స్వామి పార్టీపై పూర్తి పట్టు సాధించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పారు. పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకుని లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నా డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇదే వరుసలో తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థలు, నగర పాలక సంస్థలు, ఉప ఎన్నికలలోనూ అన్నాడీఎంకేకు ఓటమి తప్పలేదు. ∙ఎన్నికల్లో వరుస ఓటముల నేపథ్యంలో.. 2026లో పళనిస్వామి నాయకత్వం బలహీనపడింది. ఇదే సమయంలో పార్టీలో కీలక నేతగా ఉన్న ఎస్పీ షణ్ముగం నాయకత్వంలో 24 మంది ఎమ్మెల్యేలు విడిపోవడంతో పార్టీ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. బుధవారం అసెంబ్లీ వేదికగా పళణిస్వామి ఆజ్ఞను ఆ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు ధిక్కరించారు. టీవీకే చీఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అంతే కాదు, పార్టీని సైతం కైవశం చేసుకునే దిశగా సర్వసభ్య సమావేశానికి ఈ ఎమ్మెల్యేల శిబిరం పిలుపునివ్వడం కొసమెరుపు. -
TVKలో షణ్ముగం వర్గం విలీనం..!? AIADMK చాప్టర్ క్లోజ్!
-
విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన అసెంబ్లీ
-
ఉదయనిధికి సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త అసెంబ్లీలో పొలిటికల్ పంచులు పేలడం అప్పుడే ప్రారంభమైంది. టీవీకే ప్రభుత్వ బలనిరూపణ వేళ.. ప్రతిపక్ష డీఎంకే సంచలన ఆరోపణలకు దిగింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం విజయ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలకు సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ బలనిరూపణ చర్చ వేళ విమర్శలు గుప్పించారు. ‘‘65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్‌కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడింది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు’’ అని ఆరోపించారాయన. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం టీవీకే తీరుకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ ప్రసంగించారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు. మున్ముందు ఆ ప్రయత్నం చేయబోం. మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. కాబట్టి వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అనేది చూడం.. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. అలాగే గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయ్ టీవీకే సర్కార్ నెగ్గింది. -
విజయ్‌పై ప్రేమలతా విజయ్‌కాంత్ ఎదురుదాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణ ఎదుర్కొంటున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్‌కాంత్(విజయ్‌కాంత్ సతీమణి) విజయ్‌పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు.‘‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’’ అని విజయ్‌కు చురకలంటించారామె. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. முதல்வர் விஜயை பார்த்து கேட்ட பிரேமலதா #premalatha pic.twitter.com/ei8tNlTIJi— Way2News Tamil (@way2news_) May 13, 2026Video Source: Way2News Tamil మరోవైపు.. బల నిరూపణ వేళ విజయ్ సర్కార్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విడుదల చిరుతైగల్ కట్చి(VCK) పార్టీ సైతం జ్యోతిష్యుడిని నమ్ముకుని పాలన చేయొద్దని విజయ్‌కు హితవు పలికింది. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తు.. 108 సీట్లు గెల్చుకుంది. ఆ సమయంలో డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్‌కు అభినందనలు తెలియజేశారు. విజయ్ తన బిడ్డలాంటోడని.. మొదటి నుంచి తన భర్త విజయ్‌కాంత్‌కు దగ్గరగా ఉండేవాడని.. ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మద్దతు ఇస్తారా? అనే అంశంపై మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఎన్డీయే కూటమిలో భాగంగా విరుదాచలం నుంచి పోటీ చేసిన ఆమె.. ఆ పార్టీ నుంచి పోటీ నెగ్గిన ఏకైక అభ్యర్థిగా నిలిచారు. -
బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. బుధవారం ఉదయం ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్, ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ నేరుగా.. వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు కూడా బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గినట్లు జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.తమిళనాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 144 మంది విజయ్ టీవీకే సర్కార్‌కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ నుంచి 61 మంది వాకౌట్(డీఎంకే సభ్యులతో పాటు) చేయగా.. 22 మంది విజయ్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. బీజేపీ, పీఎంకే సభ్యులు ఐదుగురు గైర్హాజరు అయ్యారు. బలపరీక్ష విషయంలో తటస్థంగా ఉన్నట్లు బీజేపీ తర్వాత ఓ ప్రకటన విడుదల చేసింది. విజయ్ ధన్యవాదాలుతమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ వేళ.. ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటన చేశారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు.మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని అన్నారు. అంతకు ముందు.. చర్చ సందర్బంగా ఒక్కో పార్టీ విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తూ వచ్చింది. అయితే అన్నాడీఎంకే వంతు వచ్చేసరికి హైడ్రామా మొదలైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే వేలుమణికి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయితే ఒక రెబల్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వడం ఏంటని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకుని.. సంచలన ఆరోపణలకు దిగారు. ఏ పార్టీలో అయిన విబేధాలు సహజం. మా పార్టీ విషయంలో సీఎం తీరు సరికాదు. ఆయన మా రెబల్ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు?. వాళ్లతో ఆయనకేం పని?. ఆయన మా తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు. డబ్బుతో కొనాలని చూస్తున్నారు? అని పళని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది. చివరకు చేసేది లేక పళనిస్వామి వర్గం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ఉదయనిధి సంచలన ఆరోపణలుప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. 65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్‌కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతోంది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఓటింగ్..విజయ్ సర్కార్ బలనిరూపణ కోసం ఓటింగ్ జరిగింది. టీవీకేకు బల నిరూపణకు కావాల్సిన సంఖ్య 118. బలనిరూపణ ఓటింగ్ సందర్భంగా మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించగా.. ఒక్కొక్కరు లేచి తమ హాజరును ప్రదర్శించారు. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఐయూఎంల్, వీసీకే, ఏఎంఎంకే రెబల్ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకేలో రెబల్ ఎమ్మెల్యేలు(షణ్ముగం వర్గం 25 మంది) విజయ్‌కు సపోర్ట్‌గా లేచి నిలబడ్డారు.కాంగ్రెస్, ఇతరులు ఏమన్నారంటే.. విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలి.. భరోసా కల్పించాలి. ఖర్గే, రాహుల్ ఆదేశాల మేరకు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో బీజేపీ కుట్రలు చేసింది.. వాటిని అడ్డుకున్నాం. రాష్ట్రంలో గవర్నర్ పాలన రాకూడదనే మద్దతు ఇచ్చాం అని వామపక్షాలు తెలిపాయి. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ ప్రభుత్వం రాజీ పడకూడదు. డీలిమిటేషన్‌పై కేంద్రంతో విజయ్ పోరాడాలి. మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలి. జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదు అని వీసీకే తెలిపింది. Tamil Nadu Legislative Assembly: Confidence motion moved in support of the Council of Ministers led by Chief Minister Vijay. pic.twitter.com/uxT0BMzNoY— Vijay Fans Trends (@VijayFansTrends) May 13, 2026 -
సనాతన ధర్మంపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంగళవారం కొత్త అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్‌గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్‌కు అభినందనలు తెలిపే క్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ మంగళవారం మరోసారి సనాతన ధర్మం(sanatana dharma)పై విమర్శలు చేశారు. “ప్రజలను విడదీసే సనాతనం నిర్మూలించబడాలి” అని ఉదయనిధి అన్నారు. అలాగే.. సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో రాష్ట్ర గేయం తమిళ్ తాయ్ వజ్తు కంటే ముందు వందేమాతరం ప్రదర్శించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర గీతం ఎప్పుడూ రెండో స్థానంలో ఉండకూడదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయ మర్యాద కొనసాగాలి. ప్రభుత్వం–ప్రతిపక్షం వేర్వేరు వరుసల్లో కూర్చున్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. ప్రజల కోరిక కూడా అదే” అని అన్నారు. సీఎం విజయ్ను ఉద్దేశిస్తూ.. “ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. రాజకీయాల్లో మేము సీనియర్లు. మా అనుభవం, జ్ఞానం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ఉదయనిధి ప్రసంగం ముగిశాక.. ప్రతిగా సీఎం విజయ్ నమస్కారం చేశారు.Udhayanidhi Stalin again says"SANATANA MUST BE ERADICATED."CM Joseph Vijay in assembly just looks on and even greets with folded hands pic.twitter.com/MNMz7PWmQL— Megh Updates 🚨™ (@MeghUpdates) May 12, 2026ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఏకైక ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ స్పందించేందుకు నిరాకరించారు. “ఈ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల గౌరవం మాత్రమే జరగాలి. ఇతర విషయాలపై సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను” అని అన్నారు. 2023లో ఉదయనిధి మంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. “సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సిద్ధాంతం. దాన్ని నిర్మూలించడం మానవత్వం, సమానత్వాన్ని కాపాడటమే” అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మతపరమైన సంస్థలు తీవ్రంగా స్పందించాయి. దేశంలో పలు చోట్ల ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. మద్రాస్ హైకోర్టు సైతం ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. బాధ్యత గల పదవిలో ఉండి విద్వేషపూరిత ప్రసంగం చేయడమేంటని మందలించింది. అయినప్పటికీ ఉదయనిధి మాత్రం వెనక్కి తగ్గలేదు. -
తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్!
తమిళనాడులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మిత్రపక్షం అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. టీవీకే విజయ్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే టీవీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూడా అదే ప్రకటన చేసింది. ‘‘డీఎంకేతో చేతులు కలిపి సీఎం కావాలని పళనిస్వామి కుట్ర చేశారు. పార్టీ సిద్దాంతాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నాం. ఇకపై ఎన్డీయే కూటమికి.. మాకు సంబంధం లేదు. మాదే అసలైన అన్నాడీఎంకే. విజయ్ ప్రజల సీఎం. అందుకే మా మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని అన్నాడీఎంకే రెబల్ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం ప్రకటించారు. ఆ వెంటనే.. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(AMMK) ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీ అధినేత టీవీవీ దినకరన్ హైడ్రామా నడిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న టీవీకేకు తొలుత కామరాజ్ మద్దతుగా సంతకం చేశారు. అయితే తమ ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దినకరన్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ విషయంపై గవర్నర్‌కు, పోలీసులు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తమ మిత్రపక్షం అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధంగా ఉందని.. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. అయితే.. టీవీకే ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసింది. అయినా కూడా దినకరన్ తన ఆరోపణలను కొనసాగించారు. ఈ తరుణంలో.. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటన చేయడం గమనార్హం. అయితే తన ఎమ్మెల్యే కామరాజ్ దినకరన్ సూచన మేరకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటన చేశారా?.. లేదంటే రెబల్‌గా సంతకం చేశారా? ఎన్డీయే కూటమి నుంచి దినకరన్ పార్టీ కూడా బయటకు వచ్చేసినట్లేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి మొత్తం 234 స్థానాలకుగానూ.. 223 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో అన్నాడీఎంకే 178 స్థానాల్లో పోటీ చేసి 47 గెల్చుకుంది. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు నెగ్గింది. ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచింది. పట్టాలి మక్కల్ కట్చి(PMK) 18 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లు గెలిచింది. ఫలితంగా, ఈ కూటమి మొత్తం 53 స్థానాలు గెలుచుకుంది.ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఎన్డీయే కూటమిలో.. లుకలుకలు బయటపడ్డాయి. మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు (24-30) మంది కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ప్రకటించారు. ఇటు దినకరన్ ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో పళని వర్గ ఎమ్మెల్యేలు, పీఎంకే 4 ఎమ్మెల్యేలు, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే మాత్రమే మిగిలినట్లైంది!. -
ఎన్డీయేకు ఝలక్.. విజయ్‌కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు
అన్నాడీఎంకే పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యే వర్గం సంచలన ప్రకటన చేసింది. ఎన్టీయే కూటమి నుంచి బయటకు వచ్చి.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అలాగని ఇది పార్టీని చీల్చే ప్రయత్నం ఏమాత్రం కాదని ఆ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం తేల్చి చెప్పారు. సీవీ షణ్ముగంలో నేతృత్వంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు(24 మంది అని కొన్ని తమిళ మీడియా సంస్థలు చెబుతున్నాయ్) విజయ్‌కు మద్దతు ప్రకటించారు. తాము ఏ పదవులనూ ఆశించబోవడం లేదని.. బయటి నుంచే విజయ్ సర్కార్‌కు సపోర్ట్ ఇస్తామని అన్నారు. చెన్నైలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకేలో అంతర్గత పోరు నిజమేనని ఆయన అంగీకరించారు. ‘‘విజయ్ ప్రజల సీఎం. ఆయన ఆ కుర్చీలో కూర్చోవాలని తమిళ ప్రజలు కోరుకున్నారు. ప్రజా నిర్ణయమే మాకు శిరోధార్యం. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని షణ్ముగం ప్రకటించారు. అదే సమయంలో.. పార్టీ లుకలుకలను ఆయన మీడియాకు వివరించారు. డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళని స్వామి కుట్ర చేశారు. ఎలాగైనా ఆయన సీఎం కావాలని అనుకున్నారు. ఆ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదు. అన్నాడీఎంకే స్థాపన లక్ష్యం డీఎంకేను ఎదుర్కోవడం. అలాంటి పార్టీతో చేతులు కలపడం పార్టీ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమే కాదు.. అత్యంత ప్రమాదకరం కూడా. ఈ విషయంలో పళనిస్వామి మాకు విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పాం అని షణ్ముగం వివరించారు. వరుస ఓటములకు పళనినే కారణమన్న షణ్ముగం.. ఆయన అన్ని పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి మాదే అసలైన అన్నాడీఎంకే కూటమి.. ఎన్డీయేతో మాకు సంబంధం లేదు.. మేం బయటకు వచ్చేశాం. ఎన్నికల ఫలితాలపై, భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తాం అని స్పష్టం చేశారాయన. దీంతో పళనిస్వామి ఎలా స్పందిస్తారు? ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది?. కూటమి విచ్ఛిన్నంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో? అనే ఉత్కంఠ నెలకొంది.ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 53 సీట్లు నెగ్గింది. అన్నాడీఎంకే 47 స్థానాల్లో.. పీఎంకే 4, ఏఎంకే, బీజేపీలు చెరో సీటు చొప్పున నెగ్గాయి. అయితే ఫలితాల తర్వాత విజయ్‌కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. బీజేపీ మద్దతు నేపథ్యంతో పళనిస్వామి అందుకు ఒప్పుకోలేదు. రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ కంటే విజయ్‌కు మద్దతు పార్టీకి ప్రజల్లో సింపథీ క్రియేట్ చేస్తుందని.. రాబోయే రోజుల్లో అది పనికి వస్తుందని వాదించింది. అంతేకాదు.. ఆ పార్టీ తరఫున శాసనసభా పక్షనేత, ఉప నేత ఎంపికలోనూ ఈ వర్గపోరు మరింత ఉధృతంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తనకు, తన అనుచర గణానికి ఆ పదవులు దక్కాలని పళనిస్వామి భావిస్తున్నారు. అయితే షణ్ముగం వర్గం మాత్రం సీనియర్ నేత ఎస్పీ వేలుమణికి శాసనసభా పక్ష నేత, డిప్యూటీ పదవిని జీ హరి, సీ భాస్కర్లలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే పోరు ముదిరి బయటకు వచ్చి ప్రకటన చేసింది. రేపు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కొనుంది. ఈ తరుణంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన బూస్ట్ కానుంది. -
తమిళనాడు అసెంబ్లీలో మొదటి రోజే ఆసక్తికర ఘటన
-
విజయ్ - స్టాలిన్ అపూర్వ కలయిక
-
స్టాలిన్ ఇంటికి చేరుకున్న సీఎం విజయ్
-
TVK పార్టీ ఎమ్మెల్యే ల క్వాలిఫికేషన్ చూస్తే షాక్ అవుతారు
-
తమిళనాడు సీఎం విజయ్ బిగ్ సర్ప్రైజ్
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అగ్రనటుడు విజయ్ ఆదివారం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అదే ఊపులో మేనిఫెస్టోలో కీలక మూడు హామీల అమలును ప్రకటించారు. తొలి సంతకాన్ని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఫైలుపై చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన దస్త్రాలపైనా సంతకాలు పెట్టారు. ఇక.. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసే టీంను తన పర్యవేక్షణలోనే ఉంచుకోనున్నట్లు విజయ్ ఇవాళ చెప్పారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసిన కాసేపటికే వరుస సమావేశాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యరుస్తూ ప్రతిపక్ష నేతల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే స్టాలిన్‌తో విజయ్ భేటీ అయ్యారని టీవీకే వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలోస్టాలిన్తో విజయ్ సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఎండీఎంకే నేత వైకో నివాసానికి వెళ్తారని సమాచారం. డీఎంకే కూటమిలో ఉన్న ఎండీఎంకే నాలుగు స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు నెగ్గలేకపోయింది. వీళ్లతో పాటు పలువురు నేతలను కలుస్తారని తెలుస్తోంది. అయితే.. ఇది మర్యాదపూర్వక భేటీనేనని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. అయితే అన్నాడీఎంకే నేతలను కలుస్తారా? ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పళని ఇంటికి వెళ్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. టీవీకే మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇక.. తమిళనాడులో కొత్త అసెంబ్లీ ఇవాళ కొలువు దీరింది. నూతనంగా ఎన్నికైన 234 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ సమక్షంలో శాసన సభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్‌ని డీఎంకే ప్రకటించింది. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 13న టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నీ సజావుగా సాగితే.. 17న అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. -
గేమ్‌చేంజర్ తిరుమావళవన్.. జీవితగాధ వింటే గూస్బంప్స్
చెన్నై: కొందరు నేతలు దళితుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటారు. కానీ, దళితుల కోసం చేసేది ఏమీ ఉండదు. కొందరు నేతలు మాత్రం దళితుల కోసం అహర్నిశలు కష్టపడతారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతారు. రాజకీయాల్లోకీ వారిని తీసుకొస్తారు. వారి వెనక ఉండి గెలిపిస్తారు. దళితులు ఏ ప్రాంతంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, ఏ ప్రాంతంలో మోసాలకు, అణచివేతలకు గురవుతున్నా అక్కడికి వెళ్లి మరీ వారి సమస్యలను పరిష్కరిస్తుంటారు. అటువంటి నేతే తిరుమావళవన్.తిరుమావళవన్ దళితుల హక్కుల కోసం తమిళనాడులో దీర్ఘకాలంగా ఉద్యమాలు చేపట్టిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 1990లలో తమిళనాడులో దళితులపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా తిరుమావళవన్ నిర్వహించిన సభలు, నిరసనలు పెద్ద ఎత్తున దళిత యువతను రాజకీయంగా చైతన్యపరిచాయి. కుల వివక్ష నిర్మూలన, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం అంశాలను ఆయన నిరంతరం ముందుకు తెచ్చారు. హిందుత్వ రాజకీయాలు దళితులపై ప్రభావం చూపుతున్నాయని విమర్శిస్తూ, దళితుల రాజకీయ ఐక్యత అవసరమని పిలుపునిచ్చారు. కుల హింస ఘటనల్లో బాధితులకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వ చర్యలు కోరారు. శ్రీలంక తమిళ శరణార్థుల సమస్యపైనా తిరుమావళవన్ గళం విప్పారు. ఎన్నికల్లో పోటీ చేసి, 2001లో ఎమ్మెల్యేగా అయ్యారు. 2009, 2019, 2024లో చిదంబరం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.రిజర్వ్ స్థానాలకే దళిత రాజకీయ నాయకులు, పార్టీలను పరిమితం చేసే రాజకీయ వ్యవస్థలో.. ప్రభుత్వాలకు బయట నుంచి మద్దతు ఇవ్వడమే కాదు, అధికార భాగస్వామ్యంలో కూడా దళిత పార్టీలకు స్థానం ఉండాలన్న తిరుమావళవన్ దీర్ఘకాల డిమాండ్ ఇప్పుడు నెరవేరుతోంది.తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వేళ టీవీకే విజయ్‌కు మద్దతు ఇచ్చి ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ. ఈ పార్టీ మొదట “దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా” పేరుతో 1982లో ఉద్యమంగా ప్రారంభమై, తర్వాత “విదుతలై చిరుతైగళ్ కచ్చి”గా రాజకీయ పార్టీగా మారింది. తమిళనాడు రాజకీయాలను మార్చిన దళిత పార్టీగా వీసీకే నిలిచింది. ఈ పార్టీని స్థాపించిన వారు ఎం.మలల్చామి, డి.అముకురాజా. ప్రస్తుత వీసీకే ఛైర్‌పర్సన్‌గా తోల్ తిరుమావళవన్ , ప్రధాన కార్యదర్శిగా డి.రవికుమార్ ఉన్నారు.దళితుల ఆశాజ్యోతి తమిళనాడులో దళితుల కోసం తిరుమావళవన్ చేసిన కృషి అంతాఇంతా కాదు. ఇప్పటిది కాదు. 1996లో చిదంబరం దక్షిణ కార్ వీధిలో నిలబడి తిరుమావళవన్ నినాదాలు చేస్తూ దళితుల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అణచివేతను మౌనంగా భరించేందుకు అలవాటు పడ్డ అనేక మంది దళిత యువతలో అది రాజకీయ చైతన్యానికి నాంది పలికింది.వీసీకే రాజకీయాల్లోకి 1999లో అధికారికంగా అడుగుపెట్టింది. 2024లో వీసీకే తమిళనాడులో అతిపెద్ద దళిత పార్టీగా ఎదిగింది. తాజా ఎన్నికల్లో రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్నా.. వీసీకే ఇప్పుడు కూటమిలో కీలక భాగస్వామిగా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు వేళ విజయ్ టీవీకేకు మద్దతు ఇచ్చి, తమిళనాడు రాజకీయాల్లో కింగ్‌మేకర్‌గా ఎదిగింది. వీసీకే ప్రస్తుత అవకాశాలు, భవిష్యత్ దిశ ఇప్పటికీ ప్రధానంగా తిరుమావళవన్ వ్యక్తిత్వం, రాజకీయాలపైనే ఆధారపడి ఉన్నాయి.దళితుల సామాజిక న్యాయం, సాధికారతపై అంబేద్కర్ భావజాలం, హేతువాదం, సామాజిక సంస్కరణ, కుల వ్యతిరేక ఉద్యమంపై పెరియార్ భావజాలం, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకత, కార్మిక విముక్తిపై మార్క్స్ భావజాలం.. వీటన్నింటినీ సమ్మిళితం చేశారు తిరుమావళవన్. అణచివేత, అసమానతల అనేక పార్శ్వాలను ఎదుర్కొన్నప్పుడే విముక్తి సాధ్యమని ఆయన నమ్ముతా. వాటినే తిరుమావళవన్ ముందుకు తీసుకువెళ్తూ దళితుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నారు.దళితులు, అట్టడుగు వర్గాల ప్రజలు తిరుమావళవన్‌ను తమ ఏకైక ఆశగా భావిస్తున్నారు. హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా చురుకుగా పోరాడుతున్న తమిళనాడులోని ఏకైక కుల వ్యతిరేక పార్టీ వీసీకేనని వారు చెబుతున్నారు.ఇటీవల ముగిసిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వీసీకే ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుచుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే రాజకీయ ప్రయాణంలో కొత్త దశకు నాంది పలికాయి. తిరుమావళవన్ కృషి ఎన్నికల తర్వాత దాని ప్రాధాన్యం మరింత పెరిగింది. తమిళనాడులో హంగ్ రావడంతో ప్రభుత్వం ఏర్పాటు వేళ వీసీకే కీలక పాత్ర పోషిస్తోంది. -
తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్‌లు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. కేరళం పర్యటనను గవర్నర్ రద్దు చేసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే, విజయ్‌కు గవర్నర్ తొలుత.. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో లోక్‌భవన్‌కు వచ్చిన విజయ్.. వెనుదిరిగారు. కేరళంకు వెళ్లడానికి సిద్ధమైన గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్‌కు సమయం ఇవ్వలేదు.విజయ్ కంటే ముందుగా లోక్‌భవన్‌కు సీపీఎం నేతలు చేరుకోగా.. వారిని కూడా లోక్‌భవన్ సిబ్బంది వెనక్కి పంపించారు. అయితే, చివరి క్షణంలో గవర్నర్ తన మనస్సు మార్చుకున్నారు. కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. విజయ్‌కు అపాయింట్మెంట్ ఇచ్చారు. టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీసీకే నుంచి మద్దతు లేఖ కూడా టీవీకే బృందం అందుకుంది. దీంతో వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది.ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్‌కు ఎమ్మెల్యేల మద్దతు 121కి చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేయడానికి.. మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ను విజయ్ కోరారు. ఇవాళ(శనివారం) సాయంత్రం గవర్నర్‌ను కలిసిన విజయ్.. తనకు మద్దతు ఇస్తున్న వారి పేర్లతో లేఖను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంటీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. రేపు(మే 10, ఆదివారం) నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు జాబితా గవర్నర్‌కు అందజేశారు. -
తమిళనాడులో మొదలైన విజయ్ ఫ్యాన్స్ సంబరాలు
-
పాపం విజయ్... తెరవెనుక జరుగుతుంది ఇదే..!
-
తొలగిన అడ్డంకులు విజయ్ కు సంపూర్ణ మద్దతు
-
విజయకి మరో షాక్.. చివరి నిమిషంలో మెలిక పెట్టిన VCK
-
టెన్షన్ టెన్షన్ విజయ్ కు VCK మద్దతు!
-
గవర్నర్ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు ఇది తమిళనాడు బిడ్డా.. మీ ఆటలు సాగవు
-
టీవీకే సర్కార్ ఏర్పాటుపై ట్విస్ట్.. పళనిస్వామి సంచలన పోస్ట్
చెన్నై: తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్నాయి. ఇప్పటికి మద్దతు లెక్కలు తేలలేదు. విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామి పోస్ట్ వైరల్‌గా మారింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. పళనిస్వామి కీలక పోస్ట్‌తో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి అభినందనలు అంటూ ఎడప్పాడి పళనిస్వామి ట్వీట్ చేశారు. దీంతో విజయ్‌తో వీసీకే పొత్తు ఖాయమైందంటూ ప్రచారం జరుగుతోంది.తమిళనాడు ఎన్నికల తర్వాత ప్రతిష్టంభన ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తున్న తరుణంలో పళనిస్వామి వ్యూహాత్మక పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్‌కు అవసరమైన మద్దతు లభించిందా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఏ పార్టీ పేరునూ నేరుగా ప్రస్తావించకుండానే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న పార్టీకి పళనిస్వామి అభినందనలు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి కొద్దిగా దూరంలో నిలిచింది. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో ఈపీఎస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నివారించడానికి.. అలాగే బీజేపీ పరోక్ష జోక్యాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్, సీపీఐ, CPI(M) పార్టీలు ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు అందరి దృష్టి తోల్ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే (విడుతలై చిరుతైగల్ కట్చి) పార్టీపై పడింది. ఆ పార్టీ తీసుకునే నిర్ణయమే విజయ్ మెజారిటీ మార్కును దాటడానికి అత్యంత కీలకం కానుంది.తెరవెనుక విజయ్‌కు అవసరమైన పూర్తి మద్దతు లభించిందనే బలమైన నమ్మకం విపక్ష కూటమిలో వ్యక్తమవుతోందని.. అందుకే పళనిస్వామి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండు రోజులుగా తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతోంది. వీసీకే పార్టీ తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
విజయ్‌కు సీఎం చాన్స్ ఇవ్వాల్సిందే: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ఏమాత్రం మంచి చేయని కూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పుడు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం తాతయ్య గుంట గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భగా తాజా తమిళ రాజకీయ సంక్షోభంపైనా ఆమె స్పందించారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. కాబట్టి విజయ్‌కు సీఎంగా ప్రమాణం చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అవకాశం ఇవ్వాలి. తద్వారా తమిళ ప్రజల నిర్ణయాన్ని ఆయన ఆమోదించాలి అని రోజా అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి, విజయ్‌కు దగ్గర పోలికలు ఉన్నాయని అన్నారామె. ‘‘జగనన్నకు, విజయ్‌కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సింగిల్‌గా పోటీ చేసి సీఎం అయ్యారు. అలాగే హామీల అమలు విషయంలోనూ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు’’ అని అన్నారామె. జగనన్న పాలనలో తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారని.. సీఎం హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. ఈవీఎంల మోసంతో కూటమి ప్రభుత్వం ధికారంలోకి వచ్చిందని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ల బండారం బయటపడుతుందని ఆర్కే రోజా అన్నారు. -
విజయారోహణలో ట్విస్టులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రివాజుకు భిన్నంగా ప్రధాన ద్రవిడ పార్టీలు రెండింటినీ రెండంకెలకు పరిమితం చేసి, రాజకీయ తెరపైకి విజేతగా దూసుకొచ్చిన సినీ నటుడు విజయ్‌కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో చివరి నిమిషంలోనూ అవరోధాలు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రిగా శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని తొలుత అనుకున్నా వీసీకే, ఐయూఎంఎల్ లేఖలు రాలేదని అంటున్నారు.దాంతో విజయ్ వరసగా మూడోరోజు గవర్నర్‌ని కలిసినా ఫలితం లేకపోయింది.సొంతంగా 108 స్థానాలు సాధించి అత్యధిక స్థానాలున్న పార్టీగా ఆవిర్భవించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తామని అయిదుగురు సభ్యులున్న కాంగ్రెస్ ప్రకటించగా, తాజాగా రెండేసి స్థానాలున్న సీపీఐ, సీపీఎంలు అంగీకారం తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 118 అవసరం కాగా, రెండుచోట్లనుంచి గెలిచిన విజయ్ ఎటూ ఒక స్థానం నుంచి తప్పుకోవాలి గనుక టీవీకే నికర బలం 107. రాజీనామా చేసే స్థానం తమకిస్తేనే లేఖ ఇస్తామని వీసీకే పట్టుబట్టగా, ఐయూఎంఎల్ అసలు లేఖే ఇవ్వలేదంటున్నారు. ఈ అంకెల ఆట ఎలావున్నా, ఆర్లేకర్ తీరు సంప్రదాయాలకు విరుద్ధం. ఈనెల 6న విజయ్ తొలిసారి గవర్నర్‌ను కలిసినప్పుడే ఆ వ్యవహారం ముగియాల్సి ఉండగా ఎందుకనో దీన్నింకా సాగదీస్తున్నారు.ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా ‘ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్ భవన్లలో కాద’ని తెలిపింది. ఉన్నవాటిలో మెజారిటీ పొందిన పక్షమేదో గమనించుకుని ఆహ్వానించటం, బల నిరూపణకు గడువీయడం తప్ప గవర్నర్‌కు మరే ప్రత్యామ్నాయమూ లేదు. అందుకు భిన్నంగా వ్యవహరించటం ఎలా చూసినా ధర్మం కాదు. ఇది అనవసర అపోహలు, అనుమానాలకు తావిచ్చింది. కేంద్రం రాష్ట్రంలో అస్థిరత కోరుకుంటున్నదనీ, రాష్ట్రపతి పాలన విధిస్తారనీ వదంతులు వ్యాపించాయి. కొన్ని గంటలపాటు డీఎంకే, ఏఐఏడీఎంకేలు కలుస్తాయన్న పుకార్లు షికార్లు చేశాయి. అలా కలిసినా ఆ పక్షాలు విజయ్ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం ఉండదు.ఈ ఊహాగానాలకు తావిచ్చేలా జాప్యం చేయటం అవసరమా? బలనిరూపణలో విఫలమైతే విజయ్ సర్కారు తప్పుకోవాల్సిరావొచ్చు. దానివల్ల కలిగే కష్టనష్టాలు ఆయన చూసుకుంటారు. ఆ పరిస్థితి ఏర్పడితే టీవీకే తర్వాత స్థానంలోవున్న పార్టీని ఆహ్వానించాలి.అంతేతప్ప లోక్‌భవన్‌లో లెక్కలు వేస్తూ కూర్చోవటం సరికాదు. విజయ్ తమ లేఖతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ కూడా ఇవ్వటమే సమస్య తెచ్చిందని కొందరు వాదిస్తు న్నారు. ప్రజల మనోభీష్టం నెరవేర్చేందుకు సాంకేతికపరమైన అంశాలు అభ్యంతరం కావటం సరికాదు.పొరుగునున్న కర్ణాటకలో కొన్నేళ్లక్రితం బీజేపీకి తక్కువ స్థానాలొ చ్చినా మెజారిటీ స్థానాలున్నాయి గనుక దాన్నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ నిర్ణయాన్నెవరూ తప్పుబట్టలేదు. సర్కారియా కమిషన్ సైతం 1988నాటి నివేదికలో ఎన్నికల ముందు ఏర్పడిన కూటములనూ, లేనట్టయితే ఉన్న పక్షాల్లో అత్యధిక స్థానాలొ చ్చిన పార్టీనీ పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈ రెండేళ్లలో విజయ్ సాధించిన రాజకీయ అనుభవం సంగతేమోగానీ... ఈ మూడు నాలుగు రోజుల్లో ఆయనకది దండిగానే దక్కింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ తీరు జుగుప్సాకరంగావుంది. జాతీయస్థాయిలో ఇండియా కూటమికి నాయ కత్వం వహిస్తూ తన భాగస్వామ్యపక్షం తమిళనాట ఓడిపోగానే చేతులు దులుపుకొని బయటకు పోవటం ఏం నీతి? అందువల్ల విజయ్‌కి వీసమెత్తు ప్రయోజనం లేకపోగా, విపక్ష కూటమికి అది చేటు తెస్తుంది. కనీసం సహ భాగస్వామ్యపక్షాలు డీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎంలనైనా సంప్రదిస్తే మర్యాదగా ఉండేది.చివరకు సీపీఐ, సీపీఎం వచ్చి చేరాయిగానీ... రాజ్యాంగసంక్షో¿¶ నివారణకే ఆ పనిచేశాయి. ఆ మాత్రం వేచిచూడాలన్న ఇంగితజ్ఞానం లేకపోగా, భవిష్యత్తు ఎన్నికలన్నిటికీ ఈ కొత్త పొత్తు వర్తిస్తుందని ప్రకటించి కాంగ్రెస్ మరింత చులకనైంది. ఒంటరిగా బరిలోదిగి తన సత్తాతో జనాభిమానం చూరగొని మెజారిటీ స్థానాలు పొందిన విజయ్‌కి అవకాశమీయకుండా మీనమేషాలు లెక్కించటం సరికాదు. అది అప్రజాస్వామికం. అన్ని అడ్డంకులూ తొలగి ఆయన ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, ప్రజాభీష్టం నెరవేరుతుందని ఆశించాలి. -
విజయ్ కాన్వాయ్ సిద్ధం 118 MLAల సంతకాలతో రెడీ
-
విజయ్ సిద్ధం.. రేపే ప్రమాణ స్వీకారం?
-
కాంగ్రెస్ తో కటీఫ్.. స్టాలిన్ సంచలన నిర్ణయం
-
DMK-AIADMK పొత్తు.. స్టాలిన్ నమ్మక ద్రోహి
-
అలా జరిగితే విజయ్ మళ్లీ ఎన్నికలకు వెళ్లడం ఖాయం..
-
విజయ్ నిర్ణయం ప్రమాదం? కొమ్మినేని సంచలన కామెంట్స్
-
తమిళనాడు లోక్ భవన్ వద్ద హై టెన్షన్
-
తమిళనాడులో రాష్ట్రపతి పాలన? లేకుంటే..
దేశం మొత్తం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తోంది. ఒక అగ్రనటుడు పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పూర్తి బలం లేకున్నా ప్రభుత్వ ఏర్పాట్లకు ప్రయత్నించడం.. మ్యాజిక్ ఫిగర్ లేదంటూ గవర్నర్ అందుకు అనుమతించకపోవడం విమర్శలకూ తావిచ్చింది. ఈ తరుణంలో తమిళనాడులో మే 10 దాటితే ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో.. విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ 118.. అంటే ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 స్థానాలు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్ తన ఐదుగురు ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించింది. విజయ్ రెండు చోట్ల పోటీ చేసి నెగ్గడంతో.. ఇంకో సీటు అదనంగా అవసరం కానుంది. అంటే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే సరిపోతుందన్నమాట.ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ తర్వాత బలనిరూపణ చేసుకుంటామని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు విజయ్ రెండుసార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో.. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్లు సానుకూలంగా వ్యవహరించిన సందర్భాలే అధికంగా ఉన్నాయి. కానీ, తమిళనాడు విషయంలోనే గవర్నర్ ఆర్లేకర్ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయాలని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని విజయ్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో..విజయ్‌కు ఇతర పార్టీల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో.. తమిళనాడు 16వ అసెంబ్లీ గడువు ముగియడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈలోపు ప్రభుత్వ ఏర్పాటు అంశం కచ్చితంగా ఓ కొలిక్కి రావాలని లేదు. కాకుంటే గవర్నర్ తన విశిష్ట అధికారాల్ని (Discretionary Powers) ఉపయోగించే అవకాశమూ లేకపోలేదు. ఒకటి.. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేదాకా కొనసాగమని కోరడం.. రెండోది టీవీకేను పక్కనపెట్టి ఇతర కూటములను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడం.. మూడోది రాష్ట్రపతి పాలన విధించే అవకాశం!.తమిళనాడులో గతంలో నాలుగుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. కరుణానిధి హయాంలో 1976 జనవరి నుంచి 516 రోజులపాటు, ఎంజీఆర్ సీఎంగా ఉన్న టైంలో 1980 ఫిబ్రవరి నుంచి 113 రోజులపాటు, 1988లో ఎంజీఆర్ మరణాంతరం ఆయన సతీమణి జానకీ సీఎంగా ఉన్నప్పుడు 363 రోజులపాటు, చివరగా.. 1991లో కరుణానిధి హయాంలో 145 రోజులపాటు రాష్ట్రపతి పాలన విధించారు.రాజకీయ విశ్లేషకులు చెబుతోంది ఏంటంటే.. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించాలనే కచ్చితమైన రూల్ రాజ్యాంగంలో లేదు. కాకుంటే.. మెజారిటీ నిరూపించలేకపోయినా.. ప్రభుత్వం ఏర్పడకపోయినా "రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది" అని కారణాన్ని చూపిస్తూ కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపే అవకాశం ఉంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడవడం లేదని/ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం కొనసాగడం అసాధ్యమని కేంద్రం భావిస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఆ అవకాశం లేకపోలేదు.సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ముందుగా అవకాశం ఇవ్వడం ఒక సంప్రదాయం. అయినప్పటికీ, అది రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉండదు. గవర్నర్ తన నిర్ణయాన్ని మెజారిటీ నిరూపణ ఆధారంగా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అయితే తాజా తమిళనాడు ఎపిసోడ్ నేపథ్యంలో.. గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు అప్పుడు గవర్నర్లు రాష్ట్రపతి పాలనకు సిఫార్సులు చేసిన సందర్భాలు ఉన్నాయి.1996లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 174 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ టైంలో మేజిక్ ఫిగర్ 213. బీజేపీకి అది సాధ్యం కాలేదు. ఏ కూటమి కూడా మెజారిటీ సాధించలేకపోవడంతో అప్పటి గవర్నర్ రాష్ట్రపతి పాలన కొనసాగించారు(ఎస్పీ-బీఎస్పీ కూటమి కూలిపోవడంతో 1995లోనే గవర్నర్ మోతీలాల్ వోరా రాష్ట్రపతి పాలన విధించారు). ఆ తర్వాత ఏడాదికి బీజేపీ-బీఎస్పీ కూటమి ఏర్పడి మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కేసు.. ఇక్కడ ఒక పార్టీ అత్యధిక సీట్లు గెలుపొందడం ముఖ్యం కాదు అని చెప్పింది. ఇక.. 2005 బీహార్ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే ఒకవైపు కూటమి ప్రయత్నాలు జరుగుతుండగానే అప్పటి గవర్నర్ బూటా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదటి సమావేశం జరగకముందే ఆ అసెంబ్లీని రద్దు చేసి.. ‘‘హార్స్ ట్రేడింగ్ జరుగుతోంది’’ అని కేంద్రానికి నివేదిక పంపి రాష్ట్రపతి పాలన విధించారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరడం.. గవర్నర్ వ్యవహరించిన తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టడం.. అది రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయమని.. గవర్నర్ అధికారాలను పరిమితం చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగాయి. అయితే అప్పటికే ఎన్నికల తేదీలు ప్రకటించడంతో కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం ఇక్కడికే పరిమితం చేసింది.విజయ్ పార్టీ (TVK) అత్యధిక స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ మెజారిటీకి కావలసిన 118 సీట్లు దాటలేకపోవడంతో గవర్నర్ మద్దతు లేఖలు కోరుతున్నారు. ఆయన అడిగిన దాంట్లో తప్పుందని కూడా అనలేం. 2006లో డీఎంకేకు 96 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ, మిత్రపక్షాల మద్దతు లేఖలతో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకొచ్చింది. మెజారిటీ ఉండడంతో గవర్నర్ అందుకు అనుమతించారు. ఆ తర్వాత బలనిరూపణలో ప్రభుత్వం నెగ్గింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ఒక అత్యవసర పరిస్థితిలో మాత్రమే అమలు చేసే చర్య. ప్రస్తుత తమిళనాడు విషయంలో గవర్నర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే వివాదాలకు దారి తీసే అవకాశం కూడా. గవర్నర్ నివేదికలు, ఆర్టికల్ 356 వినియోగం.. కోర్టు సమీక్షకు లోబడి ఉండాలని గతంలో న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అలాగే ఎన్నికల ద్వారా వచ్చిన అసెంబ్లీని రద్దు చేయడం అత్యంత అసాధారణం కూడా. ఒకవేళ.. తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ గనుక ఏదైనా అసాధారణ నిర్ణయం తీసుకుంటే టీవీకే పార్టీ సుప్రీం కోర్టు తలుపు తట్టే అవకాశం లేకపోలేదు. -
108 మంది ఎమ్మెల్యేల సామూహిక రాజీనామా..?
-
విజయకి కాన్వాయ్ రద్దు DGPపై గవర్నర్ సీరియస్
-
118 మందితో రా.. విజయ్ కి గవర్నర్ భరోసా..
-
పొలిటికల్ థ్రిల్లర్
-
TVKకు కాంగ్రెస్ మద్దతు.. DMK ఫైర్
-
DMK తో 55 ఏళ్ల బంధాన్ని వదిలి TVK కు కాంగ్రెస్ మద్దతు
-
TVK లీడర్ గా చెబుతున్నా..పొలిటికల్ గా వైఎస్ జగనే విజయకు స్ఫూర్తి
-
బాబొచ్చారు ఓటమి తెచ్చారు
-
ఎవరీ అధవ్ అర్జున? విజయ్ గెలవడానికి కారణం ఇతనేనా!
-
సింహం సింగిల్ గా విజయ్ గెలుపు వెనుక 10 కారణాలు ..
-
ఆ పార్టీలతో విజయ్ పొత్తు ఖరారు.. ఎల్లుండే ప్రమాణ స్వీకారం
-
సింగిల్ గా సింహంలా గర్జించాడు.. విజయ్ గెలుపు పై అంబటి రియాక్షన్
-
విజయ్ కు తోడుగా త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్ బై ?
-
TVK ఎమ్మెల్యేలతో విజయ ఇదే మన స్టాండ్..
-
గెలిచిన చోట విజయ్ రాజీనామా..
-
ఊరిస్తున్న సీఎం కుర్చీ.. 108 సీట్లు వచ్చినా.. విజయకి కష్టాలే
-
విజయ్ వెంట ఎవరెవరు? ఆప్షన్స్ ఇవే
-
విజేతను నిర్ణయించేది 'విజయ్ ఫ్యాక్టర్!'
ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో సినీ నటుడు హీరో విజయ్ నిర్ణాయక అంశం కాబోతున్నారు. సీట్ల సంఖ్య ఎలా ఉన్నా, ఓట్ల చీలికలో విజయ్ ప్రభావం వల్ల విపక్ష ఏఐడీఎంకే–బీజేపీ కూటమి కన్నా పాలక డీఎంకే–కాంగ్రెస్ కూటమికే మేలు జరిగే సూచనలున్నాయి. ఢిల్లీ పెత్తనం వర్సెస్ ‘తమిళ ప్రైడ్’ తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశముంది. విపక్షాల్లో అనైక్యత లాభించి, తండ్రి కరుణానిధి సాధించలేని ఘనత – డీఎంకేను వరుసగా రెండోసారి గెలిపించడం తనయుడు స్టాలిన్ సాధించనూవచ్చు!తమిళనాట ద్రవిడ పార్టీల రాజకీయాలది ఆరు దశాబ్దాల చరిత్ర! 1967 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. రాష్ట్రంలో తమకంటూ సొంతంగా బలం, బలగం లేకపోయినా... డీఎంకే మద్దతు కాంగ్రెస్‌కు, ఏఐడీఎంకే మద్దతు బీజేపీకి ఢిల్లీలో కావాలి. అందుకే ఆ రెండు ప్రధాన స్రవంతి జాతీయ పార్టీలు ద్రవిడ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని, అల్ప భాగస్వాములు (తోక పార్టీలు)గా పోరాడుతున్నాయి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ ప్రాంతీయ శక్తులు భాగం పంచుకుంటాయి తప్ప, రాష్ట్ర అధికారంలో మాత్రం జాతీయ పార్టీలకు ఎప్పుడూ భాగమి వ్వవు. ఒక పరిమితిని (8 నుంచి 10 శాతం ఓటు వాటా) మించి ఆయా పార్టీలను రాష్ట్రంలో ఎదగనీయవు. ఈసారి విశేషమేమంటే, సినీ కెరటం విజయ్, అన్ని స్థానాల నుంచి బరిలోకి దిగి ఈ రెండు కూటములకు గట్టి సవాల్ విసురు తున్నారు. గ్రామీణ, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల యువతలో విజయ్ అంటే ఎంతో క్రేజ్ ఉంది. పాలక ‘లౌకిక ప్రగతిశీల కూటమి’లో డీఎంకే, కాంగ్రెస్‌లతో పాటు డీఎండీకే, వీసీకే తదితర ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. వీరి మధ్య సయోధ్య, సీట్ల సర్దుబాటు ఒకింత సామరస్యంగా జరిగింది. ‘ప్రభుత్వ వ్యతిరేకత’ బలపడనీయకుండా గట్టి సంకేతం ప్రజాక్షేత్రంలోకి పంపగలిగారు. విపక్ష ఎన్డీయే కూటమి భాగస్వా ముల మధ్య సఖ్యత గొప్పగా లేదు. కూటమిలో ఆధిపత్యానికి మొదట కొంత యత్నించిన బీజేపీ, చివరకు విధిలేని పరిస్థితుల్లో పొత్తుల్లో ఏఐడీఎంకే ఆధిపత్యానికే తగ్గింది. గణాంకాలు చెప్పేవి అర్ధ సత్యాలే!రాజకీయాలు అంకగణితం కాదు, 2+2 నాలుగవటం లెక్కల్లోనే తప్ప రాజకీయాల్లో అవాలని లేదు. 2+2 ఆరు అవొచ్చు, జీరో అవొచ్చు. 234 స్థానాలున్న అసెంబ్లీలో అధికారానికి 118 సీట్లు కావాలి. ఈసారి ఏ ఒక్క పార్టీకి ఆ సంఖ్య దక్కకపోవచ్చు. 2021 ఎన్నికల్లో డీఎంకే నేతృత్వపు ఎస్పీయే కూటమి 45.3 శాతం ఓటు వాటాతో 159 స్థానాలు గెలిచింది. అంతకు ముందు స్టాలిన్ మేయర్‌గా చేసిన చెన్నై మహానగర్ పరిధిలోని 22 అసెంబ్లీ స్థానాల్లో ఏఐడీఎంకేకు ఒక సీటు కూడా రాలేదు. ఎన్డీయే కూటమి 39.7 శాతం ఓటు వాటాతో 75 స్థానాలు నెగ్గింది. 2016 ఎన్నికల్లో జయ లలిత గెలుపు తర్వాత మరే ఎన్నికల్లోనూ ఏఐడీఎంకేకు ఆధిపత్యమే దక్కలేదు. అదే యేడు చివర్లో జయలలిత మరణం తర్వాత... పళనిస్వామి, పన్నీరు సెల్వమ్ల మధ్య వివాదాలతో పార్టీ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికలు (38/39), తర్వాతి అసెంబ్లీ (2021) ఎన్నికలు (159/234), అటు తర్వాత మూడేళ్లకు జరిగిన 2024 లోక్‌సభ (39/39), స్థానిక సంస్థల ఎన్నికలు, 2021–2026 మధ్య దాదాపు అన్ని ఉపఎన్నికలు... ఇలా అన్నిటా డీఎంకే మిత్రులు గెలుస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో చివరి పెద్దపోరు 2024 లోక్‌సభ ఎన్నికల్లో, 221 అసెంబ్లీ సెగ్మెంట్లలో డీఎంకే కూటమికి ఆధిక్యత లభిస్తే ఏఐడీఎంకేకు 10 చోట్ల, పీఎంకేకు 3 చోట్ల ఆధిక్యత దక్కింది. ఆ ఎన్నికల్లో బీజేపీ, ఏఐడీఎంకేలు విడిగా పోటీ చేశాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పీఎంకేకు 3 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత లభించింది తప్ప బీజేపీకి ఒకచోట కూడా ఆధిక్యత రాలేదు. గణాంకాల పరంగా చూసినపుడు డీఎంకే కూటమి బలంగా కనిపిస్తోంది. 1984లో ఎంజీ రామచంద్రన్, 2016లో జయలలిత తప్ప వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని గెలిపించుకొని, తిరిగి ముఖ్యమంత్రి అయినవారు లేరు. కరుణానిధికి అదెప్పుడూ సాధ్యపడలేదు. స్టాలిన్ మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి అయితే తండ్రిని మించి రికార్డు నెలకొల్పినట్టే!ఢిల్లీ వర్సెస్ తమిళ గాలిప్రాంతీయ, భాష, సాంస్కృతిక, రాజకీయ అస్తిత్వ భావో ద్వేగాల రాష్ట్రం తమిళనాడు. అవి రగిలినపుడు, జనం ఎటువైపు మళ్లినా ఉప్పెనలా ఎగిసిపడతారని ప్రచారం. జాతీయ పార్టీలు, జాతీయ అంశాల ప్రభావం నామమాత్రమే! స్టాలిన్ నెమ్మదిగా రాజకీయ పోరాటాన్ని ఢిల్లీ పెత్తనం వర్సెస్ తమిళ గౌరవం కిందకు మార్చే యత్నం చేస్తున్నారు. త్రిభాషా సూత్రం, బీజేపీయేతర ప్రభుత్వాలపై గవర్నర్ల ద్వారా దొడ్డిదారి పెత్తనం, నిధుల కేటాయింపులో వివక్ష, నియోజకవర్గాల పునర్విభజనలో ప్రాతినిధ్య తగ్గింపు ప్రమాదం... ఇలా పలు అంశాలతో ప్రచారం చేస్తున్నారు.తమిళ సమాజం మీద మొదటి, రెండో తరం నాయకులంత పలుకుబడి, ప్రభావం కలిగిన నేత కాదు స్టాలిన్. అయినా ఈతరంలో స్టాలిన్‌కు దీటుగా నిలువగలిగే నాయకులు లేరు. మొదటి తరంలో రాజాజీ, కామరాజ్ నాడార్, అన్నాదురై లాంటి హేమాహేమీలుంటే, తర్వాతి తరంలో సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత ఒక వెలుగు వెలిగారు. సినీరంగం నుంచి కమల్‌హాసన్, విజయ్‌కాంత్ (దివంగత), సీమాన్... ఇలా కొందరు ప్రయత్నించినా నిలదొక్కుకున్నది లేదు. కానీ, హీరో విజయ్ భిన్నంగా కనిపిస్తున్నారు. గత సంవత్సరం కరూర్ ర్యాలీ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన తర్వాత పెద్ద ర్యాలీలు, సభల్ని విజయ్ నిరాకరిస్తున్నారు కానీ, లోలోపల యువ తలో ఆసక్తి రేపుతున్నారు. తమిళ ఓటర్లలో 40 శాతం మంది 40 ఏళ్లలోపు వారే! రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ యువత విజయ్ వైపు మొగ్గితే ఎన్నికల సమీకరణాలే మారొచ్చు.తమిళ ఆకాంక్షలే ప్రతిఫలిస్తాయి!‘ఎన్నికల ఉచితాల’కు పేరుబడ్డ తమిళనాడులో వాటికి, నగదు బదిలీలకు మించి అదనంగా తమిళ ప్రజలు ఏదో కోరుకుంటు న్నారని ఈ ఎన్నికల సరళి చెబుతోంది. స్టాలిన్‌ను వెంటనే గద్దె దించేయాలన్నంత కోపం మూకుమ్మడిగా తమిళ ప్రజల్లో లేదు కనుక ‘విజయ్’ ఫ్యాక్టర్ విపక్షాలకు ఉపయోగపడకపోవచ్చు. దించేయాలన్నంత వ్యతిరేకత ఉంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయ్ చేసిన ప్రచారమంతా డీఎంకేని ఓడించగలిగే ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే–బీజేపీ కూటమి ఖాతాలో చేరేది. కానీ, 2009 ఏపీ ఎన్నికల్లో ‘చిరంజీవి’ (ప్రజారాజ్యం), జయప్రకాశ్ నారాయణ (లోక్‌సత్తా) ఫ్యాక్టర్ పాలకపక్షం కాంగ్రెస్‌కు లాభించి డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసినట్టు ఇక్కడ కూడా విజయ్ కారకం స్టాలిన్‌కే లాభం చేకూర్చవచ్చు. కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీ కన్నా మెరుగ్గా ఏం లేకపోయినా ప్రధాని మోదీ సానుకూలత ఎంతో కొంత తగ్గి, రాహుల్ ప్రజాదరణ పెరిగినట్టు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. మహిళల ఓట్లు ఈసారి మూకుమ్మడిగా ఒక వైపు వెళ్లే పరిస్థితి లేదు. ఇలా అనేక అంశాలతో పాటు ‘విజయ్ ఫ్యాక్టర్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విజేతను తేల్చనుంది.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ డైరెక్టర్ -
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్‌జెండర్‌కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్‌కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్‌ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి. -
డిప్యూటీ సీఎం బర్త్‌డే వేడుకల్లో అశ్లీల నృత్యాలు
తమిళనాడు మంత్రి పెరియా కరుప్పన్ చిక్కుల్లో పడ్డారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో(డిసెంబర్ 27న ఆయన బర్త్‌డే) అశ్లీల నృత్యాల్ని ప్రొత్సహించారాయన. పొట్టి దుస్తుల్లో అమ్మాయిలు డ్యాన్స్ చేస్తుంటే సంతోషంగా చప్పట్లు చరుస్తూ ఆయన జాలీగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో దుమారం రేగుతోంది. వీడియోలో మంత్రి పెరియా కరుప్పన్.. ముందువరుసలో జిల్లా స్థాయి పార్టీ నాయకులతో కలిసి కూర్చుని ప్రదర్శనను చూస్తున్నట్లు కనిపించారు. ఆ డ్యాన్సర్లను చూస్తూ మీసాలను మెలేశారాయన. ఆ తర్వాత ఆయన వేదికపై ఉన్న కళాకారులను దిగమని సంకేతాలు చేస్తూ.. తన దగ్గరగా నృత్యం చేయమని సూచిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో వాళ్లు ఆయన దగ్గరకు వచ్చి స్టెప్పులు వేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో మంత్రి తీరును పలువురు తప్పుబడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి.. డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకల్లో ఇలాంటి నృత్యాలను ప్రొత్సహించడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అన్నాడీఎంకే, బీజేపీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మహిళలకు గౌరవం ఇచ్చే తీరు ఇదేనా? అని బీజేపీ నిలదీస్తోంది. అర్థనగ్నంగా ఉన్న మహిళలను తమ వద్దకు పిలిపించుకుని ఇలా మురిసిపోయే నేతలకు.. తమ భద్రత గురించి మహిళలు ఎలా చెప్పుకోగలరు? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరుప్పున్ చరిత్ర గురించి పాపం వాళ్లకు తెలియదేమో. ఇది పగటిపూట జరిగిందని అదృష్టం, లేకపోతే ఏమి జరిగేదో ఊహించలేం అంటూ అన్నాడీఎంకే ఘాటు చురకలు అంటించింది. పలువురు నెటిజన్లు సైతం ఈ వీడియోపై మండిపడుతున్నారు. గతంలో ఓ మహిళతో ఆయన్న సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజా ఘటన నేపథ్యంలో ఆ వీడియోను పలువురు తెరపైకి తెచ్చారు. ఈ ఘటనపై డీఎంకే పార్టీ, ఉదయ్‌నిధి ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదు. மீசையை முறுக்கிக்கொண்டே ஆட்டத்தை ரசிக்கும் அமைச்சர் பெரிய கருப்பன்... வைரல் வீடியோவ முழுசா பாருங்க.... pic.twitter.com/D1sHnbpmd8— Kathir News (@KathirNews) November 26, 2025 -
అవును.. నిందితుడు మా పార్టీ మద్దతుదారుడే: సీఎం స్టాలిన్
చెన్నై: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటన తమిళనాట రాజకీయ దుమారం రేపుతోంది. అసెంబ్లీని సైతం దద్దరిల్లిపోయేలా చేసిన ఈ ఘటనపై బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. నిందితుడు తమ పార్టీ మద్దతుదారుడేనని ప్రకటించారాయన. అయితే..అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు సీఎం స్టాలిన్(CM Stalin) మాట్లాడుతూ.. ‘‘అన్నా వర్సిటీ ఘటనలో నిందితుడు కేవలం డీఎంకే మద్దతుదారుడేనని, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నట్లు పార్టీ సభ్యుడు ఎంతమాత్రం కాదు’’ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. మహిళల భద్రతే ప్రాధాన్యంగా పని చేస్తున్న తమ ప్రభుత్వం.. నిందితుడికి రక్షణ కల్పించలేదని, భవిష్యత్తులోనూ కల్పించబోదని, పైగా అతనిపై గుండా యాక్ట్ ప్రయోగించామని ప్రకటించారు. అన్నా వర్సిటీ ఘటన.. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.‘‘విద్యార్థినిపై లైంగిక దాడి(Sexual Assault) క్రూరమైన ఘటన. అయితే.. చట్ట సభ్యులు ఇవాళ ఈ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని విమర్శించడమే అంతా పనిగా పెట్టుకున్నారు. బాధితురాలి తరఫు నిలబడి సత్వర న్యాయం చేకూర్చాలనే మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాధారణంగా.. ఘటన జరిగాక నిందితుడు తప్పించుకుంటేనో.. అరెస్ట్‌లో జాప్యం జరిగితేనో.. లేకుంటే నిందితుడ్ని రక్షించే ప్రయత్నాలు జరిగితేనో విమర్శలు వినిపిస్తాయి. కానీ, ఇక్కడ వీలైనంత త్వరగా అరెస్ట్ చేసినా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే రాద్ధాంతం కాకపోతే ఇంకేంటి?’’ అని ప్రశ్నించారాయన. అన్నా వర్సిటీ(Anna University) ఘటనకు నిరసనగా ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యులు నల్లదుస్తులతో అసెంబ్లీకి వచ్చారు. వాళ్లను ఉద్దేశిస్తూ సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.గతంలో ఇదే ప్రతిపక్ష అన్నాడీఎంకే అధికారంలో ఉండగా.. పొల్లాచ్చి లైంగిక దాడి కేసు సంచలనం సృష్టించింది. ఆ టైంలో ప్రభుత్వం ఏం చేసింది?.. ఆలస్యంగా స్పందించడంతో నిందితుడు పారిపోలేదా? అని ప్రశ్నించారాయన. ప్రతిపక్షాలంతా నిందితుడు ఎవరు? మీ పార్టీ వాడు కాదా అని ప్రశ్నిస్తున్నాయి. అవును.. అతను మా పార్టీ మద్దతుదారుడే. కానీ, సభ్యుడు మాత్రం కాదు. ఈ విషయాన్ని మేం ముందు నుంచే చెబుతున్నాం. అరెస్ట్ విషయంలోనూ ఎక్కడా రాజకీయ జోక్యం జరగలేదు. ఒకవేళ.. అలా జరిగిందని ఆధారాలు ఉంటే సిట్‌కు సమర్పించండి. దర్యాప్తు అయ్యేదాకా ఎదురుచూడడండి. అంతేగానీ స్వప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేయొద్దు అని ప్రతిపకక్షాలను ఉద్దేశించి హితవు పలికారాయన. ఈ తరుణంలో అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇదిలా ఉంటే.. అన్నా వర్సిటీ ఉందంతంపై దాఖలైన ఓ పిటిషన్ విషయంలోనూ మదద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19) తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో.. క్యాంపస్‌కు దగ్గర్లో బిర్యానీ సెంటర్ నడిపే జ్ఞానేశ్వర్‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను డీఎంకే సభ్యుడంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. మరోవైపు.. ఈ కేసులో ఇంకొంతమంది నిందితులు ఉన్నారని.. వాళ్లను రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.ఇదీ చదవండి: బీజేపీ నేత నోటి దురుసు! ఫలితంగా.. -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా సమయం ఉంది. 2026 ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. అధికార డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. అటు బీజేపీ కూడా తమ ఓటు బ్యాంకు పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్- డీఎంకే కూటమిని ఓడించాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.ఏదైనా జరగొచ్చు..అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో జట్టు కట్టే అవకాశముందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సూచనప్రాయంగా వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే పార్టీని తమిళనాడులో లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలపడం లేదా ప్రస్తుతం కొనసాగుతున్న కూటమిని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. ‘వచ్చే ఎన్నికల సమయానికి ఏదైనా జరగొచ్చు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే మా ధ్యేయమ’ని అన్నామలై పేర్కొన్నారు. 2026లో ద్రవిడేతర పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.‘2026 అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ద్రవిడ పార్టీలు సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండకపోవచ్చు. నాన్-ద్రవిడన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నాం. మాది కూడా బలమైన కూటమే. తమిళనాడు ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. 2025లో జరిగే రాజకీయ పరిణామాలతో ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంద’ని అన్నామలై వ్యాఖ్యానించారు.బలమైన కూటమి ఏర్పాటు చేస్తాంఅన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడపాడి పళనిస్వామి కూడా ఇంచుమించు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వీరిద్దరిని మాటలను బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖాయమన్న అభిప్రాయం బలపడుతోంది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని ఓడించి తాము మళ్లీ అధికారంలోకి వస్తామన్న దీమాను పళనిస్వామి వ్యక్తం చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటతామని ప్రకటించారు. ‘అందరూ ఊహించినట్లుగానే ఏఐఏడీఎంకే బలమైన కూటమిని ఏర్పాటు చేస్తుంది. పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. రెండిటికీ చాలా తేడా ఉంది. 2026 మన ఎన్నికలు! ఇవి అన్నాడీఎంకే ఎన్నికల’ని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నారు.ఈసారి అటువంటి పొరపాటు చేయంలోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే నష్టపోయామన్న అభిప్రాయాన్ని పరోక్షంగా అంగీకరించారు పళనిస్వామి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి పొరపాటు చేయబోమని చెప్పారు. ‘2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐఏడీఎంకేపై అనేక విమర్శలు వచ్చాయి. సరైన పొత్తు లేకపోవడంపై పలువురు ప్రశ్నలు సంధించారు. పొత్తులు వస్తాయి, పోతుంటాయి.. కానీ ఏఐఏడీఎంకే భావజాలం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు, బలమైన కూటమి లేదు.. ప్రభుత్వంలో లేనప్పటికీ మేము 20 శాతానికి పైగా ఓట్లను సాధించాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే కూటమికి 26 శాతం ఓట్లు సాధించింది. 2019తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ’ని ఈపీఎస్ వివరించారు. ఈ ట్రెండ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.చదవండి: అమిత్ షా మాట.. ఒమర్ అబ్దుల్లా నోట.. ఏం జరిగింది?డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడమనేది పగటి కలగా మిగిలిపోతుందని పళనిస్వామి జోస్యం చెప్పారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు గెలుస్తామని చెబుతూ డీఎంకే పగటి కలలు కంటోంది. అది ఎప్పటికీ నిజం కాదు. డీఎంకేపై ప్రజల్లో కొత్త చైతన్యం వస్తోంది. అదే మా విజయమ’ని ఆయన అన్నారు. కాగా తమిళనాడు శాసనసభలో 234 మంది సభ్యులు ఉన్నారు. -
Actor Vijay: విజయ్ పార్టీ కోసం పని చేస్తారా?
చెన్నై: స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటన తర్వాత.. తమిళనాడు రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైం ఉంది. ఈలోపే విజయ్ ‘‘తమిళగ వెట్రి కళగం’’ TVK ఎవరితో చేతులు కలుపుతుంది? ఏ మేర ప్రభావం చూపెడుతుందంటూ డిబేట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రవేశంపై విజయ్ ప్రశాంత్ కిషోర్‌తో సైతం చర్చలు జరిపినట్లు వార్తలు వినవచ్చాయి. ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్‌కు దీనికి సంబంధించి ప్రశ్న ఎదురైంది. విజయ్ అడిగితే ఆయన పార్టీ కోసం పని చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘విజయ్ నాతో టచ్‌లో లేరు. ప్రస్తుతం ఎన్నికల వ్యహకర్త వ్యవహారాలను నేను చూడడం లేదు. ఒకవేళ ఆయన నన్ను అడిగినా.. ఆ పని చేయలేను. కానీ, ఆయన కోరుకుంటే మాత్రం సలహాలు ఇచ్చి సాయం చేయగలను. ఎందుకంటే.. నన్ను గౌరవించే వాళ్లకు సలహాలు ఇవ్వడం నాకు అలవాటు’’ అని పీకే క్లారిటీ ఇచ్చారు. ఇక.. ఇదే ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాలపై స్పందించిన పీకే.. అక్కడి రాజకీయాల్లో విజయ్ ప్రభావంపైనా మాట్లాడారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని తేలికగా తీసుకోవద్దని ఇతర పార్టీలకు సూచించారు. ముఖ్యంగా ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకు 60 నుంచి 65 శాతం తగ్గిపోయే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. -
Vijay Political Party: రాజకీయ పార్టీ ప్రకటించిన హీరో విజయ్
తమిళనాడులో హీరో విజయ్ పార్టీ ప్రకటించాడు. 'తమిళగ వెట్రి కళగం'Tamizhaga Vetri Kazhagam పేరుతో ఆయన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. గత మూడేళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా నేటితో దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తమిళగ వెట్రి కళగం పేరును రిజస్టర్ చేసినట్లు ప్రకటన రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఆయన ఎక్కువగా ప్రజల్లోనే కనిపించడమే కాకుండా పలు సేవా కార్యక్రామాల్లో పాల్గొంటు ఉన్న విషయం తెలిసిందే. పార్టీ ప్రకటన అయితే వచ్చేసింది కానీ అందుకు సంబంధించిన గుర్తును త్వరలో ప్రకటించనున్నారు. పార్టీ ఎజెండాను కూడా త్వరలో ప్రకటిస్తామాని విజయ్ నుంచి ఒక నోట్ వెలువడింది. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని దానిని నిర్మూలించడమే తన ధ్యేయం అని విజయ్ అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్ పేర్కొన్నారు. హీరో విజయ్ తన రాజకీయ రంగప్రవేశం ఒకరోజుతో అనుకుని జరగలేదు. పక్కా ప్లాన్‌తోనే ఆయన అడుగులు వేశారు. పొలిటికల్ రంగంలోకి దిగిన తర్వాత తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి అనే దృఢ సంకల్పంతోనే టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తన విజయ్ మక్కళ్ ఇయక్కుమ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరవయ్యారు. ఈ సంఘం ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆపై అనేక రక్తదాన శిబిరాలతో పాటు ఉచిత విద్య కేంద్రాలు, ఉచిత న్యాయ సలహా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ ఏర్పాటు చేశారు. గతేడాది తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు చెందిన పదవ తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ముగ్గురు చొప్పున తన కార్యాలయానికి రప్పించి వారికి ప్రశంసాపత్రాలతో పాటు కానుకలను అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ వారితో ముఖ్యంగా నోటుకు ఓటు విధానం సరికాదని, దీన్ని అందరూ పాటించాలని హితవు పలికారు. నెలరోజుల క్రితం తమిళనాడులో తుపాను దెబ్బకు వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. వారందరికి తనవంతుగా సాయం అందించి వారికి అండగా నిలిచాడు. ఇలా తన పొలిటికల్ ఎంట్రీ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం తమిళనాడులో సినిమా పరిశ్రమ నుంచి కమల్ హాసన్, ఖుష్బూ, నమిత వంటి వారు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. విజయ్ రాకతో ఆయన పార్టీలోకి మరికొంత మంది చేరనున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Vijay (@actorvijay) -
ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా.. అని పరోక్షంగా పళణి స్వామి శిబిరాన్ని ఉద్దేశించి పన్నీరు సెల్వం వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. వివరాలు.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరాల మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఇద్దరు నేతలు పక్క పక్కనే కూర్చున్నా, ఒకరి ముఖాలు, మరొకరు చూసుకోవడం లేదు. పలకరించుకోవడం కూడా లేదు. ఈ నేపథ్యంలో మంళవారం మీడియా ప్రతినిధి ఓ ప్రశ్న సంధించగా, ఏకం అయ్యేందుకే తన ప్రయత్నమంటూ పరోక్షంగా పళణితో చేతులు కలిపేందుకు తాను రెడీ అనే సంకేతాన్ని ఇచ్చారు. అయితే ఇప్పటికే పళణి శిబిరం పన్నీరుకు ఇక పార్టీలో చోటు లేదని స్పష్టం చేయడం గమనార్హం. -
‘చౌరస్తా’లో రాజ్యాంగ విలువలు
దేశంలో జరుగుతున్న ఎన్నో ఘటనలు పడిపోతున్న ప్రజాస్వామిక విలువలను సూచిస్తున్నాయి. అసహనాన్ని సూచిస్తున్నాయి. న్యాయంగా ఉండటానికి రోజులు కావని చెబుతున్నాయి. ఇది కొత్త రాజకీయ వాదనలు చేయడానికి కారణమవుతోంది. నిజానికి ఇలాంటి ధోరణులు ప్రబలడానికి మూలం ఎక్కడ ఉందో అంతా ఆలోచించాలి. యావద్భారత రాజకీయాల్ని తారుమారు చేసే ‘పుండు’ అంతా స్వార్థపూరిత పార్టీల పాలకులలో ఉంది. అంబేడ్కర్ ఆశించినట్టుగా సంపన్న వర్గాల ఆధిపత్యం నుంచీ, కుల వ్యవస్థ పట్టు నుంచీ విడివడిన సామాజిక వ్యవస్థ నిర్మాణం జరగలేదు. వామపక్షాల మధ్య ఐక్యత కొరవడిన ఫలితంగా బలమైన ఉద్యమాలు లేక జనం మితవాద పార్టీల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది మౌనం వీడాల్సిన సమయం. ‘‘తమిళనాడును స్వయంప్రతిపత్తిగల ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే స్థితికి మా తమిళనాడును నెట్టవద్దు. తమిళనాడును ప్రత్యేక దేశంగా మేము ప్రకటించుకునే స్థితికి మమ్మల్ని నెట్టవద్దు. స్వపరిపాలనా ప్రాంతంగా తమిళనాడును కేంద్రం ప్రకటిం చాలి. అందాకా మేము విశ్రమించేది లేదు. తమిళనాడు వేరే దేశంగానే వృద్ధి చెందాలన్న పెరియార్ విశ్వాసం వైపుగా మమ్మల్ని నెట్టవద్దు.’’ – సీఎం ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సీనియర్ నాయకుడు, నీలగిరి పార్లమెంట్ సభ్యుడైన ఎ.రాజా (4 జూలై 2022). ‘‘ద్రవిడియన్ ప్రాంతీయ పార్టీ రాజకీయాల వైఫల్యాన్ని డీఎంకే నాయకుడు రాజా ఆమోదించినట్టే’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సి.టి. రవి దీనికి స్పందించారు. రాజా ప్రకటన దేశ విభజనకు దారితీసే పచ్చి చీలుబాట రాజకీయమని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి ప్రకటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ మౌనంగా ఉండిపోవడాన్ని ఖండిస్తున్నాననీ, రాజ్యాంగానికి బద్దులై ఉంటానని హామీపడి కూడా స్టాలిన్ ప్రేక్షకుడిగా ఉండిపోయారనీ తిరుపతి అన్నారు. నిజానికి దేశంలో ఇలాంటి ధోరణులు ప్రబలడానికి మూల మంతా ఎక్కడ ఉందో నిష్పాక్షికంగా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. వేర్పాటు ధోరణుల మూలం అంతా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఉందని దక్షిణ, తూర్పు భారత రాష్ట్రాలు ఇప్పటికే గ్రహించాయి. యావద్భారత రాజకీయాల్ని తారుమారు చేసే ‘పుండు’ అంతా స్వార్థపూరిత పార్టీల పాలకులలో ఉంది. కేంద్రాధి కారంలో ఉన్న రాజకీయ పక్షాల ఉసురును ఇంతవరకూ కాపాడి నిలబెడుతున్న ఏకైక ‘చిట్కా’ – యూపీలోని 80 లోక్‌సభ సీట్లు. ఈ ‘గుట్టు’ చేతుల నుంచి జారిపోకుండా జాగ్రత్త పడటానికే ఉత్తర– దక్షిణ భారతదేశాల మధ్య గండి కొట్టాల్సిన అవసరం పాలకులకు అనివార్యం అయిపోయింది. భారతదేశ పాలనలో ఈ ‘గుట్టు’ను కాస్తా పసిగట్టి ‘రట్టు’ చేసిన తొలి దార్శనికుడు, భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన అంబేడ్కర్. కనుకనే దక్షిణ భారతదేశానికి హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా తక్షణం ప్రకటించాలని అంబేడ్కర్ కోరారని మరచి పోరాదు. అప్పుడుగానీ ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ సీట్ల ఆధారంగా దక్షిణ భారత రాష్ట్రాలకు కేంద్ర పాలకులు నిరంతరం తలపెడుతున్న అన్యాయానికి అడ్డుకట్టు వేయడం సాధ్యపడదు. అందుకే అంబేడ్కర్ ప్రతిపాదనకు (దక్షిణ భారత రాజధానిగా హైదరాబాద్) అంతటి విలువ! ఈ దృష్టితో చూస్తే డీఎంకే నాయకుడు ఎ.రాజా ఆందోళనను కూడా తప్పుగా అర్థం చేసుకోనక్కర్లేదు. అంబేడ్కర్ 1956లో విస్తృత స్థాయిలో భారత రిపబ్లికన్ పార్టీని ఏర్పరచి, దానిని లౌకిక (సెక్యులర్) ప్రాతిపదికపైన ‘సోషలిస్టు ఫ్రంట్’గా తీర్చిదిద్దారు. బౌద్ధంలోని హేతువాద సూత్రాల అండ దండలనూ తోడు చేసుకున్నారు. తద్వారా సంపన్న వర్గాల ఆధిపత్యం నుంచీ, కుల వ్యవస్థ పట్టు నుంచీ, మూఢ విశ్వాసాల నుంచీ, సామాజిక దురన్యాయాల నుంచీ విడివడిన కుల రహిత సామాజిక వ్యవస్థ నిర్మాణాన్ని ఆశించారు. అందువల్లే వ్యవసాయ రంగంలోని పేద రైతాంగ వర్గాలనూ, సామాజికంగా వెనుకబడిన, నిరక్ష్యానికి గురైన వర్గాలనూ ఆకర్షించగలిగారు. అయితే అప్పటికి కుల వర్గ విభేదాలనూ, దౌర్జన్యాలనూ, హింసాకాండనూ బలంగా ఎదురొడ్డి, అగ్రకుల పెత్తనాలకు వ్యతిరేకంగా నిలబడగల బలవత్తర ఉద్యమాలు లేకపోవడంవల్ల... దళిత, బహుజన, పేద వర్గాలు మితవాద రాజకీ యాల వైపు ఆకర్షితులవుతూ వచ్చిన ఉదాహరణలూ ఎన్నో అని ప్రొఫెసర్ హరీష్ వాంఖడే (జేఎన్‌యూ ప్రొఫెసర్) అభిప్రాయం. ఆ మాటకొస్తే అప్పుడే కాదు, ఇప్పటి వర్తమాన రాజకీయాల లోనూ ఇదే పరిస్థితి. వామపక్షాల మధ్య ఐక్యత, ఏకవాక్యత కొరవడిన ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాలు పలు అన్యాయాలకూ, దాష్టీకాలకూ బలి కావలసి వస్తున్న సత్యాన్ని గుర్తించాలి. ఈ రోజుకీ భూమి తగాదాల మిషపైన ఆదివాసీ మహిళల పైన దాడులు జరుగుతున్నాయి. ఒక ఆదివాసీ మహిళనుగానీ, పురుషుడినిగానీ దేశ రాష్ట్రపతి స్థానంలో ఒక పాలకవర్గ పార్టీ కూర్చోబెట్టినంత మాత్రాన ఏ ప్రయోజనమూ లేదు. ‘స్టాంపు డ్యూటీ’తో నిమిత్తం లేకుండా, కేవలం ‘రబ్బర్ స్టాంప్’గా రాష్ట్రపతి ఉన్నంతకాలం దేశానికీ, ప్రజలకూ ఒరిగేదేమీ ఉండదు. బీజేపీకి చెందిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ హయాంలో, లక్నోలోని 140 ఏళ్ల చరిత్రగల ఒక హయ్యర్ సెకండరీ స్కూలు, కళాశాల ఉన్నట్టుండి అంతర్ధానమై, వాటి స్థానంలో ఒక ప్రైవేట్ స్కూలు వెలిసింది. దాంతో విద్యార్థులు పాఠాలన్నీ రోడ్డుపైనే నేర్చుకోవలసిన గతి పట్టింది. స్కూలు పేరు మారిపోయింది. స్కూలు లోకి విద్యార్థుల్నీ, ఉపాధ్యాయుల్నీ రానివ్వలేదు. వందలాదిమంది ఆ బడి పిల్లలు గేటు బయటే కూర్చునివుంటే, రోడ్డుమీదనే టీచర్లు పాఠాలు చెప్పాల్సిన గతి పట్టింది. ‘పేరు ధర్మరాజు, పెను వేప విత్తయా’ అన్నట్టు ప్రసిద్ధ చరిత్ర గల ఆ పాఠశాలకు బీజేపీ పాలకులు ఎందుకు ఆ గతి పట్టించారంటే – లక్నోలో ప్రసిద్ధికెక్కిన ఆదర్శ విద్యావేత్త రెవరెండ్ జేహెచ్ మెస్మోర్ ఆ పాఠశాలను నెలకొల్పి ఉండటమే! అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి హెచ్.పి. సందేశ్ అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ)ను విమర్శిస్తూ, అవినీతికి పాల్పడిన ఒక అధికారిని శిక్షించాలని ఆదేశించారు. అయితే నిజాయితీపరుడైన న్యాయమూర్తి సందేశ్‌కు దక్కిన ప్రతిఫలం – బదిలీ ఉత్తర్వులు! బదిలీకి సిద్ధంగా ఉన్నానని సందేశ్ ప్రత్యుత్తరమిచ్చారు. ఈ సంద ర్భంగా, ఏసీబీ తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నిస్తూ సందేశ్ చేసిన ప్రకటన దిమ్మ తిరిగిపోయేలా ఉంది: ‘‘ఇంతకూ మీరు ప్రజల ప్రయోజనాల్ని రక్షిస్తున్నారా లేక అవినీతితో గబ్బు పట్టిపోయిన అధికారుల్ని కాపాడుతున్నారా? ఈ నల్ల కోట్లు ఉన్నవి అవినీతిపరుల్ని రక్షించడానికి కాదు. లంచగొండితనం, అవినీతి క్యాన్సర్ వ్యాధిగా తయారైంది. ఈ వ్యాధి ఇక ఆఖరి దశ వరకూ పాకడానికి వీల్లేదు’’ అని హెచ్చరించారు. ఇక గుజరాత్ అల్లర్లానంతరం నరేంద్ర మోదీని ఒకప్పుడు సుప్రీంకోర్టు ‘నయా నీరో’గా విమర్శించింది. కానీ, అదే గుజరాత్ కేసులో మోదీకి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం’ ఇచ్చిన ‘క్లీన్ చిట్’ సరైనదేనంటూ సుప్రీం ఇటీవల చెప్పడం మరో చిత్రమైన ట్విస్టు. కాగా, ఈ సందర్భంగా 92 మంది సుప్రసిద్ధులతో కూడిన రాజ్యాంగ పరిరక్షణా మండలి ఒక ప్రకటన విడుదల చేసింది: ‘‘ఇంతకూ 2002 నాటి గుజరాత్ ఊచకోతలపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికలు, నాటి సుప్రీంకోర్టు ప్రత్యేక సలహాదారైన ప్రసిద్ధ న్యాయ వాది రాజు రామచంద్రన్ సమర్పించిన ప్రత్యేక నివేదిక ఏమైనట్టు?’’ అని రాజ్యాంగ పరిరక్షణ మండలి ప్రశ్నించింది. ఈ 92 మంది ఉద్దండులలో సమాచార శాఖ మాజీ కమిషనర్ హబీబుల్లా, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సునీల్ మిత్రా, హోంశాఖ మాజీ కార్య దర్శి జి.కె. పిళ్ళై, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్, తదితర పెక్కుమంది మాజీ ప్రధాన కార్యదర్శులూ, రిటైర్డ్ రాష్ట్ర పోలీస్ అధికారులూ ఉన్నారు. ఆ ప్రకటనలో వారిలా పేర్కొ న్నారు: ‘‘జీవించే హక్కును, పౌర స్వేచ్ఛను హరించే ప్రభుత్వ చర్యలను ప్రశ్నించి, వాటిని కాపాడుకోవడం పౌరుల విధి.’’ అందుకే ‘మౌనం’ అనేది ఒక్కో సందర్భంలో మంచికి దోహదం చేయొచ్చు. ఇంకొన్ని చోట్ల ఆ లక్షణమే మానవుడి ఉనికికే ప్రమాదభరితం కావొచ్చు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in


