విజయ్‌ సర్కార్‌ ఏ క్షణమైనా కూలిపోవచ్చు | TN EX CM Stalin Sensational Comments On Vijay Government | Sakshi
Sakshi News home page

విజయ్‌ సర్కార్‌ ఏ క్షణమైనా కూలిపోవచ్చు

May 19 2026 11:51 AM | Updated on May 19 2026 4:04 PM

TN EX CM Stalin Sensational Comments On Vijay Government

చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ నేతృత్వంలోని టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని.. తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.

డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్‌ మాట్లాడుతూ.. ఇప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయి. ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు. కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండాలి అని ఆయన పిలుపు ఇచ్చారు. అలాగే రాజకీయాల్లో ఓటమి తాత్కాలికమని.. డీఎంకే మళ్లీ బలంగా తిరిగి వస్తుందని పార్టీ శ్రేణుల్లో ఆయన ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

తమిళనాడులో సూర్యుడు (డీఎంకే గుర్తు) ఎప్పటికీ అస్తమించడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. కానీ మళ్లీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా గెలుచుకుంటాం అని స్టాలిన్ అన్నారు.

అందుకే స్టాలిన్‌ కామెంట్లు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం చిన్న పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో మద్దతు విషయంలో పెద్ద హైడ్రామానే నడిచింది. చివరకు కాంగ్రెస్‌, వామపక్షాలు, వీసీకే, అన్నాడీఎంకే రెబల్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

అయితే మిత్రపక్షాల మద్దతు ఉపసంహరణ, లేదంటో విజయ్‌కు మద్దతు ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. ఈ రెండింటిలో ఏదైనా జరగొచ్చని స్టాలిన్‌ అంచనా వేస్తున్నారు. అందుకే ఆయన పై వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.

ఇప్పటికే ఎన్నికల ఓటమి కారణాలను విశ్లేషించేందుకు స్టాలిన్‌ 36 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాలను సేకరించి, పార్టీ బలహీనతలను గుర్తించనుంది. తద్వారా మళ్లీ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఏం చేయాలో స్టాలిన్‌ వ్యూహ రచన చేస్తారని సమాచారం. అలాగే సోషల్‌ మీడియాలోనూ డీఎంకే వీక్‌గా ఉందని.. దానిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement