విజయ్‌కు సీఎం చాన్స్‌ ఇవ్వాల్సిందే: ఆర్కే రోజా | YSRCP RK Roja Reacts On TVK Vijay TN Political Crisis | Sakshi
Sakshi News home page

విజయ్‌కు సీఎం చాన్స్‌ ఇవ్వాల్సిందే: ఆర్కే రోజా

May 9 2026 1:53 PM | Updated on May 9 2026 5:41 PM

YSRCP RK Roja Reacts On TVK Vijay TN Political Crisis

సాక్షి, తిరుపతి: ఏమాత్రం మంచి చేయని కూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పుడు భయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం తాతయ్య గుంట గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భగా తాజా తమిళ రాజకీయ సంక్షోభంపైనా ఆమె స్పందించారు. 

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. కాబట్టి విజయ్‌కు సీఎంగా ప్రమాణం చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ అవకాశం ఇవ్వాలి. తద్వారా తమిళ ప్రజల నిర్ణయాన్ని ఆయన ఆమోదించాలి అని రోజా అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి, విజయ్‌కు దగ్గర పోలికలు ఉన్నాయని అన్నారామె. 

‘‘జగనన్నకు, విజయ్‌కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సింగిల్‌గా పోటీ చేసి సీఎం అయ్యారు. అలాగే హామీల అమలు విషయంలోనూ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు’’ అని అన్నారామె. జగనన్న పాలనలో తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారని.. సీఎం హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. ఈవీఎంల మోసంతో కూటమి ప్రభుత్వం ధికారంలోకి వచ్చిందని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ల బండారం బయటపడుతుందని ఆర్కే రోజా అన్నారు.

విజయ్ చేతిలో జగన్ ఫోటో.. TVKకె గెలుపుపై.. రోజా రియాక్షన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement