అలా చేయకపోతే.. అదే జరిగేది: ఎంకే స్టాలిన్‌ | Dmk Allowed Allies To Support Tvk To Prevent President Rule In Tn: Stalin | Sakshi
Sakshi News home page

అలా చేయకపోతే.. అదే జరిగేది: ఎంకే స్టాలిన్‌

Jun 6 2026 6:33 PM | Updated on Jun 6 2026 7:53 PM

Dmk Allowed Allies To Support Tvk To Prevent President Rule In Tn: Stalin

చెన్నై: తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించేందుకే తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ పార్టీ కూటమి భాగస్వాములను తానే అనుమతించినట్లు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. శనివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు మిత్రపక్షాలు తనకు తెలిపినప్పుడు తాను అభ్యంతరం చెప్పలేదన్నారు.

'మీరు వెళ్ళవచ్చు. అది మీ ఇష్టం, మీ ప్రజాస్వామ్య హక్కు. నేను మిమ్మల్ని ఆపను' అని చెప్పాను. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే నేను వారికి అభ్యంతరం చెప్పలేదని.. ఎందుకంటే రాష్ట్రపతి పాలన వస్తే అది తమిళనాడులో బీజేపీ పాలనకు దారి తీసే అవకాశం ఉందంటూ ఆయన పేర్కొన్నారు.

గతంలో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న పార్టీల మద్దతుపైనే ప్రస్తుత (టీవీకే) ప్రభుత్వం ఆధారపడి నడుస్తోందని ఆయన అన్నారు. డీఎంకే అధికారంలోకి రావాలని నమ్మి, మా కూటమిలో భాగమైన పార్టీల మద్దతు వల్లే ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తోంది. టీవీకేకు మద్దతు ఇచ్చే ముందు తాము స్టాలిన్‌కు సమాచారం అందించినట్లు కూటమి పార్టీల నాయకులు బహిరంగంగానే అంగీకరించారు’’ అంటూ స్టాలిన్‌ చెప్పుకొచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమిపై స్టాలిన్ స్పందిస్తూ... ఎన్నికల ఓటములు పార్టీని నిరుత్సాహపరచలేన్నారు. గెలుపోటములు సహజం. విజయాలు వచ్చినప్పుడు మనం తలబిరుసుగా ప్రవర్తించం.. అలాగని ఓటమికి నిరాశ పడిపోము. మనకు విజయావకాశాలు లభించకపోయినా.. అధికారంలో లేకపోయినా... ప్రతిపక్ష పాత్రలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం’’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement