అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన

Jul 25 2026 12:17 AM | Updated on Jul 25 2026 12:17 AM

తిరువళ్లూరు: అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భారీగా పొగలు కమ్ముకుంటే సహాయక చర్యలు ఎలా చేపట్టాలన్న అంశంపై అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. తిరువళ్లూరు జిల్లాలోని కన్నిగైపేర్‌ వద్ద అమ్మోనియం గ్యాస్‌ లీకేజీ, గుమ్మిడిపూండి వద్ద బాయిలర్‌ పేలి దుర్ఘటనతో పాటు పలు ప్రమాధాలు జరుగుతున్నాయి. ప్రమాధంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం కూడా చేయడానికి ప్రజల్లో ఆందోళన వుంది. దీంతో పాటు అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకు సహాయక చర్యల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ క్రమంలో ప్రమాదం జరిగినప్పుడు సహాయక చర్యలను ఎలా చేయాలన్న అంశంపై తిరువళ్లూరు అగ్నిమాపక సిబ్బంది శుక్రవారం ఉదయం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి లోకనాధన్‌, డిప్యూటి డైరెక్టర్‌ విల్సన్‌, సెల్వరాజన్‌ పాల్గొన్నారు. లోకనాధన్‌ మాట్లాడుతూ పొగల్లో చిక్కుకున్న వారిని సైతం ప్రజలు చిన్నపాటి భద్రత చర్యలను చేపట్టి రక్షించవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement