వేలూరు: ఐదు సంవత్సరాల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కార్మికుడికి వేలూరు పోక్సో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని ఒక గ్రామానికి చెందిన సుబ్రమణి(64) గత సంవత్సరం ఏప్రిల్‌లో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ తీసి ఇస్తానని తెలిపి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటిలో ఎవరూ లేక పోవడంతో చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. చిన్నారి ఏడుస్తూ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారు గుడియాత్తం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కార్మికుడు సుబ్రమణిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ వేలూరు కోర్టులో జరిగింది. సుబ్రమణిపై నేరం రుజువు కావడంతో పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.40 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మోనిక తీర్పు చెప్పారు దీంతో పోలీసులు నిందితుడిని వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.


