కండక్టర్లు లేచి వెళ్లి టిక్కెట్లు ఇవ్వాలి | free travel scheme for women girls and transgender passengers | Sakshi
Sakshi News home page

కండక్టర్లు లేచి వెళ్లి టిక్కెట్లు ఇవ్వాలి

Oct 4 2026 12:02 PM | Updated on Oct 4 2026 12:09 PM

 free travel scheme for women girls and transgender passengers

కొరుక్కుపేట: తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పించే పథకాన్ని ముఖ్యమంత్రి విజయ్‌ శుక్రవారం ప్రారంభించారు. దీంతో ఇప్పుడు ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో ప్రయాణించడం సాధ్యమవుతుంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులతో ఎలా ప్రవర్తించాలనే దానిపై రవాణా సంస్థ అధికారులు బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా కండక్టర్లు కూర్చుని ప్రయాణికులకు టిక్కెట్లు ఇవ్వకూడదు. 

వారు ఉన్న చోటుకే వెళ్లి టిక్కెట్లు ఇవ్వాలి. స్వేచ్ఛాయుత ప్రయాణం పట్ల ఎలాంటి ఉదాసీనత ఉండకూడదు. ప్రయాణికులు మాట్లాడకూడదని, బస్సు ఎక్కిన తర్వాత, దిగిన తర్వాత తలుపులు మూసివేయాలని సూచించారు. ఈ విషయ మై చెన్నై మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ అధికారి మాట్లాడుతూ నగర బస్సులను పక్కన నిలిపి, ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించడం చేయాలని కండక్టర్లు, డ్రైవర్లకు సూచించారు. ఈ పనిలో 7,000 మంది పాల్గొంటున్నారు. వారి కోసం 4 కేంద్రాలలో శిక్షణా కోర్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇందులో మహిళా ప్రయాణికులతో ట్రాన్స్‌పోర్టు సిబ్బంది కఠినంగా ప్రవర్తించవద్దని సూచించినట్లు వెల్లడించార 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement