సాక్షి, ముంబై : ముంబైలోని కుర్లా ప్రాంతంలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. పబ్లిక్ పార్కులో ఒక యువజంటపై ఎనిమిది నుండి పది మంది బాలుర గుంపు దాడి చేసి, కర్రలతో కొట్టిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కుర్లా వెస్ట్‌లోని ఫీనిక్స్ మాల్ వెనుక ఉన్న ప్రమోద్ మహాజన్ గార్డెన్‌లో ఈ ఘటన జరిగింది.
బీజేపీ నేత కిరీట్ సోమయ్య కూడా షేర్ చేసిన ఈ వీడియో ప్రకారం ఎనిమిది నుండి పది మంది మైనర్ బాలురు ఒక జంటతో (ఒక యువకుడు యువతి) వాగ్వాదానికి దిగారు. అది కాస్తా హింసాత్మకంగా మారి, నిందితులు ఆ జంటను చుట్టుముట్టి వారి దారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కొందరు బాలురు ఆ యువకుడిని కర్రలతో కొట్టడం, ఆపై పిడిగుద్దులు కురిపించడం వీడియోలో కనిపించింది. బాధిత యువతికూడా దాడిని ఆపడానికి ప్రయత్నించింది. మొత్తంమీద ఎలాగోలా ఆ జంట తప్పించుకుని బయట పడింది. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు, ఈ కేసులో ఆరుగురు మైనర్లపై కేసు నమోదు చేసి, 15 రోజుల పాటు అబ్జర్వేషన్ హోమ్‌కు (బాలల సంరక్షణ కేంద్రానికి) పంపారు.
Mumbai Police File FIR After Juveniles Assault Couple in Kurla Park: The assault happened on November 20 at Pramod Mahajan Garden in Kurla West, where video footage captured eight juveniles, aged around 7 to 15, pushing and beating the boy and girl until they fell to the ground. Ghatkopar Police registered an FIR based on the girl's complaint under Bharatiya Nyaya Sanhita sections for assault and related charges, with the minors set to appear before the Juvenile Justice Board. While social media raised concerns over youth violence and limited punishments for minors, police have not confirmed any religious motives or specific slurs, focusing instead on the complaint and parental notices. https://t.co/bG7PnA0Sjb
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) November 21, 2026
ఇదీ చదవండి: 70 ఏళ్ల సమస్యకు నీనా గుప్తా సమాధానం!
పోలీసుల కథనం ప్రకారం, నిందితులను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నారు మరియు వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. పిల్లల తల్లిదండ్రులకు కూడా నోటీసులు జారీ చేశారు.మరోవైపు, బహిరంగ ప్రదేశాల్లో నడుస్తున్న పౌరులను వేధించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ బోమని ముంబై పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: డా.శివరంజని మరో ఘనత : రూ.9 కోట్ల మందు అత్యంత చౌకగా
ఇదీ చదవండి :బుడ్డోడి ఫోజులకు ఫిదా : సర్‌ప్రైజ్ ఆఫర్


