సినిమాల్లో నటిస్తే.. బయట అలా తాకాలా..?: కీర్తి సురేశ్‌ | Keerthy Suresh Clarifies Viral Mysskin Video Viral | Sakshi
Sakshi News home page

Keerthy Suresh-Mysskin : ‘కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి బ్రదర్’

Nov 20 2026 3:32 PM | Updated on Nov 20 2026 3:36 PM

Keerthy Suresh Clarifies Viral Mysskin Video Viral

ఇటీవలే ‘అక్క’ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది కీర్తి సురేశ్. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’ విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బుధవారం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో దర్శకుడు మిస్కిన్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాకితే ఎందుకు ఇబ్బందిపడుతున్నారంటూ
ఈ సమావేశంలో మాట్లాడుతున్న మిస్కిన్.. కీర్తి సురేశ్‌ను ప్రశంసిస్తూ ఆమె ఒడికి దగ్గరలో చేతితో తాకారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో కొందరు నెటిజన్లు కీర్తి అసౌకర్యంగా కనిపించారంటూ కామెంట్లు చేశారు. ఓ నెటిజన్‌ అయితే.. సినిమాల్లో అలాంటి సన్నివేశాల్లో నటిస్తే తప్పులేదు.. బయట ఓ వ్యక్తి కొద్దిగా తాకితే ఎందుకు ఇబ్బందిపడుతున్నారంటూ ప్రశ్నించారు.

అర్థం చేసుకోవాలి బ్రదర్
ఈ పోస్టుపై కీర్తి సురేశ్ స్పందించారు. ‘ముందుగా నా ముఖంలో మీకు ఎక్కడ అసౌకర్యం కనిపించింది? నాకు.. మిస్కిన్ కి తండ్రీకూతుళ్ల అనుబంధం ఉంది. ఈ విషయం చెప్పినప్పుడు వినలేదా? ఒకవేళ నేను అసౌకర్యంగా ఉన్నానని అనుకున్నా.. సినిమాల్లో అలా ముట్టుకుంటారు కాబట్టి బయట కూడా అలాంటి టచింగ్‌లు అంగీకరించాలని చెబుతున్నారా? కొన్ని విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి బ్రదర్’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. ప్రస్తుతం కీర్తి ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో సదరు నెటిజన్ తన పోస్టును తొలగించి క్షమాపణలు చెప్పారు. 

(ఇదీ చదవండి: ఈ రోజే ఆమె డెబ్యూ.. అల్లు అరవింద్‌ గోల్డెన్‌ ఆఫర్‌)
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement