మన సంస్కృతిని కించపరచను | Keerthy Suresh gave clarity on the Radhika Apte controversy | Sakshi
Sakshi News home page

మన సంస్కృతిని కించపరచను

Nov 20 2026 4:17 AM | Updated on Nov 20 2026 4:17 AM

Keerthy Suresh gave clarity on the Radhika Apte controversy

‘‘నేనెప్పుడూ మన సంస్కృతిని కించపరిచేలా మాట్లాడను. అలాగే దక్షిణాది సంప్రదాయాలను ఎప్పటికీ తక్కువ చేయను’’ అని కీర్తీ సురేష్‌ పేర్కొన్నారు. ఆమె ఇలా స్పందించడానికి కారణం రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలే. కీర్తీ సురేష్, రాధికా ఆప్టే లీడ్‌ రోల్స్‌లో ‘అక్క’ వెబ్‌ సిరీస్‌లో నటించారు. ‘ఈ సిరీస్‌ ప్రమోషన్ల సమయంలో మేనమామను పెళ్లి చేసుకునే పాత్ర గురించి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.

దీనిపై మీ స్పందన ఏంటి?’ అని తాజాగా ‘సత్యవాన్‌ సావిత్రి’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న కీర్తీ సురేష్‌ని విలేకరులు అడగ్గా– ‘‘ఓ సినిమాలో నా మామయ్యను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది’ అని రాధికా ఆప్టే అన్నప్పుడు అసలు ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో నాకు మొదట అర్థం కాలేదు. ఆ తర్వాతే ఆమె మన దక్షిణాది సంప్రదాయంలోని మేనరికం గురించి ప్రస్తావిస్తున్నారని తెలిసింది.

తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు రాష్ట్రాల్లో మేనరికం వివాహాలు జరుగుతాయి. కేరళలో మాత్రం ఈ పద్ధతి లేదు. మరి... కర్ణాటకలో ఈ ఆచారం ఉందో? లేదో అనే విషయం గురించి నాకు తెలియదు. ఉత్తరాది వారికి మన దక్షిణాది ఆచారాల గురించి తెలియదు కాబట్టి కేవలం మన సంప్రదాయం గురించి మాత్రమే నేను చెప్పగలను.

అంతేకానీ, ఇదే మా సంస్కృతి అని వారికి నిరూపించలేను’’ అని పేర్కొన్నారు. కాగా ‘‘గతంలో నేను నటించిన ఓ తెలుగు సినిమాలో (‘లెజెండ్‌’ మూవీని ఉద్దేశించి) నాకంటే ఎంతో పెద్ద వయసున్న హీరోతో రొమాన్స్‌ చేయాల్సి వచ్చింది. ఆ సినిమాలో కథ ప్రకారం సొంత మేనమామనే పెళ్లి చేసుకునే సన్నివేశాలు నాకు ఇబ్బందిగా అనిపించాయి’’ అంటూ రాధికా ఆప్టే పేర్కొన్న సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement