స్వతంత్ర భావాలున్న వ్యక్తి కథ | Ram Pothineni RAPO23 Pre-Look Released | Sakshi
Sakshi News home page

స్వతంత్ర భావాలున్న వ్యక్తి కథ

Nov 20 2026 3:50 AM | Updated on Nov 20 2026 3:50 AM

Ram Pothineni RAPO23 Pre-Look Released

రామ్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘రాపో 23’ (వర్కింగ్‌ టైటిల్‌). సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. గురువారం ఇంటర్నేషనల్‌ మెన్స్‌ డే సందర్భంగా ఈ సినిమాలోని రామ్‌ ప్రీ–లుక్‌ను రిలీజ్‌ చేశారు. డిఫరెంట్‌ హెయిర్‌ స్టయిల్, తన వెనక భాగంలో ప్రత్యేకమైన టాటూ... ఇలా ఈ చిత్రం కోసం రామ్‌ పూర్తిగా మేకోవర్‌ అయ్యారని ఈ లుక్‌ స్పష్టం చేస్తోంది.

‘‘వ్యక్తిగత స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం, తనదైన ఆలోచనా విధానంతో ముందుకు వెళ్లే వ్యక్తి కథగా ఈ సినిమా ఉంటుంది. అందుకే పోస్టర్‌పై ‘ది స్టోరీ ఆఫ్‌ ఏ లోన్‌ ఉల్ఫ్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చాం. తన దారిని తానే ఎంచుకుని, ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి అనే నిర్వచనాన్ని ఈ క్యాప్షన్‌ సూచిస్తుంది’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement