మళ్లీ పుడదాం... చలో! | Vrushakarma Movie Releases Chalo Padave Lyrical Video Song | Sakshi
Sakshi News home page

మళ్లీ పుడదాం... చలో!

Nov 20 2026 3:59 AM | Updated on Nov 20 2026 3:59 AM

Vrushakarma Movie Releases Chalo Padave Lyrical Video Song

‘ఊహలు ఉరుములై గుండెలోన మోగుతున్నవే... చూపులు చినుకులై కళ్లలోన జారుతున్నవే... చలో పదవే... చలో పదవే...’ అంటూ సాగుతుంది ‘వృషకర్మ’ సినిమాలోని ‘చలో పదవే...’ పాట. నాగచైతన్య, మీనాక్షీ చౌదరి హీరో, హీరోయిన్లుగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వృషకర్మ’. ఈ చిత్రంలో అర్జున్‌ పాత్రలో నాగచైతన్య, దక్షగా మీనాక్షీ చౌదరి నటించారు.

బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌. బి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 4న రిలీజ్‌  కానుంది. గురువారం ఈ సినిమాలోని ‘చలో పదవే... చలో పదవే...’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు.

సంగీత దర్శకుడు అజనీష్‌ బి. లోక్‌నాథ్‌ స్వరకల్పనలో అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను సాయి విఘ్నేష్‌ పాడారు. ఈ పాట ప్రారంభంలో ‘అర్జున్‌... ఇషా ఆర్టిస్టిక్‌ చైల్డ్‌... కొత్తవాళ్లతో ఇంట్రాక్ట్‌ అవ్వదు...’ అనే డైలాగ్‌ వినిపిస్తుంది. ‘‘ఒకో క్షణము... ఒకో జన్మే, మళ్లీ పుడదాం... చలో...’ అంటూ ఈ పాట సాగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement