బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’. ఈ చిత్రంలో నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్, రావు రమేష్, సత్య, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు.
తాజాగా ‘టైసన్ నాయుడు’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘కొత్తగా ఈ మధ్య ఎస్‌ఓటీ అనే యూనిట్‌ని దించారు’, ‘స్పెషల్ ఆపరేషన్స్ టీమ్... ఫాంథమ్ వింగ్ ఆఫ్ పోలీస్’, ‘నో అరెస్ట్... నో రికార్డ్స్’, ‘అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది’ వంటి డైలాగ్స్ టీజర్‌లో ఉన్నాయి.


