ఓటీటీలోకి నేరుగా నివేదా కొత్త సినిమా స్ట్రీమింగ్ | Nivetha Thomas Srimathi OTT Release Date | Sakshi
Sakshi News home page

Srimathi OTT: నివేదా లీడ్ రోల్.. డైరెక్ట్ ఓటీటీలోకే

Nov 20 2026 3:20 PM | Updated on Nov 20 2026 3:32 PM

Nivetha Thomas Srimathi OTT Release Date

మలయాళ భామ నివేదా థామస్.. తెలుగులోనూ చాలానే సినిమాలు చేసింది. 2016 నుంచి 2024 వరకు 10 వరకు మూవీస్ చేసింది. గత రెండేళ్లుగా పూర్తిగా నటనకు దూరమైపోయిన ఈమె.. ఓ చిత్రంలో లీడ్ రోల్ చేసింది. అదిప్పుడు నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)

రెండేళ్ల విరామం తర్వాత నివేదా థామస్ 'శ్రీమతి' అనే ఫ్యామిలీ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో మధ్యతరగతి గృహిణి మధుశ్రీగా కనిపించనుంది. తిరువీర్ కీలక పాత్ర పోషించాడు. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 04 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి టీజర్ రిలీజ్ చేశారు.

అయితే ఇందులో విజువల్స్ చూస్తుంటే 2021లో మలయాళంలో వచ్చిన 'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' సినిమా గుర్తొచ్చింది. ఒకవేళ దాన్ని ఏమైనా రీమేక్ చేశారా అని సందేహం కలుగుతోంది. ట్రైలర్ వస్తే ఇది రీమేకా ఒరిజినల్ కంటెంట్ అనేది క్లారిటీ వస్తుంది.

మరోవైపు నివేదా థామస్ బరువు పెరగడంతో సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించట్లేదు. తన బరువు గురించి గత నెలలో ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన ఈమె.. ‘ఆ రోజు తాను ఎంతో అందంగా కనిపించాను. ఆ ఫొటోలను చూసిన ప్రతిసారీ సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తుకొచ్చేవి. కానీ నన్ను చూసి ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన ఈ ఫొటోలను పోస్ట్‌ చేయకుండా ఆపింది. ఇన్ని నెలలపాటు వాటిని దాచిపెట్టడం బాధగా ఉంది. మనలో కలిగే ఆలోచనలని పట్టించుకోవడం మానేసి, వాటిని అంగీకరిస్తూనే జీవితాన్ని ఆస్వాదించాలి అని పరోక్షంగా తన గురించి తానే చెప్పింది.

(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమంత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement