మరో ఓటీటీకి టాలీవుడ్ థ్రిల్లర్‌ మూవీ.. ఎక్కడ చూడాలంటే? | Tollywood Thriller Movie Streaming In another Ott From Today | Sakshi
Sakshi News home page

Thriller Movie: మరో ఓటీటీకి టాలీవుడ్ థ్రిల్లర్‌ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Nov 18 2026 12:47 PM | Updated on Nov 18 2026 12:47 PM

Tollywood Thriller Movie Streaming In another Ott From Today

కికు యనమల, కశీశ్ ఖాన్ జంటగా వచ్చిన టాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ కికు చిరంజీవి.  ఈ ఏడాది ఆగస్టు 28న థియేటర్లలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీకి శుభ సాయి వెంకట్‌ దర్శకత్వం వహించారు. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దీప్తి నడిమింటి నిర్మించారు. ఇందులో ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి,  శ్రీకాంత్‌ భరత్‌(అయ్యంగార్‌), వైవా రాఘవ ముఖ్య పాత్రలు పోషించారు.  

ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వేదికగా ఈనెల 14 నుంచే అందుబాటులోకి వచ్చేసింది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ రోజు నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా అలరిస్తోంది. ఈ మూవీని కుడివైపు గుండె ఉండటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేయండి.

ఈ మూవీ కథేంటంటే..

చిరంజీవి(కికు యనమల) అరకులో ఒక ఫోటోగ్రాఫర్. అతనికి ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. అందరికీ గుండె ఎడమ సైడ్ ఉంటే ఈయనకు కుడివైపు ఉంటుంది. దానివల్ల ఎక్కువ పరిగెడితే ఊపిరి ఆడదు.. ఆయన శరీరం నీలం రంగులోకి మారిపోతుంది. అలాంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి స్నేహితులతో కలిసి అరకు విహారయాత్రకు వచ్చిన మను(కశిశ్ ఖాన్‌)ని తొలిచూపులోనే ఇష్టపడతాడు. అయితే మనుని ప్రేమించిన ప్రతి ఒక్కరిని ఓ వ్యక్తి తన మనుషులతో చంపేస్తుంటాడు. ఈ విషయం మనుకి కూడా తెలియదు.  ఓ సంఘటన తర్వాత మను కూడా చిరంజీవిని ఇష్టపడుతుంది. ఈ విషయం ఆ దుండగులకు తెలిసి చిరంజీవిని చంపేందుకు ప్రయత్నిస్తారు. అయితే వారి నుంచి తప్పించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు . శోభనం రోజు రాత్రి మనుకి షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు మనును చంపేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు? వారి లక్ష్యం ఏంటి?  చిరంజీవి గతం ఏంటి? ఈ కథలో ఈశ్వరి రావు పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement