పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సమంత.. పేరు ఏంటంటే..? | Samantha Blessed Baby Boy | Sakshi
Sakshi News home page

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సమంత.. పేరు ఏంటంటే..?

Nov 20 2026 1:56 PM | Updated on Nov 20 2026 2:10 PM

Samantha Blessed Baby Boy

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. తన బిడ్డకు ‘దేవ్‌ నిడిమోరు’ అని పేరు పెట్టినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా  ప్రకటించారు. 

గతేడాది డిసెంబర్‌ 1న సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వీరి పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది.  రాజ్‌- డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’, ‘సిటడెల్‌: హనీ బన్నీ’లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాజెక్ట్‌ల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్‌కు, ఆమెకు మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ ఏడాది జూన్‌లో తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని అభిమానులతో పంచుకుంది. నవంబర్‌ 19న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సామ్‌ వెల్లడించడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement