ప్రియదర్శి పులికొండ, నాగ దుర్గ జంటగా వస్తోన్న విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ ఇడుపుకాయితం. ఈ సినిమాకు వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే అంతేస్థాయిలో ఈ సినిమా టైటిల్ నుంచి సాంగ్ వరకు వివాదాలతో మరింత హైలెట్‌గా నిలిచింది.
తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. గోగులు గోగులు అంటూ సాగే లిరికల్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటకు కొంగరి కృష్ణ లిరిక్స్ అందించగా.. ఈ సాంగ్‌ను అభిక్య తనికెళ్ల,తరుణి,రచిత రాయప్రోలు, జయశ్రీ పాలెం, స్నిగ్ధా శర్మ ఆలపించారు. ఈ పాటను సురేశ్ బొబ్బిలి కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ అండ్ బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో అభినవ్ గోమటం, వినోద్ బాల, సురభి ప్రభావతి, మైమ్ మధు, సుజాత దీక్షిత్, గీతా భాస్కర్, బిత్తిరి సత్తి, శివ జ్యోతి, మౌనిక రెడ్డి, అభయ్ కీలక పాత్రల్లో నటించారు.
The Beat & Heartbeat of a Beautiful Beginning❤️✨ The Enchanting Melody #GoguluGogulu song from #IdupuKayitham is out now🫶 ▶️ https://t.co/SoqrFlKxVx Bringing Every Home's Beautiful Story to Big Screens On DEC 11th, 2026😍 #IdupuKayithamOnDec11th #IK @aryasukku @Thabithasukumar @TheBunnyVas @SukumarWritings @BunnyVasWorks @Preyadarshe @NagaDurgaOffl #VamsiReddyDondapati @sureshbobbili9 #BalReddyP #SreedharSompally @saregamasouth @Netflix_INSouth @ZeeTVTelugu
— Sukumar Writings (@SukumarWritings) November 20, 2026


