ఇటీవలే రణబాలితో మెప్పించిన టాలీవుడ్ హీరోయిన్ రష్మిక. పెళ్లి తర్వాత తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి తొలిసారి నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం రష్మిక మైసా అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తోంది. రావీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమె గోండ్ తెగకు చెందిన యువతిగా కనిపించనుంది. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే రష్మిక తాజాగా పుట్టపర్తి సాయిబాబా 101వ జయంతి వేడుకలకు హాజరైంది. ఈ సందర్భంగా రష్మిక ఆసక్తకర విషయాలు పంచుకుంది. సత్యసాయి బాబా బోధనలు నన్ను ఎంతగానో ఆకర్షించాయని తెలిపింది. ఆయన ప్రభావం తనపై చాలా ఉందని పేర్కొంది. నా అత్తమామల వల్లే నాకు పుట్టపర్తి సాయిబాబా బోధనలతో పరిచయం ఏర్పడిందని వెల్లడించింది. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ చిన్నతనంలో ఇక్కడే చదువుకున్నారని రష్మిక తెలిపింది. నా వైపు ఒక్క అడుగేస్తే.. నీ వైపు వందడుగులు వేస్తానంటూ స్వామి చెప్పారని గుర్తు చేసుకుంది. నా బెస్ట్ ఫ్రెండ్, నా భాగస్వామి విజయ్ దేవరకొండ అని సంతోషం వ్యక్తం చేసింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
My best friend, my partner, #VijayDeverakonda. It was through my in-laws that I was introduced to the teachings of Sathya Sai Baba.🙏🏻 – #RashmikaMandanna https://t.co/9npl3uJ2iU
— Suresh PRO (@SureshPRO_) November 19, 2026


