పెళ్లిబంధంలోకి ప్రముఖ హీరో.. ప్రియురాలితో ఏడడుగులు | kollywood Hero Ashwin kumar Knot with Her Lover Bhuvaneswari | Sakshi
Sakshi News home page

పెళ్లిబంధంలోకి ప్రముఖ హీరో.. ప్రియురాలితో ఏడడుగులు

Nov 20 2026 11:25 AM | Updated on Nov 20 2026 11:25 AM

kollywood Hero Ashwin kumar Knot with Her Lover Bhuvaneswari

ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాదిలో సినీతారలు సైతం పెళ్లిబంధంవైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే  కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ‍అనిరుధ్ రవిచందర్ ఓ ఇంటివాడయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్యమారన్‌ను ఆయన పెళ్లాడారు. తాజాగా మరో కోలీవుడ్ హీరో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలి మెడలో మూడుముళ్లు వేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తమిళంలో కుక్ విత్ కోమలి సిరీస్‌తో ఫేమ్ తెచ్చుకున్న కోలీవుడ్ హీరో అశ్విన్ కుమార్. తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలైన భువనేశ్వరిని పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి వేడుక కోయంబత్తూరులో గ్రాండ్‌గా జరిగింది. కాగా.. అశ్విన్ కుమార్ కోలీవుడ్‌లో  సెంబి, ఓ కదల్ కన్మణి, ఆదిత్య వర్మ, మీట్ క్యూట్, హాట్ స్పోర్ట్ 2 మచ్ వంటి చిత్రాలలో నటించారు. ఆదిత్య వర్మ చిత్రంలో ధ్రువ్ విక్రమ్ సోదరుడిగా కనిపించారు. కాగా.. పెళ్లి కూతురు భువనేశ్వరి దివంగత దర్శకుడు రాజశేఖర్  మనవరాలిగా తెలుస్తోంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement