breaking news
ashwin kumar
-
రూ. 40 కోట్ల బడ్జెట్..300 కలెక్షన్స్.. ఆస్తులన్నీ అమ్ముకున్నాం : డైరెక్టర్
పాన్ ఇండియా హీరోలు..స్టార్ డైరెక్టర్లు.. భారీ బడ్జెట్.. ఇవన్నీ ఉన్నా కూడా థియేటర్స్‌కి ప్రేక్షకులు రాలేకపోతున్న రోజులివి. స్టార్ హీరోల సినిమాలకు కూడా సూపర్ హిట్ టాక్ వస్తేనే కాస్తో కూస్తో జనాలు థియేటర్స్‌కి వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ యానిమేషన్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అదే ‘మహావతార్ నరసింహా’.బడా చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటే.. ఈ మూవీ మాత్రం ఐదు వారాలుగా థియేటర్స్‌లో సందడి చేస్తూనే ఉంది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా రికార్డుకెక్కింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించాడు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ఐదేళ్ల పాటు పడిన కష్టానికి ఫలితం దక్కిందని అంటున్నాను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా తీసే క్రమంలో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.దేవుడిని నమ్మేవాడిని కాదు..మాది మహారాష్ట్ర. చదువుకునే రోజుల్లో దేవుడిని నమ్మేవాడిని కాదు. దేవుడే ఉంటే..కొందరికి కష్టాలు, కొందరికి సుఖాలు ఎందుకు ఇస్తాడని ప్రశ్నించేవాడిని. అయితే కొన్ని సమస్యలు, ఒత్తిళ్లు రావడంతో కృష్ణభక్తుడైన శ్రీలప్రభుపాద రచనలు, భగవద్గీతా చదివాను. దీంతో నేను కృష్ణ భక్తిడిగా మారిపోయా. అప్పుడే వీఎఫ్ఎక్స్ ఉపయోగించి త్రీడీలో ప్రహ్లాదుడు-నరసింహా స్వామి కథను తీయాలనుకున్నా. దాదాపు ఐదేళ్ల క్రితం మహావతార్ నరసింహ కథకి బీజం పడింది.ఆస్తులన్నీ అమ్ముకున్నాం.. ఈ సినిమా కోసం మా ఆస్తులన్నీ అమ్ముకున్నాం. మొదట్లో మా దగ్గర ఉన్న డబ్బుతో సినిమా తీద్దాం అనుకున్నాం. కానీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సంపాదించిదంతా కొన్నాళ్లకే అయిపోయింది. నా భార్య దగ్గర ఉన్న డబ్బులు కూడా ఈ సినిమాకే ఖర్చు చేశాం. బడ్జెట్ ఊహించనంత పెరిగిపోయింది. ఇన్వెస్టర్లను వెతికాం. కొంతమంది పెట్టుబడి పెడతామని చెప్పి చివర్లో హ్యాండిచ్చారు. అలా దాదాపు వంద మందికి పైగా నిర్మాతలను, ఇన్వెస్టర్లను కలిశాం. చివరకు నా భార్య నగలు, కారు, ఇష్టంగా కట్టుకున్న ఇళ్లు కూడా అమ్మేసి సినిమా నిర్మాణానికి ఖర్చు చేశాం.ఎవరు చూస్తారంటూ భయపెట్టారుసినిమా కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడింది. రోజుకు 16 గంటలు పని చేసేవాళ్లం. నెలాఖరు రాగానే టీమ్ జీతాల కోసం ఎక్కడ అప్పులు తేవాలని నా భార్య ఆలోచించేంది. ఇలా మా అవస్థలేవో మేం పడుతుంటే.. మరికొందరు ‘దేవుడి సినిమా ఇప్పుడు ఎవరు చూస్తారు? ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు.. సినిమా పోతే మీ పరిస్థితి ఏంటి? అని కొంతమంది భయపెట్టేవాళ్లు. కానీ నా భార్య, నేను ఒక్కటే అనుకున్నాం. ఒకవేళ సినిమా పోతే.. ‘అది మన ఖర్మ’ అనుకొని వదిలేసి.. గతంలో మాదిరి మళ్లీ వీఎఫ్ఎక్స్ పనులు చేసుకుందాం’ అని నిర్ణయించుకున్నాం. చాలా ఇబ్బందులు పడి జులై 25న ఈ చిత్రాన్ని విడుదల చేశాం. రూ.40 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం పది రోజుల్లోనే రూ. 100 కోట్లను వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల వరకు రాబట్టింది. మా ఐదేళ్ల కష్టానికి ఫలితం దక్కింది. చాలా సంతోషంగా ఉంది’ అని అశ్వి కుమార్ అన్నారు. -
నా సొంతిల్లు తాకట్టు పెట్టి సినిమా తీశా: మహావతార్ నరసింహా డైరెక్టర్
'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యానిమేటేడ్ చిత్రం ఊహించని విధంగా ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరింది. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సత్తా చాటుతోంది.మహావతార్ నరసింహ సూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు తెలిపారు. నా జీవితంలో సంపాదించిదంతా ఈ సినిమా కోసం ఖర్చు చేశానని వెల్లడించారు. మా తల్లిదండ్రులతో పాటు నా భార్య తరఫున వారి ఆస్తులు కూడా తాకట్టు పెట్టానని అన్నారు. ఆఖరికి నా సొంత ఇల్లు కూడా తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ ఈ సినిమా తీశానని అశ్విని కుమార్ షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు.కాగా.. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ హైదరాబాద్‌కు విచ్చేసిన డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఏఏఏ సినిమాస్‌లో మూవీని వీక్షించారు. ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణ చూసి ఆనందం వ్యక్తం చేశారు.The roaring love from Hyderabad continues… 🦁❤️🔥Director @AshwinKleem visited AAA Cinemas & Mythri Vimal Theatre for #MahavatarNarsimha screening and witnessed a phenomenal response from the audience.#Mahavatar @hombalefilms @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/Ax6BMlbtHs— Hombale Films (@hombalefilms) August 5, 2025ఇల్లు తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ సినిమా తీసా- Director #AshwinKumar #MahavatarNarsimha #TeluguFilmNagar pic.twitter.com/R34q2LsSLD— Telugu FilmNagar (@telugufilmnagar) August 5, 2025 -
మన చరిత్ర ఈ తరానికి తెలియాలి: దర్శకుడు అశ్విన్ కుమార్
‘‘మహావతార్ నరసింహ’ సినిమా మన చరిత్ర. ప్రతి తరానికి మన చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలకి, ఈ తరం యువతకి మన చరిత్ర తెలియాలి. ఈ ఉద్దేశ్యంతోనే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ను ఆరంభించాం. లైవ్ యాక్షన్ సినిమా కూడా చేయొచ్చు. కానీ ఎవరైనా హీరోగా నటిస్తే, ఆ హీరో ఇమేజ్ ఈ క్యారెక్టర్‌పై పడే అవకాశం ఉంది. అందుకే శ్రీ మహావిష్ణువు కథని చెప్పాలంటే యూనిమేషన్ అనేది ఒక ఉత్తమ మాధ్యమంగా మేం భావించాం. అందుకే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ను యానిమేషన్లో చేస్తున్నాం’’ అని దర్శకుడు అశ్విన్ కుమార్ అన్నారు.శ్రీ విష్ణువు దశావతారాల ఆధారంగా ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ రూపొందుతోంది. ఈ యూనివర్స్ నుంచి తొలి భాగంగా ‘మహావతార్ నరసింహ’ రానుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ ఈ నెల 25న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల అవుతోంది.ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో అశ్విన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘శ్రీ మహావిష్ణువు దశావతారాలను బిగ్ కాన్వాస్‌లో ప్రజెంట్ చేయాలనే ఆలోచనతో ‘మహావతార్ యూనివర్స్’ను మొదలు పెట్టాం. ఈ కథని మేము శాస్త్రాల నుంచే తీసుకున్నాం. ఈ సినిమా చేసేప్పుడు సృజనాత్మకంగా, ఆర్థికంగా, సాంకేతికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. కోవిడ్ పరిస్థితులను ఫేస్ చేశాం. స్వామివారి ఆశీర్వాదం ఈ సినిమాపై ఉంది. వినోదంతో పాటు చరిత్ర, మన సంస్కృతి, ధర్మం... వంటి అంశాలు కూడా ఉన్నాయి. మా నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘మహావతార్ పరశురాం’ ప్రీ ప్రోడక్షన్ దశలో ఉంది’’ అన్నారు. ‘‘మా యూనివర్స్ నుంచి ప్రతి రెండేళ్లకో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు నిర్మాత శిల్ప. -
బిహార్‌లో మరోసారి మతఘర్షణలు
నవాద: బిహార్‌లో మరోసారి మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. నవాద జిల్లాలోని ఓ గ్రామంలో విగ్రహాన్ని అపవిత్రం చేశారంటూ ఆందోళనకారులు శుక్రవారం అనేక వాహనాలను ధ్వంసం చేశారు. ఓ హోటల్‌కు నిప్పు అంటించారు. గోదాపూర్ గ్రామంలో ఓ విగ్రహం కూలిపోయి ఉండటంతో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకోవడంతో గొడవ ప్రారంభమైందని నవాద జిల్లా కలెక్టర్ కౌశల్ చెప్పారు. ఆ తర్వాత ఆందోళనకారులు జాతీయ రహాదారి–31పైకి వెళ్లి వాహనాలపై రాళ్లు విసిరి వాటిని ధ్వంసం చేశారనీ, వార్తల సేకరణకు వచ్చిన స్థానిక విలేకరులను కొట్టడంతోపాటు ఓ హోటల్‌కు నిప్పు పెట్టారని చెప్పారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. కేంద్రంమంత్రి అశ్వినీ కుమార్ చౌబే కొడుకు అరిజిత్ ఆధ్వర్యంలో ఈ నెల 17న భాగల్పూర్లో దేవుడి ఊరేగింపు వేడుక సందర్భంగా మత ఘర్షణలు చెలరేగాయి. -
ఆదిలాబాదా? శ్రీకాకుళమా?
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఢిల్లీ నుంచి వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర అవార్డు కమిటీ సభ్యులు మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం జిల్లాకు వచ్చారు. గురు, శుక్రవారాల్లో కూడా జిల్లాలో పర్యటించి ఉపాధి హామీ పనులు పరిశీలిస్తారు. బుధవారం ఇద్ద రు కమిటీ సభ్యులు గల బృందం ఇచ్చోడ, నేరడిగొండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, జైనూర్, జన్నా రం, దండేపల్లి మండలాల్లో పర్యటించారు. ఈ బృందంలో ప్రొఫెసర్ అశ్విన్కుమార్తోపాటు మరొకరు ఉన్నారు. ఉపాధి హామీ పనుల అమలులో పురోగతి సాధించిన దేశంలోని కొన్ని జిల్లాలకు అవార్డును ఏటా జాతీయ స్థాయిలో అందజేస్తారు. మన రాష్ట్రంలో శ్రీకాకుళం, ఆది లాబాద్ జిల్లాలను ఇందుకు పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికే సభ్యులు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో కూలీలకు జాబ్‌కార్డులు, పనిదినాలు, కూలీ చెల్లింపు, వివిధ రి కార్డులు పరిశీలించడంతోపాటు కూలీలతో వివి ద అంశాలపై చర్చించారు. కాగా ఈ బృందం సభ్యులు తమ పర్యటనలో జిల్లా అధికారులను దూరంగా ఉంచి వివరాలు సేకరిస్తున్నారు. కేవ లం రూట్‌మ్యాప్ కోసం ఇద్దరు జిల్లాకు చెందిన సిబ్బందిని తీసుకెళ్లారు. ఈ వారం రోజుల్లో అవార్డు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరీ ఆదిలాబాద్‌కు వస్తుందా? శ్రీకాకుళంకు దక్కుతుందా వేచి చూడాలి. ఫిబ్రవరి 2న అవార్డు ప్రకటన దేశంలోని పలురాష్ట్రాల్లో పర్యటించిన బృందం జాతీయస్థాయిలో మొదట సుమారు 40 జిల్లాల ను పరిగణలోకి తీసుకుని 20 జిల్లాలతో జాబి తా తయారు చేశారు. ఇందులో రాష్ట్రంలోని ఆది లాబాద్తోపాటు శ్రీకాకుళం ఉన్నాయి. ఫిబ్రవరి 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించిన రోజు కావడంతో ఆ రోజున దే శంలోని కొన్ని జిల్లాలకు అవార్డును అందజేసే అవకాశాలున్నాయి. ప్రధానంగా శ్రమ శక్తి సం ఘాలు ఎలా ఉన్నాయి? కూలీలు ఎంత మంది ఉన్నారు? లబ్ధిపొందుతున్న కుటుంబాలు ఎ న్ని? వంద రోజుల పని ఎన్ని కుటుంబాలకు దక్కుతుంది? ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం చే కూరుతుందా? వారిలో కూలీల సంఖ్య ఎంత? వేతనాల చెల్లింపు ఎలా ఉంది? అక్రమాలపరంగా దుర్వినియోగం అవుతున్న నిధులు, అవి నీతికి పాల్పడిన వారిపై చర్యలు ఎలా ఉన్నా యి? అనే తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఉపాధి హామీ 2006లో ప్రారంభం కాగా జిల్లాలో ఐదు విడతలుగా అమలు చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ. 28 కోట్లకుపైగా నిధులు దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది.