
'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యానిమేటేడ్ చిత్రం ఊహించని విధంగా ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరింది. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సత్తా చాటుతోంది.
మహావతార్ నరసింహ సూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు తెలిపారు. నా జీవితంలో సంపాదించిదంతా ఈ సినిమా కోసం ఖర్చు చేశానని వెల్లడించారు. మా తల్లిదండ్రులతో పాటు నా భార్య తరఫున వారి ఆస్తులు కూడా తాకట్టు పెట్టానని అన్నారు. ఆఖరికి నా సొంత ఇల్లు కూడా తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ ఈ సినిమా తీశానని అశ్విని కుమార్ షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు.
కాగా.. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ హైదరాబాద్కు విచ్చేసిన డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఏఏఏ సినిమాస్లో మూవీని వీక్షించారు. ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణ చూసి ఆనందం వ్యక్తం చేశారు.
The roaring love from Hyderabad continues… 🦁❤️🔥
Director @AshwinKleem visited AAA Cinemas & Mythri Vimal Theatre for #MahavatarNarsimha screening and witnessed a phenomenal response from the audience.#Mahavatar @hombalefilms @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/Ax6BMlbtHs— Hombale Films (@hombalefilms) August 5, 2025
ఇల్లు తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ సినిమా తీసా- Director #AshwinKumar #MahavatarNarsimha #TeluguFilmNagar pic.twitter.com/R34q2LsSLD
— Telugu FilmNagar (@telugufilmnagar) August 5, 2025