breaking news
Mahavatar Narsimha
-
ఆన్ మిషన్ జోరు మీదున్న యానిమేషన్ మూవీస్
⇒ అమరేంద్ర బాహుబలి.... భల్లాలదేవ ఢీ అంటే ఢీ అంటూ ఆయుధాలతో, ఒంటి చేత్తో ఒకరిపై మరొకరు ఎలా దాడి చేసుకున్నారో ‘బాహుబలి’లో చూశాం...⇒ కొమురం భీమ్... అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై ఏ స్థాయి పోరాటం చేశారో ‘ఆర్ఆర్ఆర్’లో చూశాం.⇒ ఇప్పుడు ఈ సినిమాల్లోని క్యారెక్టర్లు ‘యానిమేషన్’ రూపంలో కనిపిస్తే... అదో థ్రిల్. ⇒ అంతేనా... హిరణ్యకశిపుడిని నరసింహావతారంలో ఆ విష్ణువు సంహరించిన ఘటనను ‘మహావతార్ నరసింహా’లో చూశాం. అయితే యానిమేషన్ రూపంలోనే ఈ సినిమాని చూశాం. ఈ సిరీస్‌లో ఇంకా ఆరు సినిమాలు రానున్నాయి.⇒ ఇవే కాదు... ఇంకా మరికొన్ని యానిమేషన్ చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు యానిమేషన్ చిత్రాల నిర్మాణం ఎక్కువైంది. దానికి కారణం ఆ చిత్రాలకు దక్కుతున్న ప్రేక్షకాదరణ... వస్తున్న వసూళ్లు.⇒ ఇక ‘ఆన్ మిషన్’ అంటూ జోరుగా నిర్మాణంలో ఉన్న ‘యానిమేషన్ మూవీస్’ గురించి తెలుసుకుందాం.ఇటు బాహుబలి... అటు ఆర్ఆర్ఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోపాన్ ఇండియా మార్కెట్ ట్రెండ్‌ను తెరపైకి తెచ్చిన ఈ తరం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పుడు మహేశ్‌బాబుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ‘వారణాసి’ సినిమాను తెరకెక్కిస్తూ, అదే స్థాయిలో రిలీజ్నుప్లాన్ చేస్తూ,పాన్–వరల్డ్ ట్రెండ్‌ను టాలీవుడ్లో స్టార్ట్ చేశారు. అలాగే రాజమౌళి చూపు యానిమేషన్ చిత్రాలపై పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో భారీ స్థాయి వీఎఫ్ఎక్స్ విజువల్ వండర్స్‌ను ఆడియన్స్ తెరపై చూశారు. ముఖ్యంగా ‘ఈగ’ సినిమాను రాజమౌళి సూపర్బ్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కించారు. ఆయన డైరెక్షన్లో వచ్చిన ‘బాహుబలి’ (‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’), ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల కొనసాగింపు కథలు యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, తమన్నా, సత్యరాజ్ ప్రధానపాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బాహుబలి’. ఈ సినిమా తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: కన్‌క్లూజన్’ చిత్రాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’గా గత ఏడాది 31 అక్టోబరు 2025న విడుదల చేశారు. ఆ సమయంలో ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగానికి సంబంధించిన అనౌన్స్మెంట్ రావొచ్చనే ఊహాగానాలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. కానీ ‘బాహుబలి’ కథకు కొనసాగింపుగా ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అనే యానిమేషన్ సినిమా త్రీడీ ఫార్మాట్లో రానుందని, రాజమౌళి అధికారికంగా వెల్లడించారు.‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేసి, ఈ సినిమాను 2027లో రిలీజ్ చేయనున్నట్లుగా రాజమౌళి తెలిపారు. మరో విశేషం ఏంటంటే.. 2027లో రిలీజ్ అవుతున్నది ‘ది బాహుబలి: ది ఎటర్నల్ వార్’ తొలి భాగం మాత్రమే. అంటే... ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి మరికొన్ని యానిమేషన్ చిత్రాలొస్తాయని ఊహించవచ్చు. దేవ, రాక్షసుల యుద్ధంలో బాహుబలి ప్రమేయం ఉంటే ఏం జరుగుతుంది? అనేపాయింట్ ఆఫ్ వ్యూలో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఈ త్రీడీ యానిమేషన్ సినిమాను దాదాపు రూ. 120 కోట్లతో తెరకెక్కిస్తున్నారట మేకర్స్.ఆర్కా మీడియా వర్క్స్, ముంబైకి చెందిన యానిమేషన్ లీడ్ స్టూడియో 88 పిక్చర్స్ ఈ సినిమా నిర్మాణంలో అసోసియేట్ అయ్యాయి. ఇషాన్ శుక్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రాజమౌళి ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ సినిమాకు నా పర్యవేక్షణ కూడా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి’ సినిమాల్లోని క్యారెక్టర్స్‌తోపాటు మరికొన్ని కొత్తపాత్రలను ఈ సినిమాలో చూస్తారు’’ అని ఓ సందర్భంలో రాజమౌళి పేర్కొన్నారు.ఆర్ఆర్ఆర్ యూనివర్స్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంతటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’పాట ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ కావడం, ఈపాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణిలకు ఆస్కార్ అవార్డులు రావడం కూడా తెలిసిందే. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైన తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో ‘ఆర్ఆర్ఆర్ 2’ ఉండే అవకాశం ఉందని, ఈ చిత్రం కథారచయిత విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ కథకు కొనసాగింపుగా సినిమా రానుంది. కానీ లైవ్ యాక్షన్ ఫీచర్ ఫిల్మ్ కాదు... యానిమేషన్ ఫిల్మ్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు కొనసాగింపుగా ‘ఆర్ఆర్ ఆర్’ యూనివర్స్‌లో ఓ యానిమేషన్ సినిమా చేసే ఆలోచన ఉందని, ఈ అంశంపై జపాన్ స్టూడియోలు వర్క్ చేస్తున్నాయని ఇటీవల ఓ సందర్భంలో రాజమౌళి పేర్కొన్నారు. ఇలా... ఒకవైపు లైవ్ యాక్షన్ ఫీచర్ ఫిల్మ్స్ చేస్తూనే, భవిష్యత్‌లో యానిమేషన్ సినిమాల హవా ఉంటుందని ఇప్పట్నుంచే రాజమౌళి ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోందిఏఐతో ‘కొచ్చడైయాన్’ రజనీకాంత్ హీరోగా, ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘కొచ్చడైయాన్’ (2014). ఈ తమిళ పీరియాడికల్ యానిమేషన్ మూవీని సునీల్, సునంద మురళీ మనోహర్, ప్రశీదా చౌదరి నిర్మించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది. కాగా ఈ సినిమా త్వరలోనే రీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అంటే...‘కొచ్చడైయాన్’ సినిమాను ఏఐ (కృత్రిమ మేధ)తో కొత్త వెర్షన్ రెడీ చేశారు.ఈ రీ మాస్టర్డ్ ‘కొచ్చడైయాన్’ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టీజర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పదేళ్ల క్రితం మోషన్ క్యాప్చర్ ఫిల్మ్‌గా చేశాం. ఈ సినిమా నన్ను చాలెంజ్ చేసింది. నన్ను చేంజ్ చేసింది. ‘కొచ్చడైయాన్’ రీ మాస్టర్డ్ టీజర్‌ని రిలీజ్ చేయడం భావోద్వేగానికి గురి చేస్తోంది’’ అని సౌందర్య రజనీకాంత్ పేర్కొన్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శోభన్, ఆర్. శరత్‌కుమార్, ఆది పినిశెట్టి ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. మహావతార్ యూనివర్స్ గత ఏడాది జూలైలో విడుదలైన యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ యానిమేషన్ సినిమాను దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో మేకర్స్ నిర్మించగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అశ్విన్‌కుమార్ డైరెక్షన్లో క్లిమ్ ప్రోడక్షన్స్, హోంబలే ఫిల్మ్స్ సంస్థలు ‘మహావతార్ నరసింహా’ను నిర్మించాయి.అయితే ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన విషయం ఏంటంటే...‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి ‘మహావతార్ పరశురామ్’ (2027), ‘మహావతార్ రఘునందన్’ (2029) – (రామావతారం), ‘మహావతార్ ద్వారకాధీష్’ (2031) – (కృష్ణుడు), ‘మహావతార్ గోకులానంద’ (2033) – (కృష్ణుడి బాల్యం/గోకులం), ‘మహావతార్: కల్కిపార్ట్ 1’ (2035), ‘మహావతార్: కల్కిపార్ట్ 2’ (2037) చిత్రాలు రానున్నాయి.‘మహావతార్ నరసింహా’ తర్వాత ‘మహావతార్ పరశురామ్’ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తామని, ప్రతి రెండేళ్లకొకసారి, మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఓ యానిమేషన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని, దర్శకుడు అశ్విన్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. భవిష్యత్‌లో యానిమేషన్ చిత్రాలకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గొప్ప ఆదరణ ఉంటుందని కూడా అశ్విన్ పేర్కొన్నారు.వాయుపుత్ర భారతీయ ఇతిహాసాలు ‘రామాయణం, మహాభారతం’ ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి... మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. కాగా పర్వతాలనే కదిలించిన మహా బలశాలి, అంజనీపుత్రుడు హనుమంతుని జీవితం ఆధారంగా ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్ సినిమా తెరకెక్కుతోంది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాలను తెరకెక్కించిన చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ త్రీడీ యానిమేషన్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరులో ‘వాయుపుత్ర’ సినిమాను అధికారికంగా ప్రకటించారు. 2డీ, 3డీ ఫార్మాట్స్‌లో ‘వాయుపుత్ర’ సినిమాను ఈ ఏడాది దసరాకు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. కీకీ అండ్ కోకో యానిమేషన్ చిత్రాల్లోనే కిడ్స్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. హాలీవుడ్ నుంచి ఇండియన్ వ్యూయర్స్ ముందుకు వచ్చిన పలు బాలల యానిమేషన్ చిత్రాలకు విశేషమైన ఆదరణ దక్కింది. అయితే ఈసారి ఈ జానర్లో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ నుంచి ‘కీకీ అండ్ కోకో’ సినిమా రానుంది. బాలనటి శ్రీనిక ప్రధానపాత్రధారిగా పి. నారాయణన్ దర్శకత్వంలో ధరణి నిర్మించిన ఈ కిడ్స్ యానిమేషన్ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. పినాకిన్ లార్డ్ శివ నేపథ్యంలో ‘పినాకిన్’ అనే యానిమేషన్ చిత్రం రూపొందుతోంది. కమల్భారతి ఎంటర్టైన్మెంట్ పతాకంపై హర్‡్ష పండిట్, వామన్ రాణే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ‘పినాకిన్’ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అంతేకాదు... ఈ చిత్రాన్ని ఈ ఏడాదే తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా తెలిపారు. అలాగే మహాశివరాత్రి సందర్భంగానే ‘శివ్ సతీ’ అనే మరో యానిమేషన్ సినిమాను ప్రకటించారు. వివేక్ అంచాలియా ఈ సినిమాకు దర్శకడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ‘హను–మాన్’ సినిమా ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించారు. ఈ యూనివర్స్ నుంచే ఇంకా ‘మహాకాళి, అధీర, జై హనుమాన్’ వంటి సినిమాలు రానున్నాయి. హనుమాన్ మూవీకి 71వ జాతీయ అవార్డుల్లో వీఎఫ్ఎక్స్–యానిమేషన్ విభాగంలో అవార్డులు వచ్చిన విషయం గుర్తుంటే ఉంటుంది (యానిమేషన్ విభాగంలో జెట్టి వెంకట్‌కుమార్ అవార్డు అందుకున్నారు). అయితే ఈ యూనివర్స్ నుంచే రెండు యానిమేషన్ చిత్రాలను రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారట ప్రశాంత్ వర్మ.గత ఏడాది గోవా వేదికగా జరిగిన 56వ ఇఫీ వేడుకల్లోపాల్గొన్న ఆయన యానిమేషన్ చిత్రాలను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పినట్లు వార్తలు ఉన్నాయి. ఇక రిషబ్ శెట్టి హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోని ‘జై హనుమాన్’ సినిమా ఈ నెల 22న హంపిలో ప్రారంభం కానుందని, ఈ సినిమాలో రానా ఓ కీలకపాత్రలో నటించనున్నారని తెలిసింది. అలాగే ‘జై హనుమాన్’ చిత్రంలో తేజ సజ్జా కూడా నటిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు.భలే భలే మగాడివోయ్ సీక్వెల్ నాని, లావణ్యా త్రిపాఠి హీరో హీరోయిన్లుగా మారుతి డైరెక్షన్లో రూపొందిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా 2015లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ రావొచ్చనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా ప్రమోషన్స్‌లో మారుతి ఈ అంశంపై స్పందించారు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకు సీక్వెల్ కథను యానిమేషన్ రూపంలో తీసుకు వచ్చే ఆలోచన ఉందని మారుతి చెప్పారు. ఇండస్ట్రీకి రాకముందు మారుతికి యానిమేటర్‌గా వర్క్ చేసిన అనుభవం ఉంది. అలా యానిమేషన్ రంగంలో ఆల్రెడీ ఆయనకు ప్రవేశం ఉంది. ఒకసారి తెలుగు ఇండస్ట్రీలో యానిమేషన్ సినిమాల హవా ఊపందుకుంటే, ఆయన డైరెక్షన్లో ఓ యూనిమేషన్ మూవీ రావొచ్చని ఊహించవచ్చు.ఈ కోవలో మరికొన్ని యానిమేషన్ చిత్రాలు రూపొందుతున్నాయి. ముఖ్యంగా మన భారత పురాణ కథల ఆధారంగా ఎక్కువగా యానిమేషన్ చిత్రాలు రూపొందడం విశేషం. ఆ రకంగా వినోదానికి వినోదం... విజ్ఞానానికి విజ్ఞానం అందుతుంది. నేటి తరం పురాణ కథలు తెలుసుకోవడానికి ఈ యానిమేషన్ చిత్రాలు ఉపయోగపడతాయని చెప్పోచ్చు. యానిమేషన్ సినిమా వసూళ్లు రూ. 19 వేల కోట్లు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు సాధించిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో ఓ యానిమేషన్ సినిమా ఉంది. అదే ‘నే ఝా 2’ (2019లో వచ్చిన ‘నే ఝా’ సినిమాకు ఇది సీక్వెల్). చైనీస్ మైథాలజీతో కూడిన ఈ ‘నే ఝా 2’ చిత్రం గత ఏడాది జనవరి 29న రిలీజైంది. యు యంగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చైనాలో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. 2025 చివర్లో ఇతర విదేశీ భాషల్లో కూడా ఈ సినిమా అనువాదమై, సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు రూ. 700 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చైనీస్ యానిమేషన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి ట్రెడ్ వర్గీయులను ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపించింది. మాస్టర్ షెన్‌కు వ్యతిరేకంగా నే ఝా ఎలా పోరాటం చేశాడు? ఈ పోరాటంలో నే ఝా స్నేహితుడు అవో బింగ్ సహకారం ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ‘నే ఝా 2’ కథ సాగుతుంది. ఈ సినిమా ఈ నెల 20 నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఇంగ్లిష్, హిందీ, మాండరీన్ (చైనా భాష) భాషల్లో యాపిల్ టీవీప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. – ముసిమి శివాంజనేయులు -
ఆస్కార్ కు అడుగు దూరంలో కాంతారా, మహావతార్..
-
2025 రౌండప్.. ఓటీటీల్లో ఈ సినిమాలకు సూపర్ రెస్పాన్స్
2025 క్లైమాక్స్‌కి వచ్చేసింది. ఈ ఏడాది ఓటీటీల్లోకి చాలా తెలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్ని ఊహించినట్లుగానే అద్భుతమైన రెస్పాన్స్ అందుకోగా.. మరికొన్ని మాత్రం అనుహ్యంగా డిజిటల్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకున్నాయి. అలా బెస్ట్ అనిపించుకున్న చిత్రాలేంటి? ఇవి ఏయే ఓటీటీల్లో ఉన్నాయనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి థియేటర్లలో కళ్లు చెదిరే వసూళ్లు అందుకున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేశ్, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై విడుదల టైంలోనే విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. అయినా సరే దీన్ని ఓటీటీలోనూ అదేస్థాయిలో చూశారు. ఇది జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.సాధారణ ప్రేక్షకుల నుంచి దైవభక్తుల వరకు ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేసిన మూవీ 'మహావతార్ నరసింహా'. ఇదో యానిమేటెడ్ మూవీ. కాబట్టి దీనికి బాషతో సంబంధం లేదు. విజువల్స్, మ్యూజిక్, స్టోరీ, సీన్స్.. ఇలా అన్నీ టాప్ నాచ్‌లో ఉంటాయి. తొలుత థియేటర్లో, ఆపై నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చాక కూడా సేమ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.పవన్ కల్యాణ్ నుంచి చాలారోజుల తర్వాత వచ్చిన స్ట్రెయిట్ సినిమా 'ఓజీ'. థియేటర్లలో అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. దర్శకుడు సుజీత్‌కి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత కూడా ఈ చిత్రానికి సాధారణ ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది.హీరో నాని నిర్మించిన చిన్న సినిమా 'కోర్ట్'. థియేటర్లలో రిలీజైనప్పుడే అద్భుతమైన హిట్ అయిన ఈ చిత్రం.. తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి రెస్పాన్స్ అందుకుంది. మిగిలిన దక్షిణాది భాషల్లోనూ దీనికి ఓటీటీలో హిట్ టాక్ రావడం విశేషం.శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'సింగిల్'. ప్రేమకథని కామెడీగా తీసిన విధానం, అందులో ట్రెండింగ్ మీమ్స్, వన్ లైనర్స్ లాంటివి ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడానికి కారణమయ్యాయి. అమెజాన్ ప్రైమ్‌లో ఇది ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.నవీన్ చంద్ర హీరోగా నటించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఎలెవన్'. థియేటర్లలో రిలీజైనప్పుడు దీని గురించి జనాలకు పెద్దగా తెలియలేదు గానీ ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం సర్ప్రైజ్ రెస్పాన్స్ అందుకుంది. థ్రిల్లర్ మూవీస్ లవర్స్‌కి ఇది నచ్చేసింది.తెలుగులో ప్రేమకథలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అలా ఈ ఏడాది రిలీజైన సినిమా '8 వసంతాలు'. అనంతిక లీడ్ రోల్ చేసిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు. థియేటర్లలో రిలీజైనప్పుడు దీనికి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి గానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత పాజిటివ్ టాక్ వినిపించింది. డైలాగ్స్, విజువల్స్ ఈ మూవీలో మెయిన్ హైలైట్. నెట్‌ఫ్లిక్స్‌లో దీన్ని చూడొచ్చు.తేజా సజ్జా చేసిన మరో సూపర్ హీరో సినిమా 'మిరాయ్'. ఇందులో మంచు మనోజ్ విలనిజం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూవీలో లాజిక్స్‌పై ట్రోల్స్ వచ్చినప్పటికీ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం తొలుత థియేటర్లలో ఆపై ఓటీటీలోనూ మంచి స్పందనే అందుకుంది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో ఉంది.విలన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుని.. ప్రస్తుతం హీరోగా చేస్తున్న తిరువీర్ నుంచి వచ్చిన లేటేస్ట్ మూవీ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల థియేటర్లలో అంతంత మాత్రంగా ఆడిన ఈ చిన్న చిత్రం.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. స్వచ్ఛమైన హాస్యం, సిచ్యుయేషన్ కామెడీ ప్లస్ పాయింట్స్. ఇది జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే?) -
ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీస్, సినిమాలివే!
సినిమాలు, టీవీ షోలు, సెలబ్రిటీల సమాచారానికి సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రామాణికమైన వేదిక Imdb..2025 సంవత్సరానికి గాను ఇండియాలోని టాప్ 10 వెబ్ సిరీస్, సినిమాలను ప్రకటించింది.1) టైటిల్: ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్నటీనటులు: బాబీ డియోల్, లక్ష్య లల్వానీ, సాహెర్ బాంబా, మోనా సింగ్, అన్యా సింగ్, గౌతమీ కపూర్దర్శకత్వం: ఆర్యన్ ఖాన్ (షారుఖ్ ఖాన్ కుమారుడు)ఓటీటీ: ‘నెట్‌ఫ్లిక్స్’2) టైటిల్: బ్లాక్ వారెంట్నటీనటులు: జహాన్ కపూర్, అనురాగ్ ఠాకూర్, పరం వీర్ సింగ్, రాహుల్ భట్దర్శకత్వం: విక్రమాదిత్య మోత్వానే - సత్యాన్షు సింగ్ ఓటీటీ : 'నెట్ ఫ్లిక్స్'(7 ఎపిసోడ్స్)3) టైటిల్: పాతాళ్‌లోక్ సీజన్-2నటీనటులు: జైదీప్ అహ్లవత్, గుల్‌పనాగ్, ఇష్వాక్ సింగ్, విపిన్ శర్మ, తిలోత్తమ షోమీ, ప్రశాంత్ తమాంగ్దర్శకత్వం: అవినాష్ అరుణ్, ప్రోసిత్ రాయ్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో4) టైటిల్:పంచాయత్ సీజన్ 4నటీనటులు: జితేంద్ర కుమార్, నేనా గుప్తా,రఘుబీర్ యాదవ్బి,శ్వపతి సర్కార్, సునీత రాజ్వార్, శాన్విక దర్శకుడు: దీపక్ కుమార్ మిశ్రా - అక్షత్ఓటీటీ:'అమెజాన్ ప్రైమ్ వీడియో5) టైటిల్: మండల మర్డర్స్నటీనటులు: వాణీ కపూర్, వైభవ్ రాజ్, సుర్విన్ చావ్లా, శ్రియా పిల్గాంకర్, జమీల్‌ఖాన్, అదితి సుధీర్దర్శకత్వం: గోపి పుత్రన్, మనన్ రావత్ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్6) టైటిల్: ఖాఫ్నటీనటులు: మోనిక పన్వర్, రజత్ కపూర్, గీతాంజలి కులకర్ణి దర్శకత్వం: పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో7) టైటిల్: స్పెషల్ ఓపీఎస్2నటీనటులు: కేకే మేనన్, తాహిర్ రాజ్ బాసిన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త, సయామీ ఖేర్, ప్రకాశ్రాజ్దర్శకత్వం: నీరజ్ పాండేఓటీటీ:జియో హాట్‌స్టార్8) టైటిల్: ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2)నటీనటులు: జీత్, ప్రొసెన్ జిత్ ఛటర్జీ, రిత్విక్ భౌమిక్, ఆదిల్ జాఫర్ ఖాన్, పరంబ్రత ఛటర్జీ, చిత్రాంగ్ధ సింగ్ దర్శకత్వం: డెబాత్మ మండల్, తుషార్ కాంతి ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్9) టైటిల్: ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3నటీనటులు: మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, షరీబ్ హష్మి, జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్, శ్రేయా ధన్వంతరి, గుల్ పనాగ్, సందీప్ కిషన్దర్శకత్వం: రాజ్ అండ్ డీకే, సుమన్ కుమార్, తుషార్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో10) క్రిమినల్ జస్టీస్ 4నటీనటులు: పంకజ్ త్రిపాఠి, మహ్మద్ జీషన్, సుర్వీన్ చావ్లా, ఆషా నేగి, మీతా వశిష్ట్, శ్వేతా బసు ప్రసాద్, ఖుషీ భరద్వాజ్దర్శకత్వం : రోహన్ సిప్పిఓటీటీ: హాట్స్టార్టాప్ 10 సినిమాలివేసయారామహావతార్ నరసింహఛావాకాంతారా: ఎ లెజెండ్ – ఛాప్టర్ 1కూలీడ్రాగన్సితారే జమీన్ పర్దేవారెయిడ్ 2లోక ఛాప్టర్ 1: చంద్ర -
అఫీషియల్.. ఆస్కార్ బరిలో 'మహావతార్ నరసింహ'
ఆస్కార్ అవార్డ్ అనేది ప్రతి ఇండస్ట్రీ కల. భారతీయ సినిమాలకు, మరీ ముఖ్యంగా దక్షిణాది చిత్రాలకు చాన్నాళ్ల పాటు ఇది అందని ద్రాక్షలానే మిగిలింది. కానీ 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటకు పురస్కారం దక్కడంతో యావత్ భారతదేశం సంతోషంతో ఉప్పొంగింది. ఇప్పుడు మరో హిట్ మూవీ.. ఆస్కార్ బరిలో నిలిచింది. అదే ఈ ఏడాది వందల కోట్లు సాధించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న 'మహావతార్ నరసింహ'.సలార్, కేజీఎఫ్ తదితర మూవీస్ తీసిన హొంబలే ఫిల్మ్స్ నుంచి ఈ ఏడాది వచ్చిందీ యానిమేషన్ సినిమా. జూలై 25న ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్ల రిలీజ్ చేశారు. తొలివారం పాజిటివ్, మౌత్ టాక్ రావడంతో ఓ మాదిరి కలెక్షన్ వచ్చాయి. రెండో వారం నుంచి ఇక తగ్గేదే లే అనేలా దూసుకుపోయింది. రూ.30-40 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఓవరాల్‌గా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పాన్ ఇండియా లెవల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది.ఇకపోతే ఇప్పుడీ సినిమా ఆస్కార్ బరిలోనూ నిలిచింది. 2026 ఆస్కార్ పోటీలో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పలు దేశాల నుంచి వచ్చిన 35 సినిమాల్లో 'మహావతార్ నరసింహ' కూడా ఒకటిగా నిలిచింది. మన దేశం నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన తొలి యానిమేటెడ్ చిత్రం ఇదే కావడం విశేషం. ఒకవేళ ఆస్కార్ గెలుచుకుంటే మాత్రం అది మరొక అద్భుతం అవుతుందడంలో ఎలాంటి సందేహం లేదు.(ఇదీ చదవండి: కాబోయే భార్యకు మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్)మహావతార్ నరసింహ సినిమా విషయానికొస్తే.. శ్రీ మహావిష్ణువు, నరసింహావతారం ఆధారంగా రూపొందిన చిత్రమిది. మీరు సృష్టించిన ఏ జీవి వల్ల, ఎలాంటి కాలంలోనూ ఏ అస్త్ర శస్త్రాల నుంచి తన ప్రాణాలకి ముప్పు కలగకూడదని బ్రహ్మ దేవుడి నుంచి రాక్షసరాజు హిరణ్యకశిపుడు వరం పొందుతాడు. ఆ తర్వాత ముల్లోకాలకు తానే అధిపతినని, తానే భగవంతుడినని ప్రకటించుకుంటాడు. భూలోకంలో ధర్మాన్ని కాలరాస్తాడు. తన సోదరుడి మరణానికి కారణమైన మహావిష్ణువుపై మరింత కోపంతో రగిలిపోతుంటాడు.కానీ తన కుమారుడు ప్రహ్లాదుడు... శ్రీవిష్ణువుకి మహా భక్తుడిగా మారతాడు. ఇది సహించలేని హిరణ్యకశిపుడు.. ప్రహ్లాదుడిని చంపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? తనకెంతో ప్రీతిపాత్రమైన భక్తుడు ప్రహ్లాదుడిని మహావిష్ణువు ఎలా కాపాడుకున్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో నరసింహావతారం ఎత్తాల్సి వచ్చింది? హిరణ్యకశిపుడి సంహారం ఎలా జరిగింది? అనేదే సినిమా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన) -
క్రికెట్లో సెంచరీ కాదు.. ఈ రోజుల్లో ఇలాంటి సెంచరీ ఎప్పుడైనా చూశారా?
ఒకప్పుడు సినిమాలు అంటే సెంచరీలు కొట్టేవి. హాఫ్ సెంచరీతో మొదలై డబుల్ సెంచరీలు కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇదేంటి సినిమాల గురించి చెబుతూ క్రికెట్‌తో పోలుస్తున్నారని మీకనిపిస్తోందా? నేను చెప్పేదాంట్లో వింతేముంది.. సెంచరీ అనే పదం అందరికీ తెలిసిందే. క్రికెట్లో వంద రన్స్ చేస్తే సెంచరీ కొట్టినట్లే. మరి సినిమాల్లో సెంచరీ అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఈ రోజుల్లో కొట్టమనేది ఇక అసాధ్యమే.ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయినా సినిమా కూడా నెల రోజులు బాక్సాఫీస్ వద్ద ఆడిందంటే గొప్పే. వారం రోజులు దాటిందంటే చాలు.. రిలీజైన చిత్రాలు థియేటర్లలో కనిపించడం లేదు. అవీ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండానే కనుమరుగువుతున్నాయి. ఈ రోజుల్లో ఎంత హిట్ సినిమా అయినా కూడా నెల రోజులు బాక్సాఫీస్ వద్ద నిలవడం కూడా గగనమే అన్నట్లుంది పరిస్థితి. ఇటీవల రిలీజైన కాంతార చాప్టర్-1 సూపర్ హిట్‌గా నిలిచినా నెల రోజుల్లోపే ఓటీటీకి వచ్చేసింది. అలాంటి ఈ రోజుల్లో ఒక సినిమా వంద రోజులు ఆడిందంటే మీరు నమ్ముతారా? నమ్మరు కాక నమ్మరు. కానీ ఇప్పుడు తప్పకుండా నమ్మాల్సిందే. అదేంటో మీరు కూడా చదివేయండి.ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ మహావతార్ నరసింహా. పాన్ ఇండియా రేంజ్లో జులై 25న విడుదలైన ఈ యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా రిలీజై 50 రోజులు పూర్తయినా కూడా 200 థియేటర్స్ పైగానే ఈ సినిమాను ప్రదర్శించారు.ఈ చిత్రం ఏకంగా ఇప్పుడు సెంచరీ కొట్టేసింది. ఏకంగా థియేటర్లలో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ రోజుల్లో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసింది ఈ యానిమేషన్ మూవీ. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 100 రోజుల కీర్తి.. ఇది ఒక తిరుగులేని గాథ.. మహావతార్ నరసింహ బాక్సాఫీస్ చరిత్రను తిరిగి రాస్తూ గర్జిస్తున్నాడు అంటూ పోస్ట్ చేసింది. ఈ ప్రయాణంలో భాగమైనందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది.అయితే ఈ రోజుల్లో వంద రోజులు బాక్సాఫీస్ వద్ద నిలిచిందంటే మామూలు విషయం కాదు. భారీ చిత్రాలు సైతం నెల రోజులకే కనుమరుగవుతున్న తరుణంలో బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. కాగా.. ఈ మూవీని అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా తెరకెక్కించారు. 100 DAYS of glory. One unstoppable saga! 🔥#MahavatarNarasimha roars on, rewriting box-office history.Eternally grateful to our amazing audience for being part of this divine journey. 🙏🏻❤️#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan… pic.twitter.com/yZcsyCazkw— Hombale Films (@hombalefilms) November 1, 2025 -
ఓటీటీకి రూ.340 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ రివీల్
ఎలాంటి అంచనాలు లేకుండా యానిమేషన్ చిత్రం మహావతార్ నరసంహా. జూలై 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ (ఎమ్.సి.యు) పేరుతో తొలి చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం 200 థియేటర్స్‌కు పైగా 50 రోజులు పూర్తి చేసుకుందని ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. రిలీజైన రోజు నుంచి ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ డేట్ మేకర్స్ రివీల్ చేశారు. ఈ శుక్రవారం(సెప్టెంబర్ 19న) మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ మహావతార్ నరసింహ పోస్టర్‌ను పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం రేపటి నుంచి ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
'మహావతార్ నరసింహ' 50 రోజులు పూర్తి
'మహావతార్ నరసింహ' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్లో జులై 25న విడుదలైన ఈ యానిమేషన్ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో థియేటర్స్ నిండిపోయాయి. ఈ మూవీ ఆఫ్ సెంచరీ కొట్టడంతో డిలీటెడ్ సీన్ వీడియోను చిత్ర యూనిట్ పంచుకుంది. ఇప్పటికీ ఎన్ని థియేటర్స్‌లలో రన్ అవుతుందో కూడా పేర్కొంది.అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం 200 థియేటర్స్ పైగానే 50 రోజులు పూర్తి చేసుకుందని మేకర్స్ ప్రకటించారు. ఆపై ఇప్పటి వరకు ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ కూడా బుక్‌మైషోలో రోజుకు సుమారు 10వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే, ఈ 50రోజుల్లో బుక్‌మైషో ద్వారా సుమారు 67 లక్షలకు పైగానే టికెట్లు కొనుగోలు చేశారు. -
అన్ని సినిమాలు మహావతార్, సయారాలు కావుగా!: నిర్మాత
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.310 కోట్లు కొల్లగొట్టింది మహావతార్ నరసింహ మూవీ (Mahavatar Narsimha). అటు బాలీవుడ్లో కొత్తవారితో తీసిన సయారా చిత్రం ఏకంగా రూ.580 కోట్లు దాటేసింది. ఈ రెండు సినిమాలు ఎంత సెన్సేషన్ అయ్యాయో అందరికీ తెలిసిందే! అయతే కొత్తవారితో తీసిన ప్రతి సినిమా సయారాలా సెన్సేషన్ హిట్ అందుకోలేదంటున్నాడు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్.భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్.. ఎందుకు?తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. ఈ సినిమాను హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి కరణ్ జోహార్ (Karan Johar) విడుదల చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో కరణ్ జోహార్ పాల్గొన్నాడు. అక్కడ.. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవడానికి పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం లేదా స్టార్స్ తీసుకుంటున్న రెమ్యునరేషన్.. ఏది కారణం? అని ఓ ప్రశ్న ఎదురైంది.ఎవర్నీ తప్పుపట్టలేంఅందుకు కరణ్ స్పందిస్తూ.. ప్రతి సినిమాకు దాని ఫలితం ముందే రాసిపెట్టి ఉంటుంది. పెద్ద హీరోలతో తీసిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా హిట్టయిన రోజులున్నాయి. కాకపోతే పరిస్థితులు సరిగా లేవు. అందుకే ఇప్పుడందరూ సినిమాను మరోసారి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనం ఎవరినీ తప్పుపట్టలేము. అలాగే కొత్తవారితో పెద్ద సినిమా తీసినప్పుడు అవి సక్సెస్ అయిన రోజులున్నాయి, అలాగే ఫెయిలైన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేరు.దరిదాపుల్లోకి కూడా రాలేవ్సంగీతాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చే ప్రతి సినిమా సయారాలా హిట్టవలేదు. యానిమనేషన్ సినిమాలు కూడా ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ మహావతార్ నరసింహకు దరిదాపుల్లోకి కూడా రాలేవు అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.చదవండి: సెంచరీలతో స్టార్ హీరో దూకుడు.. మరో హాఫ్ సెంచరీ! -
రూ. 40 కోట్ల బడ్జెట్..300 కలెక్షన్స్.. ఆస్తులన్నీ అమ్ముకున్నాం : డైరెక్టర్
పాన్ ఇండియా హీరోలు..స్టార్ డైరెక్టర్లు.. భారీ బడ్జెట్.. ఇవన్నీ ఉన్నా కూడా థియేటర్స్‌కి ప్రేక్షకులు రాలేకపోతున్న రోజులివి. స్టార్ హీరోల సినిమాలకు కూడా సూపర్ హిట్ టాక్ వస్తేనే కాస్తో కూస్తో జనాలు థియేటర్స్‌కి వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ యానిమేషన్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అదే ‘మహావతార్ నరసింహా’.బడా చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటే.. ఈ మూవీ మాత్రం ఐదు వారాలుగా థియేటర్స్‌లో సందడి చేస్తూనే ఉంది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా రికార్డుకెక్కింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించాడు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ఐదేళ్ల పాటు పడిన కష్టానికి ఫలితం దక్కిందని అంటున్నాను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా తీసే క్రమంలో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.దేవుడిని నమ్మేవాడిని కాదు..మాది మహారాష్ట్ర. చదువుకునే రోజుల్లో దేవుడిని నమ్మేవాడిని కాదు. దేవుడే ఉంటే..కొందరికి కష్టాలు, కొందరికి సుఖాలు ఎందుకు ఇస్తాడని ప్రశ్నించేవాడిని. అయితే కొన్ని సమస్యలు, ఒత్తిళ్లు రావడంతో కృష్ణభక్తుడైన శ్రీలప్రభుపాద రచనలు, భగవద్గీతా చదివాను. దీంతో నేను కృష్ణ భక్తిడిగా మారిపోయా. అప్పుడే వీఎఫ్ఎక్స్ ఉపయోగించి త్రీడీలో ప్రహ్లాదుడు-నరసింహా స్వామి కథను తీయాలనుకున్నా. దాదాపు ఐదేళ్ల క్రితం మహావతార్ నరసింహ కథకి బీజం పడింది.ఆస్తులన్నీ అమ్ముకున్నాం.. ఈ సినిమా కోసం మా ఆస్తులన్నీ అమ్ముకున్నాం. మొదట్లో మా దగ్గర ఉన్న డబ్బుతో సినిమా తీద్దాం అనుకున్నాం. కానీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సంపాదించిదంతా కొన్నాళ్లకే అయిపోయింది. నా భార్య దగ్గర ఉన్న డబ్బులు కూడా ఈ సినిమాకే ఖర్చు చేశాం. బడ్జెట్ ఊహించనంత పెరిగిపోయింది. ఇన్వెస్టర్లను వెతికాం. కొంతమంది పెట్టుబడి పెడతామని చెప్పి చివర్లో హ్యాండిచ్చారు. అలా దాదాపు వంద మందికి పైగా నిర్మాతలను, ఇన్వెస్టర్లను కలిశాం. చివరకు నా భార్య నగలు, కారు, ఇష్టంగా కట్టుకున్న ఇళ్లు కూడా అమ్మేసి సినిమా నిర్మాణానికి ఖర్చు చేశాం.ఎవరు చూస్తారంటూ భయపెట్టారుసినిమా కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడింది. రోజుకు 16 గంటలు పని చేసేవాళ్లం. నెలాఖరు రాగానే టీమ్ జీతాల కోసం ఎక్కడ అప్పులు తేవాలని నా భార్య ఆలోచించేంది. ఇలా మా అవస్థలేవో మేం పడుతుంటే.. మరికొందరు ‘దేవుడి సినిమా ఇప్పుడు ఎవరు చూస్తారు? ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు.. సినిమా పోతే మీ పరిస్థితి ఏంటి? అని కొంతమంది భయపెట్టేవాళ్లు. కానీ నా భార్య, నేను ఒక్కటే అనుకున్నాం. ఒకవేళ సినిమా పోతే.. ‘అది మన ఖర్మ’ అనుకొని వదిలేసి.. గతంలో మాదిరి మళ్లీ వీఎఫ్ఎక్స్ పనులు చేసుకుందాం’ అని నిర్ణయించుకున్నాం. చాలా ఇబ్బందులు పడి జులై 25న ఈ చిత్రాన్ని విడుదల చేశాం. రూ.40 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం పది రోజుల్లోనే రూ. 100 కోట్లను వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల వరకు రాబట్టింది. మా ఐదేళ్ల కష్టానికి ఫలితం దక్కింది. చాలా సంతోషంగా ఉంది’ అని అశ్వి కుమార్ అన్నారు. -
'మహావతార్ నరసింహ' కలెక్షన్స్.. దేశాన్ని ఏకం చేసిన గర్జన
'మహావతార్ నరసింహ' కలెక్షన్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. సినిమా రిలీజై ఆరు వారాలు పూర్తి అయినప్పటికీ కొన్నిచోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతుంది. దీంతో ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను పంచుకుంది.'మహావతార్ నరసింహ' చిత్రం రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరిపోయింది. ఇండియా బిగ్గెస్ట్ యానిమేటెడ్ చిత్రంగా నిలిచిందంటూ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ప్రకటించింది. దేశాన్ని ఏకం చేసిన నరసింహ గర్జన అంటూ పేర్కొంది. శ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి అల్లు అరవింద్ విడుదల చేశారు. కేవలం తెలుగులోకే రూ. 47 కోట్ల నెట్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. The roar that united the nation 🦁🔥300 Cr+ Worldwide Gross & Counting… 💥India’s biggest animated blockbuster, #MahavatarNarsimha continues its legendary box office run into its 6th week!#Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/swIBVl0y4x— Hombale Films (@hombalefilms) August 29, 2025 -
'మహావతార్ నరసింహ' బ్లాక్‌బస్టర్ ట్రైలర్ చూశారా..?
'మహావతార్ నరసింహ' సినిమా విడుదలై నెల కావస్తుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ యానిమేషన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏకంగా రూ. 280 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. మూవీ భారీ విజయం అందుకోవడంతో తాజాగా మేకర్స్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ నిండిపోయాయి. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల విజయవంతంగా రన్ అవుతుంది. -
మహావతార్ నరసింహ అద్భుతాలు.. సెట్స్‌పైకి పరశురామ్
మహావతార్ నరసింహ.. వెండితెరపై ఇప్పటికీ అద్భుతాలు సృష్టిస్తూనే ఉంది. ప్రమోషన్లు లేవు, హైప్ లేదు, బడ్జెట్ కూడా తక్కువే.. అందులోనూ భారీ సినిమాలతో పోటీ.. అన్నింటినీ తట్టుకుని నిలబడింది. యానిమేషన్ మూవీ అయినా రికార్డులు భారీ కలెక్షన్లు రాబడుతూ రికార్డులు తిరగరాస్తోంది. జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ గతవారం క్రితమే రూ.200 కోట్ల మైలురాయిని దాటేసింది. హరిహర వీరమల్లు, కింగ్డమ్ చిత్రాల పోటీని తట్టుకుని బలంగా నిలబడింది.నవంబర్‌లో సెట్స్పైకిఇటీవలే రిలీజైన వార్ 2, కూలీ సినిమాల కాంపిటీషన్‌ను సైతం తట్టుకుని ఇంకా వెండితెరపై మ్యాజిక్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రదర్శకుడు తన నెక్స్ట్ మూవీని ప్రకటించాడు. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో శ్రీవిష్ణువు దశావతారాల ఆధారంగా సినిమాలు తెరకెక్కనున్నాయని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే! అందులో భాగంగా తన రెండో సినిమా మహావతార్ పరశురామ్‌ను నవంబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్తున్నట్లు ప్రకటించాడు. నాకంటూ క్లారిటీ ఉందివ్యవస్థ తప్పుదారిలో వెళ్తున్నప్పుడు దాన్ని సరిదిద్దేందుకు నిలబడ్డ హీరో పరశురామ్. ఇది చాలా శక్తివంతమైన కథ. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ కూడా మొదలైంది. నరసింహ సినిమా సక్సెస్‌తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజల ప్రేమను చూస్తుంటే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలనిపిస్తోంది. నాపై ఒత్తిడి ఉంది. కాకపోతే ఇంకా ఏడు సినిమాలు తీయాలన్న క్లారిటీ కూడా ఉంది. అయితే అన్నీ యానిమేషన్స్ తీయాలనుకోవడం లేదు. కనీసం రెండు చిత్రాలైనా లైవ్ యాక్షన్ ఫిలింస్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.పరశురామ్‌పై రెండు సినిమాలుఇదిలా ఉంటే పరశురామ జీవితకథపై హిందీలో మహావతార్ టైటిల్ పేరిట ఓ సినిమా తెరకెక్కుతోంది. ఛావాతో ప్రేక్షకుల్ని మెప్పించిన విక్కీ కౌశల్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ రెండు పరశురామ్ చిత్రాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద నెగ్గుతుందో చూడాలి! -
'మహావతార్ నరసింహ' సినిమాపై చాగంటి కోటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) తాజాగా 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని చూశారు. ఎవరూ ఊహించని రీతిలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ యానిమేషన్ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. ఆధ్యాత్మికత మార్గంలో యావత్ ప్రపంచాన్నే నడిపించే చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌తో పాటుగా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.పురాణాలకు చాలా దగ్గరగానే 'మహావతార్ నరసింహ' చిత్రం ఉందని చాగంటి అన్నారు. భక్త ప్రహ్లాద వంటి సినిమా ఇప్పటికీ ప్రజల మదిలో ఉండిపోయింది. మనుషులతో కాకుండా కేవలం బొమ్మలతో సినిమా తీసినా నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చివరి సన్నివేషం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చని సూచించారు.శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి కూడా చాగంటి కోటేశ్వరరావుతో సినిమా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు. వారిద్దరూ కలిసి 'మహావతార్ నరసింహ' సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలిపిన వీడియోను గీతా ఆర్ట్స్ షోషల్‌మీడియాలో షేర్ చేసింది.జులై 25న విడుదలైన 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, ఇప్పటి వరకు ఈ మూవీ సుమారు రూ. 230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా.. హోంబలే ఫిల్మ్స్‌తో కలిసి క్లీమ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.Chaganti Koteswara Rao garu and K.I. Vara Prasad Reddy garu share their thoughts on #MahavatarNarsimha, applauding the team for delivering a truly divine experience. Witness the divine saga at theatres near you. 🔥pic.twitter.com/qtHfd7XsJw— Geetha Arts (@GeethaArts) August 15, 2025 -
మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ'
రీసెంట్ టైంలో ఏ కొత్త సినిమా అయినా సరే వారం రోజులు నిలబడటమే గ్రేట్ అన్నట్లు తయారైంది. ఎందుకంటే స్టార్ హీరోల చిత్రాలు కూడా పట్టుమని పదిరోజులు ఆడట్లేదు. అలాంటిది ఓ యానిమేటెడ్ మూవీ.. రిలీజై రెండు వారాలు దాటిపోయినా సరే ఫుల్ జోరు చూపిస్తోంది. అవును ఇప్పటివరకు చెప్పింది 'మహావతార నరసింహ' గురించే. ఇప్పుడు ఈ చిత్రం మరో రికార్డ్ సృష్టించింది.సలార్, కేజీఎఫ్ నిర్మించిన హొంబలే సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'మహావతార నరసింహ'. మనలో చాలామందికి తెలిసిన నరసింహా స్వామి కథతో ఈ చిత్రాన్ని పూర్తిగా వీఎఫ్ఎక్స్లో తీశారు. జూలై 25న పాన్ ఇండియా వైడ్ రిలీజైంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా థియేటర్లలోకి వచ్చింది గానీ తర్వాత మాత్రం రోజురోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది.(ఇదీ చదవండి: నా బలం, నా సర్వస్వం.. మహేశ్‌కి నమ్రత స్పెషల్ విషెస్)ఇప్పటివరకు 15 రోజులు కాగా ఏకంగా రూ.150 కోట్ల మేర వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సాధించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు బుక్ మై షోలో 3.6 మిలియన్ల టికెట్స్ అమ్ముడుపోయాయి. అలానే కన్నడ నుంచి ఓ యానిమేటెడ్ మూవీకి ఈ రేంజ్ వసూళ్లు రావడం ఇదే తొలిసారి. ఈ మేరకు హోంబలే సంస్థ ట్వీట్ కూడా చేసింది.ఒరిజినల్‌గా కన్నడ భాష నుంచే దీన్ని తెరకెక్కించినప్పటికీ కన్నడ, తమిళ, మలయాళంలో పెద్దగా వసూళ్లు రాలేదు. తెలుగు, హిందీ నుంచి మాత్రం దాదాపు కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనితోపాటు రిలీజైన 'హరిహర వీరమల్లు' ఇప్పటికీ సైలెంట్ అయిపోగా.. ఈ మూవీ వచ్చిన వారం తర్వాత రిలీజైన 'కింగ్డమ్' కూడా బాక్సాఫీస్ దగ్గర నెమ్మదించింది. 'కూలీ', 'వార్ 2' రిలీజైన తర్వాత ఈ మూవీ జోరు తగ్గుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: 'సు ఫ్రమ్ సో' రివ్యూ.. కన్నడలో బ్లాక్‌బస్టర్ మరి తెలుగులో?)Unleashing a divine blaze 🦁❤️🔥#MahavatarNarsimha races past 150 CRORES+ worldwide gross till Aug 8th, and continues setting screens on fire all over .Catch the divine phenomenon, running successfully in theatres near you.#Mahavatar @hombalefilms @AshwinKleem… pic.twitter.com/RBbuu8OULS— Hombale Films (@hombalefilms) August 9, 2025 -
నా సొంతిల్లు తాకట్టు పెట్టి సినిమా తీశా: మహావతార్ నరసింహా డైరెక్టర్
'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యానిమేటేడ్ చిత్రం ఊహించని విధంగా ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరింది. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సత్తా చాటుతోంది.మహావతార్ నరసింహ సూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు తెలిపారు. నా జీవితంలో సంపాదించిదంతా ఈ సినిమా కోసం ఖర్చు చేశానని వెల్లడించారు. మా తల్లిదండ్రులతో పాటు నా భార్య తరఫున వారి ఆస్తులు కూడా తాకట్టు పెట్టానని అన్నారు. ఆఖరికి నా సొంత ఇల్లు కూడా తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ ఈ సినిమా తీశానని అశ్విని కుమార్ షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు.కాగా.. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ హైదరాబాద్‌కు విచ్చేసిన డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఏఏఏ సినిమాస్‌లో మూవీని వీక్షించారు. ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణ చూసి ఆనందం వ్యక్తం చేశారు.The roaring love from Hyderabad continues… 🦁❤️🔥Director @AshwinKleem visited AAA Cinemas & Mythri Vimal Theatre for #MahavatarNarsimha screening and witnessed a phenomenal response from the audience.#Mahavatar @hombalefilms @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/Ax6BMlbtHs— Hombale Films (@hombalefilms) August 5, 2025ఇల్లు తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ సినిమా తీసా- Director #AshwinKumar #MahavatarNarsimha #TeluguFilmNagar pic.twitter.com/R34q2LsSLD— Telugu FilmNagar (@telugufilmnagar) August 5, 2025 -
'మహావతార్ నరసింహ' ఓటీటీ బిగ్ డీల్
'మహావతార్ నరసింహ' సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఎక్కడ చూసిన విజయవంతంగా రన్ అవుతుంది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీ ఢీల్ గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సినిమా విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఓటీటీ రైట్స్ ఎవరూ కొనుగొలు చేయలేదు. కానీ, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదుచేయడంతో ఓటీటీ సంస్థలు చాలా వరకు మహావతార్ నరసింహా సినిమా కోసం పోటీ పడుతున్నాయి.'మహావతార్ నరసింహ' ఓటీటీ రైట్స్ కోసం చాలా సంస్థలు పోటీ పడుతున్నప్పటికీ జియోహాట్‌స్టార్‌కు దక్కే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు బాలీవుడ్లో కథనాలు వచ్చాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థలతో ఉన్న పరిచయాలను బట్టి వారికే ఈ అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, సుమారు రూ. 50 కోట్లకు పైగానే ఈ ఢీల్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలుగు, తమిళ్, కన్నడ వంటి రీజనల్ ఓటీటీ సంస్థలలో కూడా మహావతార్ నరసింహా స్ట్రీమింగ్కు రావచ్చని సమాచారం. దీంతో హాట్‌స్టార్‌కు మంచి లాభాలే రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో ఈ చిత్రం సత్తా చాటుతుంది. -
రూ. 100 కోట్ల క్లబ్లో 'మహావతార్ నరసింహ'
'మహావతార్ నరసింహ' సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఈమేరకు తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా ఈ యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నారు. బుక్‌మైషోలో ఇప్పటికే 25 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి.'మహావతార్ నరసింహ' చిత్రం పదిరోజుల్లోనే రూ. 105 కోట్లు సాధించింది. భారత్‌లో విడుదలైన యానిమేషన్ చిత్రాలలో ఇదే అత్యధిక కలెక్షన్స్ కావడం విశేషం. ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్‌గా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తెలుగులో గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజైంది.. ఈ సినిమాని విడుదల చేసేలా నరసింహ స్వామి అనుగ్రహించడం తన అదృష్టమని అల్లు అరవింద్ తెలిపారు. తెలుగులోనే ఏకంగా రూ. 20 కోట్లకు పైగా నెట్ రాబట్టినట్లు తెలుస్తోంది. హిందీలో రూ. 70 కోట్లకు పైగానే నెట్ కలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి.Roaring past records with divine force 🦁❤️🔥#MahavatarNarsimha crosses 105 CRORES+ GBOC India, setting the box office ablaze with unstoppable momentum.A divine phenomenon awaits you in cinemas.#Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/LbEdQBZyjo— Hombale Films (@hombalefilms) August 4, 2025 -
మహావతార్ నరసింహ రిలీజ్ చేయడం నా అదృష్టం: అల్లు అరవింద్
‘‘హోంబలే ఫిలింస్ సంస్థ విజయ్‌గారు ఫోన్ చేసి, ‘మహావతార్ నరసింహ’ సినిమాని తెలుగులో విడుదల చేయాలని కోరగా, వెంటనే ఓకే అన్నాను. విడుదలైన రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నాం. ఈ సినిమాని విడుదల చేసేలా నరసింహ స్వామి అనుగ్రహించడం నా అదృష్టం’’ అని అల్లు అరవింద్ తెలిపారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించిన చిత్రం ‘మహావతార్ నరసింహ’. ఈ సినిమా జూలై 25న విడుదలైంది.తెలుగులో గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఎప్పుడూ థియేటర్స్‌కి రాని ప్రేక్షకులు ఈ సినిమాని వీక్షిస్తున్నారు’’ అన్నారు. ‘‘ప్రస్తుత సమాజానికి ఏం కావాలో అది ఈ చిత్రంలో ఉంది. కుటుంబంతో కలిసి వెళ్లి ఈ సినిమాని చూడండి’’ అని పేర్కొన్నారు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. ‘‘ఈ చిత్రాన్ని నా కుటుంబంతో కలిసి చూశాను.సినిమా మొదలైన మూడో నిమిషం నుంచే మేము ఒక గుడిలో ఉన్నామనే భావన కలిగింది’’ అని తెలిపారు తనికెళ్ల భరణి. ‘‘మా సినిమాకు వచ్చిన ప్రతి ప్రశంస నరసింహ స్వామికే చెందుతుంది’’ అన్నారు అశ్విన్ కుమార్. ‘‘ఇది యావత్ భారత్ సినిమా. ఈ చిత్రం నిర్మించడం నరసింహ స్వామి కృపగా భావిస్తున్నాం’’ అని శిల్పా ధావన్ చెప్పారు. -
'మహావతార్ నరసింహా' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మహావతార్ నరసింహ
-
'మహావతార్ నరసింహ' ఆల్‌టైమ్ రికార్డ్ .. కలెక్షన్స్ ఎంతంటే?
'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఎలాంటి తారాగణం లేకుండానే విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డ్లను క్రియేట్ చేసింది. కలెక్షన్ల పరంగా ఇప్పుడు ఏకంగా ఇండియన్ ఆల్‌టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా జులై 25న విడుదలైన ఈ చిత్రం చాలాచోట్ల థియేటర్స్ కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. బుక్‌మైషోలో ఏకంగా ప్రతిరోజు రెండు లక్షలకు పైగా టికెట్లు తెగుతున్నాయి. క్లీమ్ ప్రొడక్షన్స్, ప్రఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. తెలుగులో గీతా అర్ట్స్ నుంచి అల్లు అరవింద్ విడుదల చేశారు.దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన 'మహావతార్ నరసింహ' సినిమాను చూసేందుకు పిల్లలు నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులు వెళ్తున్నారు. దీంతో 8రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 60.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా మార్కెట్లో విడుదలైన అన్ని యానినేషన్ సినిమాల తాలూకా వసూళ్ల రికార్డులను మహావతార్ దాటేసింది. ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా యూఎస్ మార్కెట్లో కూడా ఇదే రేంజ్ ఓపెనింగ్స్ సాధించింది. ఏకంగా వన్ మిలియన్ క్లబ్లో కూడా చేరింది. ప్రపంవ్యాప్తంగా అన్ని భాషలలో ఇప్పటికీ అదే స్ట్రాంగ్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇది డివైన్ బ్లాక్‌బస్టర్ అని చిత్ర మేకర్స్ పేర్కొన్నారు.The divine roar has echoed across the nation 🦁#MahavatarNarsimha has roared past all records, grossing ₹60.5 CRORES+ in just 8 DAYS to become India’s Highest-Grossing Animated Film of All Time 💥💥#Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/kAJNJRlPsY— Hombale Films (@hombalefilms) August 2, 2025 -
ఆ క్లబ్బులో చేరిన 'మహావతార్ నరసింహ'.. కలెక్షన్స్ ఎంతంటే?
ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ అద్భుతాలు సృష్టిస్తున్న చిత్రం మహావతార్ నరసింహ (Mahavatar Narsimha Movie). జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నిజానికి ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ.1.75 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. కానీ మౌత్ టాక్ బాగుండటంతో ఏరోజుకారోజు వసూళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పలుచోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. దీంతో వారం రోజుల్లోనే నరసింహ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మేరకు హోంబలే ఫిలింస్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది.నరసింహస్వామి కథపురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద- నరసింహస్వామి కథే మహావతార్: నరసింహ. ఈ యానిమేషన్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించింది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం అందించాడు. డైరెక్టర్ అశ్విన్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ .. గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది.విష్ణు దశావతరాలుహోంబలే ఫిలింస్.. క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి పన్నెండేళ్ల ప్రణాళికతో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రారంభించింది. శ్రీవిష్ణువు దశావతారాల ఆధారంగా ఈ యూనివర్స్‌లో సినిమాలు తెరకెక్కనున్నాయి. ఈ యూనివర్స్‌లో వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయి, చైతన్య దేశాయి నిర్మించారు. రాబోయే సినిమాలు..ఈ చిత్రం 3డీ ఫార్మాట్లో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2025లో నరసింహ (ఆల్రెడీ రిలీజైంది), 2027లో పరశురామ, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీశ్, 2033లో గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 ’ చిత్రాలను విడుదల చేస్తామని హోంబలే గతంలో వెల్లడించింది. 53 CRORES India GBOC and counting… 💥The unstoppable #MahavatarNarsimha continues to reign supreme at the box office.Witness the divine rage unfold on the big screen 🦁🔥#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan @AshwinKleem @SamCSmusic… pic.twitter.com/ZeV8LDDelc— Hombale Films (@hombalefilms) August 1, 2025చదవండి: ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్ -
మహావతార్.. నరసింహపై కలెక్షన్ల వర్షం
-
అల్లు అరవింద్‌కు 'మహావతార్ నరసింహా' వరం
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' వంటి పెద్ద సినిమానే ఒక యానిమేషన్ సినిమా వెనక్కు నెట్టేసింది. కేవలం ఒక్కరోజు గ్యాప్‌లో వచ్చిన 'మహావతార్ నరసింహా' చిత్రం తెలుగులో దుమ్మురేపుతుంది. బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ ఈ చిత్రం దూసుకుపోతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఈ చిత్రం ట్రెండ్ కనిపిస్తోంది. బుక్ మై షోలో ఏకంగా కేవలం తెలుగులోనే ప్రతి గంటకు పది వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే, ఈ చిత్రాన్ని తెలుగు రైట్స్ కొనుగోలు చేసింది నిర్మాత అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి జులై 25న తెలుగులో విడుదల చేశారు. ఈ మూవీ ఆయనకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.'మహావతార్ నరసింహా' చిత్రం మొదటి రోజు కేవలం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలతో కలిపి రూ. 1.75 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. సినిమాకు మంచి టాక్ రావడంతో రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 22 కోట్ల నెట్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. గ్రాస్ పరంగా చూస్తే రూ. 31 కోట్లగా ఉండవచ్చని అంచనా.. అయితే, తెలుగులో 4రోజులకు గాను రూ. 8 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ప్రతిరోజు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఏకంగా వీరమల్లు చిత్రాన్ని తొలగించి 'మహావతార్ నరసింహా' చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో మరింత కలెక్షన్స్ పెరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా పూర్తి రన్ అయ్యేసరికి తెలుగులోనే సుమారు రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టవచ్చని అంచనా ఉంది. అల్లు అరవింద్ గతంలో కూడా కాంతార, 2018 వంటి చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసి మంచి ఫలితాలను అందుకున్నారు. ఇప్పుడు ‘మహావతార నరసింహ’తో ఆయన జాక్‌పాట్ కొట్టారని నెటిజన్లు చెబుతున్నారు. -
'మహావతార్ నరసింహా' కలెక్షన్.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా
కొన్నిసార్లు చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా యానిమేటెడ్ చిత్రాలు మన దగ్గర పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. కానీ ఈ మూవీ మాత్రం మౌత్ టాక్‌తో పాటు కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ.10 కోట్లకు పైన వసూళ్లు రావడం విశేషం.ఓవైపు 'హరిహర వీరమల్లు' లాంటి తెలుగు సినిమా పోటీ ఉన్నప్పటికీ.. 'మహావతార్ నరసింహా' స్క్రీన్ కౌంట్ పెంచుకుంటూ పోతోంది. తొలిరోజు కొన్ని థియేటర్లు దక్కగా.. రెండోరోజు, మూడో రోజుకి థియేటర్ల సంఖ్య పెరిగింది. అదే రీతిన వసూళ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. తొలిరెండు రోజుల్లో కలిపి రూ.5 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. మూడో రోజైన ఆదివారం మాత్రం దేశవ్యాప్తంగా రూ.11.25 కోట్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)ఈ లెక్కన చూసుకుంటే మూడు రోజుల్లో కలిపి దాదాపు రూ.20 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతార, సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ సినిమా 'మహావతార్ నరసింహా'. మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాలు ఆధారంగా ఓ యూనివర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా రిలీజైన తొలి పార్ట్ ఇది. నరసింహా స్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అమితంగా నచ్చేస్తోంది.సాధారణంగా మన దగ్గర యానిమేటెడ్ మూవీస్ పెద్దగా వర్కౌట్ కావు. గతంలో 'హనుమాన్' తదితర చిత్రాలు వచ్చాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే వసూళ్లు రాబట్టుకోలేకపోయాయి. ఈ సినిమా మాత్రం కోట్ల రూపాయలు కలెక్షన్స్, అది కూడా పాన్ ఇండియా లెవల్లో అంటే విశేషమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్!) -
'మహావతార్ నరసింహ' థియేటర్స్ హౌస్‌ఫుల్.. కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ (ఎమ్.సి.యు) పేరుతో తొలి చిత్రంగా జులై 25న విడులైంది. క్లీమ్ ప్రొడక్షన్స్, ప్రఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాలను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ఈ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద మెప్పిస్తుంది. చాలాచోట్ల థియేటర్స్ కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అయతే, హరిహర వీరమల్లు వల్ల పెద్దగా ఈ చిత్రానికి థియేటర్స్ దొరకలేదు. కానీ, మొదటిరోజునే మంచి టాక్ రావడంతో మెల్లిగా బాక్సాఫీస్ వద్ద జోరందుకుంటుంది.యానిమేటెడ్ రూపంలో తెరకెక్కిన భారతీయ చిత్రాలకు ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారని సినిమా క్రిటిక్స్ చెబుతున్నారు. 'మహావతార్ నరసింహ' విడుదలైన మొదటిరోజు రూ. 1.75 కోట్ల నెట్ రాబట్టింది. రెండోరోజు రూ. 5.20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే కలెక్షన్స్ గ్రాస్ పరంగా చూస్తే రూ. 10 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, నేడు ఆదివారం కావడంతో బుక్‌మైషోలో ఏకంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమాకు మంచి టాక్ రావడంతో రోజురోజుకు టికెట్లు తెగడం పెరుగుతుందని చెప్పవచ్చు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఫలితం ఎలా ఉంటుంది అన్న దానికి తాజా నిదర్శనం 'మహావతార్ నరసింహ'. నరసింహ స్వామి, భక్త ప్రహ్లాదుడు ఇతివృత్తాలతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి కూడా. అదే ఇతిహాసంతో యానిమేషన్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే నమ్ముకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి జయ పూర్ణ దాస్ కథను, అశ్విన్ కుమార్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సీఎస్ శ్యామ్ సంగీతాన్ని, అందించిన ఈ భక్తి రస చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. శ్రీమహావిష్ణువు భక్తులను రక్షించడానికి ఎత్తిన అవతారాల్లో ఒకటి నరసింహ అవతారం. అలాంటి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం మహావతార్ నరసింహ. ఇది పూర్తిగా యానిమేషన్లో రూపొందడం విశేషం. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కొన్నాళ్ల క్రితం మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ మహావిష్ణువు దశావతారాలపై ఏడాదికో యానిమేటెడ్ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా తొలి సినిమా 'మహావతార్: నరసింహ' నేడు(జులై 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యూనిమేటెడ్ ఫిల్మ్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.'మహావతార్: నరసింహ' కథేంటంటే..పురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి కథ గురించి తెలిసిందే. విష్ణువు మూర్తి నరసింహ అవతారం(సగం మనిషి, సగం సింహం) ఎత్తి, భక్తుడైన ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. ఇదే కథను యానిమేషన్లో చూస్తే.. అదే మహావతార్: నరసింహ సినిమా.విశ్లేషణభక్త ప్రహ్లాద కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఎస్వీ రంగారావు, అంజలీదేవి, రోజా రమణి ప్రధాన పాత్రలు పోషించిన 'భక్త ప్రహ్లాద' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ప్రహ్లాద కథ దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి తెలిసింది. ఇలాంటి కథలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా'మహావతార్: నరసింహ'. కథనం మొత్తం యానిమేషన్‌తో నడుస్తుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టడానికి గల కారణాలను వివరిస్తూ ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. మహా విష్ణువుపై ద్వేషం పెంచుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు..తమకున్న శక్తులతో దేవతలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తారు. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు భూదేవికి అపహరించి సముద్ర గర్భంలో బంధిస్తాడు. దీంతో విష్ణు మూర్తి వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడు సంహరించి భూదేవిని తీసుకొస్తాడు. సోదరుడి మరణంతో విష్ణుపై హిరణ్యకశిపుడు మరింత పగను పెంచుకుంటాడు. తీవ్రమైన తప్పస్సు చేసి బ్రహ్మాదేవుడి నుంచి తనకు భూమి, అకాశం పైన,దేవతలతో గాని, పశువులతోగానీ, పగలు గానీ రాత్రి గానీ మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ శక్తులతో ఇంద్రలోకాన్ని సైతం తన ఆధీనంలోకి తెచ్చకుంటాడు. అతని కొడుకే ప్రహ్లాదుడు. పుట్టుకతోనే విష్ణుమూర్తి భక్తుడిగా మారతాడు. తండ్రికేమో విష్ణువు అంటే పడదు.. కొడుకుకేమో విష్ణుమూర్తే సర్వస్వం అన్నట్లుగా బతుకుతాడు. ఎంత నచ్చజెప్పిన విష్ణుమూర్తి పేరు తలచకుండా ఉండడు. చివరకు కొడుకునే సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి నరసింహా అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ కథలో ఉన్నాయి. దాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ చక్కగా వాడుకున్నాడు. భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌తో అద్భుతంగా తీర్చిదిద్దాడు. క్లైమాక్స్‌లో నరసింహ స్వామి ఎంట్రీ ఇచ్చే సీన్ అదిరిపోతుంది.హిరణ్యకశిపుడితో నరసింహాస్వామి చేసే యాక్షన్ తెరపై చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. యానిమేటెడ్ సినిమా అయినా సరే కొన్ని యాక్షన్ సీన్లకు థియేటర్స్‌లో విజిల్స్ పడతాయి. యానిమేషన్ పర్ఫెక్ట్గా కుదిరింది. తెరపై చూస్తుంటే కమర్షియల్ సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. సామ్ సీ.ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. బీజీఎం అదిరిపోయింది. చిన్నపిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.


