
ఎలాంటి అంచనాలు లేకుండా యానిమేషన్ చిత్రం మహావతార్ నరసంహా. జూలై 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ (ఎమ్.సి.యు) పేరుతో తొలి చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం 200 థియేటర్స్‌కు పైగా 50 రోజులు పూర్తి చేసుకుందని ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. రిలీజైన రోజు నుంచి ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ డేట్ మేకర్స్ రివీల్ చేశారు. ఈ శుక్రవారం(సెప్టెంబర్ 19న) మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ మహావతార్ నరసింహ పోస్టర్ను పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం రేపటి నుంచి ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.