సల్మాన్‌ ఒక్క ఎపిసోడ్‌కు అందుకునేది.. నాగ్‌కు మొత్తం సీజన్‌కు అందుతుంది.. | Bigg Boss Hosts Massive Remunerations, Know How Much Salman Khan, Kamal Haasan, Mohanlal And Nagarjuna Earning Per Season | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ఒక్క ఎపిసోడ్‌కు అందుకునేది.. నాగ్‌కు మొత్తం సీజన్‌కు అందుతుంది..

Dec 20 2025 10:09 AM | Updated on Dec 20 2025 10:34 AM

Bigg Boss all languages hosts remuneration salman khan is special

నాటకీయ నామినేషన్ల నుంచి ఊహించని ఎలిమినేషన్ల వరకు, బిగ్‌ బాస్‌ అనే రియాల్టీ షో వీక్షకుల్లో ఎల్లప్పుడూ కుతూహలాన్ని రేకెత్తిస్తూ ఆదరణను కాపాడుకుంటూ వస్తోంది.  ఈ షో విజయానికి దాని కాన్సెప్ట్‌తో పాటు దాని హోస్ట్‌లు కూడా ప్రధాన కారణమే అనేది నిస్సందేహం.   ఆధిపత్యం చెలాయించే ప్రవర్తనతో సల్మాన్‌ ఖాన్‌ కావచ్చు,  సహజసిద్ధమైన కూల్‌ అట్రాక్షన్‌తో నాగార్జున  కావచ్చు, పెద్దరికపు ఆప్యాయత కనబరిచే మోహన్‌లాల్‌ కావచ్చు...దేశంలో పలు భాషల్లో ప్రసారమవుతున్న  ఈ రియాలిటీ షోకు తమదైన ప్రత్యేకతను తీసుకువచ్చారనేది వాస్తవం. అయితే ఆ పెద్ద ఇల్లును అంత బాధ్యతగా నిర్వహిస్తున్న, ఈ  సెలబ్రిటీ హోస్ట్‌ లు తాజా సీజన్‌లో అందుకున్న పారితోషికం వివరాలు చూద్దామా?

సహజంగానే అత్యంత భారీ స్థాయిలో వీక్షకులు ఉంటారు కాబట్టి బిగ్‌ బాస్‌  హిందీ వెర్షన్‌ హోస్ట్‌గా అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకుంటూ బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ అందరిలోనూ ముందున్నారు.  సుమారు 15 వారాంతాల్లో హోస్ట్‌గా ఆయన వ్యవహరిస్తారు. మొత్తం 13 సీజన్ల పైగా ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సల్మాన్‌ ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేశారని వార్తలు వచ్చినప్పటికీ సల్మాన్‌ దాన్ని కొట్టిపారేశారు. అందుతున్న నివేదికల ప్రకారం, సల్మాన్‌ ప్రారంభంలో వారానికి సుమారు రూ. 12 కోట్లు పారితోషికం తీసుకున్నారు, ఆ తర్వాత దానిని ఎపిసోడ్‌కు రూ. 25 కోట్లకు పెంచారు.  తాజా సీజన్‌  బిగ్‌ బాస్‌ 16 కోసం ప్రతి ఎపిసోడ్‌కు రూ. 43 కోట్లకు చేరినట్లు సమాచారం.

  •  ప్రఖ్యాత నటుడు కమల్‌ హాసన్‌ తమిళ బిగ్‌బాస్‌ రియాలిటీ టీవీ షో  7వ సీజన్‌కు తీసుకున్న పారితోషికం  రూ. 130 కోట్లు అని సమాచారం. అయితే, గత రెండు సీజన్లకు హోస్ట్‌గా విజయ్ సేతుపతి కొనసాగుతున్నారు. తను కూడా సుమారుగా రూ. 50 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.

  • హిందీ వెర్షన్‌ విజయం తర్వాత, బిగ్‌ బాస్‌ కన్నడ వెర్షన్‌ 2013లో ప్రారంభమైంది. కన్నడ షో  మొత్తం 11 సీజన్లకు కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్‌ సంజీవ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గత 2015లో కలర్స్‌ ఛానెల్‌తో అతను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఐదేళ్లకు గాను ప్రారంభంలో రూ. 20 కోట్లు పారితోషికం తీసుకున్నారట. అభిమానులు అతని పారితోషికాన్ని సల్మాన్‌తో పోల్చడం ప్రారంభించారు.  ఇటీవలి సీజన్‌కు అతని పారితోషికం బాగా పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

  • దక్షిణాన కేరళలో, మోహన్‌లాల్‌ హోస్ట్‌ చేస్తున్న బిగ్‌ బాస్‌ ... దాని నాటకీయ ఎలిమినేషన్లు  షాకింగ్‌ ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దీని  విజయంలో మోహన్‌లాల్‌ హోస్టింగ్‌ నైపుణ్యం  ప్రధాన ఆకర్షణగా ఉంది, ఈ మలయాళ వెర్షన్‌  2018లో ప్రారంభమై వేగంగా ప్రజాదరణ పొందింది. సీనియర్‌ నటుడు మోహన్‌లాల్‌  మొదటి సీజన్‌కు రూ. 12 కోట్లు, ఆయన తాజా  సీజన్‌కు సుమారు రూ. 24 కోట్లు అందుకున్నారని అంచనా.

  • తెలుగు వారి అభిమాన హీరో అక్కినేని నాగార్జున వరుసగా బిగ్‌బాస్‌ ఆరవ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. నివేదికల ప్రకారం, ఆయన తొలిదశలోప్రతి ఎపిసోడ్‌కు రూ. 12 లక్షలు చొప్పున మొత్తం సీజన్‌కు  రూ. 12 కోట్లను అందుకున్నారు.అయితే తాజా సీజన్‌కు ముందు ఆయనకు రూ. 15 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే, తాజా సీజన్‌ కోసం ఆయన తన ఫీజును అమాంతం 30 కోట్ల రూపాయలకు పెంచినట్లు సమాచారం. ఫరెవర్‌ కూల్‌గా, అదే సమయంలో ఖచ్చితత్వంతో వ్యవహరిస్తూ హౌస్‌లోని వారిని సమన్వయం చేయడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనూ నాగ్‌ విజయవంతం అవడంతో... ఈ షో పాప్యులారిటీకి ఆయన కీలకంగా మారారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement