విన్నర్‌ రేంజ్‌ ఎలివేషన్‌...మీసం మెలేసిన కల్యాణ్‌ | Bigg Boss 9 Telugu December 19th Full Episode Highlights, Pawan Kalyan Padala Felt Emotional About His Journey | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 9: తనూజను తొక్కేసి కల్యాణ్‌కు హైప్‌.. అదిరిపోయిన జర్నీ వీడియో

Dec 20 2025 9:56 AM | Updated on Dec 20 2025 10:33 AM

Bigg Boss 9 Telugu: Pawan Kalyan Padala felt emotional About his Journey

బిగ్‌బాస్‌ షోలో హౌస్‌మేట్స్‌ ఫైనల్‌ వీక్‌ను సరదాగా గడిపేస్తున్నారు. కాఫీ పంపిస్తే డిమాన్‌ పవన్‌కు చీర కట్టి అందంగా రెడీ చేసి డ్యాన్స్‌ వేయిస్తాం అన్నారు. అన్నట్లుగానే పవన్‌ను అమ్మాయిగా ముస్తాబు చేసి ఓ ఆటాడుకున్నారు. తర్వాత కల్యాణ్‌ జర్నీ వీడియో ప్లే చేశారు. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్‌ 19వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేయండి..

ఆడవేషం కట్టిన పవన్‌
ఆడవేషంలో ఉన్న పవన్‌ డ్యాన్స్‌తో ఎపిసోడ్‌ ఉత్సాహంగా మొదలైంది. వీళ్ల జోష్‌ చూసిన బిగ్‌బాస్‌ కాఫీ పౌడర్‌తో పాటు ఏకంగా మటన్‌ పంపించాడు. తర్వాత కల్యాణ్‌ గార్డెన్‌ ఏరియాలో తన కటౌట్‌ చూసుకుని మురిసిపోయాడు. బిగ్‌బాస్‌ మాట్లాడుతూ.. మీది ఒక సామాన్యుడి కథ.. కానీ సామాన్యమైన కథ కాదు. జీరో దగ్గర మొదలైన కథ.. కానీ, జీరోగా ముగిసిపోని కథ. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమను పొందే అవకాశం లభిస్తుంది. దాన్ని మీరు అగ్నిపరీక్షను దాటి సొంతం చేసుకున్నారు.

ఓనర్‌గా మొదలై...
ఇప్పుడు వారి ప్రేమను పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్నిచ్చారు. ఓనర్‌గా ఇంట్లో మొదలైన మీ ప్రయాణం.. మొదట్లో సులువుగా అనిపించినా పోనుపోను ఎన్నో కఠినమైన పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిని దాటితేకానీ, మీ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు నిరూపిస్తే కానీ.. ముందుకు కదల్లేని పరిస్థితిలో ఒకరి స్నేహం మీకు బాసటగా నిలిచింది.

కుంగదీసినా తేరుకున్నారు
మీ తప్పొప్పులను స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది. ధైర్యాన్ని నింపింది. వారికోసం ఎలాంటి త్యాగాలైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. మీతో ప్రయాణం మొదలుపెట్టినవారందరూ ఒక్కొక్కరిగా ఇంటినుంచి బయటకు వెళ్లిన క్షణాలు మిమ్మల్ని కుంగదీసినా తేరుకున్నారు. తప్పులను సరిచేసుకున్నారు. సరైన దిశలో నడవడమే విజయాన్ని అందించే మార్గమని చూపించారు. 

గుండె బలంతో..
బుద్ధి బలాన్ని, భుజ బలాన్ని మించినది గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కోవారం నింపుకుంటూ కెప్టెన్‌గా నిలిచారు. కెప్టెన్సీ మీ ఆటకు మరింత వేగాన్ని జత చేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపింది. మీలోని యోధుడిని నిద్ర లేపింది. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటిమ అయిన మీ బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లన్నీ సరి చేసుకుంటూ చివరి కెప్టెన్‌గా నిలిచారు.

ఎంతోమందికి దిక్సూచిలా..
అంతేక కాక ఫస్ట్‌ ఫైనలిస్టుగా నిలిచి ఒక కామనర్‌ తల్చుకుంటే ఏం చేయగలడో ప్రపంచానికి తెలిసేలా చేశారు. లక్ష్మణ్‌ రావు- లక్ష్మీల కొడుకు కల్యాణ్‌ అనే మాట ఇప్పటివరకు! కానీ వీళ్లు కల్యాణ్‌ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని, కాలర్‌ ఎగరేసే గర్వాన్ని అందించారు. గొప్ప కలలు కనేందుకు, వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్‌కు దిక్సూచిలా నిలిచి, స్ఫూర్తినిచ్చిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.. అంటూ జర్నీ వీడియో చూపించాడు. అది చూసిన కల్యాణ్‌ ఆనందంతో మీసం మెలేశాడు. అయితే తనూజ జర్నీ వీడియోలో హైప్‌ ఇచ్చే మూమెంట్‌ ఒక్కటి కూడా లేదు.. కానీ కల్యాణ్‌ వీడియో మొత్తం హైప్‌తో నిండిపోవడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement