‘హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్’ శుక్రవారం ఎన్‌టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది.
బుక్‌ఫెయిర్ ప్రాంగణానికి ప్రజాకవి అందెశ్రీ పేరును నామకరణం చేశారు.
దీనితో పాటు అనిశెట్టి రజిత పేరును ప్రధాన వేదికకు, సాహితీవేత్త కొంపల్లి వెంకట్‌గౌడ్ పేరును పుస్తకావిష్కరణల వేదికకు పెట్టారు.
బుక్‌ఫెయిర్ ప్రాంగణంలో మొత్తం 367 స్టాల్స్ ఏర్పాటు చేశామని, ప్రతిరోజూ ఆరు స్ట్లాట్స్‌లో పుస్తకావిష్కరణలు జరుగుతాయని బుక్‌ఫెయిర్ నిర్వహకులు తెలిపారు.
శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో ఎప్పటిలానే పుస్తక ప్రియుల రద్దీ పెరగనుంది.


