అహ్మదాబాద్: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌ను భారత్ 3–1తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), తిలక్ వర్మ (42 బంతుల్లో 73; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు.
అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులకే పరిమితమైంది.


