దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్: నరసింహ’ సీక్వెల్‌పై ప్రకటన వచ్చేసింది. ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వస్తున్న రెండో చిత్రం టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది.
‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రెండేళ్లకు ఒకటి చొప్పున మొత్తం ఏడు సినిమాలు వస్తాయని దర్శకుడు ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా రానున్న రెండో ప్రాజెక్ట్‌కు మహావతార్ పరశురామ్(Mahavatar Parshuraam) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పరుశురాముడు తన ఆయుధంతో వెళ్తున్న ఫోటోను విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో 2027 డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. పాలకుడు కాదు, అధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతూ, యుగయుగాలుగా సమతుల్యతను పునరుద్ధరించే ఒక శక్తి అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
𝐖𝐇𝐄𝐍 𝐃𝐇𝐀𝐑𝐌𝐀 𝐅𝐀𝐋𝐋𝐒, 𝐓𝐇𝐄 𝐏𝐀𝐑𝐒𝐇𝐔 𝐑𝐈𝐒𝐄𝐒 🪓
Presenting the next from the Mahavatar Cinematic Universe 🔥#MahavatarParshuraam
Coming December 2027.
Not a ruler, but a force against adharma, restoring balance across ages.
Wishing you a blessed… pic.twitter.com/wKS0T5E9rR— Hombale Films (@hombalefilms) April 19, 2026


