హే చికీతా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే? | Hey Chikitha Movie Review And Rating In Telugu, A Rural Love Story With Friendship And Emotions | Sakshi
Sakshi News home page

Hey Chikitha Review In telugu: హే చికీతా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Jul 24 2026 10:03 PM | Updated on Jul 25 2026 11:01 AM

Tollywood Movie Hey Chikitha review In telugu

టైటిల్‌ : హే చికీతా
నటీనటులు: అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్, అజయ్ తదితరులు
నిర్మాణ సంస్థలు: అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్
నిర్మాతలు: ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, గరుడవేగ అంజి 
దర్శకత్వం: ధనరాజ్ లెక్కల
సంగీతం: చరణ్ అర్జున్ 
సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి
ఎడిటర్: మధు 
విడుదల తేది: జులై 24, 2026


ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి నిర్మాతగా మారిన బద్రి సినిమాలోని ఓ పాటలోని పదం హే చికీతా తీసుకొని టైటిల్‌గా పెట్టడంతో ఈ చిన్న సినిమాపై కాస్తా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ హే చికీతా సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

అసలు కథేంటంటే..

శివ(అభినవ్ మణికంఠ)తన ఫ్రెండ్స్ ఢిల్లీ( జబర్దస్త్ అజయ్), రాజు, కృష్ణ, సూరిలతో కలిసి అల్లరిచిల్లరిగా ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. శివ పక్క ఊరిలో ఉండే తన మరదలు చిట్టి(దివిజ ప్రభాకర్) చిన్నప్పట్నుంచి ప్రేమించుకుంటారు. కానీ శివ జాబ్ తెచ్చుకుంటేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు చిట్టి తండ్రి. ఇంకో మరదలు పొట్టి(తన్మయ్ ఖుషి) ఏమో శివని ప్రేమిస్తుంది. ఓ సినిమా రిలీజ్ రోజు శివ, తన మరదలు, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లగా అక్కడ వేరే ఊరికి చెందిన కొంతమందితో గొడవ పెట్టుకుంటాడు శివ. దాంతో వాళ్ళు శివ మీద అటాక్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. తన ఊళ్ళో గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం ఊళ్ళో పెద్ద మనుషులతో గొడవ పడి ఇంకో పందిరి పెట్టుకొని ఘనంగా చేస్తారు శివ, అతని ఫ్రెండ్స్. అయితే నిమజ్జనం రోజు థియేటర్లో శివతో గొడవపడిన వాళ్ళు శివపై అటాక్ చేయడంతో అందులో ఓ వ్యక్తిని శివ పొడుస్తాడు. ఆ తర్వాత ఏమైంది? శివ జాబ్ తెచ్చుకుంటాడా? శివ పెళ్లి ఎవరితో జరుగుతుంది.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

ఓ నలుగురు ఫ్రెండ్స్, హీరో లవ్ స్టోరీ, ఊళ్ళోనే ఉండి బతకాలి అనే కథాంశాలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. ఈ హే చికీతా సినిమా కూడా అదే కోవలోకి చెందింది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, అతని ఫ్రెండ్స్ ఊళ్ళో చేసే అల్లరి చిల్లరి పనులు, కామెడీ, శివ - చిట్టి లవ్ స్టోరీ, హీరో గొడవలు, హీరో ఫ్రెండ్స్ పాత్రల పరిచయాలతో సోసో గా సాగుతుంది. ఇంటర్వెల్ కి హీరో ఓ వ్యక్తిని పొడవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఎక్కువగా హీరో - హీరోయిన్ లవ్ స్టోరీ మీదే నడుస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సాగుతుంది. క్లైమాక్స్ హీరో - హీరోయిన్ కలవడం, వ్యవసాయం, రైతు గురించి కొన్ని మంచి మాటలు చెప్పడంతో ముగుస్తుంది.

అక్కడక్కడా కామెడీ సీన్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయి. బావ మరదళ్ల లవ్ స్టోరీ బాగుంటుంది. రైతుల ఎమోషన్స్ క్లైమాక్స్ తో, కొన్ని సీన్స్ లో డైలాగ్స్ తో చెప్పించారు కానీ ఆ ఎమోషన్ ఎక్కడా పండలేదు. హీరో వ్యవసాయం చేస్తున్నాడు అంటారు కానీ అసలు ఎక్కడా హీరో వ్యవసాయం చేసినట్టు చూపించరు. హీరో పాత్ర మాత్రం క్లైమాక్స్ వరకు కూడా ఇంత జరుగుతున్నా ఇంకా మారడా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో మాత్రం కొన్ని అక్కర్లేని కామెడీ సీన్స్ తో సాగదీశారు అనిపిస్తుంది. ఇక ఈ కథ అంతా 2000 సంవతసరంలో జరుగుతుంది. దానికి తగట్టు చూపించడానికి రైటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

ఎవరెలా చేశారంటే..

అభినవ్ మణికంఠ హీరో పాత్రలో బాగానే మెప్పించాడు. దివిజ ప్రభాకర్ క్యూట్ గా కనిపిస్తూ అల్లరి చేసే అమ్మాయిలా మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా పర్వాలేదనిపించింది. తన్మయ్ ఖుషి మరో మరదలు పాత్రలో మెప్పిస్తుంది. జబర్దస్త్ అజయ్ అక్కడక్కడా నవ్విస్తాడు. దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్, ఫ్రెండ్స్ పాత్రల్లో నటించిన నటులు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.  సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో  కొన్ని సీన్స్ ఎడిటింగ్‌లో కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. 
 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement