విజయ్ దేవరకొండ రణబాలి.. అంతలా కష్టపడ్డారా? | Vijay Deverakonda brutal training for Ranabaali Movie | Sakshi
Sakshi News home page

Ranabaali Movie: రణబాలి లుక్‌.. అంతలా శ్రమించారా?

Jul 24 2026 8:23 PM | Updated on Jul 24 2026 8:25 PM

Vijay Deverakonda brutal training for Ranabaali Movie

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది.

అయితే ఈ మూవీ కోసం విజయ్‌ దేవరకొండ కాస్తా గట్టిగానే శ్రమించినట్లు తెలుస్తోంది. కథకు తగినట్లుగా యాక్షన్ సన్నివేశాల్లో సహజంగా కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. తన పాత్ర కోసం కెరీర్‌లోనే అత్యంత కఠినమైన శిక్షణ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. రణబాలి లుక్ కోసం నెలల తరబడి ఫిట్‌నెస్‌ వర్కవుట్స్ చేశారని ఓ నివేదికలో వెల్లడైంది.

విజయ్ దేవరకొండ ముఖ్యంగా గుర్రపు స్వారీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయుధాలను వాడటం, తుపాకీని ఆపరేట్ చేయడం కూడా నేర్చుకున్నారని ఓ నివేదిక ద్వారా తెలిసింది. కత్తిసాము, ఆయుధాల వాడకం, తుపాకీ విన్యాసాలతో పాటు ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడానికి కఠోర శిక్షణ తీసుకున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement