విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న మరో చిత్రం పళ్లబురుసు. బలగం నటులు ప్రధాన పాత్రల్లో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ వచ్చేసింది. తాజాగా 'కొత్త సోకు' అనే ఫోక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో సుధాకర్ రెడ్డి కొత్త కళ్లజోడుతో కనిపించారు. ఈ పాట రంగురంగుల విజువల్స్‌తో ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సురేశ్ గంగుల లిరిక్స్ అందిచగా.. కుమారా వాగ్దేవి ఆలపించారు. ఈ మూవీకి పవన్ సీహెచ్ సంగీతమందిస్తున్నారు. పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


