breaking news
Pallaburusu Movie
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే కొరియన్ కనకరాజు, డిసి, ఉన్మాదం లాంటి పలు భాషల్లో హిట్ అయిన చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. గాంధారి లాంటి ఓటీటీ మూవీతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి డబ్బింగ్ సిరీసులు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇవలా ఉండగానే హీరో నాగార్జున నిర్మించిన ఓ చిత్రం ఎలాంటి సౌండ్ లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)గత కొన్నేళ్లుగా తెలంగాణ నేపథ్యంగా పలు సినిమాలు వస్తున్నాయి. అలా అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిన్న మూవీ 'పళ్లబురుసు'. బలగం చిత్రంలో నటనతో ఆకట్టుకున్న సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. గత నెలలో అంటే ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది. ప్రమోషన్లు పర్లేదనిపించారు గానీ కంటెంట్ ఓ మాదిరిగా ఉండేసరికి జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడు వారాల్లోపే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది.'పళ్లబురుసు' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఉండే వృద్ధుడు శంభు(సుధ). ఓసారి పంటినొప్పితో ఆస్పత్రికి వెళ్లగా, చికిత్స చేసిన డాక్టర్.. వేపపుల్ల కాకుండా టూత్ బ్రష్ వాడాలని చెబుతుంది. దీంతో ఇది కొనివ్వమని శంభు, తన కొడుకు తిరుపతి(మురళీధర్ గౌడ్)ని అడుగుతాడు. కానీ వేరే పనుల్లో పడిపోయి తిరుపతి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. దీంతో శంభుకి కోపమొస్తుంది.సరిగ్గా అదే టైంలో తనని పిలవకుండా మనవరాలి పెళ్లిని కొడుకు చేయడంతో శంభు అవమానంగా ఫీలవుతాడు. దీంతో పళ్లబురుసు కొనివ్వలేదని కొడుకుపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. ఈ కేసు వల్ల తండ్రీకొడుకుల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అసలు తిరుపతి తన తండ్రిని పట్టించుకోకపోవడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేది మిగిలిన స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?) -
‘పళ్ళ బురుసు’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్..ముఖ్య అతిథిగా నాగార్జున (ఫొటోలు)
-
'శివ కోసం ఎడ్లబండిపై వచ్చా.. ఇప్పుడు శివ ఎదురుగా ఉన్నా'
బలగం మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వాళ్లలో సుధాకర్ రెడ్డి ఒకరు. ఈ చిత్రంలో తన నటన, తెలంగాణ యాసతో అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన పళ్లబురుసుతో అలరించేందుకు వస్తున్నారు. టైటిల్‌తోనే ఆసక్తి పెంచిన ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నటుడు సుధాకర్ రెడ్డి ఎమోషనలయ్యారు. నాగార్జున నటించిన శివ మూవీ చూసేందుకు మేము ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చామని తెలిపారు. ఆ రోజు సినిమా చూసి మిగిలిపోయిన మిరపకాయ బజ్జీలు తిని ఇంటికెళ్లామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఇలా పాడేవారు, ఇలా చేసేవారని రచ్చకట్ట దగ్గర మాట్లాడుకునే వాళ్లమని అన్నారు. కానీ ఈ రోజు నేను శివ(నాగార్జున) ముందు నిలబడి మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని సుధాకర్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారులను ఇంతవరకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.కాగా.. బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ రూరల్ కామెడీ ఎంటర్టైనర్ పళ్లబురుసు. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతమందించగా.. ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. -
నా కొడుకు మీద కేసెయ్యాలి!
‘సేటూ... నా కొడుకు మీద కేసెయ్యాలి’ అంటూ ‘బలగం’ మూవీ ఫేమ్ సుధాకర్ రెడ్డి చెప్పే డైలాగ్‌తో ‘పళ్ళ బురుసు’ మూవీ ట్రైలర్ మొదలైంది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్, గోమతి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పళ్ళ బురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సమర్పణలో ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘నాకు పళ్ళ బురుసు (టూత్ బ్రష్) కొనియ్యలే... పెట్టండి సేటూ కేసు పెట్టండి’, ‘మీరు రోజూ గా పళ్ళ బురుసుతోనే పండ్లు తోముతారా? గందుకనే మస్తు తెల్లగున్నయ్’ అంటూ సుధాకర్ రెడ్డి, ‘కేసే... మీ మామనే నా మీద కేసు ఏసుండు’, ‘నా ఇజ్జత్ తీయనీకే ఉన్నవ్ నువ్వు’, ‘ఏమైనా సరే నేను హైకోర్టుకు ΄ోతా’ అంటూ మురళీధర్ గౌడ్ చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. కిరణ్ మచ్చా, ప్రజ్వల్ యాద్మ, గోమతి రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వినోద్ కె. బంగారి, సంగీతం: పవన్. -
బ్రష్ కొనివ్వలేదని కేసు.. 'పళ్లబురుసు' ట్రైలర్ రిలీజ్
తెలంగాణ నేపథ్యంతో రీసెంట్ టైంలో చాలానే సినిమాలు వస్తున్నాయి. అలాంటి ఓ చిత్రమే 'పళ్లబురుసు'. వచ్చే శుక్రవారం(ఆగస్టు 14) థియేటర్లలో రిలీజయ్యే ఈ మూవీని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. 'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది బయటపెట్టారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా)టూత్ బ్రష్ కొనివ్వలేదని ఓ ముసలాయన.. తన కొడుకుపైనే పోలీస్ కేసు పెట్టేందుకు వెళ్తాడు. దీని కారణంగా ఈ కుటుంబంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ 'పళ్లబురుసు' ఎంత పనిచేసింది అనే నేపథ్యంగా ఎమోషనల్ స్టోరీని చూపించబోతున్నారని తెలుస్తోంది. పల్లెటూరిలో తండ్రి కొడుకు మధ్య సాగే భావోద్వేగ కథ, కోర్టు నేపథ్యంలో నడిచే ఆసక్తికరమైన డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. ఉదయ్ చౌహాన్ దర్శకుడు.(ఇదీ చదవండి: ఇది మేం ఊహించలేదు.. ఉదయనిధి అరెస్ట్‌పై విశాల్) -
పక్కా విలేజ్ కామెడీ.. పళ్లబురుసు టీజర్ చూశారా?
బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న విలేజ్ కామెడీ ఎంటర్టైనర్ పళ్లబురుసు. ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. టూత్ బ్రష్ పేరునే టైటిల్‌గా పెట్టుకున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన సాంగ్, పోస్టర్స్‌కు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలంగాణ యాస, పల్లె నేపథ్యంలోనే ఈ సినిమా ఉండనుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల మధ్య సాగే సరదా వార్ ఈ సినిమా కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్లో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా కనిపించనున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 14న విడుదల కానుంది. -
పళ్లబురుసు.. క్రేజీ ఫోక్ సాంగ్ రిలీజ్
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న మరో చిత్రం పళ్లబురుసు. బలగం నటులు ప్రధాన పాత్రల్లో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ వచ్చేసింది. తాజాగా 'కొత్త సోకు' అనే ఫోక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో సుధాకర్ రెడ్డి కొత్త కళ్లజోడుతో కనిపించారు. ఈ పాట రంగురంగుల విజువల్స్‌తో ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సురేశ్ గంగుల లిరిక్స్ అందిచగా.. కుమారా వాగ్దేవి ఆలపించారు. ఈ మూవీకి పవన్ సీహెచ్ సంగీతమందిస్తున్నారు. పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


