బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న విలేజ్ కామెడీ ఎంటర్‌టైనర్ పళ్లబురుసు. ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. టూత్ బ్రష్ పేరునే టైటిల్‌గా పెట్టుకున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన సాంగ్, పోస్టర్స్‌కు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలంగాణ యాస, పల్లె నేపథ్యంలోనే ఈ సినిమా ఉండనుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల మధ్య సాగే సరదా వార్ ఈ సినిమా కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా కనిపించనున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 14న విడుదల కానుంది.


