బ్రష్ కొనివ్వలేదని కేసు.. 'పళ్లబురుసు' ట్రైలర్ రిలీజ్ | Pallaburusu Movie Trailer Reveals A Heartfelt Tale Of Family And Conflict, Watch Full Video Inside | Sakshi
Sakshi News home page

Pallaburusu Trailer: బ్రష్ చుట్టూ ఎమోషన్.. ట్రైలర్ చూశారా?

Aug 7 2026 9:53 AM | Updated on Aug 7 2026 10:20 AM

Pallaburusu Movie Trailer Latest

తెలంగాణ నేపథ్యంతో రీసెంట్ టైంలో చాలానే సినిమాలు వస్తున్నాయి. ‍‍అలాంటి ఓ చిత్రమే 'పళ్లబురుసు'. వచ్చే శుక్రవారం(ఆగస్టు 14) థియేటర్లలో రిలీజయ్యే ఈ మూవీని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. 'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది బయటపెట్టారు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా)

టూత్ బ్రష్ కొనివ్వలేదని ఓ ముసలాయన.. తన కొడుకుపైనే పోలీస్ కేసు పెట్టేందుకు వెళ్తాడు. దీని కారణంగా ఈ కుటుంబంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ 'పళ్లబురుసు' ఎంత పనిచేసింది అనే నేపథ్యంగా ఎమోషనల్ స్టోరీని చూపించబోతున్నారని తెలుస్తోంది. పల్లెటూరిలో తండ్రి కొడుకు మధ్య సాగే భావోద్వేగ కథ, కోర్టు నేపథ్యంలో నడిచే ఆసక్తికరమైన డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. ఉదయ్ చౌహాన్ దర్శకుడు.

(ఇదీ చదవండి: ఇది మేం ఊహించలేదు.. ఉదయనిధి అరెస్ట్‌పై విశాల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement