దీనికంటే ఇంకేం ఆశించగలం.. ఉదయనిధి అరెస్ట్‌పై విశాల్ | Vishal Reacts To Udhayanidhi Stalin Arrest Over Trisha Remarks, Says Some Limits Must Be Maintained, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Vishal: ఉదయనిధి కామెంట్స్.. రాజకీయాల్లో ఇది సహజమే

Aug 7 2026 9:05 AM | Updated on Aug 7 2026 10:05 AM

Actor Vishal Reacts Cm Vijay Arrest Udhayanidhi

మూడు నాలుగు రోజుల క్రితం తమిళ రాజకీయాల్లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కావేరీ జలాల కోసం చేసిన ఓ నిరసన కార్యక్రమంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్.. హీరోయిన్ త్రిష గురించి ద్వందార్థం వచ్చేలా మాట్లాడటం సంచలనమైంది. దీంతో అధికార టీవీకే పార్టీ ఈయన్ని అరెస్ట్ చేసింది. ఆపై బెయిల్‌పై ఉదయనిధి విడుదలయ్యారు. ‍ఈ వ్యవహారంపై ఖుష్బూ, చిన్మయి లాంటి సెలబ్రిటీలు.. ఉదయనిధి తీరుని విమర్శించారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా ఈ సంఘటనపై స్పందించాడు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: 'త్రిషకు సారీ చెప్పాలి.. మరి సంస్కారం ఆయనకు ఉందో లేదో')

"నేను ఉదయనిధి ప్రసంగాన్ని చూశాను. ఎవరు ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో కొన్ని పరిమితులు పాటించడం అవసరం. రాజకీయాల్లో ముందుగానే సిద్ధం చేసిన స్పీచ్ మాట్లాడటం ఒకటి, ఆవేశంలో మాట్లాడటం మరొకటి. లయోలా కాలేజీలో నాకు సీనియర్ అయిన విజయ్ ఒకరోజు నా బ్యాచ్‌మేట్ అయిన ఉదయనిధి స్టాలిన్ ని అరెస్టు చేస్తారని మేమెప్పుడూ ఊహించలేదు. ఉదయనిధి చాలా విషయాలు చూశారు. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లో ఉన్నారు. ఇవన్నీ రాజకీయాల్లో భాగమే. దీనికంటే ఇంకేం ఆశించగలం. ఇదే రాజకీయాలు' అని విశాల్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

విశాల్ హీరోగా నటించిన 'మకుటం' వచ్చే శుక్రవారం(ఆగస్టు 14) థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే పై వ్యాఖ్యలు చేశాడు. ఇకపోతే కొన్నిరోజుల క్రితం మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావొచ్చని పరోక్షంగా కామెంట్స్ చేశాడు. అందులో భాగంగానే ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఏదో ఒకరోజు కమ్యూనిజందే గెలుపు.. శోభిత రాజకీయ వ్యాఖ్యలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement