అన్న వల్లే ఆ సినిమా.. నా కెరీర్‌నే మార్చేసింది: రాకా డైరెక్టర్ అట్లీ | Atlee reveals CM Vijay advice after SRK approached him for Jawan | Sakshi
Sakshi News home page

Atlee: ‍అన్న చెప్పినట్లే జరిగింది.. ఆయన వల్లే ఈ స్థాయికి: అట్లీ

Sep 19 2026 5:02 PM | Updated on Sep 19 2026 5:24 PM

Atlee reveals CM Vijay advice after SRK approached him for Jawan

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ‍‍అట్లీ ఒకరు. షారూఖ్ ఖాన్‌ జవాన్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో రాకా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ గ్లింప్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 21 అట్లీ బర్త్‌ డే కానుకగా ట్రీట్ ఇవ్వనున్నట్లు నిర్మాణ సంస్థ హింట్ ఇచ్చింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు అట్లీ తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జవాన్ మూవీ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని అన్నారు. చెన్నైలో ఓ సినిమా ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌కు హాజరైన అట్లీ తన జర్నీ గురించి మాట్లాడారు. విజయ్ అన్న లేకపోతే ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదన్నారు. ఆయన లేకపోతే నేను ఈ స్థాయికి రావడం సాధ్యమయ్యేది కాదని తెలిపారు. 
రాజా రాణి సినిమాతో నాకు గుర్తింపు వచ్చిందని వెల్లడించారు.

ఆ దేవుడి ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా భార్య ఆశీస్సులతో కెరీర్‌లో రాణిస్తున్నానని అట్లీ తెలిపారు. కానీ ఆ వ్యక్తి నాకు వరుస అవకాశాలు ఇచ్చి నా జీవితాన్నే మార్చేశారు. విజయ్ అన్న చెప్పడం వల్లే జవాన్ మూవీని తెరకెక్కించానని అట్లీ వెల్లడించారు. జవాన్ సినిమా చేయాలని విజయ్ అన్న ప్రోత్సహించిన విషయాన్ని డైరెక్టర్ అట్లీ గుర్తు చేసుకున్నారు. అందుకే విజయ్ అన్నకు నేనెప్పుడూ ఎంతో కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు. అన్న సీఎం కావడం వల్ల మరో సినిమా చేసేందుకు నాకు అవకాశం లేకుండా పోయిందని నవ్వుతూ అన్నారు.

అట్లీ మాట్లాడుతూ.' షారుఖ్ సర్ నా ఆఫీస్‌కి వచ్చినప్పుడు మా మధ్య మీటింగ్ జరిగింది. అప్పుడు విజయ్ అన్న నాతో ఓ మాట అన్నారు. చూడు.. నువ్వు ఏం చేస్తావో, దాన్ని ఎలా నిర్వహిస్తావో నాకు అనవసరం. ఇక నుంచి నా చుట్టూ తిరగడం ఆపు. దయచేసి ముందుకు వెళ్లి ఆ సినిమా చెయ్యి. అది నీ కెరీర్ గమనాన్ని మార్చేస్తుంది' అని చెప్పారు. విజయ్ అన్న చెప్పినట్లుగానే జవాన్‌ మూవీతో నా జీవితం మారిపోయిందని అట్లీ అన్నారు.

కాగా.. విజయ్-అట్లీ కాంబోలో తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలు వచ్చాయి. తన విజయాలు సొంత కష్టంతోనే వచ్చినప్పటికీ.. కెరీర్‌ను తీర్చిదిద్దడంలో విజయ్ అన్న మద్దతు, ప్రోత్సాహం కీలక పాత్ర పోషించాయని ఆయన అన్నారు. ఈ రోజు నేను వేసుకునే చొక్కా, ప్యాంటు, వాచ్ అన్నీ నా కష్టంతోనే సంపాదించుకున్నా.. ఇదంతా ఆయన వల్లేనని అట్లీ అన్నారు. విజయ్ అన్న మద్దతు లేకుండా తాను ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement