ది ప్యారడైజ్.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, గ్లింప్స్, టీజర్ ..ప్రతీది సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కి ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం అంతా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. నాని వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీయడమేకాకుండా..సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.
ఇది ‘సమ్మక్క’ కథ..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నానికి సినిమా టైటిల్‌పై ప్రశ్న ఎదురైంది. ‘ఒకవేళ ది ప్యారడైజ్ చిత్రానికి మరో పేరు పెట్టాల్సి వస్తే..ఏం పెడతారు?’ అని యాంకర్ అడిగింది. దానికి నాని వెంటనే ‘సమ్మక్క’ అనే టైటిల్ ఈ కథకు వందశాతం సెట్ అవుతుందని చెప్పారు.
(ఇదీ చదవండి: ‘రాకా’.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..)
సమ్మక్క ఎవరు?
నాని నోటి నుంచి సమ్మక్క అనే పేరు రావడంతో.. అసలు సమ్మక్క ఎవరు? భారీ యాక్షన్ కథకు ఆ టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారనేదానిపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నాని తల్లి పెరు ‘సమ్మక్క’ అట. ఇది తల్లి కొడుకు కథ అని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా సార్లు చెప్పారు. తల్లి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పాడు. అందుకే నాని ఈ కథకు ‘సమ్మక్క’ అనే టైటిల్ సరిపోతుందని చెప్పాడు.
(ఇదీ చదవండి: ‘పీరియడ్స్ వస్తే నరకం.. నొప్పి భరించలేక కార్వాన్‌లో..’)
తల్లి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయట. ఈ సినిమాలో నాని తల్లిగా మరాఠి నటి సోనాలి కులకర్ణి నటిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె లుక్, క్యారెక్టర్ డిజైన్ గురించి ఇప్పటి వరకు ఏ విషయం బయటకు రాలేదు. ఇప్పుడు నాని చేసిన కామెంట్స్‌తో ఆ పాత్రను ఎలా చూపిస్తారనే అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది.


